For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్తనాలలో కణితుల నివారణ కోసం ఎఫెక్టివ్ టిప్స్ అండ్ లైఫ్ స్టైల్

|

సాధారణంగా వక్షోజాలలో వచ్చే కణితులు చాలా వరకు క్యాన్సర్ కారకాలు కాదు. కానీ అవి పెద్దయి, నొప్పి పుడుతూ, అసౌకర్యంగా మారతాయి. వక్షోజాల కణితులలో గ్రంథులు స్రవించే ద్రవాలు నిండి ఉంటాయి.

వయస్సుతో సంబంధం లేకుండా, హార్మోన్ల అసమతుల్యత వలన, రజస్వల అయిన ఎలాంటి స్త్రీలోనైనా వక్షోజాలలో కణుతులు ఏర్పడవచ్చు.

పీరియడ్స్ కు, సంతానానికి అంతరాయం కలింగే ఓవేరియన్ సిస్ట్ లక్షణాలు..!పీరియడ్స్ కు, సంతానానికి అంతరాయం కలింగే ఓవేరియన్ సిస్ట్ లక్షణాలు..!

స్తనాల కణజాలం ఇలాంటి మార్పులకి చాలా సున్నితంగా ఉంటుంది. అధికంగా ఏర్పడే స్రావాలు బయటకి పోకుండా, ఇక్కడే సంచీలలో నిండినట్టు, కణితులుగా మారతాయి.

చాలావరకు ఈ కణితులు వాటంతట అవే మాయమైపోతాయి. అలా కాకపోతే మీరు ఇంటి చిట్కాలు ఉపయోగించి వాటి సైజు తగ్గించటమో, మొత్తానికే వాటిని వదిలించుకోటమో చేయవచ్చు.

మానసిక వత్తిడి ఎక్కువగా ఉండే జీవనవిధానం ఇలా కణాలను ఒకచోట పేరుకుపోయి కణితులుగా మారే అవకాశాన్ని ఇస్తుంది.

ఓవేరియన్ సిస్ట్ తొలగించుకోవడానికి బెస్ట్ నేచురల్ రెమెడీస్ఓవేరియన్ సిస్ట్ తొలగించుకోవడానికి బెస్ట్ నేచురల్ రెమెడీస్

మంచివిషయం ఏంటంటే ఇంటి చిట్కాలు ఎప్పుడూ మిమ్మల్ని ఆదుకోటానికి సిద్ధంగా ఉంటాయి. ఈ వ్యాసంలో మేము మీ కోసం స్తనాల కణితులకు మేటి ఇంటిచిట్కాలను పొందుపరిచాం.

ఈ సహజ చిట్కాలేమిటో తెలుసుకోటానికి కింద చదవండి.

1. వేడి బియ్యంతో వత్తడం

1. వేడి బియ్యంతో వత్తడం

వండని బియ్యాన్ని సాక్సులో ఒకదాంట్లో పోసి, ముడివేయండి. దీన్ని మైక్రోవేవ్ లేదా పెనంలో వేడిచేసి, నెప్పి పుడుతున్న స్తనాలపై వత్తుకుంటూ ఉపశమనం పొందండి.

2. క్యాబేజీ ఆకును పెట్టడం

2. క్యాబేజీ ఆకును పెట్టడం

ఈ చిట్కా నొప్పి మరియు కణుతుల పరిమాణం తగ్గడానికి కూడా సాయపడుతుంది. రెండు క్యాబేజీ ఆకులు తీసుకుని, మీ స్తనాల పరిమాణాన్ని బట్టి ఆ సైజులో కత్తిరించుకోండి. వాటిని మీ స్తనాలపై అరగంట పెట్టుకోండి. ఇది స్తనాలలో కణితుల కోసం మంచి ఇంటిచిట్కా.

