For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అవి తింటే నిద్ర సరిగ్గా పట్టదు

By Y. Bharath Kumar Reddy
|

చాలామంది ప్రజలు నిద్ర విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. తక్కువ సమయం నిద్ర పోవడం వల్ల శారీరకంగా, మానసికంగా అనేక సమస్యలు వస్తాయి. నిద్ర సరిగ్గా పోని వారు అన్ని విషయాలపై ఆసక్తిని కోల్పోతారు. మనం తీసుకునే ఆహారం మన నిద్రపై ప్రభావం చూపుతుంది. అయితే ఈ విషయం చాలా మందికి తెలియదు.

ప్రాసెస్ చేసిన ఆహారాలు, తక్కువ నాణ్యతగల ఆహారాలు మన సక్రమంగా నిద్రపోకుండా చేస్తాయి. వీటివల్ల నిద్ర సరిగ్గా పట్టదు. అలాగే చక్కెర, శుద్ధిచేసిన పిండి పదార్థాలుండే ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా సరిగ్గా నిద్రపట్టదని అధ్యయనాల్లో తేలింది. దీంతో రాత్రి సమయంలో తరచుగా మేల్కొంటుటారని కొన్ని అధ్యయనాల్లో బయటపడింది.

<strong>బాగా నిద్రపోవాలంటే ఈ ఆహారాలు తినాల్సిందే</strong>బాగా నిద్రపోవాలంటే ఈ ఆహారాలు తినాల్సిందే

do eating habits affect sleep

అలాగే శరీరంలో అనారోగ్య కొవ్వుల స్థాయి పెరిగిపోవడంతో కూడా నిద్ర విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఇక జంక్ ఫుడ్స్ కూడా నిద్రను భంగం చేస్తాయి. ఉప్పు, చక్కెర, కొవ్వు పదార్ధాలు ఎక్కువగా ఉండే ఆహారాలు నిద్రలేమికి కారణం అవుతాయి. అయితే మంచి ఆహార పదార్ధాలు తినడం వల్ల మీ శరీరానికి మంచి పోషకాలు అందుతాయి. మీరు ఎలాంటి ఇబ్బందులులేకుండా నిద్రపోవొచ్చు.

do eating habits affect sleep

విటమిన్ డీ తగినంత స్థాయిలో ఉండే గుడ్లు, పుట్టగొడుగులు, ఫ్యాటీ చేపలు వంటి ఆహారాలు తీసుకునే వారిలో నిద్రలేమి సమస్య 33% తక్కువగా ఉంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ట్యూనా, సాల్మోన్ వంటి చేపలను ఆహారంగా తీసుకుంటే కూడా బాగా నిద్రపోవొచ్చని పరిశోధనల్లో తేలింది. అలాగే పొటాషియం, మెగ్నీషియం శరీరానికి చాలా అవసరం. ఇవి కండరాల విశ్రాంతికి బాగా సహాయపడతాయి. దీంతో మీరు బాగా నిద్రపోవడానికి అవకాశం ఉంటుంది.

<strong>నిద్రకు భంగం కలగకూడదనుకుంటే ఈ ఆహారాలకు దూరంగా ఉండాల్సిందే...</strong>నిద్రకు భంగం కలగకూడదనుకుంటే ఈ ఆహారాలకు దూరంగా ఉండాల్సిందే...

కాల్షియం అధికంగా లభించే ఆహారాలను తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే మెలటోనిన్ అనే హార్మోన్ ను కాల్షియం ఫుడ్ ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోన్ మీరు ప్రశాంతంగా నిద్రపోవడానికి దోహదపడుతుంది.

do eating habits affect sleep

ఇక ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినే వారు ప్రాసెస్ డ్ ఫుడ్స్ ని అధికంగా తినే వారి కంటే ఎక్కువ నిద్రపోతూ ఉంటారు. అలాగే సాయంత్రం పూట మంచి స్నాక్స్ తీసుకుంటే కూడా నిద్ర బాగా పడుతుంది. రాత్రి నిద్రకు ఉపక్రమించే సమయానికి రెండు మూడు గంటల ముందు స్నాక్స్ తీసుకోవాలి.

గ్రెయిన్ క్రాకర్స్, చెర్రీ జ్యూస్, వాల్నట్స్ , 8 ఔన్సుల తక్కువ కొవ్వు ఉండే పాలు అల్పాహారం, ఒక కప్పు చమోమిలే టీ మొదలైనవి ఉత్తమమైన అల్పాహారాలు. వీటిని తీసుకోవడం వల్ల నిద్రకు ఎలాంటి భంగం కలగదు. హ్యాపీగా నిద్రపోవొచ్చు.

English summary

Here is how your eating habits can impact your sleep

This is how your eating habits can affect your sleep. Read to know more!
Story first published:Thursday, November 2, 2017, 16:56 [IST]
Desktop Bottom Promotion