పొగతాగడం, మద్యం తాగడం వల్ల దంతాల ఫిల్లింగ్స్ పై ప్రభావం చూపిస్తుందని పరిశోధనలో తేలింది

Posted By: DEEPTHI T A S
Subscribe to Boldsky

ధూమపానం మరియు మధ్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం.అది మీ కాలేయం, ఊపిరి తిత్తులకే కాక పళ్ళని కూడా పాడుచేస్తుంది.

అందుకని, మీకు పళ్ళకు సంబంధించిన బాధలు ఏమైనా ఉంటే వెంటనే, ధూమపానం మరియు మధ్యపానం మానేయండి.ఎందుకంటే ఈ అలవాట్లు పెద్ద పెద్ద ప్రమదకరమైన ఆరోగ్య సమస్యలకి దారితీయడమే కాకుండా, అవి సరి అయిన సమయంలో అదుపు చేయకపోతే ప్రాణాంతకం కూడా అవుతాయి.

ఒక ఇటీవల అధ్యయనం ప్రకారం, ధూమపానం మరియు మధ్యపానం మీ పళ్ళని పాడుచేయడమే కాకుండా ఎక్కువ దంతాల వైఫల్యానికి దారి తీస్తుంది.

side-effects of smoking

ధూమపానాల వల్ల పళ్ళ మీద పడే ప్రభావాలు

పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఇటీవల అధ్యయనం ప్రకారం,ధూమపానం మరియు మధ్యపానం అలవాట్లు ఉన్న దంత రోగులు ఎవరైతే ఉన్నారో , వాళ్ళకి దంత ఫిల్లింగ్స్ చేసిన రెండేళ్ళకే ఆ విధానం విఫలమవ్వడం మొదలయ్యింది మరియు పొగ తాగే పురుషుల్లో ఇది మరింత ఎక్కువగా ఉంది.

అదనంగా,మాట్రిక్స్ మెటెల్లోప్రొటినేస్(ఎం ఎం పి2) అనే పళ్ళలోని ఎంజైం ఉండే జన్యువులు తేడా ఉన్న రోగులలో ఈ దంత ఫిల్లింగ్ చికిత్స వైఫల్యం చెందడానికి ఎక్కువ ప్రమాదముంది.

అధ్యయనం కోసం అమెరికా మరియు బ్రెజిల్ దేశం వాళ్ళు 807 రోగుల రికార్డులు విశ్లేషించారు.ఈ అధ్యయనంలో పరిశోధకులు కొత్త కాంపోసిట్ ఫిల్లింగ్స్, 150 సంవత్సరాల నుంచి వాడుకలో ఉన్న ప్రాచీన అమాల్గపు ఫిల్లింగ్స్ లాగ ఎక్కువ కాలం మన్నుతాయా, లేదా అని పరీక్షించారు.కానీ ఈ అమాల్గపు ఫిల్లింగ్స్ లో విషపూరితమైన పాదరస లోహం ఉంది.

మరోవైపు ధూమపానం మరియు మధ్యపానం మానడానికి కొన్ని సహజ చిట్కాల గురించి ఇక్కడ చూడండి.

1. తేనె

1. తేనె

మధ్యం మరియు ధూమపానం మానేయడానికి తేనె ప్రకృతిలో దొరికే సహజ సిద్దమైన,ఉత్తమమైన పదార్థం.తేనె లో ధూమపానం మానేయడానికి సహాయపడే అన్ని విటమిన్లు, ఎంజైములు మరియు ప్రోటీన్లు ఉంటాయి.

మీరు చెయాల్సింది ఏంటి అంటే, సిగరెట్టో, మందో తాగలనిపించినప్పుడు, ఒక గ్లాసులో గోరు వెచ్చని నీళ్ళు పోసుకొని,ఒక చెంచా తేనె వేసి బాగ కలిపి తాగండి.లేకుంటే ఒక చెంచా తేనె తీసుకొని తినండి.

2) పండ్లు/కూరగాయల రసం:

2) పండ్లు/కూరగాయల రసం:

తాజా పళ్ళైన పైనాపిల్, ఆపిల్, ఆరంజ్ లేకుంటే కూరగాయలైన కారెట్, రాడిష్ల వంటి రసాలు తాగడం వలన అవి శరీరంలోని విషపూరితమైన పదార్థాలని తరిమేసి మధ్యపానం, ధూమపానం మానేయడంలో సహాయపడతాయి.అందుకే ఎప్పుడైనా సిగరెట్టో, మందో తాగాలనిపిస్తే వెంటనే ఒక తాజా రసం తాగండి. అది ఈ అలవాటు మానేయడంలో తోడ్పడుతుంది.

3) ఖర్జూరాలు :

3) ఖర్జూరాలు :

ఎప్పుడైనా సిగరెట్టో, మందో తాగాలనే కోరిక కలిగినప్పుడు, 1-2 ఖర్జూరాలు తీసుకోని అవి ఒక గ్లాసు నీళ్ళలో బాగా కలిపి, తరువాత ఆ నీళ్ళను తాగాలి.ఇది కోరిక తగ్గించడంలో మరియు శరీరంలోని విషపదార్థాలు తరిమేయడంలో సహాయపడుతుంది.

4) అల్లం:

4) అల్లం:

అల్లం అన్నిటికంటే సాధారణంగా దొరికే మరియు ధూమపానం యొక్క ఉపసంహరణ లక్షణాల సమయంలో సహాయపడే ఏకైక పదార్థం.సిగరెట్టు మరియు మందు మానేసే సమయంలో, వికారం మరియు తలతిరగడం వంటి లక్షణాలు ఉంటాయి.అల్లం టీ తాగిన లేక అల్లం ముక్కలు నమిలినా అవి తగ్గుతాయి.

5) లికోరైస్:

5) లికోరైస్:

మీరు ధూమపానం లేక మధ్యపానం మానేయాలనుకుంటే లికోరైస్ ఒక చక్కని సహజమైన పరిహారం.ఎప్పుడైనా సిగరెట్టు కాల్చాలనే కోరిక కలిగినప్పుడు,లికోరైస్ ఒక చిన్న ముక్క తీసుకొని నమలండి.ఇది తాగాలనే కోరికని తగ్గించడమే కాకుండా, జీర్ణ శక్తిని కూడా నియంత్రిస్తుంది.

English summary

Smoking, Drinking Affects Dental Fillings Finds Research

Smoking and alcohol abuse can be dangerous for your teeth. The problem might get worse if you have dental fillings.A new study has found that drinking alcohol or smoking may not only damage your teeth but also lead to increased incidences of failure in dental fillings.
Story first published: Wednesday, December 20, 2017, 13:30 [IST]