ఈ అలవాట్లను గనుక మీరు పాటిస్తున్నట్లైతే మీకు ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుంది

Posted By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ వ్యాధి చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోంది. గణాంకాల ప్రకారం వక్షోజాల క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్,పెద్దప్రేగు క్యాన్సర్, మూత్రాశయం క్యాన్సర్, మూత్రపిండాల క్యాన్సర్, చర్మ క్యాన్సర్,గర్భకోశపు క్యాన్సర్ మరియు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లు 2016 లో అత్యధికంగా నమోదయ్యాయి.

2014 నాటికి క్యాన్సర్ నిర్ధారణలు చేసుకోనివారి సంఖ్య 14.5 మిలియన్ల ఉండగా 2024 నాటికి ఏ సంఖ్య 19 మిలియన్ల చేరుతుందని అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ వల్ల ఎంతో మంది మరణిస్తున్నారు మరియు రానున్న ఇరవై సంవత్సరాల్లో కొత్తగా క్యాన్సర్ భాదితులు 22 మిలియన్ల అవుతారని అంచనా వేస్తున్నారు. 2015 గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా మరణించిన వ్యక్తుల్లో క్యాన్సర్ కి రెండవ స్థానం దక్కింది. ఆ సంవత్సరం 8.8 మిలియన్ మరణాలు క్యాన్సర్ వల్ల సంభవించాయి. చాలా వరకు క్యాన్సర్ సోకడానికి కారణం ప్రవర్తన మరియు ఆహార అలవాట్లల్లో ఉండే ప్రమాదకరమైన ధోరణి. వీటిల్లో, సరైన బాడీ మాస్ ఇండెక్స్ అంటే సరైన పద్దతిలో శరీరాన్ని నిర్వహించలేకపోవడం, పళ్ళు మరియు కూరగాయలు తక్కువగా తినడం, శారీరిక వ్యాయామం అస్సలు చేయకపోవడం, మోతాదుకు మించి మద్యం మరియు పొగాకు సేవించడం క్యాన్సర్ కు కారకులుగా చెబుతున్నారు

ప్రమాదకరమైన అలవాట్లే వల్ల క్యాన్సర్ కి కారణం అని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకోబోతున్నాం.

1. ఎయిర్ ఫ్రెషనర్లు :

1. ఎయిర్ ఫ్రెషనర్లు :

పూర్వకాలంలో ఇంటిని సువాసనమయంగా ఉంచుకోవడానికి ఉపయోగించే పద్ధతులన్నీ పక్కన పెట్టేసి, వాటి స్థానంలో ఇంటిలో సువాసనలు వెదజల్లడానికి ప్రతి ఒక్కరు తమ ఇంట్లో ఎయిర్ ఫ్రెషనర్ వాడుతున్నారు. వీటి వల్ల గాలిలో నాణ్యత ఏమాత్రం పెరగదు . కేవలం చెడు వాసనలకు ఇది ఒక ముసుగు మాత్రమే. ఒక అబద్దపు వాసనను ముక్కుకు అందిస్తుంది. దీనిలో ప్రమాదకరమైన క్యాన్సర్ కారకాలు ఉన్నాయని. వీటిని ఎప్పుడైతే మీ చుట్టూ పిచికారీ చేస్తారో అప్పుడు అవి మీ ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించి మీకు క్యాన్సర్ వంటి హానికర వ్యాధులను సంక్రమించేలా చేస్తాయని హెచ్చరిస్తున్నారు.

2. మద్యం ఉత్పత్తులను సేవించడం :

2. మద్యం ఉత్పత్తులను సేవించడం :

మద్యాన్ని సేవించడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం అధికం అవుతుందట. ఒక అధ్యయనం ప్రకారం ఎవరైతే రోజుకు రెండుసార్లు మద్యం సేవిస్తారో వారిలో పెద్ద ప్రేగు క్యాన్సర్, పురీషనాళం క్యాన్సర్, ఆహార నాళము క్యాన్సర్ మరియు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. మద్యాన్ని సేవించడం వల్ల పొట్టలో హానికర ఆమ్లాలు విపరీతంగా విడుదలయి, ఆహార నాళము లేదా జీర్ణ నాళము మార్గాన్ని దెబ్బతీస్తాయి.

3. గర్భనిరోధక మాత్రలు :

3. గర్భనిరోధక మాత్రలు :

గర్భనిరోధక మాత్రలు వాడటం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ తో పాటు కాలేయ మరియు గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం అధికంగా ఉంది. అంతేకాకుండా పిల్లలు లేని స్త్రీలకు లేదా పిల్లలు పుట్టని స్త్రీలకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని చెబుతున్నారు.

4. క్యాండిల్స్ :

4. క్యాండిల్స్ :

ఈ మధ్యనే కొన్ని అధ్యయనాల ప్రకారం పెరఫిన్ మైనం కరగటం వల్ల విడుదలయ్యే పొగలో కార్సినోజెన్స్ మరియు ఇతర శిలాజ ఇంధ పదార్ధాలు కూడా వెలువడుతున్నాయని గుర్తించారు. మీరు గనుక తరచూ పెరఫిన్ మైనంతో తయారుచేయబడిన క్యాండిల్స్ వాడుతున్నట్లైతే లేదా అటువంటి ప్రదేశాలకు ఎప్పుడు వెళ్తున్నట్లయితే మీరు ప్రమాదం లో ఉన్నట్లు అర్ధం. వీటికి బదులుగా బీస్ మైనంతో తయారుచేసిన క్యాండిల్స్ వెలిగించడం మంచిదని అది మీ శరీరానికి ఎటువంటి హాని చేకుర్చదని చెబుతున్నారు.

