For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లంచ్ చేసేటప్పుడు వీటికి దూరంగా ఉండండి

By Y. Bharath Kumar Reddy
|

ప్రతి రోజూ మన ఆహారం తీసుకోక తప్పదు. అయితే ఈ విషయంలో కొన్ని తప్పుల్ని తరుచూ చేస్తూనే ఉంటాం. ముఖ్యంగా లంచ్ సమయంలో అంటే మధ్యాహ్నం తీసుకునే భోజన విషయంలో ఎక్కువగా తప్పిదాలు చేస్తుంటాం. ఎప్పుడూ చేసేవే కాబట్టి అవి కొందరికి తప్పులుగా కూడా అనిపించవు.

కానీ, వాటి దుష్ప్రభావాలు మాత్రం శరీరం మీద పడుతాయి. ఫలితంగా ఆరోగ్యం దెబ్బతింటుది. మనం తీసుకునే ఆహారంలో అల్పాహారం ముఖ్యమైనది అయినప్పటికీ మధ్యాహ్నం తీసుకునే భోజనానికి కూడా ఎంతో ప్రాముఖ్యం ఉంది. చాలామంది లంచ్ వారు పని చేసే ఆఫీసుల్లోనే చేస్తుంటారు. భోజన విరామం అనేది మన శరీరానికి ఎంతో మేలు చేకూరుస్తుంది. అలాగే లంచ్ టైమ్ అనేది కరెక్ట్ డిజైన్ చేయబడి ఉంటుంది.

మధ్యాహ్న సమయంలో మన బాడీకి మంచి బూస్ట్ ఎనర్జి కావాలి. మధ్యాహ్నం సమయంలో మన రక్తంలో చక్కెర పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో భోజనం తీసుకుంటే చాలా ప్రయోజనాలు కలుగుతాయి. రక్తంలో చక్కెర స్థాయి స్థిరీకరించబడుతుంది.

Lunch Mistakes That You Should Strictly Avoid

అలాగే ఏకాగ్రత పెరుగుతుంది. అంతేకాకుండా మీ జీవక్రియ చురుగ్గా పని చేస్తుంది. అయితే చాలా మంది ఆ టైమ్ లో వర్క్ లో బిజీగా ఉండి సరిగ్గా తినరు. అయితే ఫస్ట్ మీరు భోజనం చేశాకే మిగతా పనులు చేయాలి. మీరు లంచ్ సక్రమంగా చేయనట్లయితే బరువు పెరుగుతారు. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. అలాగే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

భోజనం తర్వాత చేయకూడని పనులు ?

అసలు లంచ్ చేసేటప్పడు ప్రతి ఒక్కరు చేసే తప్పులు ఏమిటి? ఆ సమయంలో వేటికి దూరంగా ఉండాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

రోజూ బయటి ఫుడ్ తినడం

రోజూ బయటి ఫుడ్ తినడం

చాలామంది రోజూ బయటి ఫుడ్ తింటూ ఉంటారు. ఇది చాలా తప్పు. రెస్టారెంట్, హోటల్స్ ల్లో ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే ఇక్కడ తాజాగా ఉండే ఫుడ్ ఉండదు. దీంతో భవిష్యత్తులో మీరూ ఇబ్బందులుపడాల్సి వస్తోంది. అలాగే ఇక్కడ శుభ్రత కూడా సరిగ్గా ఉండదు. బయట ఫుడ్ ను ఎంత మితంగా తీసుకుంటే అంత మంచిది. చాలా తక్కువ సమయాల్లో ఇలాంటి ఫుడ్ ను తీసుకోవాలి. మీ ఇంట్లో తయారు చేసిన ఫుడ్ ను తినడానికే మీరు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వండి. అది మీ ఆరోగ్యానికి చాలా మంచిది. అందువల్ల మీరు రెగ్యులర్ గా చేసే తప్పును ఇక నుంచైనా చేయకుండా ఉండండి.

మీ డెస్క్ వద్ద తినడం

మీ డెస్క్ వద్ద తినడం

మీరు పని చేసే డెస్క్ వద్ద ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది. టాయిలెట్లో ఉండేదానికంటే 3 రెట్లు ఎక్కువ జెర్మ్స్ మీరు పని చేసే డెస్క్ వద్దే ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మీరు మీ డెస్క్ వద్ద వీలైనంత వరకు భోజనం చేయకండి. దాదాపు మీ డెస్కు వద్ద మన శరీరాన్ని తరచూ ప్రాంతాన్ని రోజూ శుభ్రం చేయకపోవొచ్చు. దాంతో అక్కడ ఉండే సూక్షజీవులు మీ శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఎక్కువ ఉంది. ఇప్పటి నుంచైనా మీరు డెస్క్ వద్ద తినే పద్ధతికి వీడ్కోలు పలకండి.

