For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెచ్.ఐ.వి సోకిన మహిళలలో సాధారణంగా కనపడే 10 వ్యాధికారక లక్షణాలు

By R Vishnu Vardhan Reddy
|

హెచ్.ఐ.వి అనేది నివారణలేని ఒక భయంకరమైన వ్యాధి. మరి ఇటువంటి వ్యాధి భారిన మహిళలు పడినప్పుడు వారిలో సహజంగా కనపడే వ్యాధి లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

చర్మ వ్యాధులు, గ్రంధులు ఉబ్బడం, గ్రంధులకు సంబందించిన అంటువ్యాదులు సోకడం, జ్వరం మరియు రాత్రిపూట విపరీతంగా చెమటలు పట్టడం, నెలసరి సమయంలో బాక్టీరియా మరియు ఈస్ట్ ఇన్ఫెక్షన్లు లాంటివి సోకడం ఇలా ముందస్తుగా కొన్ని లక్షాణాలు కనపడతాయి. వీటి బారినుండి మనల్ని మనం కాపాడుకోవాలంటే, దగ్గరలో ఉన్న వైద్యుల వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకొని అందుకు తగ్గ నివారణా మందులు వాడటం ఉత్తమమైన మార్గం.

అలర్ట్ : హెచ్ ఐ వి (HIV/AIDS) లక్షణాలు, సంకేతాలు ఇవేఅలర్ట్ : హెచ్ ఐ వి (HIV/AIDS) లక్షణాలు, సంకేతాలు ఇవే

మొదట్లో హెచ్.ఐ.వి కారక వ్యాధి లక్షణాలు స్వల్పంగా కనపడతాయి. అలాంటి సమయంలో వ్యాధిగ్రస్థులు ఆ విషయాన్ని పసిగట్టలేక ఆ లక్షణాలు సాధారణమే అనుకోని పెద్దగా పట్టించుకోరు. కానీ వ్యాధికారక లక్షణాలు పెద్దగా బయటపడకపోయినా ఏ వ్యక్తికైతే ఈ వ్యాధి సోకిందో అతని ద్వారా మిగతా వారికి వ్యాధి సంక్రమించే ప్రమాదం ఉంది. అందుకే ఎవరైనా సరే అనుమానం ఉన్న వెంటనే పరీక్ష చేయించుకొని, తమకు వ్యాధి ఉందా లేదా అని నిర్ధారణ చేసుకోవడం చాలా ముఖ్యం.

స్త్రీ పురుషుల్లో హెచ్.ఐ.వి వ్యాధి లక్షణాలు దాదాపు ఒకే మాదిరిగా ఉంటాయి. కానీ వాటిలో కొన్ని స్వల్ప తేడాలు ఉండే అవకాశం ఉంది. స్త్రీలలో సాధారణంగా ప్రముఖంగా కనపడే 10 హెచ్.ఐ.వి వ్యాధి లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం,

1.ప్రారంభదశ లో కనపడే లక్షణాలు :

1.ప్రారంభదశ లో కనపడే లక్షణాలు :

హెచ్.ఐ.వి సోకిన మొదటి వారాల్లో వ్యాధికారక లక్షణాలు చాలామందిలో బయట పడకపోవచ్చు. కొంతమందికి జలుబు, జ్వరం, తలనొప్పి, శక్తిలేకపోవడం లాంటి వివిధ వ్యాధికారక లక్షణాలతో బాధ పడుతుంటారు. ఈ లక్షణాలు కొన్ని సార్లు కొన్ని వారాల లోపే నయమయిపోతాయి. మరికొన్ని సందర్భాల్లో పది సంవత్సరాలైనా కూడా ఆ వ్యాధిగ్రస్తుడ్ని వదిలి పెట్టవు. మరిన్ని తీవ్రమైన లక్షణాలు శరీరానికి సోకేందుకు ఇవి దోహదపడతాయి.

