For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బరువు పెరిగితే శృంగార వాంఛను కోల్పోతారా!

By Gandiva Prasad Naraparaju
|

అంగస్ధంభనకు అత్యంత సాధారణ కారణాలలో ఊబకాయం ఒకటి, ఇది మీ అంతరంగిక జీవితాన్ని గొప్ప స్థాయిలో ముంచేస్తుంది. మీరు మీ బరువును తగ్గించుకుని, కామేచ్చను తిరిగి పొందడం నిజంగా చాలా కష్టం.

పురుషులు ఎదుర్కునే అత్యంత సాధారణ కీలక పరిస్ధితి అంగస్తంభన (ED/ఎరిక్టైల్ డిస్ఫంక్షన్). గణాంకాల ప్రకారం, 20 సంవత్సరాలు పైబడిన 18 మిలియన్ల పురుషులు దీన్ని కొద్దిగా అనుభవిస్తున్నారు. కోరుకున్న లైంగిక కార్యకలాపాలకు అవసరమైన అంగస్తంభనను సాధించడానికి లేదా నిర్వహించుకోవడంలో అసమర్ధత చోటుచేసుకుంటుంది. అయితే దీనికి చాలా కారణాలు ఉండొచ్చు, ఊబకాయం, లైంగిక అసమర్ధత మధ్య స్థిరమైన సంబంధం ఉంది. సాధారణ బరువు కంటే 2.5 రెట్లు ఎక్కువ బరువు ఉన్న ఊబకాయ పురుషులు ED బారిన పడుతున్నారు. మీరు కేవలం 30 పౌండ్ల అధిక బరువు ఉంటే, ED, ఇతర ఆరోగ్య సమస్యల లక్షణాలను గమనించవచ్చు!

అంగస్తంభనకు, గుండెజబ్బులకు సంబంధం ఏంటి?అంగస్తంభనకు, గుండెజబ్బులకు సంబంధం ఏంటి?

gain weight and lose your libido

కారణాలు
ఊబకాయం కార్డియో వాస్క్యులర్ స్థితి అతెరోస్క్లెరోసిస్ కి కారణమౌతుంది. ఈ పరిస్ధితులలో, కొవ్వు రక్తనాళాల గోడలపై పేరుకుని, పురుషాంగంతో సహా శరీరంలోని భాగాలకు రక్తప్రవాహాన్ని నిరోధిస్తుంది.

ఊబకాయ పురుషులలో టేస్టోస్టేరాన్ స్థాయి తక్కువగా ఉంటుంది. ఈ లైంగిక-ఉత్తేజిత హార్మోన్ లేకపోవడం వల్ల, అంగస్ధంభన పొందలేక పోతున్నారు, రక్తనాళ వాహిక డైలేటర్ గా పనిచేసే పెనైల్ టిష్యూలోని నైట్రిక్ ఆక్సైడ్ స్థాయి మెరుగుపరచడానికి టేస్టోస్టేరాన్ అవసరమవుతుంది.

చాలా కేసులలో, అధిక బరువు కలిగిన పురుషులలో గుండె బలహీనమై అంగస్ధంభన జరగట్లేదని మొదటి సంకేతంగా పరిగణించబడింది.

మెన్ స్పెషల్: అంగస్తంభన సమస్యకు కొన్ని అసాధారణమైన కారణాలు.!!మెన్ స్పెషల్: అంగస్తంభన సమస్యకు కొన్ని అసాధారణమైన కారణాలు.!!

gain weight and lose your libido

లక్షణాలు

పురుషులలో టేస్తోస్టేరాన్ స్థాయి తగ్గిపోవడం వల్ల, శృంగార వాంఛ తక్కువగా అనుభవిస్తున్నారు.

శక్తి స్థాయి తగ్గడం వలన, మానసిక ఒత్తిడిని ఎదుర్కుంటున్నారు.

వారు ఉత్సాహ లోపంతో ఉంటున్నారు.

 అంగస్తంభన సమస్య నివారణకు 15 నేచురల్ రెమెడీస్ అంగస్తంభన సమస్య నివారణకు 15 నేచురల్ రెమెడీస్

gain weight and lose your libido

చికిత్స
మీరు మీ లైంగిక జీవితాన్ని తిరిగి పొందాలి అంటే అదనపు బరువును తగ్గించడం నిజంగా చాలా కష్టం. ఊబకాయం గల పురుషులు బరువు కోల్పోయిన తరువాత మూడోవంతు మంది ఊబకాయుల లైంగిక కార్యకలాపాలు మెరుగుపడ్డాయని నాపిల్స్, ఇటలీ ఊబకాయ నిర్వహణా కేంద్ర పరిశోధకులచే కనుగొనబడింది.

బరువు తగ్గడం. రోజులో మీరు ఎంత తింటున్నారో పరీక్షించుకోండి. వారానికి 1 నుండి 2 పౌండ్లు తగ్గేట్టు చూసుకోండి, అంటే దాదాపు రోజుకు 500 నుండి 1000 క్యాలరీలు తగ్గినట్టు.

మీరు ఒక రోజులో ఏమి తింటున్నారో గమనించండి. చిప్స్, డిప్స్ మానేయండి, స్నేహితులతో కలిసి ఆకుకూరలు, పచ్చి కూరగాయలు స్నాక్ గా తీసుకోండి. ప్రాసెస్స్ ఫుడ్, ఎర్ర మాంస౦ తినడం మానేయండి; దానికి బదులు చేపలు తీసుకోండి. తృణధాన్యాలలోకి మారండి.

బరువు తగ్గే విషయానికి వస్తే శారీరిక శ్రమ అనేది అత్యంత ముఖ్యమైన అంశం. బరువు తగ్గించే వ్యూహాలను విజయవంతంగా అమలు చేయండి. మీ టివి కార్యక్రమాలలో కొన్ని ఎపిసోడ్లను చూడడం వదిలేసి, మంచం మీద నుండి లేచి రోజుకు 30-45 నిముషాలు చురుకుగా తయారవ్వండి. ఇలా వారానికి 3-5 సార్లు చేయండి.

చివరగా, మీరు మీ లైంగిక జీవితానికి ఆటంకం కలిగించే అదనపు బరువును తగ్గించుకోడానికి ఈ అలవాట్లను నిర్వహించుకోండి. మీరు ఏదైనా నిర్దిష్ట సమస్యను గురించి చర్చించాలి అనుకుంటే, మీరు ఒక సెక్సాలజిస్ట్ ని సంప్రదించండి.

English summary

Gain Weight and Lose Your Libido!

One of the most common reasons of erectile dysfunction is obesity, which might sink your intimate life to a great extent. It is really crucial that you are in control of your weight and regain your libido.
Desktop Bottom Promotion