‘‘ఫిల్టర్ కాఫీ’’అద్భుతమైన రుచి కాదా, అయితే వీలైనంత తక్కువ తాగండి..!!

Posted By:
Subscribe to Boldsky

'అమ్మా, కాఫీ...' బెడ్‌మీద నుంచే ఓ పొలికేక...'హాయ్‌ అనూ... ప్లీజ్‌, నాతో ఓ కాఫీ'...'తలనొప్పిగా ఉంది గురూ. స్ట్రాంగ్‌ కాఫీ పడాల్సిందే'...ఇలా లేచింది మొదలు మళ్లీ నిద్రపోయేవరకూ కాఫీకోసం కలవరించేవాళ్లు కోకొల్లలు. మధురమైన దాని రుచీ ఆ పరిమళమూ అలాంటివి మరి.

'వీలైతే నాలుగుమాటలూ కుదిరితే కప్పు కాఫీ' అంటూ నేటి యువతకి కెఫెలు కాలక్షేప వేదికలైతే కావచ్చేమోగానీ ఒకప్పుడు భావుకులకైనా విప్లవవాదులకయినా కాఫీ హౌస్‌లే చర్చావేదికలు. నురుగుతో పొంగే కాఫీ పడితేనే విప్లవ కవితైనా భావుకతైనా గోదారిలా ఉప్పొంగేదన్నమాట. కవిశ్రేష్ఠులనేముందీ... పొద్దుపొద్దున్నే ఇంత చద్ది తిని పనులకు పోయే పల్లె జనం సైతం వేడి కాఫీ గొంతు దిగందే పడక దిగనంతగా దానికి దాసానుదాసులైపోయారు.

ఆ కాఫీగింజల్లో ఏం మహాత్మ్యం ఉందో తెలీదుగానీ, ఒకసారి అలవాటుపడ్డవాళ్లు మానేయడం కుదరదంటే కుదరదు. అదిచ్చే ఆ కిక్కూ ఆ ఉత్తేజమూ అలాంటివి మరి. ఓ చుక్క గొంతులోకి ఇలా దిగిందో లేదో మెదడు పాదరసంలా పనిచేస్తుంది. డోపమైన్‌ విడుదలై ఆనందం వెల్లువెత్తుతుంది. అసలు కాఫీ ప్రపంచానికి పరిచయమైందే అలా...

కాఫీ పరిమితంగా తీసుకుంటే పర్వాలేదు కానీ, మోతాదుకు మించితే మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు. కెఫిన్ కు అడిక్ట్ అవ్వడం వల్ల తలనొప్పి, నిద్రలేమి సమస్యలు, డయూరిస్ వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అంతే కాదు పరిశోధనల ప్రకారం కార్డియో వాస్క్యులర్ ప్రమాదం 15శాతం వరకు పెరగవచ్చని చెబుతున్నారు.

కెఫిన్ రక్తంలో కొలెస్ట్రాల్ లెవల్స్ మరియు హోమోసైటిన్ లెవల్స్ ను పెంచుతుంది. ఇది ఆరోగ్యానికి ప్రమాధకరం. సాధారణ కాఫీ మాత్రమే కాదు, ఫిల్టర్ కాఫీ వల్ల కూడా ఆరోగ్య సమస్యలున్నాయంటున్నారు. మరి ఫిల్టర్ కాఫి ఆరోగ్యానికి మంచిదా కాదా..కొన్ని వాస్తవాలను తెలుసుకుందాం..

1. ఫ్యాక్ట్ #1

1. ఫ్యాక్ట్ #1

కాఫీలో టెర్ఫినాయిడ్స్ అనే కాంపౌండ్స్ ఉండటం వల్ల, ఫిల్టర్ కాఫీలో కూడా ఈ టెర్ఫినాయిడ్స్ ను పూర్తిగా తొలగించలేము. ఈ టెర్ఫినాయిడ్స్ గుండెకు సంబందించిన వ్యాధులను పెంచుతుంది.

ఫ్యాక్ట్ #2

ఫ్యాక్ట్ #2

కొలెస్ట్రాల్ లెవల్స్ పెరగకూడదునుకునే వారు, కాఫీకి దూరంగా ఉండాలి. కాఫీని మానేయడం వల్ల హోమోసిస్టైన్ మరియు కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గించుకోవచ్చు.

ఫ్యాక్ట్ # 3

ఫ్యాక్ట్ # 3

కొంత మందికి భోజనం చేసిన వెంటనే కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఈ అలవాటు చాలా ప్రమాదకరమైనదిజ ఇలా భోజంన చేసి వెంటనే కాఫీ తాగడం వల్ల ఆహారాల ద్వారా మినిరల్స్, విటమిన్స్ గ్రహించే శక్తిని కోల్పోతాయి. ఇప్పటికే పోషకాల లోపంతో బాధపడే వారు కాఫీని మానేయడం ఉత్తమం.

ఫ్యాక్ట్ # 4

ఫ్యాక్ట్ # 4

కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో క్యాల్షియం గ్రహించే శక్తి ఉండదు. అంతే కాదు యూరిన్ లో కూడా క్యాల్షియం కోల్పోయేలా చేస్తుంది. అందుకే కొంత మంది నిపుణులు కాల్షియం లోపంతో బాధపడేవారిని కాఫీని మానేయని సూస్తుంటారు.

ఫ్యాక్ట్ # 5

ఫ్యాక్ట్ # 5

అన్ని రకాల కాఫీలు...ఫిల్టర్ కాఫీతో సహా.. శరీరం జింక్ గ్రహించే శక్తిని కోల్పోతుంది. భోజనం సమయంలో నట్స్, బీన్స్, పౌల్టీ, రెడ్ మీట్, ఓయిస్ట్రెస్ వంటి ఆహార పదార్థాలను తినాలని కోరుకునే వారు కాఫీని తాగకపోవడం మంచిది.

ఫ్యాక్ట్ # 6

ఫ్యాక్ట్ # 6

కాఫీలో ఉండే కెఫిన్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల ఇది ఏవిధంగా అయితే విటమిన్ గ్రహించకుండా చేస్తుందే అదే విధంగా విటమిన్ డి కూడా శరీరంలో ఉప్పత్తి కాకుండా, గ్రహించకుండా చేస్తుంది. అంతే కాదు, కెఫిన్ కంటెంట్ ఎక్కువ సార్లు మూత్ర విసర్జనను ప్రేరేపిస్తుంది.

ఫ్యాక్ట్ # 7

ఫ్యాక్ట్ # 7

కాఫీ ఎక్కువ తాగడం వల్ల కెఫిన్ కంటెంట్ ఐరన్ గ్రహించడం కూడా తక్కువ చేస్తుంది. అందువల్ల చిక్ పీస్, లెంటిల్స్, నట్స్ వంటి కాఫీ తాగడానికి ముందు తినకూడదు. ఈ వాస్తవాలన్ని తెలుసుకున్న తర్వాత మామూలు కాఫీ అయినా..ఫిల్టర్ కాఫీ ఆయిల్ ఆరోగ్యానికి ప్రమాదకరమనే గుర్తించారు కదా...కాబట్టి కెపిన్ కు దూరంగా ఉండటమే ఉత్తమం.

English summary

Is Filter Coffee Bad For You?

Is filter coffee bad for you? Yes, say some studies. It is advisable to consume it in moderation. Here are more facts.
Subscribe Newsletter