For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెచ్ఐవి / ఎయిడ్స్ గురించి నమ్మశక్యంకాని అపోహలు!

By Ssn Sravanth Guthi
|

హెచ్ఐవి / ఎయిడ్స్ అనే వాటిని మన సమాజంలో ఒక అంటువ్యాధిలాగా తరచుగా పరిగణిస్తారు. ఇది ఒక హెచ్ఐవి వ్యక్తితో కలిసి కూర్చోవడం (లేదా) భోజనం చేయడం ద్వారా, ఈ సూక్ష్మ జీవులను మన శరీరంలోనికి ఆహ్వానించే ప్రమాదమును కలిగి ఉంటుంది. కానీ ఇది వాస్తవం కాదు.

మన సమాజంలో ఇప్పటికీ హెచ్ఐవి గురించి కొన్ని అపోహలు చాలా ఎక్కువగా ప్రచారంలో ఉన్నాయి, కానీ విద్యావంతులైన వ్యక్తులుగా ఇటువంటి విశ్వాసాలను నిర్మూలించడమే మన బాధ్యత, అలా చెయ్యడం వల్ల హెచ్ఐవి- సోకిన రోగికి ఒక ఆరోగ్యవంతమైన జీవనశైలిని పొందవచ్చు.

హెచ్ఐవి అనేది ఒక వ్యక్తి యొక్క రోగనిరోధక వ్యవస్థను ప్రభావితం చేసేందుకు మానవ శరీరంలోకి ప్రవేశించిన వైరస్. అలాంటి సమయంలో సరైన చికిత్స లేకపోతే, ఇది రోగనిరోధక వ్యవస్థకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది మరియు ఏదైనా వ్యాధి కారకాలపై పోరాటం చేయలేకపోతుంది.

ఎయిడ్స్, అయితే హెచ్ఐవి యొక్క చివరి దశలో కనిపించే లక్షణాలను మరియు అనారోగ్యాలను సూచిస్తుంది మరియు దీనికి సరైన చికిత్సను గాని చేయకపోతే, దాని పర్యవసానంగా రోగికి ప్రాణాంతకం కూడా మారవచ్చు.

కానీ వైద్య చికిత్స కన్నా ముందు, హెచ్ఐవి గురించి కొన్ని అపోహలను తొలగించాల్సిన అవసరం ఉంది.

కాబట్టి, ప్రపంచ ఎయిడ్స్ రోజునాడున, మనము హెచ్ఐవి / ఎయిడ్స్ గురించి కొన్ని అపోహలను తెలుసుకోవలసిన జాబితాను సిద్దం చేశారు. వాటిని ఈ క్రింది విధంగా తెలియజేశారు.

1. హెచ్ఐవి / ఎయిడ్స్ తో ఉన్న ప్రజలతో ఆహారాన్ని పంచుకోవటం వల్ల :

1. హెచ్ఐవి / ఎయిడ్స్ తో ఉన్న ప్రజలతో ఆహారాన్ని పంచుకోవటం వల్ల :

పర్యావరణ పరిస్థితిని తెలియజేసినప్పుడు, హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ (హెచ్ఐవి) సుదీర్ఘకాలం జీవించలేవు. కానీ ఎక్కువగా ఆహారాన్ని పంచుకోవడం ద్వారా ఒక వ్యక్తి నుండి మరొకదానికి హెచ్ఐవి వ్యాప్తి చెందగలదని ఎక్కువ మంది నమ్ముతారు.

అయితే ఇది ఒక అపోహ. హెచ్ఐవి అనేది ఒక వైరస్, ఇది శరీరం లోపల ఉన్నప్పుడే మాత్రమే చురుకుగా ఉంటుంది కానీ వెలుపల గాని ఉంటే తన మనుగడను సాగించలేదు. కాబట్టి మీ జట్టు నుండి హెచ్ఐవి పాజిటివ్ రోగిని దూరంగా ఉంచడం అంటే వారికి (అతనికి / ఆమెకు) అన్యాయం చేసినట్లే. ఒక హెచ్ఐవి రోగి అంటే మన అందరి మాదిరిగానే ఉన్న ఒక సాధారణ మానవుడు, కానీ వారి రోగనిరోధక వ్యవస్థ మనకన్నా ఎక్కువగా ప్రభావితమవుతుంది అందుకోసమే వారు అదనపు జాగ్రత్తలను తీసుకోవలసిన అవసరం చాలానే ఉంది.