3. వేడి చల్లని కాపడాలు

3. వేడి చల్లని కాపడాలు

గోరువెచ్చని నీటిసీసా లేదా వేడి క్యాన్ మీ నొప్పికి ఉపశమనంగా ఉంటాయి. అదేవిధంగా, చల్లనీరు కూడా అదే లాభాలను కలిగిస్తుంది. ఒక గుడ్డ తీసుకుని చల్లనీరులో ముంచండి. దాన్ని మీ స్తనాలపై కొద్దిసేపు ఉంచండి.

4. సరియైన బ్రా వేసుకోవటం

4. సరియైన బ్రా వేసుకోవటం

సరియైన బ్రా ఎంచుకోవటం వల్ల మీ స్తనాలకు మంచి ఆధారాన్ని ఇచ్చి అసౌకర్యాన్ని తగ్గిస్తాయి. వివిధ అధ్యయనాల ప్రకారం, మంచి బ్రా నాడీకణాలను మరింత సాగకుండా చేస్తుంది.

5. సుగంధ నూనెలు

5. సుగంధ నూనెలు

మూడు చుక్కల చమోమిలె మరియు లావెండర్ సుగంధ నూనెలను వేడినీరులో కలపండి. ఒక శుభ్రమైన గుడ్డను అందులో ముంచి మీ స్తనాలపై కప్పి ఉంచండి.

6. గోధుమ రసం

6. గోధుమ రసం

గోధుమగడ్డి నుంచి రసాన్ని తీయండి. ఈ రసాన్ని ఫ్రిజ్ లో గడ్డకట్టించండి. ఒక ఈ రసం క్యూబ్ ను తీసుకుని ఒక గ్లాసు నీరులో కలుపుకుని ప్రతిరోజూ తాగండి. ఇది స్తనాలలో కణితులకి మంచి ఇంటిచిట్కా.

7. మిశ్రమ టీ

7. మిశ్రమ టీ

అన్నిటి లక్షణాలు చదువుతూ మీకు నచ్చిన టీబ్యాగులను తీసుకురండి. వాటన్నిటినీ కలిపేసి మీ సొంత టీని తయారుచేసుకుని ప్రతిరోజూ తాగవచ్చు. స్తనాలలో కణితులకి ఇది కూడా మంచి సహజమైన చిట్కా.

8. స్తనాల పరీక్ష

8. స్తనాల పరీక్ష

మీ వైద్యులు భౌతికంగా మీ స్తనాలలో కణితులు కానీ మరేమైనా తేడాలున్నాయేమో పరీక్షిస్తారు. స్తనంలో గడ్డ కణితో కాదో మీ వైద్యుడు ఈ స్తనపరీక్ష ఒక్కదాంతో నిర్ధారించలేరు.

9. వక్షోజాల అల్ట్రాసౌండ్

9. వక్షోజాల అల్ట్రాసౌండ్

ఇది మీ వైద్యుడికి మీ స్తనాలలో గడ్డలు స్రవాలతో నిండి ఉన్నాయో లేదో తెలుసుకోడానికి ఉపయోగపడుతుంది. స్రవాలతో నిండివున్నవి సాధారణంగా వక్షోజాల కణితులై ఉంటాయి.

10. హార్మోన్ల వాడకం

10. హార్మోన్ల వాడకం

మీ నెలసరిని సరిచేయటం కోసం తరచూ గర్భనిరోధక మాత్రలు వాడితే స్తనాలలో గడ్డలు తరచూ రావటం తగ్గుతుంది. మెనోపాజ్ తర్వాత హార్మోన్ థెరపీని ఆపివేస్తే కూడా వక్షోజాల కణితులు పెద్దగా రావు.

English summary

Effective Lifestyle & Home Remedies for Breast Cyst

A very stressful lifestyle may also promote the formation of breast cysts or the accumulation of cells in a benign state. Thankfully home remedies are always there to have your back. In this article we have mentioned the top home remedies for breast cyst. Read further to know more on the natural remedies for breast cysts.
Story first published:Tuesday, October 24, 2017, 7:44 [IST]
Desktop Bottom Promotion