5. కార్ ల నుండి వెలువడే పొగ :

5. కార్ ల నుండి వెలువడే పొగ :

వ్యక్తులు ఎవరైతే ఎక్కువగా డీజిల్ ఇంధనాల వాయువులను పీలుస్తుంటారో అటువంటి వారికి ఊపిరికి సంబంధించిన వ్యాధులు లేదా ఊపిరితిత్తుల క్యాన్సర్ తలెత్తే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఎందుకంటే డీజిల్ లేదా పెట్రోల్ మండించినప్పుడు విషపూరితమైన కార్బో మోనాక్సయిడ్ మరియు హైడ్రో కార్బన్ విడుదల అవుతాయి. వీటిలో బెంజిన్ వంటి విషపూరిత పదార్ధాలు ఎన్నో ఉంటాయి.

6. కాస్మెటిక్స్ :

6. కాస్మెటిక్స్ :

చాలామంది అందంగా కనపడటానికి కాస్మెటిక్స్ ని వాడుతుంటారు. కానీ, వాటిల్లో ఉండే రసాయనాలు ముఖాన్ని కడిగిన తర్వాత కూడా కొన్ని శరీరంలోనే ఉండిపోతాయి. సువాసనలు వెదజల్లడానికి కాస్మెటిక్స్ ఉత్పత్తుల్లో వాడే పదార్ధాలను ఆయా తయారీదారులు చాలా రహస్యంగా ఉంచుతారు. ఎవ్వరికి చెప్పారు. దీనిని బట్టి వారు ఎలాంటి హానికరమైన పదార్ధాలు వాడుతున్నారో మనం అర్ధం చేసుకోవచ్చు. కావున ఆర్గానిక్ కాస్మెటిక్స్ ని వాడటానికి మొగ్గుచూపనుంది. ఇలా చేయడం ద్వారా చర్మ సంబంధిత క్యాన్సర్ సోకకుండా అరికట్టవచ్చు.

7. కాల్చిన ఆహారం :

7. కాల్చిన ఆహారం :

సాధారణంగా చాలామంది గ్రిల్ చేసిన చేప, కోడి మరియు మాంసాన్ని తినడానికి ఇష్టపడుతుంటారు. ఇవి కొద్దిగా కాలి ఉంటాయి మరియు కొన్ని ప్రాంతాల్లో మరీ నల్లగా ఉంటాయి. దీని వల్ల ఒక రకమైన రుచి ఉండవచ్చు. కానీ, దీని వల్ల పొట్ట, పెద్ద ప్రేగు మరియు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లు సోకే ప్రమాదం ఎక్కువగా ఉందని గుర్తించారు.

8. తయారు చేసి నిల్వ ఉంచిన ఆహారం :

8. తయారు చేసి నిల్వ ఉంచిన ఆహారం :

తయారు చేసి నిల్వ ఉంచిన ఆహారం చాలా అనారోగ్యకరమని మరియు వీటిని లోహపు పదార్ధాలతో చేసి ప్లాస్టిక్ పూత ఉన్న వస్తువుల్లో ఈ ఆహారాన్ని భద్రపరుస్తారని వాటిల్లో విపరీతమైన హానికర రసాయనాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇలాంటి ఆహారాలు తీసుకోవడం వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతుంటుందని మరియు డి.ఎన్.ఏ లో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటాయని, దీని ఫలితంగా బ్రెస్ట్ క్యాన్సర్ సోకే అవకాశం ఉందని చెబుతున్నారు.

9. సోడా పానీయాలు :

9. సోడా పానీయాలు :

సోడా పానీయాల్లో కృత్రిమ చెక్కర పదార్ధాలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ తో పాటు ఇతర క్యాన్సర్ లు కూడా సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎన్నో అధ్యయనాలు చెబుతున్న విషయం ఏమిటంటే, సోడాతో చేసిన పానీయాలు తీసుకోవడం వల్ల మెదడులో కణితులు ఏర్పడతాయని మరియు మూత్రాశయం క్యాన్సర్ సోకే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

10. సన్ స్క్రీన్

10. సన్ స్క్రీన్

చర్మ క్యాన్సర్ రాకుండా ఉండటానికి మరియు చర్మానికి ఎటువంటి హాని కలగకుండా ఉండటానికి చాలామంది వ్యక్తులు సన్ స్క్రీన్ లు వాడుతుంటారు. ఇప్పుడు ఈ విషయం గనుక వింటే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకంటే సన్ స్క్రీన్ తయారీలో జింక్ ఆక్సైడ్ అనే ప్రమాదకరమైన రసాయనం వాడతారు. ఇది మన డి.ఎన్.ఏ కు విపరీతమైన నష్టాన్ని చేకూరుస్తుంది మరియు విపరీతంగా క్యాన్సర్ సోకడానికి ప్రేరేపిస్తుంది.

English summary

10 Dangerous Habits That Can Cause Cancer

10 Dangerous Habits That Can Cause Cancer,Cancer is the second leading cause of death globally and was responsible for 8.8 million deaths in the year 2015. Know about the dangerous habits that cause cancer.
Story first published: Tuesday, February 13, 2018, 15:40 [IST]