కోలన్ (ప్రేగు) క్యాన్సర్ తో పోరాడే అద్భుత ఆహారాలు!

Posted By: Ashwini Pappireddy
Subscribe to Boldsky

మీకు తెలుసా! కూరగాయలలో శోథ నిరోధక, యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు సమృద్ధిగా వుంటాయని మరియు అవి పెద్దప్రేగు కాన్సర్ మీద ప్రభావం చూపుతాయని తాజా అధ్యయనాల ప్రకారం వెల్లడైంది.

ఆధునిక ఆహార పద్ధతి మరియు జీవనశైలి లో మార్పులు చేయడం వలన కూడా 70% పెద్దప్రేగు కాన్సర్ కేసులను నివారించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఆహారాల పదార్థాలను మీ రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవడం వలన ఈ వ్యాధి నుండి మిమ్మల్ని రక్షించుకోగలుగుతారు. మరి అవేంటో తెలుసుకోవడానికి మీరు సిద్ధంగా వున్నారా!

పొట్టలో క్యాన్సర్(కొలరెక్టల్ క్యాన్సర్) లక్షణాలు గుర్తించడం ఎలా...?

జీర్ణ ప్రక్రియ సరిగా జరగకపోవడం వలన మనకు కడుపు నొప్పిగా ఉంటుంది, మరియు పొట్ట బాగా ఉబ్బినట్లు లేదా అద్వానంగా ఉంటుంది. కొన్నిసార్లు, దీర్ఘకాల మలబద్ధకం కూడా కొలొరెక్టల్ క్యాన్సర్ ని అభివృద్ధి చెందే ప్రమాదాన్ని పెంచుతుంది.

foods to fight colon cancer

కాబట్టి మీ రోజువారీ రొటీన్లకు అదనపు పదార్ధాలను జోడించకుండా మీ శరీరం లోపల జరిగే విషయాలను తెలుసుకోవాలి.

దీనికోసం మీరు చేయగలిగే ఒకే ఒక ఉత్తమ మైన మార్గం పెద్దప్రేగు క్యాన్సర్ తో పోరాడటంలో సహాయపడే ఆహార పదార్థాలను తీసుకోవడమే.

ప్రాణాంతక కోలన్ క్యాన్సర్ ను నివారించే నేచురల్ మార్గాలు..

ప్రత్యేకమైన పోషకాలతో సమృద్ధిగా ఉండే కొన్ని ఆహారపదార్థాలను తీసుకోవడం వలన మరియు ఈ వ్యాధికి వ్యతిరేకంగా పోరాడటంలో సహాయం పడుతాయి.

ఈ విషయాలు మీకు సులభంగా అర్థం అవడానికి, మేము కొలోన్ క్యాన్సర్తో పోరాడే కొన్ని ఉత్తమమైన ఆహార పదార్ధాలను జాబితా ని తయారు చేశాము. సహజంగా పెద్దప్రేగు కాన్సర్తో పోరాడడం ఎలాగో తెలుసుకోవడానికి చదవడం కొనసాగించండి.

1. బ్రౌన్ రైస్:

1. బ్రౌన్ రైస్:

బ్రౌన్ రైస్ లో కాన్సర్ కణాల పెరుగుదలని అడ్డుకునే చైన్-కొవ్వు ఆమ్లాలు ఈ బ్రౌన్ రైస్ లో ఉన్న ఫైబర్లో అధికంగా ఉంటుంది.సాధారణమైన రైస్ తో పోలిస్తే బ్రౌన్ రైస్ 3.5 గ్రాముల ఫైబర్ ని అధికంగా కలిగి ఉంటుంది.

2. సాల్మన్:

2. సాల్మన్:

విటమిన్ D లోపం వలన పెద్దప్రేగు క్యాన్సర్ కి దోహదం చేస్తుంది. మూడు ఔన్సుల సాల్మన్ 112% విటమిన్ డి కలిగివుంది మరియు ఇది మీ రోజువారీ డైట్ లో చేర్చుకోవడం మంచిది. ఇది పెద్దప్రేగు కాన్సర్తో పోరాడే టాప్ ఆహారాలలో ఒకటి గా వుంది.

3. బట్టీడ్ కార్న్:

3. బట్టీడ్ కార్న్:

అయోసిటాల్ హెక్సాఫాస్ఫేట్ అని పిలువబడే మొక్కజొన్న ఫైబర్ సమ్మేళనం పెద్దప్రేగు కాన్సర్ పెరుగుదలను నిరోధిస్తుంది. మీరు తగిన క్యాన్సర్-పోరాట సంయోజిత లినోలెసిక్ ఆమ్లం (CLA) లాభాలను పొందడానికి ఎక్స్ట్రా బట్టర్ ని ఆడ్ చేసుకోవచ్చు.

