కిడ్నీ స్టోన్స్ తో బాధపడేవారు ఈ 10 ఫుడ్స్ ని అవాయిడ్ చేయాలి

Subscribe to Boldsky

కిడ్నీ అనేది శరీరంలోని ముఖ్యమైన అవయవం. ఈ మధ్యకాలంలో కిడ్నీ సమస్యలతో ఎక్కువమంది అనేక ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. కిడ్నీ అనేది ఫిల్టర్ లా పనిచేస్తుంది. శరీరంలోని టాక్సిన్స్ ను అలాగే అదనపు నీటిని యూరినేషన్ ద్వారా బయటికి పంపిస్తుంది.

అయితే, ఈ మధ్య కాలంలో ఎక్కువమంది కిడ్నీ స్టోన్స్ సమస్యతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. యూరిన్ లోనున్న క్రిస్టల్స్ పేరుకుపోవడం ద్వారా గట్టిగా రాళ్ళల్లా ఏర్పడతాయి. ఇవి యూరినరీ ట్రాక్ట్ పాత్ కి బ్లాకేజ్ ని క్రియేట్ చేయడం ద్వారా మీకు నొప్పిని కలిగిస్తాయి.

కేల్షియం ఫాస్ఫేట్, సిస్టైన్, కేల్షియం ఆక్సలేట్ మరియు యూరిక్ యాసిడ్ వంటివిగా కిడ్నీ స్టోన్స్ వర్గీకరించబడ్డాయి. వీటన్నిటిలో, కేల్షియం ఆక్సలేట్స్ కిడ్నీ స్టోన్స్ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది.

10 Foods To Avoid For Kidney Stones

కాబట్టి, కిడ్నీ స్టోన్స్ సమస్యతో మీరు ఇబ్బంది పడుతున్నట్టయినా అలాగే ఇంతకు ముందు కిడ్నీకి సంబంధించిన ఇబ్బందులను ఎదుర్కొన్నట్లయినా, కొన్ని రకాల ఆహారపదార్థాలను అవాయిడ్ చేయడం ద్వారా కిడ్నీ స్టోన్స్ ఫార్మేషన్ ను అరికట్టవచ్చు. అలాగే, కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఒకవేళ, ఈ ఆహారాలను మీరు తీసుకున్నట్లైతే, కిడ్నీ స్టోన్స్ సమస్య మళ్ళీ తలెత్తకుండా మీరు తగిన మెజర్స్ తీసుకోవాలి.

కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, లో ఫ్యాట్ డైరీ ప్రాడక్ట్స్, పౌల్ట్రీ, బీన్స్, ఫిష్, నట్స్ అలాగే సీడ్స్ వంటి పదార్థాలని మీ డైట్ లో భాగంగా చేసుకోవాలి. అదే సమయంలో, మీ డైట్ లో సోడియం అలాగే చక్కెర శాతం తక్కువగా ఉండేలా చూసుకోవాలి .

ఇప్పుడు, ఏ ఫుడ్స్ ను అవాయిడ్ చేయడం ద్వారా కిడ్నీ స్టోన్స్ ఫార్మేషన్ ని అరికట్టవచ్చో తెలుసుకుందాం.

1. కెఫైన్/సోడా:

1. కెఫైన్/సోడా:

కిడ్నీ స్టోన్ సమస్య మీకు తలెత్తినట్లయితే మీరు ఎక్కువగా ద్రవాలను తీసుకోవలసి వస్తుంది. అయితే, కెఫైన్ ను తీసుకునే మోతాదును మాత్రం పరిమితులలో ఉంచండి. కాఫీ, టీ మరియు కోల్డ్ డ్రింక్స్ వంటివి ఒక రోజులో రెండు కప్పుల కంటే ఎక్కువ తీసుకోకూడదు. ఎక్కువ కెఫైన్ ని తీసుకోవడం ద్వారా శరీరం డిహైడ్రేటెడ్ గా మారుతుంది.

