మీ గుండె ఆరోగ్యం గురించి ఈ స్మార్ట్ ఫోన్ యాప్ ద్వారా చిటికెలో తెలుసుకోవచ్చు

By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

శాస్త్రవేత్తలు ఒక వినూత్న యాప్ ని అభివృద్ధి చేశారు. మీ గుండెకు ఎటువంటి హానిని తలపెట్టకుండానే, మీ గుండె యొక్క ఆరోగ్య స్థితిని మీ స్మార్ట్ ఫోన్ కెమెరా ఉపయోగించి ఆ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇంతకు మునుపు గుండె ఆరోగ్యాన్ని పరీక్షించుకోవాలంటే 45 నిమిషాల సమయం పట్టేది. అల్ట్రాసౌండ్ యంత్రం ద్వారా స్కాన్ చేసేవారు. కానీ, ఇప్పుడు మీ స్మార్ట్ ఫోన్ ని మీ మెడకు దగ్గరగా ఒక రెండు నిముషాలు పెట్టుకోవడం ద్వారా గుండె యొక్క ఆరోగ్య స్థితిని సులభంగా తెలుసుకోగలరు.

అమెరికా కు చెందిన కొంతమంది పరిశోధకులు ఒక వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు. ఇది గుండెలో ఉన్న లెఫ్ట్ వెంట్రిక్యూలర్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ ( ఎల్ వి ఈ ఆఫ్ ) అనే ప్రక్రియ ఎలా జరుగుతుంది అనే విషయాన్ని, గుండె కొట్టుకుంటున్న ప్రతిసారి కంఠానికి రక్తాన్ని అందించే ధమని (కరోటిడ్ ) గుండా ఎంతమేర రక్తం వెళుతోంది అనే విషయాన్ని కొలుస్తుంది. గుండె కొట్టుకుంటున్న ప్రతి సరి మన గుండె ఎంతమేర రక్తాన్ని బయటకు పంపిస్తోంది అనే విషయాన్ని ఎల్ వి ఈ ఆఫ్ తెలియజేస్తుంది. సాధారణంగా ఎల్ వి ఈ ఆఫ్ స్థాయి 50% నుండి 70% మధ్యన ఉండాలి.

ఆహారంను ఎలాతింటే, ఎక్కువ ఆరోగ్యం, ఎక్కువ లాభం!?

heart

ఎప్పుడైతే గుండె బలహీనంగా ఉంటుందో, అటువంటి సమయంలో గుండెకొట్టుకునేటప్పుడు తక్కువ మోతాదులో రక్తం గుండె నుండి బయటకు పంపబడుతుంది మరియు ఆ సమయంలో ఎల్ వి ఈ ఆఫ్ విలువ కూడా తక్కువగా ఉంటుంది. గుండె యొక్క ఆరోగ్యాన్ని కొలచడంలో ఎల్ వి ఈ ఆఫ్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది అని పరిశోధకులు చెబుతున్నారు. వీటిని ఆధారంగా చేసుకొనే వైద్యలు నిర్ణయాలు తీసుకుంటారని మరియు గుండెకు సంబంధించిన జబ్బు ఏమైనా ఉందా అనే విషయమై ఒక నిర్ధారణకు వస్తారని చెబుతున్నారు.

కాల్ టెక్ అనే సంస్థ అభివృద్ధి చేసిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఎల్ వి ఈ ఆఫ్ ని చాలా సులభంగా కొలవవచ్చు. దీనిని ఉపయోగించి, వైద్యులు తమ స్మార్ట్ ఫోన్ లను స్వచ్ఛందంగా వచ్చిన వ్యక్తుల మెడకు ఎదురుగా రెండు నిముషాలు ఉంచడం ద్వారా ఎల్ వి ఈ ఆఫ్ స్థాయిలు సులువుగా తెలుసుకుంటున్నారు. దీని తరువాత పరీక్షలు చేయబడిన వ్యక్తులకు పరీక్షా ఫలితాలు మరియు వారి యొక్క గుండె ఆరోగ్య స్థితి కూడా వెంటనే తెలిసిపోతోంది.

ఒత్తిడి ఎక్కువగా ఫీలవుతున్నారా? అల్జీమర్స్ అయ్యుండచ్చు

ఈ యాప్ ఇంత బాగా ఎలా పనిచేస్తుందంటే , ధమనులు (ఆర్టెరీస్ ) ల యొక్క గోడలు ఎంతో సాగే స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఇందువల్ల ప్రతి గుండె చప్పుడుకు అవి సంకోచిస్తాయి మరియు వ్యాకోచిస్తాయి. ఈ సంకోచ వ్యాకోచాలను ఖచ్చితత్వంతో ఈ యాప్ ఖచ్చితత్వముతో కొలుస్తుంది మరియు వీటిని సూక్ష్మంగా పరీక్షించినప్పుడు ఒక తరంగిణి ఏర్పడుతుంది. దీనిని ఆధారంగా చేసుకొని ఈ యాప్ గుండె కు సంబంధించిన సమాచారాన్ని కోడీకరిస్తుంది. ఈ అధ్యయనం చేయడానికి ఆ బృందం ఐ ఫోన్ 5 ని ఉపయోగించింది. కానీ ఏ కెమెరా ఉన్న స్మార్ట్ ఫోన్లో అయినా ఈ యాప్ పనిచేస్తుంది.

ఈ యాప్ ని వృద్ధి చేసిన ఒకానొక శాస్త్రవేత్త ఏమన్నాడంటే " చాలా ఆశ్చర్యకరంగా , అతి తక్కువ సమయంలోనే మేము కనిపెట్టిన విషయాన్ని కార్య రూపం దాల్చేలా చేసి , సేకరించిన సమాచారాన్ని క్లినికల్ డేటా తో నిర్ధారించుకొనే స్థాయికి ఎదిగాము " అని హర్షం వ్యక్తం చేశారు. ఈ యాప్ ని పరీక్షించడానికి పరిశోధకులు 20 నుండి 92 సంవత్సరాల వయస్సున్న 72 స్వచ్చంద వ్యక్తుల పై పరీక్షలు నిర్వహించారు. మాములుగా ఎల్ వి ఈ ఆఫ్ ని కొలవడానికి అల్ట్రాసౌండ్ యంత్రాన్ని ఉపయోగిస్తారు. ఈ ప్రక్రియను ఎకో కార్డియో గ్రఫీ అని అంటారు.

ఈ ఎకో కార్డియో గ్రఫీ అనే పరీక్షను సొంతంగా ఎవరికీ వారు చేసుకోలేరు. ఈ పరీక్ష చేయాలంటే ఖచ్చితంగా ఒక శిక్షణ పొందిన నిపుణుడు ఉండాలి. చాలా ఖరీదైన అల్ట్రాసౌండ్ యంత్రం ఉండాలి. దాంతో పాటు రోగి 45 నిమిషాల పాటు ఈ పరీక్షలో పాల్గొనాలి. ఈ అధ్యయనం గురించి అమెరికాలోని ప్రముఖ మ్యాగజిన్ ప్రచురించింది.

Read more about: heart, smartphone, హార్ట్
English summary

New Smartphone App Can Check Your Heart Health

Read to know about the new smartphone app that can check your heart health.
Story first published: Sunday, September 10, 2017, 12:00 [IST]
Subscribe Newsletter