స్నానం తర్వాత శరీరాన్ని తుడిచుకునే బాత్ టవల్ ఖతర్నాక్ సైలెంట్ కిల్లర్ !

By: Y. Bharath Kumar Reddy
Subscribe to Boldsky

స్నానం చేసిన వెంటనే అందరికీ గుర్తొచ్చేది బాత్‌ టవల్‌. అది మిమ్మల్ని పొడిగా ఉంచుతుంది. బాత్‌ టవల్‌ శుభ్రంగా ఉంటేనే మీరు శుభ్రంగా ఉంటారు. అందువల్ల బాత్‌ టవల్స్‌ ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత మేలు. బాత్‌ టవల్స్ మళ్లీ ఉపయోగించడం సురక్షితమేనా ? బాత్‌ టవల్స్ ను ఎన్నిసార్లు ఉతకాలి ? ఈ విషయం గురించి చాలా మంది అంతటా పట్టించుకోరు.

అయితే ఇది చాలా ముఖ్యమైన విషయం. టవల్స్ వల్ల వచ్చే సమస్యలు ఏమిటి అంటే చాలానే ఉన్నాయి. ముందుగా టవల్స్ లో ఎక్కువగా బ్యాక్టీరియా ఉంటుంది. మరొక విషయం ఏమిటంటే తువ్వాళ్లను ఎక్కువ రోజుల నుంచి వినియోగిస్తూనే ఉంటాం.

దీంతో వాటిపై బ్యాక్టీరియా ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంది. బ్యాక్టీరియా వల్ల కుటుంబంలో ఒక వ్యక్తికి ఏదైనా వ్యాధి వ్యాపిస్తే.. ఆ తర్వాత వెంటనే ఆ కుటుంబంలోని అందరికీ ఆ వ్యాధి వస్తుంది. దీంతో అందరూ అనారోగ్యం బారిన పడాల్సి వస్తోంది.

అలర్ట్ : టవల్స్ ను రెగ్యులర్ గా వాష్ చేయక పోతే ఆరోగ్యానికి కలిగే హాని..!!

ఒక అధ్యయనం తెలిపిన ప్రకారం..

ఒక అధ్యయనం తెలిపిన ప్రకారం..

మీరు బాత్ రూమ్ లో ఉపయోగించే టవల్స్ లో 90% బ్యాక్టీరియా ఉంటుందని ఒక అధ్యయనంలో వెల్లడైంది. అలాగే కోలిఫికమ్ అనే బ్యా క్టీరియా తువ్వాళ్ళలో ఎక్కువగా ఉంటుది.

ల్యాబ్ టెస్ట్స్ లో తెలిసిన విషయాలు

ల్యాబ్ టెస్ట్స్ లో తెలిసిన విషయాలు

ఇక బాత్రూమ్స్ లో ఉపయోగించే టవల్స్ ను పరిశోధకులు ఒక ప్రయోగశాలకు పంపారు. అయితే టవల్స్ లో 14% ఈ కోలి బ్యాక్టీరియా ఉన్నట్లు తేలింది. ఈ కోలి తీవ్ర అంటువ్యాధులకు కారణం అవుతుంది.

హాని ఉంటుందా ?

హాని ఉంటుందా ?

ఇలాంటి టవల్స్ ను వినియోగించడం వల్ల చాలా రకాలుగా ఇబ్బందులుపడాల్సి వస్తుంది. మీ రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉంటే మీ బాత్రూం టవల్స్ లోని బ్యాక్టీరియా మిమ్మల్ని వెంటనే అటాక్ చేస్తుంది. దీంతో మీరు పలు అంటువ్యాధులకు గురవుతారు.

బాత్ టవల్స్ ను క్లీన్ చేసి, మెయింటైన్ చేయడానికి 6 సింపుల్ స్టెప్స్.. !

టవల్స్ ను షేర్ చేసుకోవొచ్చా ?

టవల్స్ ను షేర్ చేసుకోవొచ్చా ?

అస్సలు చేసుకోకూడదు. మీ చర్మంపై లేదా మీ స్నేహితుడి చర్మంపైన పగుళ్లు ఉన్నా కాస్త చిన్న గాయాలున్నా.. మీరు టవల్స్ ను షేర్ చేసుకోవడం వల్ల బ్యాక్టీరియా ఈజీగా బాడీలోకి వెళ్లే అవకాశం ఉంది. అందువల్ల ఎలాంటి పరిస్థితుల్లోనూ టవల్స్ ను షేర్ చేసుకోవొద్దు.

తరచుగా ఉతకాలి

తరచుగా ఉతకాలి

క్రమం తప్పకుండా మీ తువ్వాలను కచ్చితంగా ఉతకాలి. దీంతో వాటిలో ఉంటే బ్యాక్టీరియా మొత్తం పోతుంది. ఒక్కసారి టవల్ ఉపయోగించారనుకో వెంటనే దాన్ని ఉతికితే ఇంకా చాలు మేలు. ఇక పొడిగా ఉన్న టవల్స్ ను ఉపయోగిస్తే సాధ్యమైనంత వరకు బ్యాక్టీరియా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ తక్కువగా ఉంటుది.

టవల్స్ ను ఎప్పుడు వినియోగించకూడదు ?

టవల్స్ ను ఎప్పుడు వినియోగించకూడదు ?

మీ టవల్ నుంచి విపరీతమైన చెడు వాసన వస్తుందనుకో మీరు దాన్ని అస్సలు ఉపయోగించకూడదు. ఎందుకంటే అది బాక్టీరియాలకు నెలవై ఉంటుంది. అలాగే పబ్లిక్ బాత్ రూమ్స్, హోటల్స్ ఉంచే టవల్స్ ను అస్సలు వినియోగించవద్దు.

English summary

Is It Safe To Reuse Bath Towels? No!

Is it safe to reuse bath towels? How often should you wash your bath towels? Well, most of us seldom have the time to think of this matter. Read this!
Subscribe Newsletter