కాఫీ తాగటం మీ కాలేయానికి మంచిదా? కాఫీ లివర్ డిసీజ్ లను తగ్గిస్తుందా?

By: DEEPTHI T A S
Subscribe to Boldsky

చాలాసార్లు వినే ఉంటారు కెఫీన్ ను ఎక్కువగా తీసుకోవటం మీ ఆరోగ్యానికి మంచిది కాదని, కానీ పరిమితంగా కాఫీ తాగటం మీ ఆరోగ్యానికి మంచి కూడా చేస్తుందని తెలుసా?

ఒక కొత్త అధ్యయనం ప్రకారం రెగ్యులర్ గా మూడు నుంచి ఐదు కప్పుల కాఫీ తాగటం వలన కాలేయ క్యాన్సర్ మరియు సిర్రోసిస్ వచ్చే రిస్క్ తగ్గుతుంది.

యూకెలోని యూనివర్శిటీ కాలేజ్ లండన్ నుంచి గ్రెమె అలెక్జాండర్ మాట్లాడుతూ, “కాలేయ సమస్యలు పెరుగుతూ ఉన్నాయి, మనం కాఫీ ఎలా ఆ వ్యాధులపై ప్రభావం చూపిస్తుందో అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం” అని చెప్పారు.

Drinking Coffee May Reduce Liver Diseases Risk

అలెక్జాండర్ మరింత వివరిస్తూ, “పరిశోధనల ప్రకారం కాఫీ కాలేయ వ్యాధుల రిస్క్ ను తగ్గించవచ్చు మరియు పేషెంట్లకి పోషక సమాచారం మరియు వారికి అర్థమయ్యేటట్లు సమాచారం వివరించగలిగే ఆరోగ్యనిపుణులను వారికి అందుబాటులో ఉంచడం కూడా ముఖ్యం.” అని అన్నారు.

మెటా- విశ్లేషణల సలహా ప్రకారం, కాఫీ తాగటం మరియు కాఫీ తాగకపోవటం కన్నా 40 శాతం లివర్ క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తుందని తెలిసింది. కానీ ఇది డోసు ప్రకారం ఆధారపడే సంబంధంగా వివరించబడింది.

యూఎస్ మరియు ఇటలీ పరిశోధనలు సూచిస్తున్నదాని ప్రకారం కాఫీ తాగటం వల్ల సిర్రోసిస్ రిస్క్ క్రమంగా తగ్గుతూ వస్తోంది, అది కూడా 25-75 శాతం ఉందని నివేదిక చెప్తోంది.

Drinking Coffee May Reduce Liver Diseases Risk

మరొక పరిశోధనలో కాలేయ వ్యాధులు వచ్చే రిస్క్ కి, కాఫీ తాగటానికి వ్యతిరేక సంబంధం కూడా ఉండొచ్చని తెలిపింది. తక్కువ కాఫీ తాగేవాళ్లలో 25-30 శాతం రిస్క్ తగ్గితే, ఎక్కువ కాఫీ తాగేవారిలో 65 శాతం వరకూ వెళ్ళింది.

బ్రిటీష్ లివర్ ట్రస్ట్ కి చెందిన జూడి రైస్ మాట్లాడుతూ, “కాలేయ వ్యాధి సైలంట్ కిల్లర్ లాగా బాగా లేటు అయ్యేవరకూ లక్షణాలు కూడా చూపించదు.”అని అన్నారు. మరింత మాట్లాడుతూ 'కాఫీ అందరికీ దొరికే సులభమైన పదార్థం- ఫిల్టర్, ఇన్స్టంట్ లేదా ఎస్ప్రెసో ఏ రూపంలో తీసుకున్నా కాలేయ వ్యాధిని నివారిస్తుంది, కొన్ని కేసులలో వ్యాధి ముదరకుండా నెమ్మది చేస్తుంది.” అని రైస్ వివరించారు.

ఈ అధ్యయనం రాయల్ సొసైటీ ఆఫ్ మెడిసిన్, లండన్ లో సమర్పించారు.

ఒక కప్పు కాఫీతో ఆరోగ్యానికి ఆశ్చర్యం కలిగే లాభాలు

1. మంచి ఆహారం

1. మంచి ఆహారం

కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండటం వలన మీ కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. పళ్ళు, కాయగూరలు,సంపూర్ణ ధాన్యాలను మీ భోజనంలో జత చేయండి. ఇవి మీ కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

2. రెగ్యులర్ వ్యాయామం

2. రెగ్యులర్ వ్యాయామం

మీరు ఆరోగ్యంగా ఉండటానికి వ్యాయామం తప్పనిసరి. ఇది మీ బరువు తగ్గించటం మాత్రమే కాదు, కాలేయ వ్యాధి వంటి అనేక ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది.

3. మద్యానికి దూరంగా ఉండండి

3. మద్యానికి దూరంగా ఉండండి

ఆల్కహాల్ మీ కాలేయానికి పెద్ద రిస్క్ గా పరిణమిస్తుంది, అందుకని ఊరికే అదేపనిగా తాగకండి. అతిగా తాగటం వలన మీ కాలేయ కణాలు దెబ్బతిని కాలేయం వాచటం మరియు మచ్చలు పడటం జరుగుతుంది. ఇది సిర్రోసిస్ కి దారితీస్తుంది. మీరు సంరక్షణ సరిగా తీసుకోకపోతే తీవ్రంగా మారుతుంది కూడా.

4. నిమ్మ

4. నిమ్మ

శరీరవ్యవస్థను విషపదార్థాలనుండి శుభ్రపర్చటానికి నిమ్మ మంచి పదార్థం.మీరు మీ గ్రీన్ టీకి లేదా సలాడ్ కి కొన్ని చుక్కల నిమ్మరసం కలపండి. నిమ్మరసం మీ కాలేయం బైల్ రసం ఉత్పత్తిచేసేలా చేస్తుంది మరియు విషపదార్థాలను బయటకి తోసేస్తుంది.

(ఏజెన్సి వార్తాకథనం)

English summary

Drinking Coffee May Reduce Liver Diseases Risk

Drinking Coffee May Reduce Liver Diseases Risk,A new study has found that drinking three to five cups of coffee regularly may reduce the risk of liver cancer and cirrhosis.
Story first published: Thursday, November 23, 2017, 7:00 [IST]
Subscribe Newsletter