కిడ్ని స్టోన్స్ లక్షణాలు, ట్రీట్మెంట్ మరియు న్యాచురల్ రెమెడీస్

Posted By:
Subscribe to Boldsky

కిడ్ని స్టోన్స్ గురించి చాలా మంది అందోళన చెందుతుంటారు. కిడ్ని స్టోన్స్ ఎలా ఏర్పడుతాయి, కిడ్ని స్టోన్స్ లక్షణాలు, నివారణ గురించి తెలుసుకుంటే కిడ్నీ స్టోన్స్ ఏర్పకుండా జాగ్రత్తపడవచ్చు. మూత్రపిండాలలో రాళ్లు ఉంటే చాలా నొప్పిగా ఉంటుంది. రాళ్లు అసౌకర్యాలకు గురి చేస్తాయి. మూత్రపిండాలలో లేదా మూత్ర మార్గంలో మినరల్స్ స్ఫటికాకారంలో ఏర్పడటాన్ని కిడ్నీ స్టోన్స్ లేదా మూత్రపిండాల రాళ్లుగా పేర్కొంటారు. మూత్ర పరిమాణం తగ్గటం లేదా అధిక మొత్తంలో లవణాలు స్పటికాలుగా మారటం వలన కిడ్నీ స్టోన్స్ ఏర్పడతాయి. కిడ్నీ స్టోన్స్ వలన మూత్రంలో రక్తం రావటం మరియు ఉదర భాగంలో నొప్పి లేదా వెన్నుభాగంలో నొప్పి కలుగుతుంది.

సరైన ఆహార నియమాలు పాటించకపోవడం, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల కిడ్ని స్టోన్స్ ఏర్పడుతాయని చాలా మంది అపోహపడుతుంటారు. అయితే అది నిజం కాదు. కిడ్నీ స్టోన్స్ శరీరంలో క్యాల్షియం అధికమవ్వడం, మినిరల్స్ కారణంగా కిడ్నిస్టోన్స్ ఏర్పడుతాయి. రెడ్ మీట్, ఆర్గానిక్ మీట్ మరియు షెల్ ఫిల్ వంటివి తినకుండా ఉంటే కిడ్ని స్టోన్స్ నివారించుకోవచ్చు. ఇంకా కొన్ని రకాల అనిమల్ ప్రోటీన్స్ కు సంబంధించిన ఆహారాలు తినకూడదు. ఫ్రెష్ గా ఉండే పండ్లు వెజిటేబుల్స్ తినడం వల్ల యూరిన్ లో ఎసిడిటి లెవల్స్ తగ్గుతాయి. దాంతో కిడ్ని స్టోన్స్ ఏర్పడకుండా నివారించుకోవచ్చు .

 కిడ్ని స్టోన్స్ లక్షణాలు, ట్రీట్మెంట్ మరియు న్యాచురల్ రెమెడీస్

కిడ్ని స్టోన్స్ చాలా చిన్న సైజ్ లో ఉండటం వల్ల ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం లేకుండా యూరిన్ ద్వార వాటిని తొలగించుకోవచ్చు. అయితే మూత్ర పిండాల్లో పెద్దగా ఉన్న రాళ్ళు మూత్రం ద్వార పాస్ కాకపోవడం వల్ల తీవ్రమైన నొప్పి మరియు ఇతర లక్షణాలు కనబడుతుంటాయి. కిడ్ని స్టోన్స్ ఏర్పడినప్పుడు ప్రారంభ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం..

సరిగ్గా పొట్ట ఉదరం బ్యాక్ సైడ్ విపరీతంగా నొప్పి ఉంటుంది:

సరిగ్గా పొట్ట ఉదరం బ్యాక్ సైడ్ విపరీతంగా నొప్పి ఉంటుంది:

కిడ్నీలో రాళ్ళు ఉండే ప్రదేశంలో నొప్పి విపరీతంగా ఉంటుంది. లోయర్ బ్యాక్ ఆబ్డామినల్లో నొప్పి ఎక్కువగా ఉన్నట్లైతే ఇది కిడ్నీలో రాళ్ళు ఉన్నట్లు సంకేతం. స్టోన్స్ కదిలే ప్రదేశాన్ని బట్టి నొప్పి తీవ్రత ఉంటుంది.

