పరగడపున కోకనట్ వాటర్ తాగొచ్చా?రోజూ కోకనట్ వాటర్ తాగడం వల్ల పొందే ప్రయోజనాలు

Posted By:
Subscribe to Boldsky

కొబ్బరి బోండాం అందరికీ సుపరిచితమే...కొబ్బరి బోండాం ఒక రిఫ్రెషింగ్ డ్రింక్. ముఖ్యంగా వేసవిలో దాహార్తిని తీర్చి, ఎండల నుండి శరీరానికి మనస్సుకు ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి, కొబ్బరి బోండాం నేచురల్ రిఫ్రెషింగ్ డ్రింక్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

కోకనట్ వాటర్ ను తాగడం మాత్రమే కాదు, కొబ్బరిని వంటలకు కూడా ఉపయోగిస్తున్నారు. వీటిలో అద్భుతమైన ప్రయోజనాలుండటం వల్ల పురాతల కాలం నుండి వీటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. లోక్యాలరీలున్న తాజా కొబ్బరి నీళ్లలో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

కొబ్బరి బోండాంలో యాంటీఆక్సిడెంట్స్, అమినో యాసిడ్స్, ఎంజైమ్స్ , బి-కాంప్లెక్స్, విటమిన్ సి, ఇంకా, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, మ్యాంగనీస్, జింక్ వంటి మినిరల్స్ కూడా అధికంగా ఉన్నాయి. కోకనట్ వాటర్ లో ఉండే మైక్రో న్యూట్రీషియన్స్ వ్యాధినిరోధకతను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

పరగడపున కోకనట్ వాటర్ తాగొచ్చా?రోజూ కోకనట్ వాటర్ తాగడం వల్ల పొందే ప్రయోజనాలు

కోకనట్ వాటర్ లో ప్లాంట్ హార్మోన్స్ గా పిలుచుకునే కీటోన్స్ యాంటీఏజింగ్, యాంటీ థ్రోంబయోటిక్, క్యాన్సర్ కు వ్యతిరేఖంగా పోరాడే గుణాలున్నాయి. ఇన్ని సుగుణాలున్న కోకనట్ వాటర్ ను రోజూ రెగ్యులర్ గా తాగితే ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు, అలాగే పరగడపున కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి మంచా, చెడా అని తెలుసుకుందాం..

కొబ్బరి నీళ్ళలో నిమ్మరసం కలిపి తీసుకుంటే ఎమౌతుంది?

 1. దాహం తీర్చుతుంది:

1. దాహం తీర్చుతుంది:

కోకనట్ వాటర్ దప్పిక తీర్చడం మాత్రమే కాదు, కొబ్బరి నీళ్లలో ఉండే ఎలక్ట్రోలైట్స్ రీహైడ్రేషన్ చేస్తుంది. డీహైడ్రేషన్, డయోరియా, వాంతులు మరియు చెమటల వల్ల శరీరంలో కోల్పోయిన నీటిని ఫిల్ చేస్తుంది.

2. బ్లడ్ ప్రెజర్ లెవల్స్ ను తగ్గిస్తుంది:

2. బ్లడ్ ప్రెజర్ లెవల్స్ ను తగ్గిస్తుంది:

కోకనట్ వాటర్ లో విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం కంటెంట్ బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది.

కొబ్బరి నీళ్లలో తేనె కలిపి పరగడపున తాగితే మిరాకిల్ బెనిఫిట్స్ ..!

3. హార్ట్ టానిక్:

3. హార్ట్ టానిక్:

కొబ్బరి నీళ్లలో కొవ్వు, కొలెస్ట్రాల్ లేకపోవడం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది ఎల్ డిఎల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది. హై డెన్సిటి లిప్పోప్రోటీన్ ను పెంచుతుంది. దాంతో హార్ట్ సమస్యలుండవు.

4. హ్యాంగోవర్ తగ్గిస్తుంది:

4. హ్యాంగోవర్ తగ్గిస్తుంది:

ఆల్కహా్ శరీరంను డీహైడ్రేషన్ కు గురిచేస్తుంది. దాంతో ఉదయం చాలా కష్టంగా ఉంటుంది. కోకనట్ వాటర్ లోని ఎలక్ట్రోలైట్స్ శరీరంలోని నీటి శాతాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. హైడ్రేషన్ పెంచుతుంది.

5. బరువు తగ్గిస్తుంది:

5. బరువు తగ్గిస్తుంది:

కోకనట్ వాటర్ బరువు తగ్గించడానికి సహాయపడుతుంది. కోకనట్ వాటర్ లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. పొట్ట తగ్గడానికి సహాయపడుతుంది. కోకనట్ వాటర్ లో బయోయాక్టివ్ ఎంజైమ్స్ జీర్ణశక్తిని పెంచుతుంది. ఫ్యాట్ మెటబాలిజం రేటును పెంచుతుంది. దాంతో బరువు తగ్గడం సులభం.

6. తలనొప్పి తగ్గిస్తుంది:

6. తలనొప్పి తగ్గిస్తుంది:

డీహైడ్రేషన్ వల్ల తలనొప్పి, మైగ్రేన్ తలనొప్పి కూడా రావచ్చు. డీహైడ్రేషన్ తో పాటు, మైగ్రేన్ తలనొప్పిని కూడా తగ్గించే శక్తి కోకనట్ వాటర్ లో ఎలక్ట్రోలైట్స్ సహాయపడుతాయి. కోకనట్ వాటర్లో ఉండే మెగ్నీషియం మైగ్రేన్ సంబంద తలనొప్పి తగ్గిస్తుంది.

15రోజులు కొబ్బరి నీళ్లు తాగితే శరీరంలో జరిగే అద్భుత మార్పులు..!

7. పొట్టనొప్పి తగ్గిస్తుంది:

7. పొట్టనొప్పి తగ్గిస్తుంది:

అజీర్ణంతో పొట్ట నొప్పి, పొట్ట సమస్యలను నివారించడంలో కోకనట్ వాటర్ సహాయపడుతుంది.

8. వ్యాయామం ముందు తాగితే:

8. వ్యాయామం ముందు తాగితే:

కోకనట్ వాటర్ లో ఉండే మినిరల్స్ శరీరం త్వరగా గ్రహిస్తుంది. వ్యాయామం సమయంలో కోల్పోయిన ఎలక్ట్రోలైట్స్, ఎనర్జీ, మజిల్ బ్రేక్ డౌన్ ను నివారించే గుణాలు కోకనట్ వాటర్ లో ఉన్నాయి.

కోకనట్ వాటర్ పరగడపున తాగితే ఓకేనా?

కోకనట్ వాటర్ పరగడపున తాగితే ఓకేనా?

పరగడపున కోకనట్ వాటర్ తాగకూడదు అనుకుంటారు. కానీ ఇది కేవలం అపోహ మాత్రమే. కోకనట్ వాటర్ ను పరగడపున తాగినా, ఎక్కువ శక్తిని అందిస్తుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. బ్యాక్టీరియా, సూక్ష్మక్రిముల బారీ నుండి శరీరాన్ని కాపాడుతుంది.

English summary

Health Benefits Of Drinking Coconut Water Daily & Is It Okay To Drink It On An Empty Stomach?

Health benefits of drinking coconut water every day are lowering blood pressure levels, it acting as a heart tonic, etc. Read to know if it is okay to drinking coconut water.
Subscribe Newsletter