ఫ్రిడ్జ్ లో సురక్షితం కానీ ఆహారాలు: వీటిని ఎట్టి పరిస్థిలో ఫ్రిడ్జ్ లో ఉంచడం మంచిదికాదు!

By: Mallikarjuna
Subscribe to Boldsky

మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా ? ఇదేం ప్రశ్న అనుకుంటున్నారా ? నిజమే.. ఫ్రిడ్జ్ ఉంది కదా అని ఎడాపెడా.. దొరికిన పదార్థాలన్నీ అందులో తోసేస్తున్నారా ? ఏ వస్తువు తీసుకొచ్చినా.. ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే.. ఫ్రెష్ గా ఉంటుందని భావిస్తున్నారా ? అయితే మీరు పొరబడ్డట్టే. ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన వస్తువులు ఫ్రిడ్జ్ లో పెట్టాలి. మరికొన్ని ఆహార పదార్థాలు ఏ మాత్రం ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. ఎందుకంటే.. వాటివల్ల హానికలిగే అవకాశం ఉంది.

ప్రస్తుతం ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్ కంపల్సరీ ఉంటుంది. ఫ్రిడ్జ్ లో ఆహారాలు, కూరగాయలు, పండ్లు పెట్టడం వల్ల తాజాగా ఉంటాయని అందరూ భావిస్తాం. ఏ మాత్రం ఫుడ్ మిగిలినా.. వెంటనే ఫ్రిడ్జ్ లో తోసేయడం అందరికి అలవాటు. అలాగే ఫ్రూట్స్, బ్రెడ్, వెజిటబుల్స్, సాస్, సరుకులు కూడా కొంతమంది పెట్టేస్తుంటారు. ఇంట్లో ఉండే ఆహార పదార్థాలన్నింటినీ ఫ్రిడ్జ్ లో చేర్చడం చాలామందికి అలవాటుగా మారిపోయింటుంది.

కాస్తంత ఓపిక ఉంటే చాలు ఫ్రిజ్ ను క్లీన్ చేయడం సులభమే...

అయితే కొన్ని ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల వాటి ఫ్లేవర్ మారిపోతాయి. న్యూట్రీషన్స్ తగ్గిపోతాయి. అలాగే అవి చెడిపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఇక ఫ్రిడ్జ్ లో పెట్టే ముందు ఎలాంటి పదార్థాలు పెట్టాలి అవగాహనకు రండి. ఎలాంటి ఆహారాలు, ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్ లో పెట్టకూడదో ఇప్పుుడు చూద్దాం..

1. గుడ్లు:

1. గుడ్లు:

విస్క్ చేసిన గుడ్లును ఫ్రిడ్జ్ లో పెట్టడం మంచిది కాదు. అయితే ఉడికించిన గుడ్డును ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల పెద్దగా అయ్యి, చీలికలు ఏర్పడి లోపల బ్యాక్టీరియాకు కారణమవుతుంది. ఒక వేల చీలికలేకపోయిన లోపల తెల్లని పదార్థం రబ్బర్ లాగా మారుతుంది. అందుకు గుడ్డును ఏరూపంలోనూ ఫ్రిడ్జ్ లో ఉంచడం మంచిది కాదు.

2. డైరీ ప్రొడక్ట్స్ :

2. డైరీ ప్రొడక్ట్స్ :

పాలను ఫ్రీజర్ లో ఉంచడం మంచిది కాదు, పాలు గట్టిగా మారుతాయి. అలాగే పాలు వేడి చేసినప్పుడు గడ్డగడ్డలు కనబడుతుంది. పాలు మాత్రమే కాదు, పాలప్రొడక్ట్స్ ఏవైనా చివరికి చీజ్ కూడా ప్రిడ్జ్ లో పెడితే ఆకారం మారుతుంది. .

3. ఫ్రైడ్ ఫుడ్స్ :

3. ఫ్రైడ్ ఫుడ్స్ :

ఫ్రై చేసిన ఆహారాలు వెంటనే తినేయాలి. వాటిని ఫ్రిడ్జ్ లో ఉంచి తినడం వల్ల పొట్ట సమస్యలు వస్తాయి. ఫ్రైడ్ ఫుడ్స్ ను ఫ్రిడ్జ్ లో ఉంచి తిరిగి వేడి చేసి లేదా అలాగే తినడం వల్ల గుండె కు సంబంధించిన వ్యాధుల, ఊబకాయం, వంటి సమస్యలు వస్తాయి.

4. కార్బోనేటెడ్ డ్రింక్స్ :

4. కార్బోనేటెడ్ డ్రింక్స్ :

ఫ్రీజర్ లో కూలింగ్ కార్బోనేటెడ్ డ్రింక్స్ పెట్టకూడదు, కేవలం లిడ్ అల్యూమినియందైనది మాత్రమే పెట్టాలి. కూలిడ్రింక్స్ మీరు కొన్న వెంటనే తాగేయాలి. వాటిని ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్ లో ఉంచడం మంచిది కాదు.

5. ఉడికించిన పాస్తా:

5. ఉడికించిన పాస్తా:

ఉడికించిన పాస్తాను ఫ్రిడ్జ్ లో ఉంచడం మంచిది కాదు. ఉండలు కడుతుంది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. ఇటువంటి ఆహారాలు కూడా వండిన వెంటనే తినేయాలి..

ఫ్రిజ్ లో స్థలం సరిపోవడం లేదా..? అందుకు సులభ చిట్కాలు

6. నీరు ఎక్కువగా ఉన్న ఆహారాలు:

6. నీరు ఎక్కువగా ఉన్న ఆహారాలు:

లెట్యూస్, పొటాటో, కీరదోస, వాటర్ మెలోన్, యాపిల్స్ వంటి ఫ్రెష్ గా లేదా వాటరీగా ఉన్న ఆహారాలను నేరుగా ఫ్రిడ్జ్ లో తోసేయడం వల్ల వీటి మీద ఐస్ ఏర్పడుతుంది. తర్వాత చెడిపోవడం, కుల్లిపోవడం జరుగుతుంది. రుచి ఉండవు, కాబట్టి, నీటి శాతం ఎక్కువగా ఉండే ఆహారాలను ఫ్రిడ్జ్ పెట్టకూడదు.

7. డీఫ్రోస్టెడ్ మీట్ :

7. డీఫ్రోస్టెడ్ మీట్ :

ఫ్రిడ్జ్ లో డీప్రోస్ట్ చేసిన ఆహారాలు ఎప్పుడో ఒకసారి పెడితే సరే, కానీ, దీన్ని మళ్లీ మళ్లీ ఉంచడం వల్ల ఆరోగ్యానికి హానికరం. రెండు మూడు సార్లు ఉంచడం వల్ల బ్యాక్టీరియా చేరుతుంది. .

8. సాఫ్ట్ హెర్బ్స్ :

8. సాఫ్ట్ హెర్బ్స్ :

చాలా సున్నితంగా అంటే మెత్తగా ఉన్న ఆకుకూరలు, ఇతర హెర్బ్స్ ను ఫ్రిడ్జ్ లో ఉంచడం మంచిది కాదు, ఇలాంటి గది ఉష్ణోగ్రతలో ఉంచడం మంచిది. ఆకకూరల స్ట్రక్చర్ పోతుంది.

English summary

Foods You Must Never Put In Your Refrigerator|Foods Not To Be Refrigerated

Foods that you must never refrigerate are eggs, dairy products, fried foods, etc. Read to know about the foods that should not be kept in the fridge.
Story first published: Friday, August 25, 2017, 11:40 [IST]
Subscribe Newsletter