గురక లేకుండా హాయిగా నిద్రించే మార్గాలు

By: Deepti
Subscribe to Boldsky

గురక వల్ల గురక పెడుతున్న వ్యక్తికి, ఆ గదిలో పడుకునే మిగతావారికి కూడా నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది. అంగిలి (నోటి లోపల పై భాగం),నాలుక మరియు గొంతుల యొక్క కండరాలు వదులవటం వల్ల కలుగుతుంది. గొంతు భాగంలోని కణజాలం ఎంతగా వదులవుతుందంటే అది గాలి మార్గానికి అడ్డు వచ్చి, గాలి వెళ్తున్నప్పుడు అదురుతుంది. గాలిమార్గం సన్నగా ఉంటే, ఆ అదురు మరింత పెద్దగా ఉండి గురక పెద్దగా ఉంటుంది. కానీ చింతించవద్దు,ఎ టువంటి దుష్ప్రభావాలు లేకుండా ఇంటిచిట్కాలతోనే మీరు ఈ సమస్యపై పోరాడవచ్చు.

గురక అసౌకర్యం మాత్రమే కాదు, 75% మంది స్లీప్ ఏప్నియా అనే నిద్రలేమి వ్యాధికి కూడా గురవుతారు. ఇది హృద్రోగానికి కూడా దారితీసే అవకాశం ఉంది. మార్కెట్లో అనేక గురకను తగ్గించే పరికరాలు అందుబాటులో ఉన్నా,వాటి శాస్త్రీయత ఇంకా నిరూపణ కాలేదు. గురక వివిధ కణజాల అసాధారణతలు, మద్యం, పొగ త్రాగడం,అలర్జీలు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు వంటి అనేక కారణాల వల్ల రావచ్చు. ఈ వ్యాసంలో, గురకను దూరం చేసే మేటి పద్ధతులను పొందుపరిచాం. సహజంగా గురకను ఎలా పోగొట్టొచ్చో మరింత కింద చదవండి.

1.టెన్నిస్ బంతిని వాడండి :

1.టెన్నిస్ బంతిని వాడండి :

వెల్లకిలా పడుకున్నట్లయితే, టెన్నిస్ బంతిని పాత చొక్కా జేబులో ఉంచి దాన్ని మీ పైజామాకి లోపలి భాగంతో కుట్టేయండి. బోర్లాకాని,పక్కకి కానీ నిద్రలో తిరిగినప్పుడు,బంతి కలుగచేసే అసౌకర్యంతో మళ్ళీ వెల్లకిలా దొర్లుతారు కానీ నిద్ర లేవరు. ఈ కాస్త నిద్రాభంగం మిమ్మల్ని గురకనుంచి ఆపుతుంది.గురకకి ఇదే మేటి పరిష్కారం.

2.తేమను పెంచండి ;

2.తేమను పెంచండి ;

తేమలేని గదిలో పడుకోటం కూడా మీ గురకకి కారణమవ్వచ్చు.ఎందుకంటే పొడి గాలి మీ గొంతులో,ముక్కుకి సంబంధించిన పొరలలో తడి ఆర్చి దిబ్బడగా మారుస్తుంది.తేమను పెంచే పరికరం (humidifier)ను వాడటం వల్ల ఈ గురక సమస్య మెల్లగా తగ్గుతుంది.ఇది కూడా గురకకి మేటి చిట్కా.

3.బరువు తగ్గటం కూడా సాయపడుతుంది

3.బరువు తగ్గటం కూడా సాయపడుతుంది

మీరు అధికబరువు ఉన్నట్లయితే,అది కూడా గురకకి కారణం కావచ్చు.అధికబరువుతో ఉన్నప్పుడు మీ గొంతులో మరిన్ని కణజాల పొరలు ఉండి అవి శబ్దానికి కారణం కావచ్చు.ఎంత పెద్దగా అవరోధం ఉంటే,అంతగా గాలి ప్రయాణం ఆపబడుతుంది.ఇది అదురుకి కారణమై గురకకి దారితీస్తుంది.

4.మీ తలని మంచంపై నుంచి కొంచెం ఎత్తండి

4.మీ తలని మంచంపై నుంచి కొంచెం ఎత్తండి

మీ నాలుక వెనకకి పడకుండా ఆపుతూ,గొంతుకు అడ్డురాకుండా మీరు మీ తలను మంచంపై కొంచెం ఎత్తడానికి ప్రయత్నించవచ్చు.దీనికోసం 1-2 అంగుళాల పరిమాణం ఉన్న చెక్క ఇటుక వంటిదాన్ని మీ మంచం కింద పెట్టి మీ తల స్థానం ఎత్తును పెంచవచ్చు.ఇది గురకకి మంచి పద్ధతుల్లో ఒకటి.

