చిగుళ్ళ నుండి రక్తస్రావం అవుతుంటే తగ్గడానికి వెంటనే ఏం చేయాలి?

By: Mallikarjuna
Subscribe to Boldsky

రాత్రి మంచి నిద్ర తర్వాత ఉదయం మంచి మూడ్ తో నిద్రలేవాలి. కానీ ఉదయం నిద్రలేవగానే మన ముఖం పక్కకు తిప్పుకుని నేరుగా బాత్రూమ్ కు వెళ్ళి, టూత్ బ్రష్ చేస్తుంటాం.

ఇది మనం రోజూ చేస్తున్న ఒక హైజీనిక్ దినచర్య. అయితే సడెన్ గా బ్రష్ చేస్తున్నప్పుడు చిగుళ్ళ నుండి రక్తస్రావాన్ని చూస్తే భయమేస్తుంది. నిజంగా చెప్పాలంటే చాలా మందికి ఓరల్ హెల్త్ గురించి చాలా మందికి తెలియదు. మన రోజూ బ్రష్ చేసి దంతక్షయం నుండి దంతాలను కాపాడుకుంటాము. మరి చిగుళ్ళ సంగతేంటి?

ఇంట్లోనే కొన్ని ఓరల్ హైజీనిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయి. నోట్లో బ్యాక్టీరియా వల్ల చిగుళ్ళు వాపు, చిగుళ్ళ నుండి రక్తస్రావం జరుగుతుంది. చిగుళ్ళ వాపు నోట్లో దంతా మద్య పాచి కట్టడం ద్వారా ఏర్పడుతుంది. రెగ్యులర్ బ్రష్ తో దంతా మద్య పాచిని తొలగించకపోవడం వల్ల నోట్లో బ్యాక్టీరియా పెరిగి, చిగుళ్ళు వాపు , రక్తస్రావం జరగుతుంది.

What To Do When You Have Bleeding Gums

బ్ర‌ష్ చేసుకునేట‌ప్పుడు చిగుళ్ళ మ‌ధ్య నుండి ర‌క్తం కార‌డం..నోరు బంక బంక‌గా జిగ‌ట‌గా త‌యార‌వ‌డం..నోటి దుర్వాస‌న‌..చిగుళ్ళు వ‌దుల‌వ‌డం ఇవ‌న్నీ చిగుళ్ళ వ్యాధి ల‌క్ష‌ణాలు. చిగుళ్ళ‌వ్యాధిని ప్రాథ‌మిక ద‌శ‌లోనే అంటే చిగుళ్ళ నుంచి ర‌క్త‌స్రావం రావ‌డం గ‌మ‌నించిన త‌క్ష‌ణ‌మై దంత వైద్యుడిని సంప్ర‌దించాలి. స్కేలింగ్ చేయిస్తే ఈ స‌మ‌స్య‌ను ప్రాధ‌మిక ద‌శ‌లోనే నివారించ‌వ‌చ్చు. ఈ ద‌శ‌లో అల‌స‌త్వం వ‌హిస్తే చిగుళ్ళు వ‌దుల‌యి ప‌ళ్ళ మ‌ధ్య సందులు రావ‌డం..ఏదైనా ఆహారం తిన్నా ఆ ప‌దార్థాలు ప‌ళ్ళ సందుల్లో ఇరుక్కుపోవ‌డంతో స‌మ‌స్య మ‌రింత ఎక్కువ అవుతుంది. డాక్టర్ వద్దకు వెళితే కొన్ని యాంటీబయోటిక్స్ ను సూచిస్తారు. అయితే వీటి వల్ల నయం అవ్వడానికి కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటుంది.

దంతాలు తెల్లగా మిళమిళ మెరవాలంటే 20 చిట్కాలు

డాక్టర్ వద్దకు వెళ్ళడానికంటే ముందుగా కొన్ని హోం రెమెడీస్ ను ప్రయత్నిస్తే చిగుళ్ళు వాపు, చిగుళ్ళు నుండి రక్తస్రావంను నివారించుకోవచ్చు. కొంత వరకూ ఉపశమనం పొందవచ్చు.