2. దోమల బైట్స్ ద్వారా ఎయిడ్స్ వ్యాపిస్తుంది:

2. దోమల బైట్స్ ద్వారా ఎయిడ్స్ వ్యాపిస్తుంది:

ఎయిడ్స్ అనేది అనారోగ్యం, ఇది హెచ్ఐవి యొక్క చివరి దశ ఫలితంగా జరుగుతుంది. మరియు దోమ కాటుల నుండి ఎయిడ్స్ సంభవించవచ్చని నమ్మడం, ఒక తప్పుడు అభిప్రాయం. ఎందుకంటే, ఒక దోమ మనల్ని కరుస్తుంది, ఇది మన సిరల నుండి రక్తమును పీల్చుకుంటుంది. కానీ అది చివరి వ్యక్తి యొక్క రక్తాన్ని (ఎవరు అయితే హెచ్ఐవి ద్వారా ప్రభావితం కాబడ్డారో) మనకు ఇంజెక్ట్ చెయ్యలేదు. కాబట్టి రక్త మార్పిడికి అవకాశం లేదు, దీని వల్ల ఒక వ్యక్తికి కీటకాలు నుండి హెచ్ఐవిని పొందవచ్చు అనేది అవాస్తవం.

3. సెక్స్ వర్కర్లకు మాత్రమే ఎయిడ్స్ వస్తుంది:

3. సెక్స్ వర్కర్లకు మాత్రమే ఎయిడ్స్ వస్తుంది:

సెక్స్ కార్మికులకు మాత్రమే హెచ్ఐవి వ్యాధి బారిన పడతారని ప్రజలు తరచుగా నమ్ముతారు. ఎందుకంటే వారు లైంగిక చర్యలో భాగంగా ప్రతిరోజూ తమ భాగస్వామిని మార్చుకుంటారు మరియు తరచుగా అసురక్షితమైన లైంగిక చర్యల్లో పాల్గొంటారు. మీరు ఆ విధంగా గాని ఆలోచిస్తే, అప్పుడు అది మీ తప్పే. అవును, వారు కూడా హెచ్ఐవి వ్యాధి బారిన పడుతున్నారన్నది నిజం, కానీ సాధారణ జంట ఆ ప్రమాదపు అంచులలో లేరని మాత్రం కాదు.

హెచ్ఐవి ఏ వ్యక్తికి అయిన వ్యాప్తి చెందవచ్చు మరియు చాలా కేసుల్లో, హెచ్ఐవి రోగి ఈ వ్యాధిని కలిగి ఉన్నట్లుగా గుర్తించలేడు. కాబట్టి, మీరు ఒక భాగస్వామితో సురక్షితమైన పద్ధతిలో లైంగిక చర్యలు పాలుపంచుకున్నట్లు అయితే, ఇది హెచ్ఐవి, STD (లైంగికంగా సంక్రమించిన వ్యాధి) మరియు అవాంఛిత గర్భధారణ వంటి ప్రమాదాలను మరింత తగ్గిస్తుంది.

4. హెచ్ఐవి / ఎయిడ్స్ వ్యాప్తి చెందుటకు సెక్స్ మాత్రమే కారణం :

4. హెచ్ఐవి / ఎయిడ్స్ వ్యాప్తి చెందుటకు సెక్స్ మాత్రమే కారణం :

హెచ్ఐవి గురించి మరొక సాధారణమైన అపోహ ఏమిటంటే, ఇది లైంగిక సంబంధంలో మునిగిపోవటం ద్వారా మాత్రమే సంభవించవచ్చు. అవును, అసురక్షితమైన సెక్స్ అనేది కూడా హెచ్ఐవి సోకే పద్ధతుల్లో ఒకటి, కానీ ఆ ఒక్కటే కాదు, రక్త మార్పిడి ద్వారా కూడా హెచ్ఐవిని వ్యాప్తి చేయవచ్చు.

