రాగి కంకణాల వల్ల ఆరోగ్య ప్రయోజనాలు

By: Deepti
Subscribe to Boldsky

చాలామంది భారతీయులు రాగి కంకణాలు ధరిస్తారు. పురుషులు, స్త్రీలు కూడా వేసుకుంటారు. రాగి ఆభరణాలు ధరించటం వల్ల శరీరంపై మంచి ఆరోగ్యప్రభావం ఉంటుంది. అందుకే శతాబ్దాలకు పైగా ఇవి సంస్కృతిలో భాగమయ్యాయి.

మీకు రాగి అలర్జీ అయితే, మీరు వాడకుండా ఉండవచ్చు కానీ రాగి వల్ల మాత్రం రోగనిరోధక శక్తితో పాటు ఇతర ఆరోగ్యలాభాలు కూడా కలుగుతాయి.

జ్యోతిష్యం ప్రకారం, చేతి వేలికి రాగి రింగ్ పెట్టుకుంటే పొందే అద్భుత ప్రయోజనాలు!

వీటికి శాస్త్రీయ నిరూపణ అంతలేకపోయినా వాటివల్ల చర్మంపై మరే ఇతర దుష్ప్రభావాలు లేకపోవటంతో అందరూ వీటిపై ఆసక్తి చూపిస్తారు. రాగి కంకణాలపై మరికొన్ని విశేషాలు చదవండి.

పట్టేసిన కండరాలకు ఉపశమనం ఇస్తుంది

పట్టేసిన కండరాలకు ఉపశమనం ఇస్తుంది

రాగి కంకణాల వల్ల పట్టేసిన కీళ్ళకు ఉపశమనం లభిస్తుంది. ఆస్టియో ఆర్థరైటిస్ లేదా రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవారికి ఈ కీళ్ళవాతం వస్తుంది.

రాగి కంకణం చేతికి వేసుకున్నాక వారికి విశ్రాంతిగా అన్పిస్తుంది. నిజానికి కంకణం మణికట్టు మీదనే ఉండి మిగతా కీళ్ళనొప్పులను ఎలా తగ్గిస్తుందో ఇంకా రహస్యమే మరి.

నొప్పి తగ్గిస్తుంది

నొప్పి తగ్గిస్తుంది

కీళ్ళవాతంతో పాటు ఆర్థరైటిస్ తో బాధపడే వారికి కీళ్ళనొప్పులను ఈ రాగి కంకణాలు తగ్గిస్తాయి. (కొన్ని పరిశోధనల ప్రకారం రాగికి వాపులను తగ్గించే గుణం ఉన్నది)

దేవాలయాల్లోనూ, గృహాల్లోనూ పూజా కార్యక్రమాల్లో రాగిపాత్రలనే ఎందుకు వాడుతారు?

ఖనిజలవణాలను శరీరం పీల్చుకోవటంలో సాయపడుతుంది

ఖనిజలవణాలను శరీరం పీల్చుకోవటంలో సాయపడుతుంది

ఒక పరిశోధన ప్రకారం సూక్ష్మలవణాలైన జింక్, ఐరన్ వంటివి కంకణాలలో రాగితో పాటు కలిసి ఉండి, చెమటవల్ల శరీరంలోకి పీల్చుకోబడతాయి. ఒక వ్యక్తికి ఆ ఖనిజాల లేమితో బాధపడుతుంటే, అతని సమస్య తీరినట్టే.

సప్లిమెంట్ల కన్నా మంచిది

సప్లిమెంట్ల కన్నా మంచిది

కొన్ని పరిశోధనల్లో సప్లిమెంట్ల కన్నా రాగి కంకణాలే మంచివని తేలింది. కొన్ని సూక్ష్మలవణాలు చెమట ద్వారా లోపలికి పీల్చుకోబడితేనే ఎక్కువ ప్రభావం చూపిస్తాయనే కారణం కావచ్చు. కీళ్ళకు, కణజాలాలకు దీర్ఘకాలంలో ఇది మంచిది.

లోపాలను సవరిస్తుంది

లోపాలను సవరిస్తుంది

రాగి లోపం వల్ల అయోటిక్ అన్యూరిస్మ్ స్ అనే స్థితి ఏర్పడచ్చు. దీనివల్ల చెడ్డ కొలెస్ట్రాల్ పెరిగిపోయి మీ గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపించవచ్చు. రాగి కంకణం వేసుకోవటం వల్ల మీ హృదయానికి కూడా మంచిది.

ఇతర లాభాలు

ఇతర లాభాలు

రాగి వల్ల ఇతర లాభాలు కూడా ఉన్నాయి. ఇతర లోహాల విషప్రభావాలను ఇది తగ్గించటమే కాక, హెమోగ్లోబిన్ ను ఉత్పత్తి చేసే ఎంజైములను ప్రేరేపిస్తుంది కూడా.

రాగి పాత్రలో నీళ్ళు త్రాగడం వల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాలు

వయస్సు మీరకుండా చేస్తుంది

వయస్సు మీరకుండా చేస్తుంది

రాగి కంకణం వేసుకున్న వ్యక్తి ఆనందంగా ఉంటాడు. అధిక యాంటిఆక్సిడెంట్ల వల్ల రాగి వయస్సు తొందరగా మీరకుండా చేస్తుంది.

English summary

Health Benefits Of Wearing Copper Bracelets

Many Indians wear copper bracelets. Both men and women wear them. Wearing copper seems to have a therapeutic effect on the body .
Story first published: Wednesday, July 5, 2017, 14:00 [IST]
Subscribe Newsletter