మూత్రంతో రక్తం (హెమటూరియా):

మూత్రంతో రక్తం (హెమటూరియా):

కిడ్నీలో రాళ్ళు ఉన్నట్లైతే మూత్ర విసర్జన సమయంలో నొప్పిగా ఉంటుంది. యూరిన్ గ్రే కలర్లో ఉంటుంది. వాసన కూడా డిఫరెంట్ గా ఉంటుంది. మూత్ర విసర్జన సమయంలో మంట, మూత్రంలో రక్తం పడటం వంటి లక్షణాలన్నీ కూడా కిడ్నీ స్టోన్స్ కు సంకేతాలు.

గ్రావెల్స్ :

గ్రావెల్స్ :

మూత్రం పాస్ చేసినప్పుడు చిన్న సైజు రాళ్ళను గమనించవచ్చు. అయితే ఎలాంటి నొప్పి అనిపించదు.

వికారం మరియు వాంతులు :

వికారం మరియు వాంతులు :

కిడ్నీల్లో రాళ్ళ కారణంగా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కు కారణమవుతుంది. దాంతో వికారం, వాంతులు జ్వర లక్షణాలు కూడా కనబడుతాయి.

హైపరూరియా:

హైపరూరియా:

హైపరూరియా అంటే ఎక్కువ సార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం. కిడ్నీలో ఉన్న రాళ్ళు మూత్రనాళాలను బ్లాక్ చేసే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కిడ్నీ స్టోన్స్ కు ఇది ఒక ప్రారంభ సంకేతం.

నొప్పి తీవ్రత కూడా ఒక ముఖ్యమైన లక్షణమే:

నొప్పి తీవ్రత కూడా ఒక ముఖ్యమైన లక్షణమే:

కిడ్నీలో రాళ్ళు ఉన్నప్పుడు, నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కూర్చొన్నా లేదా పడుకున్నా , నిలబడి ఉన్నా అసౌకర్యంగా ఉంటుంది. మూత్ర విసర్జనలో కూడా అసౌకర్యంగా ఫీలవుతారు.

a. నీళ్ళు :

a. నీళ్ళు :

నీళ్ళు ఎక్కువగా తాగడం వల్ల కిడ్నీ స్టోన్స్ ఏర్పడకుండా నివారించుకోవచ్చు. యూరిన్ క్లియర్ గా ఉంటుంది.

b. మెడికేషన్ :

b. మెడికేషన్ :

కిడ్నీ స్టోన్స్ నివారించుకోవడం కోసం మెడికల్ కండీషన్ చాలా అవసరం అవుతుంది. డాక్టర్స్ సూచించే మందులు శరీరంలో కండరాలను రిలాక్స్ చేస్తాయి. అలాగే యూరినరీ ట్రాక్ కూడా రిలాక్స్ అవుతుంది. కిడ్నీ స్టోన్స్ పరిమాణాన్ని బట్టి మెడికేషన్స్ మరియు డ్రగ్స్ సూచిస్తుంటారు.

c. షాక్ వేవ్ లితోట్రిప్సీ :

c. షాక్ వేవ్ లితోట్రిప్సీ :

ఈ ట్రీట్మెంట్ వల్ల పెద్దగా ఉన్న కిడ్నీ స్టోన్స్ కరిగించడం జరగుతుంది. యూరెథ్రా ద్వారా హై ప్రెజర్ సౌండ్ వేవ్స్ పంపించడం ద్వారా పెద్ద సైజ్ కిడ్నీ స్టోన్స్ చిన్నవిగా విచ్ఛిన్నం చేయడం వల్ల సులభంగా తొలగించుకోవచ్చు.కిడ్నీ స్టోన్స్, ఇన్ఫెక్షన్, ఇతర కిడ్నీ సమస్యలను నివారించే 8 సూపర్ వెజిటేబుల్స్ ..!

a. నిమ్మరసం, ఆలివ్ ఆయిల్ మరియు యాపిల్ సైడర్ వెనిగర్ :

a. నిమ్మరసం, ఆలివ్ ఆయిల్ మరియు యాపిల్ సైడర్ వెనిగర్ :

