ఒకే నెలలో పీరియడ్స్ రెండుసార్లు రావడానికి కారణం ఏమై ఉండవచ్చు?

By: Ashwini Pappireddy
Subscribe to Boldsky

సాధారణంగా రెండు పీరియడ్స్ రావడానికి మధ్య సగటు సమయం 28 రోజులు. అయితే, ఒక్కొక్కసారి మీకు కేవలం 14 రోజుల్లోనే మీ పీరియడ్స్ రావచ్చు. అంత మాత్రాన మీలో ఏదో తప్పు ఉందని అర్థం కాదు.

కొంతమంది మహిళలు కూడా 2 వారాల ఋతు చక్రం కలిగి ఉంటారు. మరికొందరిలో ఇది క్రమంగా ఉంటుంది, ఇంకొందరిలో ఇది తాత్కాలిక సమస్య కావచ్చు. మీరు ఈ రుతుచక్రంలో ఎటువంటి ఆకస్మిక మార్పును ఎదుర్కొన్నా, వెంటనే మీ డాక్టర్ను సందర్శించాలి.

పీరియడ్స్ లో నొప్పులు, తిమ్మెర్లు తగ్గించే కామన్ ఫుడ్స్!

మీరు ఒక నెలలో రెండు సార్లు పీరియడ్స్ ని కలిగి ఉంటే, మీరు మీ యుక్తవయస్సుని తాకినప్పటి నుంచీ, అది ఒక సమస్య కాదు.

periods

ఒకవేళ మీరు అకస్మాత్తుగా ఒక నెలలో రెండు సార్లు పీరియడ్స్ రావడం మొదలుపెడితే, ఆ సందర్భంలోఈ వ్యాసంలో మేము చెప్పిన ఈ కింది కారణాలను సూచిస్తుంది.

ఈ ఆర్టికల్లో, ఒక నెలలో రెండు సార్లు పీరియడ్స్ ఎందుకు వస్తుందో దానికి గల కారణాల జాబితాను మేము ఇక్కడ తెలియజేయడం జరిగింది. కాబట్టి, మీరు ఒక నెలలో 2 సార్లు పీరియడ్స్ రావడానికి గల అర్థం ఏమిటో తెలుసుకోవడానికి మరింత చదవండి.

పీరియడ్స్ టైంలో శృంగారం వల్ల పొందే మిరాకిలస్ బెన్ఫిట్స్..!!

1. బరువు లో మార్పులు:

1. బరువు లో మార్పులు:

బరువు ను కోల్పోవడం లేదా బరువు పెరుగుట ఋతు చక్రం సరిగా రాకపోవడానికి కారణమవుతుంది. కొందరు స్త్రీలకు, ఇది చాలా ఎక్కువ రోజులకు పీరియడ్స్ రావచ్చు, ఇతరులకు తక్కువ కాలంలోనే పీరియడ్స్ రావచ్చు -ఒక్కొక్కసారి రెండు వారాలకు కూడా రావచ్చు.

2.థైరాయిడ్ సమస్యలు:

2.థైరాయిడ్ సమస్యలు:

లో థైరాయిడ్ ఫంక్షన్ కూడా పీరియడ్స్ లోని యోని స్రావంతో ముడిపడి ఉంటుంది. మీ ఋతు చక్రం ని నియంత్రించే రెండు ప్రధాన హార్మోన్లు ప్రొజెస్టెరాన్ మరియు ఈస్ట్రోజెన్. ఈ హార్మోన్లు థైరాయిడ్ గ్రంధి చేత ఉత్పత్తి చేయబడుతున్నాయి, అందువల్ల థైరాయిడ్ సమస్యలు ఇర్రెగులర్ పీరియడ్స్ తో సంబంధం కలిగి ఉంటాయి.

3. కాంట్రాసెప్టైస్లో మార్పు:

3. కాంట్రాసెప్టైస్లో మార్పు:

గర్భనిరోధక మార్పుల వలన పీరియడ్స్ ఐపోయిన రెండు వారాల తర్వాత రక్తస్రావాన్ని కలిగిస్తుంది. మీరు మాత్రను ఆపివేసినట్లయితే లేదా మీ రకమైన కాంట్రాసెప్టివ్ పిల్ని మార్చినట్లయితే, మీరు మీ కాలాల మధ్య రక్తస్రావాన్ని కలిగి ఉంటారు. మీకు ఒకే నెలలో రెండు సార్లు పీరియడ్స్ రావడానికి ఇదే కారణం.

4. కడుపు ఫైబ్రాయిడ్స్ లేదా తిత్తులు:

4. కడుపు ఫైబ్రాయిడ్స్ లేదా తిత్తులు:

కడుపు లోని ఫైబ్రాయిడ్లు రక్తం గడ్డకట్టడం మరియు భారీ రక్తస్రావం జరగడానికి పీరియడ్స్ మధ్య కారణమవుతుంది. ఈ రక్తస్రావం తరచూ పొరపాటుగా ఉంటుంది, ఎందుకంటే ఇది సాధారణ కాలం వరకు కొనసాగుతుంది లేదా రక్త గడ్డలను కూడా కలిగి ఉంటుంది.

5.ఒత్తిడి

5.ఒత్తిడి

ఋతు చక్రం లో అధిక స్థాయిలో ఒత్తిడి కూడా ఇర్రేగులర్ పెరిఒద్స్ రావడానికి సంబంధం కలిగి ఉంది. ఇది కేవలం ఒత్తిడి వలన మాత్రమే రెండువారాల తర్వాత పీరియడ్స్ వస్తుందని చెప్పలేము కానీ దీనిని ఒక కారణంగా చెప్పవచ్చు.ఇది ఒక నెలలో మీరు రెండుసార్లు మీ పీరియడ్స్ ని పొందడానికి ఇది ఒక కారణం.

6.STIs:

6.STIs:

క్లామిడియా మరియు గోనేరియా వంటి లైంగికంగా సంక్రమించిన అంటువ్యాధులు గర్భాశయం యొక్క వాపును కలిగిస్తాయి. ఇది ఋతు కాలవ్యవధి అసాధారణంగా రావడానికి ఒక కారణం.

English summary

What Could Be Causing Periods To Appear Twice In A Month

But if all of a sudden you start getting two periods in a month, then this can indicate the reasons that we have mentioned in this article.
Story first published: Monday, October 2, 2017, 12:30 [IST]
Subscribe Newsletter