ఒక హెచ్ఐవి సంక్రమణ వ్యక్తి యొక్క రక్తమును మరొక సాధారణ వ్యక్తి యొక్క శరీరానికి బదిలీ చేయబడితే, అతను / ఆమె హెచ్ఐవి రోగిగా మారడానికి అవకాశం ఉంది. ఇంతే కాకుండా, మీరు ఒక అవయవ మార్పిడి, ఆ రోగి వాడిన మందులకు సోకే గుణమును కలిగిన ఉన్నదున (లేదా) రోగి వాడిన సూదులను ఉపయోగించడం వల్ల కూడా మీకు హెచ్ఐవి వ్యాప్తి చెందవచ్చు, మీ శరీరంలో గాయాలు (లేదా) తెగిన గాయాల కారణంగా అయిన (లేదా) ఒక తల్లి నుండి గర్భం (లేదా) తల్లిపాలను అందించే సమయంలో ఆ బిడ్డకు కూడా హెచ్ఐవి సోకవచ్చు. కాబట్టి, ఈ వ్యాధికి ఇతరులకు హానిని కలిగించడానికి తగినన్ని మార్గాలు ఉన్నాయి.

5. హెచ్ఐవి పాజిటివ్ ఉన్న తల్లికి జన్మనిచ్చిన బిడ్డకు కూడా ఈ ఇన్ఫెక్షన్ ఉంటుంది:

5. హెచ్ఐవి పాజిటివ్ ఉన్న తల్లికి జన్మనిచ్చిన బిడ్డకు కూడా ఈ ఇన్ఫెక్షన్ ఉంటుంది:

అవును, ఆ పసిపిల్లలకు - వారి తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు (లేదా) తల్లిపాలను ఆ బిడ్డకు పట్టడం వల్ల కూడా ఆ పసిపిల్లలు ఈ హెచ్ఐవి వ్యాధి బారిన పడినట్లుగా తెలుస్తుంది. కానీ ప్రతిసారి, అలాంటి పిల్లలకు ఈ వ్యాధి సోకడం అనేది తప్పనిసరిగా లేదు. బిడ్డ ఒక సాధారణమైన తండ్రికి మరియు ఒక హెచ్ఐవిని కలిగి ఉన్న తల్లికి గాని జన్మించిన ఉంటే, వారు వ్యాధిని కలిగి ఉండరు. అయినప్పటికీ కూడా, అలాంటి పిల్లలు ఎక్కువ ముప్పును కలిగి ఉంటారు, అందువల్ల వారి జననాన్ని పూర్తిగా వాయిదా వేసుకోవాలి, మరియు వైరస్ను పిల్లల శరీరంలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి తగిన వైద్య చికిత్సను సరైన రీతిలో తీసుకోవాలి.

6. శక్తివంతమైన ఔషధాలు కావటం వలన వాటిని దూరం పెట్టడం :

6. శక్తివంతమైన ఔషధాలు కావటం వలన వాటిని దూరం పెట్టడం :

ఒక వ్యక్తిలో హెచ్ఐవి గుర్తించిన తర్వాత, వైద్యునిచే సూచించబడిన ఔషధాలను కొనసాగించటం చాలా అవసరం. కానీ మనలో కొందరు నమ్ముతారు, ఇవి చాలా శక్తివంతమైన మందులుగా ఉంటాయని, అవి హెచ్ఐవిని నిర్మూలించవచ్చు (ఒక బలమైన ఔషధం వలె జ్వరమును త్వరగా నయం చేయవచ్చు) అని. కానీ హెచ్ఐవి అలాంటిది కాదు. కాబట్టి, మీరు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటే, సరైన ఔషధాలను మరియు సరైన సమయానికి వాడుతూ, మధ్య మధ్యలో తనిఖీని చేయించుకోవటం కూడా చాలా అవసరం.