ఇక్కడ కొన్ని హోం రెమెడీస్ సూచించడం జరిగింది, ఇవి చిగుళ్ళ వాపు, మరియు రక్తస్రావం నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి.

1) ఉప్పు నీళ్ళతో నోరు పుక్కిలించడం:

1) ఉప్పు నీళ్ళతో నోరు పుక్కిలించడం:

ఉప్పు చాలా వరకూ న్యాచురల్ రెమెడీ. ఇది నోటి ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది. ఇది పవర్ ఫుల్ యాంటీ ఇన్ఫ్లమేటీర మరియు యాంటీ సెప్టిక్ గుణాలు కలది. ఇది బ్యాక్టీరియాను వెంటనే నాశనం చేస్తుంది. చిగుళ్ళ వాపు మరియు రక్తస్రావం , నొప్పిని వెంటనే తగ్గిస్తుంది.

ఒక టీస్పూన్ ఉప్పును ఒక గ్లాసు వేడి నీటితో వేసి నోట్లో పోసుకుని గార్గిలింగ్ చేయాలి. కొన్ని సందర్భాల్లో వాపును నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది.

 2) మింట్ ఆయిల్ :

2) మింట్ ఆయిల్ :

చిగుళ్ళ సమస్యలను నివారించడానికి మింట్ ఆయిల్ సహాయపడుతుంది. రెగ్యులర్ గా ఉపయోగించే ఒక ఓరల్ హైజీన్ ప్రొడక్ట్. ఇది నోట్లోని చెడు బ్యాక్టీరియాను ఎఫెక్టివ్ గా నాశనం చేసి, చిగుళ్ళ వాపును కూడా తగ్గిస్తుంది. మింట్ ఆయిల్లో ఉండే చెడు శ్వాసను తొలగిస్తుంది. కొన్ని చుక్కల మింట్ ఆయిల్ ను తీసుకుని నేరుగా చిగుళ్ళ మీద అప్లై చేస్తే నొప్పి నుండి ఉపశమనం పొందుతారు.

దంతాలు..చిగుళ్ళ ఆరోగ్యానికి వంటింటి చిట్కాలు

3) దాల్చిన చెక్క :

3) దాల్చిన చెక్క :

దాల్చిన చెక్కలో స్ట్రాంగ్ యాంటీబ్యాక్టిరియల్ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి పాచిని , చిగుళ్ళ వాపును తగ్గిస్తాయి. అంతే కాదు, తాజా శ్వాసను కూడా అందిస్తుంది.

దాల్చిన చెక్కను మెత్తగా పేస్ట్ చేసి, దాన్ని చిగుళ్ళ మీద అప్లై చేయాలి. 2 నిముషాలు అలాగే వదిలి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

4) డైరీ ప్రొడక్ట్స్ ను :

4) డైరీ ప్రొడక్ట్స్ ను :

డైరీ ప్రొడక్ట్స్ లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను స్ట్రాంగ్ గా మార్చుతుంది. క్యాల్షియం దంతాల మద్య బ్యాక్టీరియా చేరకుండా గ్యాప్ ను కవర్ చేస్తుంది. ఇది చిగుళ్ళ వాపు, రెడ్ నెస్ ను వెంటనే తగ్గిస్తుంది.

పాలు, చీజ్ వంటి డైరీ ప్రొడక్ట్స్ ను వెంటనే తీసుకోవడం మొదలు పెట్టండి.

