మీరెప్పుడైనా అర్థరాత్రి లేచి కదల్లేకపోతున్నారా, అలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోడానికి చదవండి!

Posted By: DEEPTHI T A S
Subscribe to Boldsky

మీరెప్పుడైనా నిద్రలేచి సడెన్ గా ఏ శరీరభాగాన్ని కదపలేకపోయారా, అయితే మీరు నిద్రలో పక్షవాతాన్ని అనుభూతి చెందిఉంటారు. ఇది పూర్తిగా మెలకువ స్థితిలో ఉండి జరిగేదే, ఇది నిద్రకి, మెలకువకి మధ్యలోని హిప్నాగోగిక్ మరియు హిప్నోపోంపిక్ దశలో జరుగుతుంది

మొదటి దశ గాఢనిద్ర పట్టేముందు జరుగుతుంది,ఇతర దశలు ఆర్ ఇఎం దశ నుంచి లేచిన వెంటనే జరుగుతుంది.

ఇది చాలా ఆశ్చర్యకరంగా, భయం కూడా వేస్తుంది, ఎందుకంటే మీ శరీరం మీ నియంత్రణలో లేకపోవటం వలన విపరీత మానసిక ఆందోళన కూడా కలగవచ్చు.

కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది చాలా సాధారణంగా జరిగే ప్రక్రియ మరియు శారీరకంగా ఏ నష్టం జరగదు.

మనం పడుకున్నప్పుడు మన శరీరం విశ్రాంతి పొంది, మనస్సుకి ధ్యాస తక్కువగా ఉంటుంది.అదే హిప్నాగోగిక్ నిద్ర పక్షవాతంలో మనస్సుకి అన్నీ తెలుస్తుంటాయి కానీ శరీరం కదల్లేని విశ్రాంతి స్థితిలో ఉండి, మనం అస్సలు కదల్లేం.

Ever Wondered Why You Suddenly Wake Up At Night But You're Unable To Move,in

రాత్రి నిద్రలో మరోవైపు కండరాలు పక్షవాతంతో చచ్చుబడినట్లు ఉన్నా, మెదడు మెలకువ స్థితిలోనే ఉండి వారు హిప్నోపాంపిక్ నిద్ర పక్షవాతం అనుభూతి చెందుతారు.

కొంతమంది ఎన్నటికీ ఇది అనుభూతి చెందరు, కొందరేమో ఎపిసోడ్ల లాగా కొంచెం కొంచెం కొన్నిసార్లు ఈ నిద్రపక్షవాతంతో బాధపడతారు. పెన్న్ స్టేట్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు 8శాతం మందికి ఈ నిద్ర పక్షవాతం స్థితి వస్తుంది.

నిద్ర సమస్యలైన నిద్రలేమి, మానసిక వ్యాధులైన డిప్రెషన్, ఆందోళన లేదా కొన్ని మందుల వల్ల సరిగా నిద్రపట్టని వారిలో ఈ నిద్రపక్షవాతాన్ని చూడవచ్చు.

వెబ్ ఎండి ప్రకారం రిస్క్ కారణాలు ఇవి ;

నిద్రలేమి

డ్రగ్స్ వాడకం

రాత్రిపూట కాళ్ళనొప్పులు లేదా నార్కోలెప్సీ వంటి నిద్ర సమస్యలు

మానసిక అసమతుల్య స్థితులైన బైపోలార్ డిజార్డర్ లేదా మానసిక ఒత్తిడి

నిద్ర సమయాలలో తరచూ మార్పులు

వెల్లకిలా పడుకోవటం

ఎడిహెచ్ డి వంటి స్థితులకి వాడే కొన్నిరకాల మందులు

నిద్రపక్షవాతం అంటే కొన్ని సెకన్లు లేదా నిమిషాలపాటు కదల్లేకపోవటం, మాట్లాడలేకపోవటం. అది మందుల వల్ల నయం కాదు. కానీ వైద్యులు ఇతర దాగివున్న కారణాలను కనిపెట్టి వాటికి చికిత్స చేస్తారు. అవేంటంటేః

Ever Wondered Why You Suddenly Wake Up At Night But You're Unable To Move,in

అంతర్లీనంగా ఉన్న నిద్ర సమస్యలకి చికిత్స

నిద్ర నిపుణుడి వద్దకు పంపటం

నిద్ర సమయాలను సరిగా పాటించేలా చూడటం

నిద్రపట్టే పరికరాలను సూచించటం

మానసిక వైద్య నిపుణుడి వద్దకు పంపటం

డిప్రెషన్ వ్యతిరేక మందులు ఇవ్వటం

ఈ స్థితిని మీరు మానసిక వత్తిడి తగ్గించుకుని, బాగా నిద్రపోయి తగ్గించుకోవచ్చు.

Ever Wondered Why You Suddenly Wake Up At Night But You're Unable To Move,in

ఇంకా, మీకు అరుదుగా ఈ నిద్రపక్షవాత స్థితి కలుగుతుంటే, మీరు ప్రొఫెషనల్ సాయం తీసుకోనక్కర్లేదు, నిద్ర అలవాట్లను బాగుచేసుకుంటే చాలు.

అదనంగా,పరిమితంగా కెఫీన్, నికోటిన్,ఆల్కహాల్ తీసుకోవటం మరియు నిద్రపోయేటప్పుడు ఎలక్ట్రానిక్ పరికరాలకి దూరంగా ఉండటం మంచిది.ఇంకా, మీరు నిద్రపక్షవాతం వచ్చినపుడు శాంతంగా ఉండాలని గుర్తుంచుకోండి, ఎందుకంటే ఇదేం సీరియస్ లేదా భయపడే విషయం కాదు, మెల్లిగా కొద్ది సమయంలో తగ్గిపోతుంది.

English summary

Ever Wondered Why You Suddenly Wake Up At Night But You're Unable To Move

in
Story first published: Wednesday, December 6, 2017, 19:00 [IST]