చెవి ఇన్ఫెక్షన్, చెవి నొప్పి నివారించే వెల్లుల్లి రెమెడీస్

Posted By:
Subscribe to Boldsky

చెవి ఇన్ఫెక్షన్, చాలామందిలో కనిపించే సాధారణసమస్య ఇది. ముఖ్యంగా స్కూలుకు వెళ్లే పిల్లల్లో తరచూ చూసే సమస్య. అందుకే జలుబు తర్వాత అత్యంత సాధారణ సమస్యగా దీన్ని చెబుతుంటారు. చెవికి సంబంధించిన ఇన్ఫెక్షన్‌కు అనేక కారణాలు ఉన్నాయి. జలుబు చేయడం, ముక్కుకు వచ్చే సమస్యలతోనూ చెవికి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే చాలామందిలో జలుబు చేశాక చెవినొప్పి కూడా కనిపిస్తూ ఉండటం సహజం.

జలుబువల్ల వ్యాపించే వైరస్ లేదా బ్యాక్టీరియా ముక్కురంధ్రాల ద్వారా యూస్టేషియన్ ట్యూబ్ నుంచి ముక్కులోని మధ్యభాగానికి చేరుతుంది. గొంతుభాగంలో అటు ముక్కు రంధ్రాలు, చెవిరంధ్రాలు, చెవి నుంచి గొంతులోకి వెళ్లే యూస్టేషియన్ ట్యూబ్స్... అవన్నీ అనుసంధానమై ఉంటాయి. అందువల్ల ముక్కుకు వచ్చిన ఇన్ఫెక్షన్లు చెవిలోకీ పాకుతాయి. అలాగే ముక్కుకు వచ్చే అలర్జీ, సైనస్ ఇన్ఫెక్షన్లు కూడా చెవినొప్పిని తెచ్చిపెడతాయి. ఇలా ఇన్ఫెక్షన్ కలిగినప్పుడు అక్కడ చీము చేరుతుంది. ఒక్కోసారి చీము పెరిగి అది కర్ణభేరికి రంధ్రం చేసుకుని చీము బయటకు స్రవిస్తుంది. ఈ సమస్య ఉన్నప్పుడు అది ఉన్న వ్యవధిని, కారణాన్ని బట్టి తీవ్రత ఆధారపడి ఉంటుంది.

చెవి నొప్పి, ఇన్ఫెక్షన్ నివారించే గార్లిక్ ఆయిల్

చెవి ఇన్ఫెక్షన్లు ఇవి రెండు రకాలు...
అప్పటికి కనిపించే ఇన్ఫెక్షన్
దీర్ఘకాలికంగా కనిపించే ఇన్ఫెక్షన్

కొన్ని రకాల చెవి ఇన్ఫెక్షన్లలో చీము కారుతుంటుంది. మరికొన్ని రకాల్లో చీము స్రవించదు. క్రానిక్ ఇన్ఫెక్షన్‌లో చెవి రంధ్రం పెద్దదిగా అయి, కొన్నాళ్ల తర్వాత చీము కారడం తగ్గిపోతుంది. అయితే వీరిలో చెవినొప్పి వచ్చి, వినికిడి లోపం క్రమంగా పెరుగుతూ పోతుంది.

తేనెలో వెల్లుల్లి నానబెట్టి తింటే శరీరంలో జరిగే అద్భుత మార్పులు..!!


కారణాలు: అపరిశుభ్రమైన నీళ్లలో ఈదులాడటం, చెవిలో పుల్లలు పెట్టడం వంటివి కూడా చెవి ఇన్ఫెక్షన్‌కు కారణాలు.

చెవి నొప్పి, ఇన్ఫెక్షన్ నివారించే గార్లిక్ ఆయిల్

నివారణ: చెవి నొప్పిని తగ్గించుకోవడానికి యాంటీబయోటిక్స్ కు అద్భుతమైన ప్రత్యామ్నాయం వెల్లుల్లి. వెల్లుల్లిలో ఉండే యాంటీ వైరల్ మరియు యాంటీ ఆక్సిడైజ్డ్ గుణాలు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది చెవి వాపు, నొప్పి, మరియు ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ మరియు యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఇన్ఫెక్షన్స్ కు వ్యతిరేఖంగా పోరాడుతుంది. చెవిలోపల నొప్పిని తగ్గిస్తుంది. మరి చెవి ఇన్ఫెక్షన్ మరియు నొప్పి, వాపులను తగ్గించుకోవడానికి వెల్లుల్లి ఏవిధంగా ఉపయోగించాలో తెలుసుకుందాం..