7. హెచ్ఐవి ఉన్న రోగుల చుట్టూ ఉండటం వల్ల కూడా ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుంది:

7. హెచ్ఐవి ఉన్న రోగుల చుట్టూ ఉండటం వల్ల కూడా ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుంది:

హెచ్ఐవి అనేది ఫ్లూ (లేదా) జ్వరం వంటి అంటువ్యాధి కాదు, వారితో ఉండటం వలన మీరు ఈ ఘోరమైన వైరస్ను భారిన పడలేరు. ఈ వైరస్ మానవ శరీరంలో మాత్రమే చురుకుగా ఉంటుంది మరియు పర్యావరణం లోనికి వచ్చినప్పుడు చాలా స్వల్పకాలికంగా మాత్రమే జీవిస్తుంది. కాబట్టి, ఆహారాన్ని పంచుకోవడం ద్వారా, కౌగలించుకోవడం, ముద్దు పెట్టుకోవటం, వారి చుట్టూ తిరగటం మొదలగున చర్యల వల్ల మీరు హెచ్ఐవి చే ప్రభావితం కాలేరు. అలాగే, ఒక హెచ్ఐవి రోగిని దూరం పెట్టడం ద్వారా, మీరు ఆ వ్యక్తి యొక్క అనారోగ్యానికి పరోక్షంగా వ్యవహరిస్తున్నారు మరియు ఆ రోగులు యొక్క ధైర్యాన్ని నిరుత్సాహపరుస్తున్నారు.

8. హెచ్ఐవి / ఎయిడ్స్ పాజిటివ్గా ఉన్న వ్యక్తి వెంటనే మరణిస్తాడు:

8. హెచ్ఐవి / ఎయిడ్స్ పాజిటివ్గా ఉన్న వ్యక్తి వెంటనే మరణిస్తాడు:

హెచ్ఐవి / ఎయిడ్స్ గురించి అత్యంత సాధారణ అపోహ ఏమిటంటే, హెచ్ఐవి రోగి యొక్క జీవితకాలం చాలా స్వల్పంగా ఉంటుంది. కానీ, ఇది చాలా తప్పు నమ్మకం. శాస్త్రీయ మరియు సాంకేతిక అభివృద్ధితో అందుబాటులో ఉన్న సరైన మందుల సహాయంతో ఒక హెచ్ఐవి సోకిన వ్యక్తి దీర్ఘకాలం వరకూ జీవిస్తూ, ఆరోగ్యకరమైన కుటుంబ జీవితాన్ని కలిగి ఉంటారని ఇప్పుడు ప్రజలందరికీ తెలుస్తోంది. ఏది ఏమయినప్పటికీ, ఆ రోగికి ఎప్పటికప్పుడు సరైన చికిత్సను అందించకపోతే, ఎయిడ్స్ మళ్లీ ఆఖరి దశకి వెళ్లిపోతుంది (మళ్లీ మళ్లీ చికిత్స చేయకపోతే), అది అలా మరణానికి దారి తీస్తుంది.

కాబట్టి, మన సమాజంలో విస్తృతంగా హెచ్ఐవి గురించి వ్యాపించి ఉన్న కొన్ని అపోహలను కలిగి ఉన్నాయి. అందువల్ల, ఎయిడ్స్ గురించి సరైన అవగాహన ఏర్పరుచుకునేందుకు మరియు అటువంటి అపోహల ఆధారంగా హెచ్ఐవి రోగులపై తీర్పులను వ్యక్తపరిచే వ్యక్తులను నిరోధించడానికి మన సామాజిక బాధ్యత.

English summary

HIV/AIDS Myths You Should Not Believe

There are some common myths about HIV that are still prevalent in our society. HIV is a virus which when enters human body affects the immune system of a person. If not treated in time, this can cause a severe damage to the immune system and make it incapable for the body to fight any disease.
Story first published: Wednesday, November 29, 2017, 12:06 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more