ఈ విధమైన నిద్ర భంగిమలు - మీ ఆరోగ్యానికి చేటు

Posted By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

మీరు రాత్రంతా మొద్దుల నిద్రపోయినా (లేదా) మీ దిండుకి మీ పాదాలను ఆనుకుని మేల్కొన్న సరే, మీ నిద్ర భంగిమలు మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేయగలవు - అది మీ మెడ భాగాన్ని ఆకస్మికంగా నొప్పిని కలిగించే విధంగానూ (లేదా) మధ్యరాత్రిలో మీరు గట్టిగా గురక పెట్టిన కారణంగా మీ భాగస్వామిని నిద్ర లేపేదిగా కూడా ఉండవచ్చు.

sleeping position can affect your health

ఈ వ్యాసంలో పేర్కొన్న కొన్ని నిద్ర భంగిమలు ఇతర వాటి కంటే మెరుగైనవి, అలా వాటివల్ల కలిగే లాభాలు మరియు నష్టాలను కూడా చూద్దాం....

1. మీ ఛాతి మీద పడుకున్నట్లయితే :

1. మీ ఛాతి మీద పడుకున్నట్లయితే :

వ్యక్తిత్వ (పర్సనాలిటీ) అధ్యయనం తెలియజేసినదేమిటంటే, మీ ముఖాన్ని మంచానికి ఆన్చి, మీ ఛాతిని పరుపుకు వ్యతిరేకదిశలో ఉంచి నొక్కటం వల్ల, మీరు దూకుడు తో ఉన్న వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నప్పటికీ - మీపై వచ్చే విమర్శలను సరైన రీతిలో ఎదుర్కొనలేరు

ఈ విధమైన స్థితిలో నిద్రపోవడం వల్ల మీకు మంచి కన్నా ఎక్కువ నష్టం జరగడానికే ఆస్కారం ఉంది.

ఆ స్థితిలో నిద్రపోవడం వల్ల కలిగే ప్రయోజనాలు :

మంచం వెనుకవైపుగా పడుకునే వారికన్నా ఇలా పడుకునే వారికి త్వరగా జీర్ణం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతే కాకుండా, మీవారు మార్గాన్ని తెరిచి శ్వాసకు అనుకూలమైన పరిస్థితులను ఉంచుతూ మరియు గురకను (లేదా) స్లీపింగ్ ఆప్నియాను నిరోధిస్తుంది.

నష్టాలు :

ఈ స్థితిలో పడుకోవటం వల్ల మీ మెడ నలిగి కి ఉన్న కారణం చేత శ్వాసించడం కష్టతరంగా ఉంటుంది, అందువల్ల మీకు మెడ మరియు భుజం నొప్పులు తరచుగా వస్తూ వుంటాయి. ఈ స్థితిలో పడుకోవడం వల్ల మీ ఛాతిని నొక్కి ఉంచడం వల్ల మీరు పూర్తిగా శ్వాసని పొందలేరు. మరియు మీరే టీనేజ్ అమ్మాయిగానే అయితే మీరు రొమ్ముల అభివృద్ధిని నిరోధించగలదు.

మీరు పడుకునే స్థితిని మెరుగు పరిచే చిట్కాలు :

ఈ స్థితిలో పడుకోవడం వల్ల మీ మెడ మరింతగా ముడు చుకోకుండా ఉండేందుకు సన్నని దిండును ఉపయోగించడం చాలా మంచిది. ఈ స్థితిలో పడుకునేటప్పుడు మరొకవైపు లావుగా ఉన్న దిండును గట్టిగా కౌగలించుకుని పడుకోవటం వల్ల మీ శ్వాసను పూర్తి అనుకూలంగా మారి, మీ మెడ వక్రంగా ఉండటాన్ని నిరోధించడానికి సహాయపడుతుంది.

2. పసిపిల్లలా పడుకోవటం :

2. పసిపిల్లలా పడుకోవటం :

ఈ స్థితిలో పడుకోవటం ని భ్రూణము (పిండము) భంగిమగా పిలుస్తారు. ఎందుకంటే ఇది తల్లి గర్భంలో ఒక శిశువు యొక్క భంగిమను పోలి ఉంటుంది. ఈ స్థితిలో మెడకు సమీపంగా గడ్డాన్ని ఉంచుతూ, కాళ్లు చేతులతో ముడుచుకుని ఛాతి భాగాన్ని కప్పే విధంగా ఉండీ, ఒకవైపు వంకరగా పడుతున్నట్లుగా ఉంటుంది.

వ్యక్తిత్వం అధ్యయనం ప్రకారం, ఈ స్థితిలో పడుకునేవారు బయటకు చాలా గంభీరంగా, కఠినమైన వారిగా కనిపిస్తారు కానీ, లోపల చాలా పిరిగి మరియు సున్నిత మనస్తత్వం కలవారిగా ఉంటారు.

ప్రయోజనాలు :

గురకను (లేదా) స్లీపింగ్ ఆప్నియాను సడలిస్తుంది. గర్భిణీ స్త్రీలకు ఈ విధమైన స్థితిలో (ఎడమచేతివైపుగా )పడుకోవటం వల్ల చాలా అనుకూలంగా ఉంటుంది.

నష్టాలు :

ఈ స్థితిలో పడుకోవడం వల్ల వెన్నెముక యొక్క తీవ్ర వక్రత కారణంగా పూర్తిస్థాయిలో శ్వాసను తీసుకోలేరు మరియు తరచుగా వెన్ను నొప్పి కూడా సంభవించవచ్చు.

మెరుగు పరిచే చిట్కాలు :

తిన్నగా నిద్రించండి.