1. చెవి నొప్పి, ఇన్ఫెక్షన్ నివారించే వెల్లుల్లి:

1. చెవి నొప్పి, ఇన్ఫెక్షన్ నివారించే వెల్లుల్లి:


ముందుగా ఒక వెల్లుల్లి రెబ్బ తీసుకుని కచపచా దంచుకోవాలి. దీన్ని ఒక చిన్న కాటన్ క్లాత్ లో వేసి , చెవి నొప్పిగా ఉన్నప్రదేశంలో పెట్టాలి. అరగంట తర్వాత క్లాత్ తొలగించి చూడండి నొప్పి మాయమవ్వడాన్నీ మీరు గమనిస్తారు.

2. చెవి నొప్పి ఇన్ఫెక్షన్ తగ్గించే వెల్లుల్లి జ్యూస్ :

2. చెవి నొప్పి ఇన్ఫెక్షన్ తగ్గించే వెల్లుల్లి జ్యూస్ :

వెల్లుల్లి రెబ్బలను మెత్తగా పేస్ట్ చేసి, ఈ పేస్ట్ ను ఒక క్లాత్ లో వేసి చెవి చుట్టూ మర్ధన చేయాలి.

3. ఆవనూనె-వెల్లుల్లి రెమెడీ :

3. ఆవనూనె-వెల్లుల్లి రెమెడీ :

ఒక టీస్పూన్ ఆవనూనె తీసుకుని, అందులో నువ్వుల నూనె మిక్స్ చేసి పెట్టుకోవాలి. అందులోనే రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి కొన్ని నిముషాల వేడి చేయాలి. నొప్పి, వాపు ఉన్న ప్రదేశంలో ఆ నూనెను అప్లై చేయాలి.

4. వెల్లుల్లి -వాటర్

4. వెల్లుల్లి -వాటర్

నీళ్లలో 3, 5 వెల్లుల్లిని వేసి వేడి చేయాలి. కొద్ది సేపటి తర్వాత వేడి నుండి క్రిందికి దింపి, ఉడికిన వెల్లుల్లిని క్లాత్ లో వేసి, దాంతో పాటు కొద్దిగా సాల్ట్ కూడా వేసి నొప్పి, ఇన్ఫెక్షన్ ఉన్న ప్రదేశంలో అప్లై చేసి మర్దన చేయాలి.

కింగ్ ఆఫ్ స్పైస్ అయిన వెల్లుల్లిని ఖాళీ కడుపుతో తింటే ఏమవుతుంది ?

5. ఇన్ఫెక్షన్ నివారించే వెల్లుల్లి:

5. ఇన్ఫెక్షన్ నివారించే వెల్లుల్లి:

ఒక వెల్లుల్లి రెబ్బ తీసుకుని, కొనలు తుంచి, ఒక పల్చటి క్లాత్ లో చుట్టి, ఇన్ఫెక్షన్ ఉన్న ప్రదేశానికి తాకే విధంగా క్లాత్ ను ముందుకు నెట్టాలి. కొద్దిసయం తర్వాత క్లాత్ తో పాటు, వెల్లుల్లిని వెనకకు తీసేయాలి. ఇలా చేయడం వల్ల చెవి నొప్పితో పాటు ఇన్ఫెక్షన్ కూడా తగ్గుతుంది.

6. చెవి నిప్పి తగ్గించడానికి గార్లిక్ ఆయిల్ :

6. చెవి నిప్పి తగ్గించడానికి గార్లిక్ ఆయిల్ :


గార్లిక్ ఆయిల్ ను రెండు మూడు చుక్కలను చెవిలో వేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే ఇన్ఫెక్షన్ తో పాటు, నొప్పి కూడా తగ్గుతుంది.

7. వేడిగా ఉండే గార్లిక్ ఆయిల్ :

7. వేడిగా ఉండే గార్లిక్ ఆయిల్ :

ఒక గిన్నెలో కొద్దిగా వెల్లుల్లి నూనె వేసి వేడి చేసి చెవిలో రెండు మూడు చుక్కలు వేసి కాటన్ పెట్టుకోవాలి. 10 నిముషాల తర్వాత కాటన్ తీసేయడం వల్ల చెవిలో గుమిలి సాప్ట్ గా మారి ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది.

8. గార్లిక్ ఆయిల్ క్యాప్స్యూల్స్ :

8. గార్లిక్ ఆయిల్ క్యాప్స్యూల్స్ :

ఒక గార్లిక్ ఆయిల్ క్యాప్స్యూల్ తీసుకుని బ్రేక్ చేసి, అందులోని ఆయిల్ మాత్రం తీసుకుని నేరుగా చెవిలోపల ఇన్ఫెక్షన్ ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. లేదా చెవిలో రెండు మూడు డ్రాప్స్ వేసి 10-15 నిముషాల కాటన్ పెట్టి విశ్రాంతి తీసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

English summary

How Garlic Helps To Teat Ear Infection in Telugu

Garlic has anti-bacterial, anti-viral and anti-oxidizing properties that helps to treat the bacterial action on the ear that causes ear infection. It also helps to reduce the ear swelling, pain and infection.
Story first published: Monday, June 19, 2017, 16:53 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter