మజా మజా మొక్కజొన్న వర్షాకాలంలో ఎందుకు తినాలి?

Posted By:
Subscribe to Boldsky

సన్నని చినుకులు పడుతూ ఉంటే ఎర్రని నిప్పులమీద మొక్కజొన్న పొత్తు కాలుస్తుంటే వచ్చే ఆ కమ్మని వాసనకి గులాం కాని వాళ్లు ఉంటారంటే నమ్మలేం. అలాంటిది వాటిని తింటే ఉండే రుచి గురించి వేరే చెప్పాలా... ఇక, గింజల్ని ఉడికించి కాస్త వెన్న జోడించి అందించే స్వీట్‌కార్న్‌ వాసనకి ఎవరైనా ఫిదా కావాల్సిందే. అంతేనా... పాలొద్దు టిఫినొద్దు అంటూ మారాం చేసే పిల్లలకు పాలల్లో కాసిని కార్న్‌ఫ్లేక్స్‌ వేసిస్తే మారుమాట్లాడరంటే అతిశయోక్తి కాదు. సూప్‌ తాగినా సలాడ్‌గా తిన్నా ఏ రూపంలో తీసుకున్నా మొక్కజొన్న రుచే వేరు. చిరుతిండిగా తినే పాప్‌కార్న్‌ సంగతి సరేసరి.

అందుకే సుమారు తొమ్మిది వేల సంవత్సరాల క్రితమే మెజో అమెరికన్లు పండించిన మొక్కజొన్న నేడు ప్రపంచవ్యాప్త ఆహారంగా మారింది. ఒకప్పుడు మెజో అమెరికన్లు పండించిన మొక్కజొన్నను మాయన్లు పెంచి పోషించారని చెప్పాలి. ఆనాటి నుంచి ఈనాటి వరకూ దీన్ని వాళ్లు కూరగాయగానూ అల్పాహారంగానూ చిరుధాన్యంగానూ వాడుతూనే ఉన్నారు. అంతేకాదు, జన్యుమార్పుల ద్వారా మేలైన వంగడాలనూ సృష్టిస్తున్నారు.

మజా మజా మొక్కజొన్న వర్షాకాలంలో ఎందుకు తినాలి?

తాజాగా ఉడికించి తింటే ఏ రకం మొక్కజొన్న అయినా మంచిదే. ఇందులో శక్తిమంతమైన పోషకాలతోబాటు ఎ, బి, సి, ఇ విటమిన్లూ, కొన్ని ఖనిజాలూ కూడా లభ్యమవుతాయి. కార్న్‌కి కాస్త నిమ్మకాయ రాసుకుని తినడంవల్ల వాటిల్లో శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లాలు, నియాసిన్‌... లాంటి పోషకాల శాతం మరింత పెరుగుతుంది. వీటిలో ఉండే డైటరీ ఫైబర్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ గా పనిచేసి, శక్తిని అందిస్తాయి. వర్షాకాలంలో వీటి వాడకం ఎక్కువగా ఉంటుంది. వర్షాకాలంలో ఇవి హెల్తీ స్నాక్ అని చెప్పొచ్చు. మరి ఈ హెల్తీ స్నాక్ ఆరోగ్యానికి ఏవిధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం..

స్వీట్ కార్న్ లోని 15గ్రేట్ హెల్త్ బెనిఫిట్స్

జీర్ణ శక్తి పెంచుతుంది:

జీర్ణ శక్తి పెంచుతుంది:

మొక్కజొన్నలో పుష్కలంగా ఉండే థైమీన్‌, నియాసిన్‌ అనే విటమిన్లు నాడీ వ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తాయి. ఇంకా పాంటోథెనిక్‌ ఆమ్లం జీవక్రియకు దోహదపడుతుంది.మొక్కజొన్నలో పీచు పుష్కలంగా వుంటుంది. అది జీర్ణక్రియకు బాగా పనిచేస్తుంది.ఆహారంలో పీచు వుంటే అది మలబద్దకం, మొలలు వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. పేగు కేన్సర్‌ అరికడుతుంది.

రక్తహీనత తగ్గిస్తుంది:

రక్తహీనత తగ్గిస్తుంది:

కార్న్‌లోని ఐరన్‌ రక్తహీనతనీ తగ్గిస్తుంది.రక్తహీనత అంటే మీలోని ఎర్ర రక్తకణాల సంఖ్య ఐరన్‌ లేకపోవటం వలన గణనీయంగా పడిపోతుంది. మరి మీరు తినే స్వీట్‌ మొక్కజొన్న విటమిన్‌ బి12, ఐరన్ మరియు ఫోలిక్‌ యాసిడ్‌లు కలిగి ఉండటం వల్ల మీలో రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. కార్న్ లో ఉండే విటమిన్ బి12, ఐరన్, ఫోలిక్ యాసిడ్స్ , ఎర్రరక్త కణాల ఏర్పాటు చాలా అవసరం అవుతాయి.

మొక్కజొన్నలో ఉన్న మేజర్ హెల్త్ బెనిఫిట్స్ చూడు గురూ...!