4. వేరుశెనగలు:

4. వేరుశెనగలు:

వేరుశెనగలను మూడు సార్లు వారానికి తీసుకుంటే కొలన్ పాలిప్స్ ప్రమాదం 33% తగ్గుతుంది. అంతేకాక, సగం కప్పు వేరుశెనగల లో 6 గ్రాముల ఫైబర్ కలిగి ఉంటుంది. అందువలన, వేరుశెనగలు సహజంగానే పెద్దప్రేగు కాన్సర్తో పోరాడడానికి మీకు సహాయం చేస్తాయి.

5. అల్లం:

5. అల్లం:

28 రోజుల పాటు అల్లం రూట్ సప్లిమెంట్ను తీసుకోవడం వలన 28 శాతం కొలోన్ వాపు తగ్గుతుంది అని ఒక అధ్యయనంలో వెల్లడైంది.ప్రతిరోజు 2 గ్రాముల అల్లం రూట్ లేదా తాజా అల్లం 2 స్పూన్లు తీసుకోండి. పెద్దప్రేగు క్యాన్సర్ను నివారించే టాప్ ఆహారాలలో ఇది ఒకటి.

6. పసుపు:

6. పసుపు:

కోలన్ క్యాన్సర్ నివారించడంలో పసుపు గ్రేట్ గా సహాయపడుతుంది. ఇందులో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలను అధికంగా ఉండటం వల్ల ట్యూమర్ గ్రోత్ ను నివారిస్తుంది. డిఎన్ ఎ సెల్స్ డ్యామేజ్ కాకుండా క్యాన్సేరియస్ సెల్స్ ను న్యూట్రలైజ్ చేస్తుంది. డ్యామేజ్ అయిన సెల్స్ ను రిపేర్ చేస్తుంది. కాబట్టి రెగ్యులర్ డైట్ లో ఎక్కువగా పసుపు వాడకాన్ని పెంచాలి.

7. ఉల్లి, వెల్లుల్లి:

7. ఉల్లి, వెల్లుల్లి:

వెల్లుల్లిలో ఉండే సల్ఫైడ్స్ క్యార్సినోజెన్స్ ను క్లియర్ చేస్తుంది. దాంతో క్యాన్సర్ సెల్స్ ను తొలగిస్తుంది. రోజుకు ఒకటి, రెండు వెల్లుల్లి రెబ్బలను వారం పాటు తినడం వల్ల కోలన్ క్యాన్సర్ ను 32 శాతం తగ్గించుకోవచ్చు. ఉల్లిపాయలను తినడం వల్ల కూడా కోలన్ క్యాన్సర్ ను 30 నుండి 50 శాతం వరకూ తగ్గించుకోవచ్చని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

8.వైట్ టీ వైట్ టీలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి.

8.వైట్ టీ వైట్ టీలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి.

ఇది క్యాన్సర్ సెల్స్ ను నాశనం చేయడంలో అద్భుతంగా సహాయపడుతాయి. గ్రీన్ టీలో కంటే వైట్ టీలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి, మీ రెగ్యులర్ డైట్ లో వైట్ టీని తీసుకోవడం వల్ల చాలా డిఫరెన్స్ ను మీరు చూడవచ్చు.

9.ఫ్లాక్స్ సీడ్స్:

9.ఫ్లాక్స్ సీడ్స్:

ఫ్లాక్సీడ్స్ ల ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ , యాంటీఆక్సిడెంట్స్ మరియు నేచురల్ ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం ఒక ఉత్తమ మార్గం. ఫ్లాక్ సీడ్స్ నీటిని గ్రహించి కోలన్ ను విస్త్రుతపరుస్తుంది. దాంతో టాక్సిన్ మరియు మ్యూకస్ ను శరీరం నుండి బయటకు నెట్టేస్తుంది. దాంతో పాటు, క్యాన్సర్, గుండె జబ్బులను మరియు డయాబెటిస్ ను నివారిస్తుంది.

10. ఆకుకూరలు మీ డైలీ డైట్ లో ఆకు కూరలు లేదా పచ్చి కూరగాయలకు ఎక్కువ ప్రాదాన్యత ఇవ్వాలి.

10. ఆకుకూరలు మీ డైలీ డైట్ లో ఆకు కూరలు లేదా పచ్చి కూరగాయలకు ఎక్కువ ప్రాదాన్యత ఇవ్వాలి.

ఆకుకూరల్లో అధిక శాతంలో న్యూట్రీషియన్ విలువలు కలిగి ఉంటాయి. ఆకు కూరల్లోని బీటా కెరోటిన్ క్యాన్సర్ సెల్స్ తో పోరాడటానికి సహాయపడుతాయి. మరియు క్యాన్సర్ సెల్స్ అభివృద్ది చెందకుండా అడ్డుకుంటాయి.

English summary

Foods To Fight Colon Cancer

Have these foods to fight colon cancer effectively. Read to know about the top foods to fight colon cancer.
Story first published: Friday, October 13, 2017, 13:30 [IST]