For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పీరియడ్స్ టైం లో ఈ పది ఫుడ్స్ ని అవాయిడ్ చేయాలి

మనలో చాలామంది అమ్మాయిలు సొగసైన స్ట్రెయిట్ హెయిర్ ఇష్టపడుతారు. స్ట్రెయిట్ హెయిర్ చూడటానికి సులభంగానే కనిపిస్తుంది దానికి సరైన సరైన జాగ్రత్త అవసరం.

|

నెలసరిలో ప్రతి మహిళ ఏదో ఒక రకమైన ఆరోగ్య సమస్యను ఎదుర్కునే తీరుతుంది. అందువలన, నెలసరి అంటేనే కాస్తంత చికాకుగా అనిపిస్తుంది. పీరియడ్స్ సమయంలో కొంతమందికి చక్కెర తినాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. అలాగే పీరియడ్స్ వలన కలిగే అసౌకర్యం వలన నిద్ర సరిగ్గా పట్టదు.

నొప్పి అలాగే కడుపుబ్బరం వంటివి నెలసరి వలన కలిగే అసౌకర్యాలు. పోషకాలు పుష్కలంగా లభించే ఆహారాలను తీసుకోవడం వలన వీటిని కొంతవరకు అరికట్టవచ్చు. అయితే, కప్ కేక్స్ మరియు పిజ్జాల వంటి జంక్ ఫుడ్స్ కి అలవాటు పడిన వారు మాత్రం పీరియడ్స్ లో తీవ్రమైన అసౌకర్యానికి గురికావచ్చు. వీటిలో శరీరానికి కావలసినంత పోషకాలు లభించకపోవడం వలన కోల్పోతున్న రక్తాన్ని పొందడం శరీరానికి కష్టతరమవుతుంది.

తప్పుడు పోషకాలు లభించటం వలన పీరియడ్స్ సమయంలో కండరాల నొప్పి, కడుపుబ్బరం, తలనొప్పి అలాగే జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. వీటివలన, మీరు శారీరకంగా అలాగే మానసికంగా బలహీనపడతారు.

కాబట్టి, అటువంటి ఆహారాలని మీరు పీరియడ్స్ సమయంలో అవాయిడ్ చేయాలి. పీరియడ్స్ సమయంలో మీరు అవాయిడ్ చేయవలసిన ఫుడ్స్ గురించి ఈ రోజు మీకు వివరిస్తాము.

ప్రాసెస్డ్ ఫుడ్స్

ప్రాసెస్డ్ ఫుడ్స్

పీరియడ్స్ సమయంలో కడుపుబ్బరమనేది సర్వసాధారణం. ప్రొసెస్డ్ ఫుడ్స్ ని తీసుకోవడం వలన ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. ప్రొసెస్డ్ ఫుడ్స్ ని తీసుకోవడం వలన ఉదరంలో వాటర్ రిటెన్షన్ ఏర్పడి కడుపు ఉబ్బిన భావన కలుగుతుంది. కాబట్టి, తీపి ఆహారపదార్థాలని అలాగే గ్రీజీ ఫుడ్స్ ని అవాయిడ్ చేయండి. వీటిని అవాయిడ్ చేయడం వలన కలిగే లాభాలను మీరు గమనిస్తే ఆశ్చర్యపోతారు.

రెడ్ మీట్

రెడ్ మీట్

రెడ్ మీట్ వంటి ఫుడ్స్ లో శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ అధికమొత్తంలో లభిస్తాయి. వీటిని నెలసరి సమయంలో అవాయిడ్ చేయాలి. లేదంటే, మొటిమలు, కడుపుబ్బరం, పొత్తికడుపు నొప్పి వంటి సమస్యల బారిన పడే ప్రమాదం ఉంది. మాంసాన్ని తినాలని మీకనిపిస్తే, ఆయిలీ ఫిష్ లేదా స్కిన్ లెస్ చికెన్ వంటి లీనర్ మీట్స్ ని ప్రయత్నించవచ్చు.

ఆల్కహాల్

ఆల్కహాల్

నెలసరి సమయంలో ఆల్కహాల్ కి దూరంగా ఉండండి. కొద్దిమొత్తంలో తీసుకుంటే ఇబ్బంది లేదనుకుంటే మీ అభిప్రాయం తప్పు. పీరియడ్స్ సమయంలో ఆల్కహాల్ ని తీసుకుంటే నెలసరి సమస్యలు మరింత ఎక్కువవుతాయి.

డైరీ ప్రాడక్ట్స్

డైరీ ప్రాడక్ట్స్

పాలు, వెన్న, జున్ను వంటి వాటిని నెలసరి సమయంలో అవాయిడ్ చేయాలి. ఇది, మీకు ఆశ్చర్యకరంగా అనిపించవచ్చు. అయితే, వీటిని అవాయిడ్ చేయడమే మంచిది. వీటిలో నుండే అరకిడోనిక్ యాసిడ్ అనేది నెలసరి నొప్పులను పెంచుతుంది. వీటికి బదులుగా మజ్జిగను తీసుకుంటే నెలసరి నొప్పులు తగ్గుముఖం పడతాయి.

