For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కిడ్నీ స్టోన్స్ తో బాధపడే వారు ఖచ్చితంగా తినకూడని ఆహారాలు..!

|

మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్ళకు సరైన చికిత్స కనుక అందించకపోతే వాటి పనితీరు మందగించి మూత్రపిండాల వ్యాధికి కారణమవుతాయి. దానితో మూత్రపిండాల వడపోత సామర్థ్యం తగ్గి రోగి ఆరోగ్యం ఇంకా దిగజారుతుంది. ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. కిడ్నీ స్టోన్స్ తో బాధపడే వారు ఖచ్చితంగా తినకూడని ఆహారాలు ఉన్నాయి.

కిడ్నీలో రాళ్ళు ఏర్పడడానికి కారణాలు: ఈ సమస్య స్త్రీ, పురుష, వయోపరిమితితో నిమిత్తం లేకుండా రావచ్చు. శారీరకశ్రమ తక్కువగా ఉండడం. రోజూ తగినంత నీళ్ళు తాగకపోవడం, గౌట్ రకం కీళ్ళవ్యాధి, వంశపారంపర్యత, స్థూలకాయం, శరీరంలో రాళ్ళు ఏర్పడే లక్షణం ఉండడం, చలికాలం, మద్యపానం ముఖ్యకారణాలు.

కిడ్నీ స్టోన్స్ తో బాధపడే వారు ఖచ్చితంగా తినకూడని ఆహారాలు..!

లక్షణాలు: కొంత మందికి కిడ్నీలో రాళ్ళు ఉన్నట్లే తెలియదు, ఎప్పుడైతే అవి పెద్దవై కొన్ని లక్షణాలను బహిర్గతం చేస్తాయి అప్పుడు సమస్య భయపటడుతుంది. కాబట్టి, మూత్రపిండాళ్లలో రాళ్ళు ఉన్నట్లు గుర్తించడానికి కొన్ని లక్షణాలు ఇలా ఉన్నాయి. మూత్రపిండాలు నడుము భాగంలో వెన్నెముకకు ఇరువైపులా ఉంటాయి. అందువల్ల నొప్పి ఈ ప్రాంతంలో మొదలై పొత్తికడుపు వరకు పాకుతుంది.

6 రోజుల్లో కిడ్నీ స్టోన్స్ తొలగించే ఎఫెక్టివ్ హోం ట్రీట్మెంట్6 రోజుల్లో కిడ్నీ స్టోన్స్ తొలగించే ఎఫెక్టివ్ హోం ట్రీట్మెంట్

మూత్రవిసర్జన సమయంలో నొప్పి తీవ్రత పెరుగుతుంది. మూత్రవిసర్జన తరచు చేయాల్సి రావడం, మూత్రం తక్కువ పరిమాణంలో, మంటగా రావడం, మూత్రం పసుపురంగు లేదా ఎరుపురంగులో రావడం, కడుపులో నొప్పి, వికారం, ఆకలి తగ్గిపోవడం, మలవిసర్జనకు వెళ్ళాల్సి వచ్చినట్లుండటం, తరచుగా వాంతులు అవడం, జ్వరం రావడం.

ఈ లక్షణాలను గుర్తించిన వెంటనే డాక్టర్ ను కలిసి చికిత్స తీసుకోవాలి. కిడ్నీలో రాళ్ళు ఒక్కో వ్యక్తిలో ఒక్కో విధంగా ఉంటాయి. కిడ్నీలో చిన్న సైజు, పెద్ద సైజు ఎలాంటి రాళ్ళున్నా మీరు తీసుకునే ఆహారాల మీద ఓ కన్నేసుండాలి. ముఖ్యంగా కిడ్నీలో రాళ్ళున్న వారు కొన్ని ఆహారాలను ఖచ్చితంగా తినడకూదు. అవేంటంటే..