ఈ మూడింటి కాంబినేషన్ లో తయారుచేసే హోం రెమెడీ కిడ్నీ స్టోన్స్ ను ఎఫెక్టివ్ గా కరిగిస్తాయి. నిమ్మరసం, ఆలివ్ ఆియల్, యాపిల్ సైడర్ వెనిగర్ ను 12 ఔన్సుల నీటిలో కలిపి తీసుకోవాలి. లక్షణాలు మెరుగుపడే వరకూ ప్రతి గంటకొకసారి తీసుకోవాలి.

b. యువిల ఉర్సి:

b. యువిల ఉర్సి:

కిడ్నీ స్టోన్స్ నివారించడంలో ఒక ట్రెడిషినల్ రెమెడీ. కిడ్నీలలో ఇన్ఫెక్షన్స్ నివారిస్తుంది. అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. ప్రతి రోజూ ఈ పదార్థాన్ని 500గ్రాములు, రోజుకి మూడుసార్లు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

c. డ్యాండలైన్ రూట్ :

c. డ్యాండలైన్ రూట్ :

హెర్బల్ రెమెడీస్ లో ఒకటి డ్యాండలైన్ రూట్ ఇది కిడ్నీ స్టోన్స్ ను ఎఫెక్టివ్ గా కరిగిస్తుంది. నార్మల్ గా కిడ్నీలు పనిచేయడానికి సహాయపడుతుంది. 500గ్రాములు డ్యాండలైన్ ను రోజుకు రెండు సార్లు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

d. కిడ్నీ బీన్స్ :

d. కిడ్నీ బీన్స్ :

కిడ్నీ బీన్స్ లో మెగ్నీషియం కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది కిడ్నీస్టోన్స్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. కిడ్నీ బీన్స్ 6-7 గంటలు నీళ్లలో నానబట్టి తర్వాత నీరు వంపేసి కుక్కర్ లో వేసి ఒకటి రెండు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి. వీటిని రోజులో అప్పుడప్పుడు తింటుంటే కిడ్నీ స్టోన్స్ సులభంగా తొలగిపోతాయి.

e. దానిమ్మ జ్యూస్ :

e. దానిమ్మ జ్యూస్ :

దానిమ్మ జ్యూస్ లో ఆస్ట్రిజెంట్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. కనుకు ఇది కిడ్నీ స్టోన్స్ ను నివారించడంలో నేచురల్ రెమెడీగా పనిచేస్తుంది. కిడ్నీ స్టోన్స్ ను నివారించడంలో దానిమ్మ జ్యూస్ ను ఉత్తమ రెమెడీ గా సూచిస్తుంటారు. కిడ్నీ స్టోర్స్ ని తేలికగా కరిగించే అమేజింగ్ జ్యూస్ లు..!

f. ఆర్గానిక్ సెలరీ :

f. ఆర్గానిక్ సెలరీ :

ఆర్గానిక్ సెలరీ గ్రేట్ యూరిన్ ప్రమోటర్ గా సూచిస్తుంటారు. ఇది కిడ్నీస్టోన్స్ కరిగించే ఒక టానిక్ . ధనియాలను రెగ్యులర్ వంటల్లో ఉపయోగించడం, టీ తయారీలో వాడటం వల్ల కిడ్నీ స్టోన్స్ ను నివారించుకోవచ్చు .

g. తులసి:

g. తులసి:

కిడ్నీ స్టోన్స్ ను తొలగించడంలో తులసి గ్రేట్ గా సహాయపడుతుంది. శరీరంలో ఫ్లూయిడ్స్ ను బ్యాలెన్స్ చేయడానికి రోజంతా కొద్దికొద్దిగా తినవచ్చు. తులసి తినడం వల్ల శరీరంలో ఫ్లూయిడ్స్ , మినిరల్స్, యూరిక్ యాసిడ్ బ్యాలెన్స్ అవుతుంది. తులసి రసంలో కొద్దిగా తేనె మిక్స్ చేసి తినడం వల్ల యూరినరీ ట్రాక్ట్ స్టోన్స్ కూడా తొలగిపోతాయి.

English summary

Symptoms Of Kidney Stones That You Need To Know, Their Treatment & Natural Remedies in telugu

Kidneys stones are deposits of minerals and salts that are formed within the kidneys. When these are inside the kidney, they do not produce any symptom. we have mentioned some of the top symptoms of kidney stones. Scroll further to find out ..
Please Wait while comments are loading...
Subscribe Newsletter