బబుల్ గమ్( చూయింగ్ గమ్) ని మింగేస్తే ఏమవుతుందో తెలుసా?

Posted By: Lekhaka
Subscribe to Boldsky

మీరు ఎప్పుడైనా బబుల్ గమ్ ని పొరపాటున మింగేశారా ? మనల్ని చిన్నప్పటి నుండి పెంచిన తల్లిదండ్రులు బబుల్ గమ్ ని అస్సలు మింగకూడదు అని తరచూ హెచ్చరిస్తుంటారు.

ఒకవేళ పొరపాటున బబుల్ గమ్ ని మింగేస్తే అది మన పొట్ట లోపల అత్తుకుపోతుందని మరియు అది ఎప్పటికీ బయటకురాదని మనలో చాలామంది సాధారణంగా భావిస్తుంటారు. ఆ ఒక్క కారణం చేతనే బబుల్ గమ్ ని మింగకూడదు అని అందరూ చెబుతుంటారా ?

మీకు చూయింగ్ గమ్ నమలడం అలవాటా ? ఐతే బీ అలర్ట్

కడుపులో బబుల్ గమ్ అత్తుకుపోతుంది అనే విషయంలో ఎటువంటి నిజం లేదు. అయినప్పటికీ బబుల్ గమ్ ని మింగటం మీ ఆరోగ్యానికి చాలా హానికరం. మీరు గనుక ఒకవేళ బబుల్ గమ్ ని మింగితే మీ శరీరంలో జరిగే మార్పులు ఏమిటి ? అది మీ శరీరం పై ఎటువంటి మార్పులు చూపిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మొదటగా అసలు బబుల్ గమ్ లో ఏమేమి ఉంటాయి :

మొదటగా అసలు బబుల్ గమ్ లో ఏమేమి ఉంటాయి :

పిండి పదార్ధం, రంగులు, చక్కెర లేదా తీపిని పెంపొందించే పదార్ధములు, సువాసనలు వెదజల్లే ద్రవాలు, కొవ్వులు, రెసిన్లు, మైనం, ఎలాస్టోమర్లు మరియు మిశ్రమద్రావణమును స్థిరపరుచు పదార్థములు( ఎమెల్సీఫైర్ ) ఇలా ఎన్నో పదార్ధాలు బబుల్ గమ్ లో ఉంటాయి.

కాలేయం ఏమి చేస్తుందంటే :

కాలేయం ఏమి చేస్తుందంటే :

బబుల్ గమ్ తయారీకి రంగులు, నిల్వ ఉంచడానికి ఉపయోగించే పదార్ధాలు మరియు కొన్ని సంకలితాలను కూడా వాడుతారు. మీరు బబుల్ గమ్ ని మింగిన వెంటనే మీ కాలేయం ముందుగా బబుల్ గమ్ ఉన్న హానికరమైన పదార్ధాలన్నింటిని తొలగిస్తుంది. మీకు ఎటువంటి అలర్జీ రాకుండా కాపాడుతుంది.

పొట్టలో ఏమవుతుందంటే :

పొట్టలో ఏమవుతుందంటే :

ఎప్పుడైతే బబుల్ గమ్ మీ పొట్టలోకి చేరుతుందో, మీ కడుపులో ఉన్న ఆమ్లం( హైడ్రోక్లోరిక్ ఆమ్లం) ఆ బబుల్ గమ్ నుండి కొన్ని పదార్ధాలను విడగొడుతుంది. సాధారణంగా చక్కెర, గ్లిజరిన్ వంటి మృదువైన పదార్ధాలను మరియు పెప్పెర్మెంట్ తైలం వంటి రుచిని పెంపొందించే పదార్ధాలను విడగొడుతుంది.

చ్యూయింగ్ గమ్ తింటే ప్రయోజనాలు!

పేగులు దగ్గరకి చేరినప్పుడు ఏమి జరుగుతుందంటే :

పేగులు దగ్గరకి చేరినప్పుడు ఏమి జరుగుతుందంటే :

ఎప్పుడైతే బబుల్ గమ్ మీ పేగుల దగ్గరకు చేరుతుందో, ఇక అప్పుడు జీర్ణ వ్యవస్థ ప్రక్రియ నుండి పక్కకు వచ్చేసినట్లు అర్ధం. మీ శరీరం నుండి బబుల్ గమ్ బయటకు వెళ్ళడానికి 25 నుండి 26 గంటల సమయం పడుతుంది.

ఒకవేళ మీ శరీరం గనుక ఒక్క రోజు లోపల బబుల్ గమ్ ని బయటకు పంపించే విషయంలో విఫలమైతే ఏమి జరుగుతుందంటే :

ఒకవేళ మీ శరీరం గనుక ఒక్క రోజు లోపల బబుల్ గమ్ ని బయటకు పంపించే విషయంలో విఫలమైతే ఏమి జరుగుతుందంటే :

ముఖ్యంగా మీ శరీర ఉష్ణోగ్రతలు సాధారణం కంటే పెరిగిపోతుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. మీ శరీరం బబుల్ గమ్ ని బయటకు పంపడంలో ఇబ్బంది పడుతుంటే, అటువంటప్పుడు మీ రక్తపోటు కూడా పెరుగుతుంది.

ఇంకా ఎటువంటి లక్షణాలు కనపడతాయంటే :

ఇంకా ఎటువంటి లక్షణాలు కనపడతాయంటే :

మీ శరీరం నుండి బబుల్ గమ్ గనుక బయటకు వెళ్లకపోతే నీళ్ల విరేచనాలు, వాంతులు మరియు వికారంగా ఉండటం ఇలా రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కొంత మందిలో దద్దుర్లు మరియు దురద వంటి లక్షణాలు కనపడుతుంటాయి. బబుల్ గమ్ లో వాడే పదార్ధాల వల్ల కొన్ని రకాల ఎలర్జీలు కూడా వస్తాయి. అందుచేత మీరు బబుల్ గమ్ గనుక మింగినట్లైతే, అంటువంటి సమయంలో ఇటువంటి విపరీతమైన లక్షణాలు మీలో కలుగుతుంటే వైద్యుడ్ని ఖచ్చితంగా కలవండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

English summary

What Happens If You Swallow Chewing Gum

Do you know what happens if you swallow chewing gum? Have you ever swallowed a chewing gum accidentally? Read this!
Subscribe Newsletter