5.ఎల్లప్పుడూ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి

5.ఎల్లప్పుడూ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి

అలర్జీలు కలిగించే పుప్పొడి,దుమ్ము,జంతువుల వెంట్రుకలు మొదలైనవి గొంతులో అడ్డం సృష్టించి గాలిని అడ్డగిస్తాయి.ఇది గురకకి దారితీయవచ్చు.మీ గాలి వడపోత పరికరాన్ని (air filter) తరచుగా మారుస్తూ ఉండండి.

6.అసలు మీకు గురక ఎందుకు వస్తోందో తెలుసుకోండి

6.అసలు మీకు గురక ఎందుకు వస్తోందో తెలుసుకోండి

మీకు గురక సమస్య ఎందుకు వస్తున్నదో తెలిస్తే,దానికి పరిష్కారం కనుగొనటం తేలిక.గురకపెడుతున్నప్పుడు మీ నోరు మూసి ఉంచుతున్నట్లయితే మీ నాలుక దారిలో సమస్య ఉన్నట్టు. నోరు తెరిచి గురక పెడుతున్నట్లయితే గొంతు పొరలలో సమస్య ఉన్నట్టు గ్రహించాలి.

7. గురక వ్యతిరేక మందులు

7. గురక వ్యతిరేక మందులు

కొన్ని ఆయుర్వేద మందులు గురకను తగ్గించటంలో సాయపడతాయి.వాటిలో ఉన్న సహజ ఎంజైములు ముక్కు దిబ్బడను తొలగిస్తాయి.ఇది గురకను ఆపుతుంది.

 8.వేపరైజర్ కి కొన్ని తైలాలను జతచేయండి

8.వేపరైజర్ కి కొన్ని తైలాలను జతచేయండి

తేమలేని గాలి,దిబ్బడ గురకకి దారితీయటంతో,మీ వేపరైజర్ కి వివిధ తైలాలు జతచేయండి. పెప్పర్ మింట్ తైలం వంటివి గాలి పోయే మార్గాలను తిరిగి తెరచి సైనస్ ప్రాంతాలను ఖాళీచేసి మీరు సుఖంగా నిద్రపోయేలా చేస్తుంది.

9.మీ దిండ్లను సరిగా అమర్చుకోండి

9.మీ దిండ్లను సరిగా అమర్చుకోండి

తలను పైకెత్తి పడుకోవటం వల్ల గాలి వెళ్ళే మార్గం తెరచుకుని,శ్వాస సులభంగా మారుతుంది. దిండు మరీ వత్తుగా కానీ,గట్టిగా కానీ ఉండరాదు.మీరు మందమైన దిండ్లు కానీ,అనేక దిండ్లను వాడుతూ కానీ ప్రయత్నించవచ్చు.

10.ప్రాణాయామం నేర్చుకోండి

10.ప్రాణాయామం నేర్చుకోండి

ఈ యోగా వ్యాయామం శ్వాసను అదుపుచేయటంలో సాయపడుతుంది. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ మీ చుట్టూ ఉన్న ఆక్సిజన్ ను ఎక్కువగా వంటికి పట్టేట్లా చేసుకోండి.ఇది మెదడుకి రక్తసరఫరా మెరుగుపరుస్తుంది. ప్రాణాయామం వివిధ నిద్రలేమి సమస్యలు స్లీప్ ఏప్నియా వంటి వాటికి కూడా ఉపశమనం కలిగిస్తుంది.

11.నాలుక,గొంతుకి సంబంధించిన వ్యాయామాలు చేయండి

11.నాలుక,గొంతుకి సంబంధించిన వ్యాయామాలు చేయండి

నాలుక,గొంతు కండరాలు బలంగా ఉంటే గురక సమస్య చాలా వరకు తగ్గిపోతుంది. కండరాలు వదులైనప్పుడే మనం ఎక్కువ గురక పెడతాం.మీరు ఈ కండరాలను గట్టిచేసే ఈ వ్యాయామాలు ప్రయత్నించవచ్చు.కింద దవడను పెద్ద దవడపై ఉంచటానికి ప్రయత్నించి పది వరకు లెక్కపెట్టండి.రోజుకి ఇది 5-10 సార్లు చేయండి.ఇది సహజంగా మీ గురకను ఆపేస్తుంది.

12. మద్యం,మత్తుపదార్థాలకు దూరంగా ఉండండి

12. మద్యం,మత్తుపదార్థాలకు దూరంగా ఉండండి

నిద్రపోయే కనీసం రెండు గంటల ముందు వరకూ మద్యపదార్థాలు తీసుకోకండి.ఇవి మీ గొంతులో కణజాలాన్ని వదులుచేసి,అది విస్తరించేట్లా చేసి గాలి మార్గాన్ని అవరోధించవచ్చు.అది గురకకి దారితీస్తుంది.

English summary

Methods To Sleep Well Without Snoring

If the airway is narrower, the vibration will be more intense and the snore will be louder. But worry not, as there are home remedies that will help you combat this problem without any torment of side effects.
Story first published: Saturday, June 17, 2017, 19:00 [IST]
Subscribe Newsletter