2. చర్మం పై దద్దుర్లు మరియు పుళ్ళు :

2. చర్మం పై దద్దుర్లు మరియు పుళ్ళు :

హెచ్.ఐ.వి వ్యాధిగ్రస్తుల్లో చాలా మందిని చర్మవ్యాధులు పట్టిపీడిస్తుంటాయి. అతిసాధారణంగా వాళ్ళ చర్మం పై దద్దుర్లు కనపడుతుంటాయి. హెచ్.ఐ.వి సోకిన వ్యక్తి చర్మం అతి సున్నితంగా మారిపోతుంది. చిన్న చిన్న రాపిడ్లకు మరియు సూర్యకాంతికి కూడా చర్మం తట్టుకోలేని పరిస్థితికి చేరుకుంటుంది. మామూలుగా దద్దురు అనేది సాదా ఎర్రటి పట్టిలా కనపడుతూ చిన్నపాటి బొప్పిలాగా ఉంటుంది. చర్మం పొరలు పొరలుగా మారే అవకాశం ఉంది.

నోటిలో ఉన్న చర్మంపై, జననాంగాల దగ్గర, గుదం దగ్గర పుళ్ళు ఏర్పడే ప్రమాదం ఉంది. అలాంటి ప్రదేశాల్లో వైద్యం చేయాలంటే కూడా చాలా కష్టం. హెచ్.ఐ.వి వ్యాధిగ్రస్తులకు, హెర్పిస్ మరియు దాని అనుబంధ వ్యాధులు సోకే అవకాశాలు ఎక్కువ. సరైన వైద్యం తీసుకోవడం ద్వారా చర్మ వ్యాధుల తీవ్రతను తగ్గించుకోవచ్చు.

3. గ్రంధులు వాపు వాయడం :

3. గ్రంధులు వాపు వాయడం :

మెడ భాగంలో, తలలో, చంకలలో,గజ్జల్లో ఇలా మన శరీరం మొత్తంగా శోషరస గ్రంధులు ఉంటాయి. వ్యాధినిరోధక వ్యవస్థలో భాగంగా ఏవైనా అంటువ్యాధులు సోకినప్పుడు, శోషరస గ్రంధులు రోగనిరోధక కణాల ద్వారా హానికర పదార్ధాలను శుద్ధిచేయడం ప్రారంభిస్తాయి. ఎప్పుడైతే హెచ్.ఐ.వి వ్యాధి భారిన పడతారో, అలాంటి సమయంలో వ్యాధినిరోధక వ్యవస్థ ఎంతో శ్రమతో ఎక్కువ సేపు పని చేయాల్సి వస్తుంది. అటువంటి సమయంలో శోషరస గ్రంధులు కొద్దిగా ఉబ్బుతాయి. వాటినే వాపు గ్రంధులని కూడా పిలుస్తారు. హెచ్.ఐ.వి వ్యాధిగ్రస్తుల్లో మొట్ట మొదట కనపడే వ్యాధిలక్షణాల్లో ఇది కూడా ఒక్కటి. గ్రంధులు వాపు వాయడం అనే లక్షణం కొన్ని నెలల పాటు పట్టి పీడిస్తుంది.

4. అంటువ్యాధులు :

4. అంటువ్యాధులు :

రోగనిరోధక వ్యవస్థ క్రిములతో పోరాడటాన్ని హెచ్.ఐ.వి, కష్టతరం చేస్తుంది. దీంతో అంటువ్యాదులు సోకే ఆస్కారం ఎక్కువ. న్యుమోనియా, క్షయ, హెపటైటిస్ సి వంటి వ్యాధులు సులభంగా శరీరంలోకి ప్రవేశిస్తాయి. చర్మం, కళ్ళు, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, ఆహార నాళము మరియు మెదడు కు సంబంధించిన అంటువ్యాదులు భారిన పడతారు. జలుబు వంటి చిన్న చిన్న జబ్బులను నయం చేయాలంటే కూడా కష్టతరం అవుతుంది.

తరచూ చేతులను కడుక్కోవడం మరియు హెచ్.ఐ.వి మందులను క్రమం తప్పకుండా వాడటం వంటి అదనపు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అనారోగ్యంతో పాటు వాటి వల్ల వచ్చే సమస్యల నుండి తప్పించుకోవచ్చు.