తినే సమయంలో ఫోన్ ఉపయోగించడం

తినే సమయంలో ఫోన్ ఉపయోగించడం

ప్రస్తుతం మొబైల్స్ ఎంతగా ఉపయోగపడుతున్నాయో అంతగా నష్టాలు చేకూరుస్తున్నాయి. మన నిత్యం జీవితంలో మొబైల్స్ భాగమయ్యాయి. అయితే మీరు తినే సమయంలో కూడా ఫోన్ ను స్క్రోల్ చేస్తూ ఉండొచ్చు. దీంతో మీరూ ఇబ్బందులకు గురవుతారు.

ప్రతి మొబైల్ ఫోన్ స్క్రీన్ సూక్ష్మ జీవులకు ఆవాసంగా ఉంటుంది. అందువల్ల మీరు భోజనం సమయంలో ఫోన్ వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించాలి. మీరు ఫోన్ వినియోగిస్తూ ఉన్నారనుకో.. పరధ్యానంలో ఉండిపోతారు. దీంతో మీ కడుపు నిండిదనే విషయాన్ని కూడా మీకు మెదడు తెలిపే ప్రసక్తి ఉండదు. దీంతో అధికంగా తింటారు. అందువల్ల వీలైనంత వరకు ఫోన్లకు దూరంగా ఉండండి.

అదనపు ఆహారపదార్థాలను కలపడం

అదనపు ఆహారపదార్థాలను కలపడం

మీరు తినే ఆహారానికి అదనపు పదార్ధాలను కలుపుతూ డ్రెస్సింగ్ చేస్తూ ఉంటారు. ఇది సరైన పద్ధతి కాదు. మసాలా లేదా ఆలివ్ నూనె ను ఎక్కువగా ఆహారంలో కలపడం వల్ల అందులో ఉండే పోషకాలు తగ్గిపోతాయి. దీన్ని వీలైనంత వరకు తగ్గించండి. సాధ్యమైనంత వరకు మీరు ఆహారాన్ని సహజంగా ఉంచుకునేందుకు ప్రయత్నించండి. అయితే దీన్ని అవాయిడ్ చేయడానికి కొంత సమయం పట్టొచ్చు. అయినా సరే మీకు ఇది చాలా మేలు చేసే విషయం.

నిద్ర పట్టించని ఆఫీస్ లంచ్!

చాలా ఆలస్యంగా తినడం

చాలా ఆలస్యంగా తినడం

చాలామంది ఆలస్యంగా తింటూ ఉంటారు. అయితే దీనివల్ల మొదట్లో ఎలాంటి ఇబ్బందులు లేకున్నా భవిష్యత్తులో మాత్రం చాలా ఇబ్బందులుపడాల్సి వస్తోంది. అంతేకాకుండా లేటుగా తినడం వల్ల ఒకేసారి ఎక్కువగా తినాల్సి వస్తోంది. దీంతో మీ జీవక్రియ నెమ్మది అయిపోతుంది. ఫలితంగా మీ శరీరంలో ఫ్యాట్ ఎక్కువయి పోతుంది.

ప్రాసెస్ చేసిన మాంసాలు

ప్రాసెస్ చేసిన మాంసాలు

ప్రాసెస్ చేసిన మాంసాల్లో ఎక్కువగా ఉప్పు, హానికరమైన రసాయనాలుంటాయి. దీంతో అధిక రక్తపోటు, ఇతర వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. ఈ మాంసాల్లో ఉన్న ఎన్ నిట్రోస్ సమ్మేళనాలు క్యాన్సర్ కు కారణమవుతాయి. అంతేకాకుండా ఇవి శరీరానికి ఎంతో హానికరం చేస్తాయి.

వైట్ బ్రెడ్

వైట్ బ్రెడ్

చాలామంది శాండ్విచ్ కోసం వైట్ బ్రెడ్ ఉపయోగిస్తుంటారు. వైట్ బ్రెడ్ లో ఎలాంటి ఫైబర్ ఉండదు. గ్లైసెమిక్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇది రక్తంలో చక్కెరను పెంచుతుంది. ఇది రక్తపోటు, ఇతర గుండె సంబంధిత వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. అధిక రక్తపోటు సమస్య కూడా వస్తుంది. అందువల్ల వీలైనంత వరకు వైట్ బ్రెడ్ కు దూరంగా ఉండండి. బ్రౌన్ బ్రెడ్ ను వాడండి. ఇది ఆరోగ్యకానికి చాలా ఉపయోగకరం.

సోడా

సోడా

సోడాలో చక్కెర అధిక మొత్తంలో ఉంటుంది. ఇందులో ఎలాంటి కేలరీలుండవు. అలాగే శరీరంలో ఫ్యాట్ ఏర్పడేందుకు కారణం అవుతుంది. మీరు బరువు పెరగడంతో పాటు ఇతర సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. అంతేకాకుండా మీ పళ్ళు కూడా దంత క్షయానికి గురవుతాయి. బ్లడ్ షుగర్ కూడా పెరుగుతుంది. నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది. అందువల్ల మీరు తినే సమయంలో సోడాకు దూరంగా ఉండండి.

కూరగాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలి

కూరగాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలి

మీరు రోజూ తినే ఆహారంలో కూరగాయాలతో తయారు చేసిన మీ భోజనాన్ని తీసుకుంటే మంచిది. దీంతో మీ శరీరానికి కావాల్సిన విటమిన్స్ లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ మిమ్మల్ని ఎక్కువగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అలాగే మీరు తినడానికి ముందు ఎలాంటి చిరుతిళ్లు తినకూడదు.

కొవ్వు పదార్ధాలు తీసుకోవడం

కొవ్వు పదార్ధాలు తీసుకోవడం

కొందరు ఎక్కువ కొవ్వు పదార్థాలను ఆహారాలుగా తీసుకుంటూ ఉంటారు. అయితే ఇది మంచి పద్ధతి కాదు. దీనివల్ల మీరు చాలా ఇబ్బందులుపడాల్సి వస్తోంది. దీంతో మీ శరీరంలో అదనపు కొవ్వు చేరుతుంది. అందువల్ల వీలైనంత వరకు కొవ్వు పదార్థాలు తక్కువ ఉండే ఆహారాలను తీసుకోండి.

మైక్రోవోవెన్ ఫుడ్

మైక్రోవోవెన్ ఫుడ్

మీరు ఫుడ్ ను ఎక్కువగా వేడి చేసి తింటున్నారా? అది కూడా మైక్రోవోవెన్స్ లో ఫ్లాస్టిక్ ట్రేలో పెట్టి వేడి చేసి తింటున్నట్లయితే మీరు చాలా సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తోంది. దీనివల్ల బీపీే (బిస్ ఫినాల్) అని పదార్థం ఆహారాలు చెడిపోయేలా చేస్తుంది. అంతేకాకుండా ఈ పదార్ధం కణాల పనితీరుపై కూడా ప్రభావం చూపుతుంది. అయితే కాస్త సేఫ్ కంటెనైర్స్ ఉపయోగిస్తే బీపీఏకు దూరంగా ఉండండి.

లంచ్ మిస్ చేయడం

లంచ్ మిస్ చేయడం

చాలామంది కొన్ని సందర్భాల్లో లంచ్ తినకుండా ఉంటారు. ఇలా భోజనాన్ని తినకపోవడం వల్ల చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో మీ శరీరానికి సరైన పోషక పదార్ధాలు కూడా అందవు. మీరు మధ్యాహ్న సమయంలో భోజనం చేయకుండా ఉండడం వల్ల ఇబ్బందులు ఎక్కువగా ఎదుర్కొంటారే తప్ప బరువు మాత్ర తగ్గరు.

తిన్న తర్వాత అలాగే కూర్చొని ఉండడం

తిన్న తర్వాత అలాగే కూర్చొని ఉండడం

తిన్న తర్వాత అలాగే కూర్చొని ఉండిపోతే ఎలాంటి ప్రయోజనం ఉండదు. తిన్న ఆహారం వెంటన జీర్ణం కావాలంటే తిన్న తర్వాత కాసేపు వాకింగ్ చేయటం మంచిది. వాకింగ్ ద్వారా కేలరీలు తగ్గుతాయి. అలాకాకుండా కూర్చొని ఉంటే ఎనర్జీ మొత్తం కొవ్వుగా మారుతుంది.

ఆరోగ్యకరమైన ఆహారాలను అతిగా తినడం

ఆరోగ్యకరమైన ఆహారాలను అతిగా తినడం

ఇది ఆరోగ్యానికి చాలా హానికరం.ఆరోగ్యకరమైన ఆహారాలు కాస్త లిమిట్ లో తినాలి. ఇష్టానుసారంగా తింటే చాలా ఇబ్బందులుపడాల్సి వస్తోంది. చాలామది వివిధ రకాలు విత్తనాలను, డ్రై ప్రూట్స్ ను ఎక్కువగా తింటూ ఉంటారు. ఇలా తినడం వలన బరువు బాగా పెరిగిపోతారు. అందువల్ల వీలైనంత వరకు సమతుల్య ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి.

ఉప్పు ఎక్కువ తినడం

ఉప్పు ఎక్కువ తినడం

కొందరు వారు తినే ఆహారం మరింత రుచిగా ఉండాలని అందులో ఉప్పు ఎక్కువగా కలుపుతారు. దీంతో చాలా అనర్థాలు ఏర్పడుతాయి. దాన్ని ఫిల్టర్ చేయడానికి మీ మూత్రపిండాలు చాలా శ్రమించాల్సి వస్తుంది. వాటిపై ఒత్తిడి కూడా పెరుగుతుంది. అంతేకాకుండా అధిక ఉప్పు ఉపయోగించడం వల్ల గుండె జబ్బులు కూడా తలెత్తుతాయి. అందువల్ల వీలైనంత వరకు ఉప్పుకు దూరంగా ఉండండి.

English summary

Lunch Mistakes That You Should Strictly Avoid

Lunch Mistakes That You Should Strictly Avoid,Having the right food and in the right quantity for lunch is very important. Know about these lunch mistakes that you need to avoid.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more