For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  మీరు సెక్స్ తరువాత తలనొప్పి తో బాధపడుతున్నారా? అయితే దీన్ని చదవండి!

  By Ashwini Pappireddy
  |

  మీరు ఎప్పుడైనా సెక్స్ తర్వాత తలనొప్పిని ఎదుర్కొన్నారా? లవ్ మేకింగ్ మానవులు అనుభవించే అత్యంత అందమైన అనుభవాల్లో ఒకటి. కానీ తలనొప్పి మీ అనుభవాన్ని పాడుచేస్తే ఏమి చేయాలి?

  అవును, కొందరు వ్యక్తులు సంభోగం తర్వాత తీవ్ర తలనొప్పిని ఎదుర్కొంటారు. ఈ పరిస్థితి కోయిటల్ సెపాలల్జియా అని పిలుస్తారు.

  తల నొప్పి తగ్గడానికి 10 ఉత్తమ చిట్కాలు

  ఆర్గాస్మ్ సమయంలో లేదా శరీరం ఆర్గాస్మ్ అనుభవించడానికి సిద్ధంగా ఉండటానికిముందు ఇటువంటి తలనొప్పి రావడం జరుగుతుంది. కొంతమంది ప్రజలు ఉద్వేగం తర్వాత తలనొప్పికి గురవుతారు. అలాంటి మెడికల్ సిట్యుయేషన్ ప్రేమపూర్వకమైన లవ్ మేకింగ్ అనుభవాన్ని ద్వేషించేలా చేస్తుంది. ఇక్కడ మరికొన్ని వాస్తవాలు ఉన్నాయి.

  తలనొప్పి ఎలా వస్తుంది? మొదటి పద్ధతి

  తలనొప్పి ఎలా వస్తుంది? మొదటి పద్ధతి

  కొంతమంది వ్యక్తులకు, బెడ్ రూమ్ లో అనుభవాన్ని పొందినప్పుడు నెమ్మదిగా మెడ మరియు తల తో నొప్పి మొదలవుతుంది. క్రమంగా, తేలికపాటి తలనొప్పి తీవ్రమై మరియు నొప్పి గా మారుతుంది.

  రెండవ పద్ధతి

  రెండవ పద్ధతి

  ఇతర సందర్భాల్లో, తలనొప్పి ఆకస్మికంగా దాడి చేస్తుంది. ఇది తీవ్రంగా ఉంటుంది మరియు ఇది చాలా సాధారణంగా తెలియకుండానే వస్తుంది. ఆర్గాస్మ్ సమయంలో ఇటువంటి తలనొప్పులు సంభవిస్తాయి.

  మూడవ పద్ధతి

  మూడవ పద్ధతి

  సంభోగం తరువాత ఏర్పడే మరొక రకం సెక్స్ తలనొప్పులు ఉన్నాయి. ఒక వ్యక్తి మంచం మీద పడుకున్నప్పుడు నొప్పి చాలా తక్కువగా ఉంటుంది మరియు అదే వ్యక్తి నిలబడి వున్నపుడు తల ఎక్కువ నొప్పిగా అనిపిస్తుంది.

  మైగ్రేన్ తలనొప్పిని తగ్గించుకోవడానికి ఒక సింపుల్ టిప్

  ఎంత తరచుగా జరుగుతుంది?

  ఎంత తరచుగా జరుగుతుంది?

  కొందరిలో, ఈ తలనొప్పి రెగ్యులర్ అయితే మరికొందరిలో, ఈ తలనొప్పి ఎప్పుడో ఒక సమయంలో మాత్రమే రావడం జరుగుతుంది.

  ఇవి ప్రమాదకరమైనవా?

  ఇవి ప్రమాదకరమైనవా?

  కాదు, ఈ తలనొప్పులు చాలా నొప్పిని కలిగించవచ్చు. కాని చాలా సందర్భాలలో జీవితాన్ని బెదిరించేటంత పెద్ద సమస్య అయితే కాదు.

  ఎప్పుడు బాధపడాలి?

  ఎప్పుడు బాధపడాలి?

  కొందరు వ్యక్తులలో తలనొప్పులు తీవ్రమైనవిగా ఉంటే అవి ఇంకొక సమస్య కి సంకేతమే కావచ్చు. ఉదాహరణకు, తలనొప్పి వలన కూడా స్ట్రోక్, రక్తస్రావం, రక్తనాళాల లేదా గర్భాశయ ధమని సమస్యలకు సంకేతంగా ఉండవచ్చు. అందువల్ల, రోగనిర్ధారణ కోసం డాక్టర్ ని సంప్రదించడం మంచిది.

  ఏమి పరిశీలించాలి?

  ఏమి పరిశీలించాలి?

  తలనొప్పి కేవలం వచ్చి వెళ్తూ ఉంటే, మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కానీ వాంతులు, మూర్ఛ, కొన్ని రోజులుగా క్రమంగా గట్టిగా మెడ నొప్పి రావడం వంటి ఇతర లక్షణాలను పరిశీలించండి. ఇలాంటి లక్షణాలతో ఇటువంటి తలనొప్పులు చాలా ప్రమాదకరంగా ఉంటాయి.

  ఏది హానికరం?

  ఏది హానికరం?

  స్త్రీల కంటే పురుషులు ఇలాంటి తలనొప్పి తో ఎక్కువగా బాధపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. అంతేకాకుండా, తక్కువ బ్లడ్ షుగర్ తో బాధపడుతున్నవారికి సంభోగం సమయంలో తలనొప్పి ని అనుభవించవచ్చు.

  దీనికి ఏదయినా సహజ పరిహారం ఉందా?

  దీనికి ఏదయినా సహజ పరిహారం ఉందా?

  మెగ్నీషియం లో అధికంగా ఉండే ఆహారాల పదార్థాలు ఆకుకూరలు, జీడి, బాదం మరియు అవకాడొలు వంటివి తినడం వల్ల ఇది మీకు సహాయపడవచ్చు. మద్యం మానుకోండి. కానీ మీరు సంభోగం తర్వాత తలనొప్పిని ఎదుర్కొన్నట్లయితే ఒక డాక్టర్తో మాట్లాడటానికి సంకోచించకండి.

  English summary

  Did You Suffer Headache After Orgasm? Read this!

  Such headaches occur either at the time of orgasm or much before the body gets ready to experience orgasm. Some people suffer headache after orgasm. Such a medical condition could make one hate the beautiful experience of lovemaking. Here are some more facts.
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more