5. జ్వరం మరియు రాత్రిపూట ఎక్కువగా చెమటలు పట్టడం :

5. జ్వరం మరియు రాత్రిపూట ఎక్కువగా చెమటలు పట్టడం :

చాలా తక్కువ స్థాయిలో జ్వరం, చాలా ఎక్కువ రోజులపాటు హెచ్.ఐ.వి వ్యాధిగ్రస్తులను ఇబ్బంది పెడుతుంది. 99.8 డిగ్రీల F నుండి 100 డిగ్రీల F మధ్య శరీర ఉష్ణోగ్రత ఉంటే దీనిని తక్కువ స్థాయి జ్వరంగా పిలుస్తారు. సాధారణంగా జ్వరం వచ్చిందంటే శరీరంలో ఎదో లోపం ఉందని అర్ధం, కానీ అందుకు అసలు కారణం ఏంటి అని మనకు తెలియకపోవచ్చు. ఈ తక్కువ స్థాయి జ్వరం ఎక్కువ రోజులు ఉండటం అనేది హెచ్.ఐ.వి పాజిటివ్ స్థితి అని గుర్తించలేక ఈ లక్షణాన్ని చాలామంది పట్టించుకోకుండా వదిలేస్తారు. కొన్ని సార్లు రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు విపరీతంగా చెమటలు పట్టడంతో పాటుగా జ్వరం వస్తుంది.

వరల్డ్ ఎయిడ్స్ డే: ఎయిడ్స్ వ్యాధి సోకకుండా తీసుకోవ్సలిన జాగ్రత్తలు...వరల్డ్ ఎయిడ్స్ డే: ఎయిడ్స్ వ్యాధి సోకకుండా తీసుకోవ్సలిన జాగ్రత్తలు...

6. రుతుక్రమంలో మార్పులు :

6. రుతుక్రమంలో మార్పులు :

హెచ్.ఐ.వి సోకిన స్త్రీలలో రుతుక్రమంలో మార్పులు వస్తాయి. మాములుగా వచ్చే నెలసరి స్థాయి కంటే తక్కువగా లేదా ఎక్కువగా లేదా అస్సలు రాకపోవచ్చు. నెలసరి ముందు వచ్చే తీవ్రమైన లక్షణాలు ఎక్కువగా కనపడుతుంటాయి.

7. బాక్టీరియా మరియు ఈస్ట్ వల్ల కలిగే అంటువ్యాదులు :

7. బాక్టీరియా మరియు ఈస్ట్ వల్ల కలిగే అంటువ్యాదులు :

హెచ్.ఐ.వి పాజిటివ్ ఉన్న మహిళల్లో, బాక్టీరియా మరియు ఈస్ట్ వల్ల కలిగే అంటువ్యాదులు సాధారణం గా కనపడుతుంటాయి. వాటికి వైద్యం చేయాలంటే కూడా చాలా కష్టతరం.

8. శృంగారపరంగా సంక్రమించే అంటువ్యాదులు :

8. శృంగారపరంగా సంక్రమించే అంటువ్యాదులు :

హెచ్.ఐ.వి కారణంగా శృంగారపరంగా సంక్రమించే అంటువ్యాదుల ప్రమాదం పెరుగుతుంది. చ్లమీడియా, ట్రిచోమోనియాసిస్, గనోరియా, హెచ్.పి.వి వంటి అంటువ్యాదులు సోకి, జననాంగాల దగ్గర పులిపిర్లు, గర్భాశయ క్యాన్సర్ వంటి విపరీతమైన జబ్బులకు దారితీసే అవకాశం ఉంది. జననాంగాల దగ్గర హెర్పిస్ వ్యాధి గనుక సోకితే ఆ వ్యాధిగ్రస్తుడి పరిస్థితి మరింత దిగజారిపోతుంది. ఇది తరచూ వ్యాధిగ్రస్తుల్లో చోటు చేసుకునే పరిణామమే. హెర్పిస్ వ్యాధిని చికిత్స ద్వారా నయంచేద్దాం అనుకున్నా, అందుకు వ్యాధిగ్రస్తుని శరీరం సహకరించకపోవచ్చు.