హార్ట్ హెల్త్ కు మంచిది:

హార్ట్ హెల్త్ కు మంచిది:

మొక్కజొన్నల నుంచి తీసిన నూనెలో అన్‌శాచ్యురేటెడ్‌ కొవ్వులూ స్టెరాల్స్‌ ఎక్కువగా ఉండటంవల్ల అవి కొలెస్ట్రాల్‌ను తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యానికి దోహదపడతాయట. రక్తనాళాల్లో పాచి పేరుకోకుండా చేయడంద్వారా గుండెపోటు, పక్షవాతం వంటివి రాకుండా చేస్తాయి. బీపీనీ తగ్గిస్తాయట. మొక్కజొన్న ను రెగ్యులర్ గా తినడం వల్ల, తగిన పరిమానణంలో మితంగా తీసుకోవడం వల్ల కార్డియోవాస్కులర్ హెల్త్(రక్తకాణాల ఆరోగ్యానికి) చాలా మంచిది. మొక్కజొన్నలో ఉండే విటమిన్ సి, కెరోటినాయిడ్స్, మరియు బయోఫ్లెవనాయిడ్స్ అనేక గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తుంది. అంతే కాదు, రక్తంలోని కొలెస్ట్రాల్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది.

ఎనర్జీ లెవల్స్ పెంచుతుంది:

ఎనర్జీ లెవల్స్ పెంచుతుంది:

మొక్కజొన్నలో ఖనిజాల శాతమూ ఎక్కువే. ఫాస్ఫరస్‌ మూత్రపిండాల పనితీరుకి తోడ్పడితే, మెగ్నీషియం ఎముక బలాన్ని పెంచుతుంది. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్స్ శరీరానికి కావల్సిన ఎనర్జీని అందిస్తుంది. అలాగే బ్రెయిన్ , నాడీవ్యవస్థ చురుకుగా పనిచేయడానికి సహాయపడుతుంది.

కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది:

కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది:

శరీరంలో లివర్‌ కొలెస్టరాల్‌ను తయారు చేస్తుంది. రెండు రకాల కొలెస్టరాల్‌ తయారవుతుంది. అవి హెడ్‌డిఎల్‌ మరియు చెడు కొలెస్టరాల్‌ అయిన ఎల్‌డిఎల్‌. నేటి రోజులలో కొవ్వు అధికంగా ఉండే ఆహారాలు చెడు కొలెస్టరాల్‌ని పెంచి గుండెను బలహీనం చేసి గుండె సంబంధిత వ్యాధులు కలిగిస్తున్నాయి. తీపి మొక్కజొన్నలో వుండే విటమిన్‌ సి, కేరోటియాయిడ్లు మరియు మయో ప్లేవినాయిడ్లు మీ గుండెను చెడు కొలెస్టరాల్‌ నుండి కాపాడుతాయి. శరీరంలో రక్తప్రసరణ అధికం చేస్తాయి.

హైపర్ టెన్షన్ తగ్గిస్తుంది:

హైపర్ టెన్షన్ తగ్గిస్తుంది:

కార్న్ లో విటమిన్ బి ఎక్కువగా ఉండటం వల్ల , ఇది కార్బోహైడ్రేట్, లిపిడ్, ప్రోటీన్, మొటబాలిజం, పెంచడం వల్ల స్ట్రెస్ లెవల్స్ తగ్గుతాయి. పినోలిక్ ఫైటోకెమికల్స్ అనే విటమిన్ బి అధికంగా ఉండటం వల్ల ఇది హైపర్ టెన్షన్ కు వ్యతిరేఖంగా పోరాడుతుంది.

 డయాబెటిస్ కంట్రోల్ చేస్తుంది:

డయాబెటిస్ కంట్రోల్ చేస్తుంది:

మొక్కజొన్నలోని ఫైటోకెమికల్స్‌ శరీరంలో ఇన్సులిన్‌ శాతాన్ని నియంత్రించడం ద్వారా రక్తంలో చక్కెర నిల్వలు పేరుకోకుండా చేస్తుంది. మొక్కజొన్న, తగినంత పరిమాణంలో వినియోగించుకుంటే, మధుమేహంతో బాధపడే వారికి చాలా మంచిది. మొక్క జొన్నలో ఉండే ఫైటోకెమికల్స్ మధుమేహవ్యాధిని రెగ్యులేట్ చేయడానికి సహాయపడుతుంది.

క్యాన్సర్ నివారిస్తుంది:

క్యాన్సర్ నివారిస్తుంది:

ఇందులోని యాంటీఆక్సిడెంట్లు క్సానర్‌ నిరోధకాలుగానూ పనిచేస్తాయి. ఫెరూలిక్‌ ఆమ్లం క్యాన్సర్‌ నిరోధకంగా పనిచేస్తూ రొమ్ము, కాలేయ క్యాన్సర్లతో పోరాడుతుంది. వూదారంగు మొక్కజొన్నల్లోని ఆంతోసైనిన్‌లు సైతం క్యాన్సర్‌ కారకాలను అడ్డుకుంటాయి. ఆల్జీమర్స్‌, మధుమేహం, బీపీ, హృద్రోగాలనూ నివారిస్తాయని తాజా పరిశోధనలూ చెబుతున్నాయి.

English summary

Why is eating corn good during monsoon

Why is eating corn good during monsoon,Eating corn during monsoon has certain benefits. Know about these benefits here on Boldsky.
Subscribe Newsletter