మీ ఆరోగ్యం గురించి మీ కళ్ళు వెల్లడించే కొన్ని భయంకరమైన నిజాలు!

Posted By: Ashwini Pappireddy
Subscribe to Boldsky

కళ్ళు మన మనస్సు కి కిటికీ లాంటివనే పాత సామెత మనందరికీ తెలిసిన విషయమే. ఏది ఏమైనా, మీ కళ్ళు మీ ఆరోగ్యం గురించి చాలా విషయాలు చెప్పగలదనే నిజం గురించి మరింత తెలుసుకోవడానికి చదవండి.

మీ కళ్ళు మీ ఆరోగ్యం గురించి ఎన్నో విషయాలను వ్యక్తపరుస్తాయి. వీటిలో కొన్నింటిని కేవలం అద్దంలో చూడటం ద్వారా మాత్రమే గుర్తించవచ్చు.

కళ్ళు చాలా విలువైనవి మరియు వాటిని ఆరోగ్యంగా ఉంచడం వల్ల మీ ఆరోగ్యం యొక్క నాణ్యతను మెరుగుపరుస్తుంది.

కళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి 8 సులభ చిట్కాలు

మీ కళ్ళు మీకు కూడా తెలియని అనేక రకాల వ్యాధుల గురించి మిమ్మల్ని హెచ్చరిస్తుందని మీకు తెలుసా!

అయితే, మీ ఆరోగ్యానికి కళ్ళు ఒక కిటికీలుగా ఉంటాయి.నిజానికి అనేక రకాల వ్యాధులు మీ కళ్ళ మీద ప్రభావితం చేయవచ్చు.

అధిక రక్తపోటు నుండి క్యాన్సర్ వరకు, ఈ రకమైన వ్యాధులు మీ కళ్ళకి హానిని కలిగిస్తాయి. కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోవడం చేయగలిగితే ముందుగానే వ్యాధుల గురించి తెలుసుకొనే అవకాశం ఉంటుంది.

ఈ ఆర్టికల్లో, మీ ఆరోగ్యం గురించి మీ కళ్ళు చెప్పే విషయాలను గురించి తెలియజేయడం జరిగింది. మరిన్ని విషయాలను తెలుసుకోవాలని ఉందా, అయితే మరెందుకు ఆలస్యం చదివేయండి.

కళ్ళు మంటలు, వాపు తగ్గించే 10 ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ..!!

1. శాశ్వత స్టై :

1. శాశ్వత స్టై :

కనురెప్పపై స్టై అనేది ఒక ముద్ద లాగా సుదీర్ఘకాలం ఉన్నట్లయితే, అది సేబాషియస్ గ్రంథి కార్సినోమా యొక్క లక్షణం కావచ్చు.

2.కనుబొమ్మల నష్టం :

2.కనుబొమ్మల నష్టం :

కనుబొమ్మలు రావడానికి ముఖ్యమైన కారణాలలో హైపో థైరాయిడిజం ఒకటి. ఇది సాధారణంగా థైరాయిడ్ హార్మోన్ల కొరత వలన ఏర్పడుతుంది.మరికొన్ని కారణాలు వృద్ధాప్యం, ఒత్తిడి మరియు పోషక లోపం కూడా కావచ్చు. అయితే, ఇది మీ ఆరోగ్యం గురించి మీ కళ్ళు తెలియజేసే లక్షణంలో ఒకటి గా చెప్పవచ్చు.

3. అస్పష్టమైన విజన్ :

3. అస్పష్టమైన విజన్ :

ఇది డిజిటల్ గా కన్ను స్ట్రెయిన్ అవడం లేదా పొడి కన్ను సిండ్రోమ్ కారణంగా అస్పష్టమైన చూపు ఏర్పడవచ్చు. ఎక్కువ సేపు కంప్యూటర్ ఎదుట ఉండటం వలన కళ్ళు మంటలు లేదా అస్పష్టమైన దృష్టి రావచ్చు.

4. బ్లైండ్ స్పాట్స్:

4. బ్లైండ్ స్పాట్స్:

బ్లైండ్ మచ్చలు కనిపించడం మైగ్రెయిన్ యొక్క సూచన గా చెప్పవచ్చు.

బ్లైండ్ స్పాట్స్ సాధారణంగా తలనొప్పితో పాటు వస్తాయి. అలాంటి సందర్భాల్లో వెంటనే మీరు మీ వైద్యుడిని సంప్రదించండి.

5. ఉబ్బిన కళ్ళు :

5. ఉబ్బిన కళ్ళు :

మీరు మీ కళ్ళు ఎప్పుడూ ఉబ్బినట్లు భావిస్తే, అది థైరాయిడ్ కంటి వ్యాధి లేదా గ్రేవ్స్ వ్యాధి యొక్క లక్షణం కావచ్చు. దీని అర్థం థైరాయిడ్ మితిమీరినది అని.

6. ఎల్లో వైట్స్:

6. ఎల్లో వైట్స్:

అభివృద్ధి చెందని కాలేయ పనితీరు కామెర్లుకి దారి తీస్తుంది. ఇది పిత్తాశయం లేదా పిత్త వాహికల స్థితికి కూడా అనుసంధానించబడుతుంది. ఒకవేళ మీ వైట్స్ పసుపు రంగులోకి వస్తే, మీరు వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.

7. డయాబెటిస్ తో నీలిరంగు చూపు :

7. డయాబెటిస్ తో నీలిరంగు చూపు :

మధుమేహం గల వ్యక్తులు, తాము ఒక ట్యాబ్ వారి దృష్టి ఫై ఉంచడం మంచిది. అటువంటి సమస్యలో ఒకటే ఈ డయాబెటిక్ రెటినోపతీ, ఇది ఫోటోసెన్సిటివ్ రెటీనా కణజాలంలో రక్త నాళాలకు నష్టం కలిగించే ప్రాంతం. ఇది అస్పష్టమైన దృష్టికి దారితీస్తుంది. మీ ఆరోగ్యం గురించి మీ కన్ను చెప్పే ప్రధాన లక్షణాలలో ఇది ఒకటి.

8. బలహీన విజన్ లేదా విజన్ నష్టం :

8. బలహీన విజన్ లేదా విజన్ నష్టం :

మీ దృష్టిలో ఎలాంటి మార్పు కనిపించినా తక్షణ ప్రతిస్పందన అవసరం ఎంతో ఉంది. మీరు అకస్మాత్తుగా బలహీనమైన, నీలి రంగులో లేదా అస్పష్టతని కలిగిన దృష్టిని మీరు గమనించినట్లయితే, మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఇది స్ట్రోక్ యొక్క మొదటి సంకేతం.

English summary

What Your Eyes Tell About Your Health

Your eyes can open the door to several health conditions that you might be facing. Read to know what your eyes can tell about your health.
Story first published: Monday, September 4, 2017, 11:00 [IST]