మొబైల్ ఫోన్ ను జేబులో ఎందుకు పెట్టుకోకూడదు?

By: Deepti
Subscribe to Boldsky

మనలో ఏ ఒక్కరూ మొబైల్ ఫోన్ లేకుండా ఇంట్లోంచి బయటకి అడుగుపెట్టరు. ఒక్కరోజు మొబైల్ లేకుండా ఊహించటం కూడా అసాధ్యం.

ప్రస్తుత అధ్యయనాల ప్రకారం మొబైల్ ఫోన్లతో రోజంతా గడపటం ఎంతవరకూ శ్రేయస్కరమో ఇంకా పూర్తిగా నిర్ధారణ కాలేదు.

రాత్రుల్లో మొబైల్ ఫోన్ వాడకూడదనడానికి ఖచ్చితమైన రీజన్స్

మొబైల్ నుంచి వచ్చే రేడియేషన్ గురించి ఇంకా పూర్తిగా పరిశోధన జరగాలి. ప్రస్తుతం, ఆరోగ్యనిపుణులు అనేదేమంటే మొబైల్ ఫోన్ ను షర్టు లేదా పాంటు జేబుల్లో పెట్టుకుని తిరగడం మంచిది కాదు అని. ఈ కింద మరికొన్ని వాస్తవాలు చదవండి.

#1

#1

పాంటు జేబులో మొబైల్ ఫోన్ పెట్టుకోవడం వల్ల మగవారిలో సంతానోత్పత్తి సామర్థ్యంపై ప్రభావం పడుతుంది.

#2

#2

మొబైల్ ఫోన్ల నుండి వచ్చే రేడియేషన్ వల్ల వీర్యకణాల సంఖ్య, వాటి కదలిక తగ్గుతుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగి, డిఎన్ ఎ కూడా పాడవ్వచ్చు.

#3

#3

మరొక అధ్యయనం ప్రకారం మగవారు ఎక్కువసేపు మొబైల్ ఫోన్లను వాడితే అంగస్థంబన సమస్యలకు గురవుతారు.

#4

#4

సెల్ ఫోన్లు షర్టు జేబుల్లో కూడా సురక్షితం కాదు. కాన్సర్ రిస్క్ ను పెంచుతాయి.

#5

#5

మొబైల్ ఫోన్ల వల్ల ప్రమాదం వాటి సిగ్నళ్ళ స్వభావం వల్ల కలుగుతుంది. మొబైల్ ఫోన్లు రేడియో తరంగాలను ( నాన్ ఐయోనైజింగ్ రేడియేషన్ ) యాంటెన్నా ద్వారా విడుదల చేస్తాయి. మీరు మొబైల్ ను శరీరానికి దగ్గరగా పెట్టుకుని వాడితే, కణజాలాలు ఆ శక్తిని పీల్చుకోవచ్చు.

#6

#6

మొబైల్ ఫోన్లు సిగ్నళ్ళను పంపిస్తాయి, గ్రహిస్తాయి కూడా. ఈ సిగ్నల్స్ వెంటనే మీ కణాలను పాడుచేయకపోయినా, ఎక్కువసేపు వాడితే వాటిని వేడెక్కించగలవు.

#7

#7

ఇతర కారణాలైన కణాల సంఖ్య పెరగటం లేదా తగ్గటం వంటివి మీరు ఎంతసేపు కాల్స్ లో మాట్లాడారు, ఎంత దగ్గరగా దాన్ని మీ దగ్గర ఉంచుకున్నారు అన్నవాటిపై ఆధారపడుతుంది.

మొబైల్ ఫోన్లను నియంత్రించడం సాధ్యం కాకపోయినా, మీ జేబుల్లో తీసుకెళ్ళకుండా కనీసం బ్యాగ్ లేదా చేతిలో పట్టుకుతిరిగి రిస్క్ తగ్గించుకోండి.

English summary

Why You Shouldn't Put Mobile Phone In Pocket

Are you wondering where to put your phone? Well, keep it in your bag or hold it in your hand to minimise the risk. Read this!
Story first published: Sunday, July 9, 2017, 9:00 [IST]
Subscribe Newsletter