Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
అలర్ట్ : మహిళలకు నిద్రతక్కువైతే, ఈ సమస్యలు తప్పవు!
నిద్ర మనిషి ఆరోగ్యాన్ని డిసైడ్ చేసే ఒక చర్య. ఈరోజుల్లో పనికి అలవాటు పడి నిద్రను నిర్లక్ష్యం చేస్తూ అనేక రకాల ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు చాలామంది.
పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలకు ఆధునిక యుగంలో నిద్ర బాగా కరువైంది. ఇంటి పనులు, ఆఫీసు పనులు చూసుకుంటూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోని మహిళల సంఖ్య ఎక్కువనే చెప్పాలి. కుటుంబం కోసం కార్యాలయాల్లో పని పూర్తి చేసుకుని.. ఇంట్లోనూ పనులు చక్కబెట్టుకుని నిద్రపోయేందుకు పదో, పదకొండో కావచ్చు. ఇక శరీరం అలసిపోయింది హాయిగా నిద్రపడుతుందిలే అనుకునే మహిళలు కంటిపై నిద్రలేకుండా బాధపడుతున్నారు.

ఒత్తిడి, ఆందోళన కారణంగా పడుకున్న వెంటనే మహిళలు నిద్రలోకి జారుకోవట్లేదు. భర్త, పిల్లలు, ఆర్థిక పరిస్థితి, కార్యాలయ ఒత్తిడి వంటి ఇతరత్రా సమస్యలన్నీ నిద్రించేందుకు ముందు వారి కంటి ముందు నిలబడితే.. ఇక నిద్రలేమి సమస్య వేధించక మానట్లేదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ విషయం పరిశోధనల్లోనూ తేలిందని చెప్తున్నారు. నిద్రలేమి సమస్య పురుషుల కంటే స్త్రీలలోనే ఎక్కువని పరిశోధకులు చెప్తున్నారు.
నిద్ర మనిషి ఆరోగ్యాన్ని డిసైడ్ చేసే ఒక చర్య. ఈరోజుల్లో పనికి అలవాటు పడి నిద్రను నిర్లక్ష్యం చేస్తూ అనేక రకాల ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు చాలామంది. అయితే.. పురుషులు, స్త్రీల నిద్ర విషయానికొస్తే.. మగవారి కంటే ఆడవారికి 20 నిమిషాల నిద్ర అదనంగా అవసరమట. పిల్లలకు, వృద్ధులకు 10 గంటలు, యువకులు, మధ్యవయసు వారికి 8 గంటల నిద్ర కనీసం అవసరం. కానీ.. స్త్రీ, పురుషుల నిద్ర సమయాల విషయంలో మాత్రం ఇది కాస్త భిన్నం. పురుషుల కంటే స్త్రీలు రోజుకు 20 నిమిషాలు అదనంగా నిద్రించాలట. లేదంటే కొన్ని సమస్యలు తప్పవు అంటున్నారు పరిశోధకులు. అలాగే స్త్రీలలో నిద్రలేమికి కొన్ని రీజన్స్ ఈ క్రింది విధంగా..

రీజన్ #1 :
పురుషుల మెదడు కన్నా స్త్రీల మెదడు ఎక్కువ విషయాల గురించి ఆలోచిస్తుందట. పనులను వేగంగా, పక్కాగా చేయడంలో ఆడవారి మెదడు కంటే పురుషుల మెదడు వెనుకబడే ఉంటుందట. మల్టీటాస్కింగ్‌లో పురుషుల కంటే మహిళలే టాప్ అనే విషయం గతంలో చాలా సర్వేలు, అధ్యయనాలు నిరూపించాయి. మగవారికంటే ఎక్కువ ఆలోచించే మహిళలు కాస్త ఎక్కువ సేపు నిద్రించాలని చెప్తున్నారు ఆరోగ్య శాస్త్రవేత్తలు.

రీజన్ #2 :
మహిళల్లో నిద్రలేమి సమస్యకు మోనోపాజ్ ఒక కారణం. వీటికి తోడు హార్మోన్లలో తేడాలు, రాత్రుల్లో చెమటలు పట్టడం, వేడి ఆవిర్లు వల్ల నిద్రను పాడు చేస్తుంది.

రీజన్ # 3 :
టీనేజర్స్, కౌమార దశలో స్త్రీ శరీరంలో అనేక మార్పులు జరగడం, హార్మోనుల అసమతుల్యతల వల్ల నిద్రలేమి సమస్యలకు దారితీస్తుంది.

రీజన్ #4 :
అలసట, మతిమరుపు, ఆందోళన, తదితర ఒత్తిడిని మానవుల నుంచి దూరం చేయడానికి ఈ నిద్ర ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మహిళలు నిద్రలేమితో బాధపడుతున్నందున ప్రతిరోజు రాత్రిపూట కనీసం ఏడు గంటల సమయం నిద్ర అవసరం అని సర్వేలో తెలిసింది. లేకుంటే కళ్లు అలసిపోయి, శరీరారోగ్యం బాధిస్తుందని ఓ సర్వేలో వెల్లడించారు.

రీజన్ #5 :
మహిళలు ఫైబ్రోమైయల్గియా, డిప్రెషన్ వల్ల నిద్రలేమి సమస్యలను ఎదుర్కొంటున్నారు. అలాగే పాలిసిస్టిక్ సిండ్రోమ్ వంటి సమస్యల వల్ల నిద్రలేమి, కలత నిద్ర సమస్యలను ఎదుర్కొంటారు.

రీజన్ # 6 :
కొన్ని పరిశోధనల ప్రకారం, మహిళలు రెస్ట్ లెస్ లెగ్ సిండ్రోమ్ అనే డిజార్డర్ వల్ల నిద్రలో కలత ఏర్పడుతుంది.

రీజన్ # 7:
ప్రెగ్నెన్సీ వల్ల కూడా నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో మానసిక, భావోద్వేగాల మార్పుల వల్ల నిద్రకు భంగం కలుగుతుంది.

జన్ # 8:
టైప్ 2 డయాబెటిస్, హార్ట్ డిసీజెస్ తో ఉన్న వారు కూడా నిద్రలేమి సమస్యలు ఎదుర్కొంటారు

రీజన్ # 9:
మహిళలకి ప్రతిరోజు ఏడు గంటల సమయం నిద్ర చాలా అవసరం, లేకుంటే వాళ్ల కళ్లు అలసి శరీరాన్ని బాధిస్తుంది. అయితే ఇది పురుషులకు చెందదు. కనీస నిద్ర తక్కువైతే వయసులోనే మరణానికి కూడా దారితీసే అవకాశం ఉంది.

రీజన్ # 10 :
ప్రతిరోజు రాత్రి ఏడు గంటల సమయం నిద్రపోయే మహిళలలో పోలిస్తే, ఐదు గంటలు లేదా అంతకంటే తక్కువ సమయం నిద్రపోయే మహిళలకు అధిక రక్తపోటు, గుండె సంబంధమైన వ్యాధులు వచ్చేందుకు రెండు వంతులు ఎక్కువ అవకాశం ఉంది. సరిపడనంత నిద్రలేని మహిళలు, శారీరకంగాను, మానసికంగాను పురుషుల కంటే ఎక్కువ ప్రభావితమవుతున్నారు.



Click it and Unblock the Notifications
