For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

HIV/ AIDS వలన ఇన్ఫెర్టిలిటీ బారిన పడవచ్చు: అధ్యయనం

|

ఎయిడ్స్ అనేది ప్రాణాంతక వ్యాధి. ఎయిడ్స్ బారిన పడిన వారి ఆరోగ్యం అనేక రకాలుగా దెబ్బతింటుంది. రోగనిరోధక శక్తిని బలహీనం చేయడం ఈ వ్యాధి యొక్క ప్రధాన లక్షణం. ఒక్కసారి రోగనిరోధక శక్తి బలహీనపడ్డాక అనేక రకాల రోగాలు దాడి చేస్తాయి.

ఈ విషయాన్నే ఇటీవలి ఒక అధ్యాయం స్పష్టం చేస్తోంది. అంతే కాదు, ఎయిడ్స్ వలన సంతానోత్పత్తి సామర్ధ్యంపై కూడా దుష్ప్రభావం కలుగుతుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ రిపోర్ట్ ప్రకారం తల్లి నుంచి శిశువుకు హెచ్ఐవీ సోకే శాతం 15 నుంచి 45 శతం వరకు ఉంటుంది.

హెచ్ఐవీ బారిన మహిళలో రోగనిరోధకశక్తి బలహీనమవడంవలన ఆ మహిళా పెల్విక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధికి గురయ్యే ప్రమాదం ఎక్కువ.

ఈ రేటుని అయిదు శాతానికంటే తగ్గించడం కోసం గర్భిణీగా ఉన్నప్పుడు, ప్రసవ సమయంలో అలాగే శిశువుకు పాలిచ్చే దశలో తగిన చికిత్స తీసుకోవాలి. ఈ చికిత్సలో ముఖ్యంగా యాంటిరెట్రోవైరల్ విధానం కలిగి ఉంటుంది.

HIV/ AIDS Can Cause Infertility- Finds Study

ఇన్ఫెర్టిలిటీ

ఇలా ఎందుకు జరుగుతుంది?

హెచ్ఐవీ పాజిటివ్ గా ఉన్న మహిళలో వివిధ రకాల ఋతుస్రావ సమస్యలు కలుగుతాయి. కొందరిలో ఋతుస్రావం ఆగిపోవడం కూడా గమనించవచ్చు. వీటితో పాటు, ఒత్తిడి, బలహీనమైన రోగనిరోధకవ్యవస్థ, బరువు తగ్గుటతో పాటు కొన్ని రకాల లైంగిక సంక్రమణ వ్యాధులుకూడా మహిళలలో సంతానోత్పత్తి సామర్థ్యంపై దుష్ప్రభావం చూపుతాయి.

యాంటీరెట్రోవైరల్ తెరపీ తీసుకోని మహిళలలో ప్రెగ్నన్సీకి సంబంధించిన అనేక సమస్యలు తరచూ బాధిస్తాయి. అయితే, HAART అభివృద్ధి వలన ఎందరో హెచ్ఐవీ పాజిటివ్ మహిళలు సురక్షితమైన వెజీనల్ డెలివెరీస్ ని ఎంచుకుంటున్నారు.

అయితే, సరైన ప్రీనాటల్ కేర్ తీసుకుంటూ వైరల్ లోడ్ 1,000/ml కంటే తక్కువున్న 36 వారాల హెచ్ఐవీ పాజిటివ్ గర్భిణీలకు మాత్రమే వెజీనల్ డెలివరీ ని దాక్ట్లర్లు సిఫార్సు చేస్తున్నారు. ఈ వ్యాధి యొక్క దుష్ప్రభావం కేవలం మహిళలపైనే కాదు పురుషులపై కూడా ఉంటుంది. హెచ్ఐవీ పురుషుల యొక్క స్పెర్మ్ ఫంక్షన్ పై దుష్ప్రభావం చూపుతుంది. వృషణాల వాపు, మంట అలాగే అసమృద్ధ టెస్టోస్టెరోన్ ఉత్పత్తి స్థాయిలు హెచ్ఐవీ బారిన పడిన పురుషులలో గమనించవచ్చు.అటువంటి వారు లైంగికాసక్తి కోల్పోవడంతో పాటు అంగస్తంభన సమస్యలతో ఇబ్బందిపడతారు.

మరోవైపు, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఇక్కడ చెప్పబడిన కొన్ని ఆహారాలు ఫెర్టిలిటీని పెంపొందించడంలో సహాయపడతాయి. ఈ ఫుడ్స్ గురించి ఇక్కడ తెలుసుకోండి.

HIV/ AIDS Can Cause Infertility- Finds Study

1. గుడ్ కార్బ్స్:

మంచి పిండి పదార్థాలని రోజు వారి ఆహారంలో భాగంగా చేసుకోవాలి. పండ్లు, కూరగాయలు అలాగే తృణధాన్యాలలో మంచి కార్బ్స్ ఉంటాయి. ఇవి అరుగుదలకు కాస్త సమయం తీసుకుంటాయి. బ్లడ్ షుగర్ పైన అలాగే ఇన్సులిన్ పైన మంచి కార్బ్స్ సత్ప్రభావం చూపిస్తాయి. ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఓవులేషన్ ని నిరోధించడం వలన సంతానోత్పత్తి సామర్థ్యం సన్నగిల్లుతుంది.

HIV/ AIDS Can Cause Infertility- Finds Study

2. ప్రోటీన్స్:

మొక్కల ద్వారా లభించే ప్రోటీన్ లు చాలా శ్రేయస్కరమైనవి. బీన్స్, నట్స్, సీడ్స్ అలాగే టోఫులో నున్న ప్రోటీన్స్ ఆరోగ్యకరమైనవి అలాగే కేలరీలు తక్కువ కలిగినవి. ఇవన్నీ రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవడం వలన సంతానోత్పత్తి సామర్థ్యం మెరుగవుతుంది.

English summary

HIV/ AIDS Can Cause Infertility- Finds Study

For women who avoid undergoing antiretroviral therapy, complications with pregnancy may occur more often. With the development of HAART, a growing number of HIV-positive women can opt to have safe vaginal deliveries.
Story first published: Monday, December 4, 2017, 8:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more