9. కటి దగ్గర మంట పుట్టించే వ్యాధి ( పెల్విస్ ఇన్ఫలమేటరీ డిసీస్(PID) ) :

9. కటి దగ్గర మంట పుట్టించే వ్యాధి ( పెల్విస్ ఇన్ఫలమేటరీ డిసీస్(PID) ) :

పి.ఐ.డి వల్ల గర్భాశయం, అండాశయమునుండి గర్భకోశమునకు గల నాళమార్గముకు మరియు అండాశయంకు అంటువ్యాదులు సోకే ప్రమాదం ఎక్కువగా ఉంది. పి.ఐ.డి ఉన్న హెచ్.ఐ.వి పాజిటివ్ స్త్రీలకు వైద్యం చేయడం చాలా కష్టమైనా విషయం. వ్యాధి లక్షణాలు అనేటివి ఎక్కువ రోజులు ఉంటాయి లేదా తరచూ తిరిగి వచ్చి ఇబ్బంది పెడుతుంటాయి.

10. హెచ్.ఐ.వి మరియు ఎయిడ్స్ ఎక్కువగా పురోగమిస్తే కనపడే లక్షణాలు :

10. హెచ్.ఐ.వి మరియు ఎయిడ్స్ ఎక్కువగా పురోగమిస్తే కనపడే లక్షణాలు :

హెచ్.ఐ.వి పురోగతి చెందుతున్న సమయంలో, డయేరియా, కళ్ళు తిరగటం, వాంతులు అవ్వడం, శరీర బరువు తగ్గటం, విపరీతమైన తలనొప్పి రావడం, కీళ్ల నొప్పి, కండరాల నొప్పులు, ఊపిరి సరిగ్గా అందకపోవడం, దీర్ఘకాలికంగా దగ్గు బాధించడం, మ్రింగేటప్పుడు ఇబ్బంది పడటం, లాంటి లక్షణాలు ఎక్కువగా కనపడతాయి.

దీని తర్వాత దశలో హెచ్.ఐ.వి వల్ల స్పల్పకాలిక సమయంలోనే జ్ఞాపక శక్తిని కోల్పోవడం, మానసిక గందరగోళానికి లోనవ్వటం, కోమా దశకు చేరటం వంటి విపరీత పరిస్థితులకు దారి తీస్తుంది. హెచ్.ఐ.వి గనుక మరీ ఎక్కువ పురోగతి చెందితే ఆ స్థితిని ఎయిడ్స్ అంటారు. ఈ స్థితి లో రోగ నిరోధక వ్యవస్థ అస్సలు పనిచేయదు. అంటు వ్యాధులు విపరీతంగా శరీరాన్ని చుట్టుముడతాయి. వాటిని నిరోధించడం కష్టమవుతుంది. హెచ్.ఐ.వి నుండి ఎయిడ్స్ గా మారడానికి కొన్ని క్యాన్సర్లు దోహద పడతాయి. వీటినే ఎయిడ్స్ డిఫైనింగ్ క్యాన్సర్లు అంటారు.

ఈ క్యాన్సర్లలో గర్భాశయ క్యాన్సర్ కూడా ఒకటి. ఈ తరహా క్యాన్సర్ నిర్దిష్టంగా స్త్రీలలో కనపడుతుంది.

ఇన్ని హెచ్.ఐ.వి కారక వ్యాధి లక్షణాలను శరీరంలోకి ఆహ్వానించి మనల్ని ఎయిడ్స్ కు కేంద్రంగా మార్చుకునే బదులు, ఒక భాగస్వామితోనే శృంగారం లో పాల్గొనటం, సురక్షిత శృంగార పద్దతులను అవలంభించడం తో పాటు , తగు జాగ్రత్తలు తీసుకుంటే అంతకు మించిన ఉత్తమమైన లక్షణం మరొకటి లేదు.

English summary

HIV and Women: 10 Common Symptoms

Read to know the signs and symptoms of hiv. Take a look at the common symptoms of hiv.
Desktop Bottom Promotion