యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ నివారించే న్యాచురల్ టిప్స్

Posted By: Mallikarjuna
Subscribe to Boldsky

మనందరికీ తెలుసు కొన్ని వ్యాధులు ఒకరితో చెప్పులేని ఉంటాయి. వాటిలో ఒకటి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. ఇది చాలా బాదిస్తుంది. అసౌకర్యానికి గురిచేస్తుంది. ముఖ్యంగా పురుషుల్లో కంటే, స్త్రీలలోనే ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.

జ్వరం వస్తే, అది నొప్పి కలిగించదు కానీ, అలసటగా మార్చేస్తుంది. అలాగే మైగ్రేన్ తలనొప్పి వస్తే భరించలేనంత నొప్పితో ఏడ్చేస్టుంటారు.

ఇక యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ విషయానికి వస్తే, ఇది అన్నిటికి భిన్నంగా, మనిషిని కూర్చొనీకి, పడుకోనీక నొప్పి, అసౌకర్యం కలిగిస్తుంది. మూత్రలో మంట, ఇబ్బంది పెడుతుంది. ప్రైవేట్ భాగాలు ఇన్ఫెక్షన్ అయి,నొప్పి, విపరీతమైన మంట కలిగిస్తుంది. ఈ పరిస్థితి ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఎదుర్కొని ఉటారు.

యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ నివారించే న్యాచురల్ టిప్స్

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే, బ్లాడర్, యురెత్రా, కిడ్నీలు, మూత్రనాళం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ కాలనీస్ వల్ల మంట, నొప్పి, వాపు వస్తుంది. ప్రైవేట్ భాగాల్లో నొప్పి, ముఖ్యంగా మూత్రవిసర్జన సమయంలో మంట, సెక్సువల్ సమయంలో నొప్పి, కౌచ్ వాసన, తరచూ మూత్రవిసర్జనకు వెళ్ళాలనిపించడం, యోనిలో చీకాకు, దురద మొదలగునవి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కు ముఖ్య కారణాలు.

కొంత మందిలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వల్ల మూత్రంలో రక్తం, పెల్విక్ పెయిన్, పొట్ట నొప్పి, వికారం, జ్వరం వంటి లక్షణాలు కూడా కనబడుతాయి. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ మహిళల్లో చాలా సాధారణంగా ఉంటుంది. పురుషులు చాలా అరుదగా ఈ సమస్యకు గురి అవుతుంటారు. అలాగే మొదటి సారి శ్రుంగారంలో పాల్గొనే వారిలో, కొంత దంపతుల్లో కూడా ఈ సమస్య బాధిస్తుంది. మరి ఈ సమస్యకు పరిస్కారం ఏంటి అంటారా? మన ఇంట్లోనే కొన్ని న్యాచురల్ టిప్స్ తోనే యూటిఐ సమస్యను నయం చేసుకోవచ్చు. అవేంటంటే..

పురుషుల్లో యూరిన్ ఇన్ఫెక్షన్ కు మెయిన్ రీజన్స్ ....!!

1.నీళ్ళు ఎక్కువగా తాగాలి:

1.నీళ్ళు ఎక్కువగా తాగాలి:

యూటిఐ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, రోజూ నీళ్ళు తాగే మోతాదుకంటే ఇంకొంచెం ఎక్కువ నీళ్ళు తాగడం వల్ల యూరినరీ ట్రాక్ట్ లో ఉండే బ్యాక్టీరియా బయటకు మూత్రంలో వచ్చేస్తుంది.

2. సిట్రస్ పండ్లు ఎక్కువ తినాలి:

2. సిట్రస్ పండ్లు ఎక్కువ తినాలి:

విటమిన్ సి ఎక్కువగా ఉండే సిట్రస్ పండ్లు తినాలి, విటమిన్ సి సప్లిమెంట్ ను తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ త్వరగా తగ్గుతుంది.

3. ఆ ప్రదేశంలో ఐస్ లేదా హాట్ ప్యాక్ ను అప్లై చేయాలి

3. ఆ ప్రదేశంలో ఐస్ లేదా హాట్ ప్యాక్ ను అప్లై చేయాలి

నొప్పి, వాపు, దురద కలిగించే ప్రదేశంలో ఐస్ లేదా, హాట్ వాటర్ ప్యాక్స్ ను అప్లై చేస్తే ఉపశమనం కలుగుతుంది.

4. కాఫీ, ఆల్కహాల్ మానేయాలి:

4. కాఫీ, ఆల్కహాల్ మానేయాలి:

ఈ సమయంలో బ్లాడర్ కు చీకాకు కలిగించే కాఫీ, ఆల్కహాల్, కారం, స్వీట్స్, మొదలగు ఆహారాలను మానేయాలి. మనం తినే ఆహారాలే సమస్యను మరింత పెద్దది చేస్తుంది.

5. నీళ్ళు బాగా తాగి, తరచూ మూత్రవిసర్జన చేస్తుండాలి:

5. నీళ్ళు బాగా తాగి, తరచూ మూత్రవిసర్జన చేస్తుండాలి:

యూటిఐ సమయంలో నొప్పి ఉన్నా, తరచూ మూత్ర విసర్జన చేయడం మంచిది, ఎక్కువ సమయం మూత్ర విసర్జన చేయకుండా ఆపుకోవడం వల్ల సమస్య ఎక్కువ అవుతుంది.

6. వాషింగ్ టిప్స్ :

6. వాషింగ్ టిప్స్ :

మలమూత్ర విసర్జన తర్వాత ముందు నుండి వెనకు శుభ్రం చేసుకోవాలి. లేదంటే బ్యాక్టీరియాల యూరెత్రాలో చేరి ఇన్ఫెక్షన్ మరింత పెంచుతుంది

7. క్రాన్ బెర్రీ జ్యూస్ తాగాలి:

7. క్రాన్ బెర్రీ జ్యూస్ తాగాలి:

క్రాన్ బెర్రీ జ్యూస్ ను రోజూ తాగడం వల్ల, ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు యూటిఐ ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    nfection Which Actually Work!

    Urinary tract infection is also known as 'honeymoon cystitis', as it is commonly seen in newlywed women. Causes for UTI can be due to a number of reasons that can lead to bacterial infections. So, here are a few natural tips to help reduce UTI, which you can follow.
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more