కెఫైన్

కెఫైన్

కాఫీ వంటి కేఫైనేటెడ్ పానీయాలలో కెఫైన్ అధికమోతాదులో లభిస్తుంది. కెఫైన్ వలన రక్తపోటు అధికమవుతుంది. తద్వారా, ఆందోళన, డీహైడ్రేషన్ వంటివి కలిగి మీకు నిద్రలేమి సమస్య తలెత్తవచ్చు. వాటికి బదులుగా హెర్బల్ టీని తీసుకోవడం మంచిది.

ఫ్యాటీ ఫుడ్స్

ఫ్యాటీ ఫుడ్స్

బర్గర్స్, చిప్స్, ఫ్రైస్ వంటి ఫుడ్స్ ని నెలసరి సమయంలో అవాయిడ్ చేయాలి. వీటిని తీసుకుంటే నెలసరి నొప్పులు అధికమవుతాయి. తద్వారా, మీకు చికాకు ఎక్కువవుతుంది. తప్పుడు ఆహారపదార్థాలు తీసుకోవడం వలన డీహైడ్రేషన్ సమస్య ఎదురవుతుంది.

రిఫైన్డ్ గ్రైన్స్

రిఫైన్డ్ గ్రైన్స్

బ్రెడ్, పిజ్జా, సెరల్స్, టోర్టిల్లా వంటి ఫుడ్స్ ని నెలసరి సమయంలో అవాయిడ్ చేయాలి. వీటివలన బ్లోటింగ్ తో పాటు మలబద్దకం సమస్య తలెత్తుతుంది. వీటిబదులు తృణధాన్యాలను తీసుకోవడం మేలు. వీటిలోనుండే లో జిఐ ఇండెక్స్ అనేది జీర్ణవ్యవస్థను ట్రాక్ లో పెట్టి ఆకలి బాధలను అరికడుతుంది.

సాల్టీ ఫుడ్స్

సాల్టీ ఫుడ్స్

క్యాన్డ్ సూప్స్, బేకాన్, చిప్స్ వంటి సాల్టీ ఫుడ్స్ ను కూడా నెలసరి సమయంలో అవాయిడ్ చేయాలి. వీటిలో ఉప్పు శాతం అధికం. నెలసరికి కారణమయ్యే హార్మోన్ వలన వాటర్ రిటెన్షన్ ఏర్పడుతుంది. సాల్టీ ఫుడ్స్ ను తీసుకోవడం వలన బ్లోటింగ్ మరింత తీవ్రతరం అవుతుంది.

షుగరీ ఫుడ్స్

షుగరీ ఫుడ్స్

నెలసరి సమయంలో హార్మోన్స్ లో మార్పులు సంభవిస్తాయి. అందువలన బ్లడ్ షుగర్ లెవల్స్ అస్థిరమవుతాయి. అందువలన, నెలసరి సమయంలో చాలా మంది మహిళలకు తీపిపదార్థాలను తీసుకోవాలని అనిపిస్తుంది. షుగరీ ఫుడ్స్ ని తీసుకోవడం వలన బ్లడ్ షుగర్ స్థాయిలలో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. తద్వారా, మూడ్ స్వింగ్స్ తో పాటు ఒత్తిడి వేధిస్తుంది. కాబట్టి, వీటి బదులు ఫైబర్ ఎక్కువగా లభించే పండ్లను సలాడ్స్ రూపంలో తీసుకుని వాటిపై పెరుగుని అద్దుకుని తింటే నెలసరి సమస్యలు తగ్గుముఖం పడతాయి.

స్పైసీ ఫుడ్స్

స్పైసీ ఫుడ్స్

నెలసరి సమయంలో స్పైసీ ఫుడ్స్ ని తీసుకోవడం వలన హాట్ ఫ్లాషెస్ సమస్య ఎదురవుతుంది. కొన్ని సార్లు, నెలసరి వాయిదా పడటం జరుగుతుంది. అలాగే చర్మంపై మొటిమలతో పాటు ర్యాషెస్ కూడా వస్తాయి. స్పైసీ ఫుడ్స్ ని తీసుకోవడం వలన స్టమక్ లైనింగ్ తో పాటు ఇంటస్టైన్స్ దెబ్బతింటాయి. అందువలన, ఎసిడిటీతో పాటు నెలసరి సమస్యలు మరింత తీవ్రమవుతాయి.

English summary

10 Foods Not To Eat During Periods

The awful cramps and uncomfortable bloating during menstruation can be reduced if you eat nutrient-dense foods. But, if you gorge on those sinful cupcakes and pizzas, it might make your periods worse. Getting the wrong nutrition during periods will lead to muscle pain, uncomfortable bloating, headaches and inconsistent digestion. This can put you off gear psychologically and physically.
Desktop Bottom Promotion