1. ఆకుకూరలు:

1. ఆకుకూరలు:

ఆకుకూరల్లో ఉండే యాంటీఆక్సిడెంట్స్, శరీరంలోని క్యాల్షియంతో కలిపి క్యాల్సియం ఆక్సాలేంట్ క్రిస్టల్స్ గా ఏర్పడుతాయి. అవే కిడ్నీలో రాళ్ళుగా మారుతాయి. కాబట్టి, కిడ్నీలో రాళ్ళు ఉన్నప్పుడు ఆకుకూరలు తింటే సమస్య మరింత పెద్దది అవుతుంది.

మూత్రపిండాల్లో రాళ్ళను నివారించడానికి సహజ పద్దతులు మూత్రపిండాల్లో రాళ్ళను నివారించడానికి సహజ పద్దతులు

2. టమోటోలు:

2. టమోటోలు:

మరో ఆక్సాలేంట్ రిచ్ ఫుడ్ ఇది. టమోటోల వంటలకు అద్భుతమైన రుచినిస్తాయి. అలాగే న్యూట్రీషియన్స్ కూడా ఎక్కువ. అయితే పొట్టలో ఆక్సాలేట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు టమోటోలు తింటే పరిస్థితి మరింత ఎక్కువ అవుతుంది.

3. సీఫుడ్:

3. సీఫుడ్:

కిడ్నీ స్టోన్స్ తో బాధపడే వారు సీఫుడ్స్ కు దూరంగా ఉండాలని డాక్టర్స్ సూచిస్తున్నారు. సీఫుడ్స్ లో పురినేస్ అనే కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీంరలో ఎక్కువైనప్పుడు, యూరిక్ యాసిడ్ లెవల్స్ పెరిగి కిడ్నీలో రాళ్ళుగా మారుతాయి.

4. సోడియం లేదా సాల్ట్ :

4. సోడియం లేదా సాల్ట్ :

కిడ్నీలో రాళ్ళున్నప్పుడు ఉప్పు తగ్గించాలి. హై సోడియం కంటెంట్ పరిస్థితిని మరింత అధికం చేస్తుంది. ముఖ్యంగా చిప్స్, ఎండుచేపలు, పికెల్స్, ప్యాకేజ్ సాస్, కెచప్, చట్నీలు , సాల్ట్ బట్టర్, సాల్ట్ నట్స్, చీజ్, క్యాన్డ్ వెజిటేబుల్స్, స్నాక్స్ , పీనట్స్ వంటి ప్యాకేజ్ ఫుడ్ నివారించాలి.

కిడ్నీల్లో స్టోన్స్ అరికట్టడానికి హోం రెమిడీస్ కిడ్నీల్లో స్టోన్స్ అరికట్టడానికి హోం రెమిడీస్

5. చాక్లెట్స్ :

5. చాక్లెట్స్ :

కిడ్నీ స్టోన్స్ తో బాధపడే వారు ఖచ్చితంగా చాక్లెట్స్ తినకూడదని డాక్టర్స్ సూచిస్తున్నారు. వారంలో ఒక చిన్న చాక్లెట్ ముక్క తింటే పర్లేదు. సాధ్యమైతే పూర్తిగా మానేయండి.

6. టీ:

6. టీ:

చాలా మంది దినచర్యను టీతోనే మొదలు పెడుతారు, అందులో ప్రయోజనాలు కూడా మనకు తెలుసు. కానీ, కిడ్నీస్టోన్స్ తో బాధపడేవారికి మాత్రం ఇది మంచిది కాదని డాక్టర్స్ సూచిస్తున్నారు. టీ తాగడం వల్ల కిడ్నీలో రాళ్ళు పెద్దవి అవుతాయి.

7. ఇతర ఆహారాలు:

7. ఇతర ఆహారాలు:

లెగ్యుమ్స్, బీట్ రూట్, స్వీట్ పొటాటో, జామ, పీనట్స్, త్రుణధాన్యాలు ఎక్కువ ఆక్సాలేట్స్ ఉన్న ఆహారాలను పూర్తిగా నివారించాలి.

English summary

Foods that are bad for kidney stones in Telugu

There are certain foods that you need to avoid if you have kidney stones. Know about these foods here
Story first published: Wednesday, July 12, 2017, 18:33 [IST]
Desktop Bottom Promotion