వెన్నెముక యొక్క మెరుగుపరచడానికి తల మరియు మెడ కింది భాగంలో దిండును ఉపయోగించండి.

3. ప్రక్కకు తిరిగి నిటారుగా పడుకోవటం :

3. ప్రక్కకు తిరిగి నిటారుగా పడుకోవటం :

నిటారుగా ఉన్న కర్ర మాదిరిగా రెండువైపులా చేతులను ఉంచి పక్కకు తిరిగి పడుకొని ఉన్నట్లయితే, వ్యక్తిత్వం అధ్యయనం ప్రకారం; మీరు జీవితంలో చాలా సులభంగా ముందుకు వెళ్తారు మరియు సామాజిక వ్యక్తిగా పరిగణించబడతారు అయినప్పటికీ, కొంత అవివేకంతో ఉంటారు.

కానీ ఇది మీ ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది ?

ప్రయోజనాలు :

ఈ రకమైన స్థితిలో పడుకోవడం వల్ల మీ వెన్నెముక సహజమైన ఆకృతిని కలిగి ఉండేందుకు, శ్వాస తీసుకోడానికి అనుకూలంగానూ, గురకను (లేదా) స్లీపింగ్ ఆప్నియాను సడలిస్తుంది.

నష్టాలు :

మీరు ఒకవేళ మహిళా గాని అయితే, మీ రొమ్ములు సాగుతాయి, మీ చేతిని మంచానికి ఆన్చినప్పుడు - తిమ్మిర్లు కలిగే భావనను పొందటం, రక్తప్రసరణ సరిగా అందకపోవడం వంటి సమస్యలకు కారణం కావచ్చు.

4. పక్కకు పడుకుని చేతులను చాచి ఉంచడం :

4. పక్కకు పడుకుని చేతులను చాచి ఉంచడం :

ఈ స్థితిలో పడుకోవడానికి చాలామంది మక్కువను కలిగి ఉంటారు మరియు, భావోద్వేగం కంటే హేతుబద్ధమైన వ్యక్తిత్వాన్ని కలిగిన అనుమానాస్పదమైన వ్యక్తికి గూర్చి తెలియజేసే సంకేతం అని చెప్పవచ్చు.

ప్రయోజనాలు :

ఈ స్థితిలో మీ వెన్నెముక సహజమైన ఆకృతిని కలిగి ఉంటూ, శ్వాసకు అనుకూలంగానూ మరియు గురక లేకుండానూ ఉంటుంది.

నష్టాలు :

నరాలకు రక్తప్రసరణ తగ్గటం వల్ల పీడనానికి గురైన కారణం చేత, చేతులు మరియు భుజం నొప్పికి దారితీస్తుంది.

5. మంచానికి మీ వీపును ఆన్చి పడుకోవటం :

5. మంచానికి మీ వీపును ఆన్చి పడుకోవటం :

ఈ స్థితిని "సైనికుని నిద్ర" స్థితి అని కూడా పిలుస్తారు. శాంతిని కలిగి మరియు హింస ను ఇష్టపడని వ్యక్తుల యొక్క క్రమశిక్షణకు ఈ భంగిమ ఒక సంకేతం అని చెప్పవచ్చు.

ప్రయోజనాలు :

ఆహార నాళాన్ని మరియు మీ కడుపును లోపలకు ఉంచుతుంది అలాగే మీ వెన్నెముకను నేరుగా ఉంచుతుంది మరియు యాసిడ్ రిఫ్లెక్షన్ తగ్గిస్తుంది.

నష్టాలు :

ఇది స్లీప్-ఆప్నియాకు కారణమవుతుంది మరియు గురకను పెంచుతుంది. ఈ స్థితిలో మే 4 కంఠానికి అడ్డుగా ఉండడం వల్ల శ్వాస తీసుకోవడాన్ని నిరోధిస్తుంది. ఇది మీ వెన్నెముకకు తక్కువ స్థాయిలో నొప్పి పుట్టేందుకు దారితీస్తుంది మరియు కాళ్ళు ముడచడానికి కష్టతరమవుతుంది.

ఉత్తమ మైన చిట్కాలు :

టవల్ను చుట్టి ఒక చిన్న దిండులా మార్చి, దానిని మీ వెన్నెముక మరియు మోకాళ్ళను పైకి లేపే విధంగా ఉంచాలి. ఈ విధంగా చేయడం వలన వెన్ను నొప్పి తగ్గు్ను నొప్పి తగ్గుతుంది.

6. స్టార్ ఫిష్ లా పడుకోవటం :

6. స్టార్ ఫిష్ లా పడుకోవటం :

ఇది కూడా సైనికుని నిద్రలానే మంచానికి వీపునుంచి అన్చే స్థితి గానే ఉంటుంది కానీ, ఈ స్థితిలో మీ రెండు చేతులను మీ తలకు దగ్గరలో విశ్రాంతిని తీసుకొనే విధంగా ఉంచుతారు.

ఇతరుల సమస్యలను విని, వారికి సహాయపడే వ్యక్తిగా - మీ వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది.

ప్రయోజనాలు :

మీ వెన్నెముక సరైన స్థితిలో (నిటారుగా) ఉంటుంది.

నష్టాలు :

యాసిడ్ రిఫ్లెక్షన్కు,

గురకను పెంచుటకు,

భుజాల తిమ్మిరికి,

స్లీపింగ్ ఆప్నియాకు కారణమవుతుంది.

English summary

Your Sleeping Position Can Affect Your Health In These Ways

The way you sleep can affect your health. For example, sleeping on your stomach can improve your digestion, but is the worst position to sleep, as it restricts your breathing and causes neck and shoulder pain. Sleeping on your back with a thin pillow under your neck is the best posture, as it keeps your spine straight.