5) ల్యావెండర్ ఆయిల్ :

5) ల్యావెండర్ ఆయిల్ :

ల్యావెండర్ ఆయిల్ మంచి యాంటీ బ్యాక్టీరియ గుణాలు కలది. చిగుళ్ళకు ల్యావెండర్ ఆయిల్ ను మసాజ్ చేయాలి. ఇది బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది. చిగుళ్ళ వాపును నొప్పిని తగ్గిస్తుంది. ఇది దంతలను మరియు చిగుళ్ళ గ్యాప్ ను పూడ్చుతుంది. క్రిములు నోట్లో స్పెడ్ కాకుండా నివారిస్తుంది.

కొన్ని చుక్కల ల్యావెండర్ ఆయిల్ ను ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో వేసి బాగా కలిపి, నోట్లో పోసుకుని, గార్గిలింగ్ చేయాలి.

6) మ్యారిగోల్డ్, క్యాలెండ్యులా

6) మ్యారిగోల్డ్, క్యాలెండ్యులా

క్యాలెండ్యులా, ఇది ఒక ఫ్లవర్ ఇందులో హీలింగ్ బెనిఫిట్స్ చాలా దాగున్నాయి. ఇది ఒక మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ సెప్టిక్ గుణాలు కలిగినది. ఇది దంతాల మద్య పాచిని తొలగిస్తుంది. ఈ హెర్బ్ న్యాచురల్ డిటాక్సిఫైర్. ఇడి బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది. చిగుళ్ళుకు సంబంధించిన కణాలను స్ట్రాంగ్ చేస్తుంది.దాంతో దంతాలు స్ట్రాంగ్ గా మారుతాయి.కొన్ని ఫ్రెష్ గా ఉండే మ్యారిగోల్డ్ ఫ్లవర్ పెటల్స్ తీసుకుని, ఒక గ్లా నీటిలో వేయాలి. ఈ నీటిని వడగట్టి నిటి శుభ్రతకు ఉపయోగించుకోవాలి.

7) ఆయిల్ పుల్లింగ్ :

7) ఆయిల్ పుల్లింగ్ :

ఆయిల్ పుల్లింగ్ ఒక పురాతన హోం రెమెడీ. ఇది దంతావదానానికి చాలా మంచిది. ఈ నూనెను కొద్దిగా నీట్లో వేసుకుని మింగకుండా, 10 -15నిముషాలు బయట ఊయకుండా నోట్లో పుల్ చేయాలి. 15 నిముషాల తర్వాత ఊసేయాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంది. ఓరల్ హైజీన్ మెరుగవుతుంది.

అరటీస్పూన్ నువ్వుల నూనె తీసుకుని అందులో కొన్ని చుక్కల టీట్రీ ఆయిల్ మిక్స్ చేయాలి. దీన్నినోట్లో పోసుకుని పుల్ చేయాలి. 10 నిముషాల తర్వాత బయటకు ఊసేయాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

8) క్యారెట్స్, బీట్ రూట్ వంటివి తినాలి:

8) క్యారెట్స్, బీట్ రూట్ వంటివి తినాలి:

పచ్చి గా, ఫ్రెష్ గా ఉన్న వెజిటేబుల్స్ తినడం వల్ల దంతాలను స్ట్రాంగ్ గా మార్చుతుంది. నోటి దుర్వాసనను పోగొడుతుంది.పచ్చి కూరగాయలలో, విటమిన్ సి, విటమిన్ డి లు అధికంగా ఉన్నాయి . ఇవి దంతక్షయాన్ని నివారిస్తాయి. వెజిటేబుల్స్ నమిలి తినడం వల్ల నోట్లో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. దంతాల చిగుళ్ళ నుండి రక్తస్రావం తగ్గుతుంది. క్యారెట్, టర్నిప్, టమోటో వంటివి భోజనానికి ముందు తీసుకోవడం వల్ల దంత ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

English summary

What To Do When You Have Bleeding Gums

leeding gums can be caused due to bad oral hygiene. Know about a few ways to prevent bleeding gums here in this article.
Story first published: Monday, November 27, 2017, 13:15 [IST]
Subscribe Newsletter