2. సోడియం రిచ్ ఫుడ్స్:

2. సోడియం రిచ్ ఫుడ్స్:

సోడియం ఇన్టేక్ ను తగ్గించుకోండి. అలాగే, ప్రొసెస్డ్ మరియు క్యాన్డ్ ఫుడ్స్ ను పూర్తిగా అవాయిడ్ చేయాలి. వీటిలో ప్రిజర్వేషన్ కోసం ఉప్పుని ఎక్కువ మోతాదులో వాడతారు. అలాగే, తక్కువ ఉప్పుతో ఆహారాలను తీసుకోండి.

3. ప్రోటీన్ బేస్డ్ ఫుడ్స్ ని తగిన మోతాదులో తీసుకోండి:

3. ప్రోటీన్ బేస్డ్ ఫుడ్స్ ని తగిన మోతాదులో తీసుకోండి:

మీట్, ఫిష్ వంటి ప్రోటీన్ బేస్డ్ ఫుడ్స్ ని తీసుకోవడం మంచిది. అయితే, వీటిని మోడరేట్ క్వాన్టిటీలోనే తీసుకోవాలి. అలాగే, తక్కువ నూనెను ఉపయోగించి కుక్ చేయబడిన లీన్ మీట్ ని తీసుకోవాలి. అలాగే, బాయిల్ చేయబడిన లీన్ మీట్ అయితే మరీ మంచిది. స్పైసీ ఫుడ్ ని తీసుకోవడం తగ్గించుకోవాలి.

4. హై ఫ్యాట్ ఫుడ్స్:

4. హై ఫ్యాట్ ఫుడ్స్:

మీ డైట్ లో హై ఫ్యాట్ ఫుడ్స్ కి స్థానం ఇవ్వకండి. లో ఫ్యాట్ డైరీ ప్రాడక్ట్స్ ని మీరు తీసుకోవచ్చు. బ్రేక్ ఫాస్ట్ లో స్కీమ్డ్ మిల్క్ ని తీసుకోవచ్చు. హై ఫ్యాట్ ఫుడ్స్ కి మాత్రం దూరంగా ఉండాలి. ఎందుకంటే, వీటిద్వారా శరీరంలోకి ప్రవేశించే ఫ్యాట్ శరీరంలో పేరుకుపోయి ప్రాణానికే ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది.

5. కేల్షియం ఫుడ్స్:

5. కేల్షియం ఫుడ్స్:

మీరు కిడ్నీ స్టోన్ తో బాధపడుతున్నట్టయితే కేల్షియంతో పాటు విటమిన్ డి కల్గిన ఫుడ్స్ ని మీరు అవాయిడ్ చేయడం మంచిది.అలాగే, యాంటాసిడ్స్ స్థాయిని కూడా మీరు గమనించాలి. వీటిలో కేల్షియం అధికంగా లభిస్తుంది. కేల్షియం కలిగిన ఫుడ్స్ ని మీరు తీసుకోవచ్చు. అయితే, వీటిలో కేల్షియం చాలా తక్కువ మోతాదులో లభించాలి. అలాగే, విటమిన్ డి లేదా ఫిష్ ఆయిల్ ని తీసుకునేముందు మీ డాక్టర్ ని సంప్రదించాలి. ఇవి, కిడ్నీ స్టోన్స్ తో ఇబ్బంది పడే మీ శరీరానికి మరింత కీడు చేస్తాయి.

6. ఆక్సలేట్ రిచ్ ఫుడ్స్:

6. ఆక్సలేట్ రిచ్ ఫుడ్స్:

ఒకవేళ మీరు కేల్షియం ఆక్సలేట్ కిడ్నీ స్టోన్ తో మీరు ఇబ్బందిపడుతూ ఉంటే ఆక్సలేట్ కలిగి ఉన్న ఆహారాలను మీరు తప్పక అవాయిడ్ చేయాలి. టీ, కాఫీ, బీట్, స్క్వాష్, స్వీట్ పొటాటో, స్పినాచ్, టమాటో సూప్, క్యాన్డ్ ఫ్రూట్ సలాడ్, రుబర్బ్, స్ట్రాబెర్రీలను అవాయిడ్ చేయాలి. అలాగే, చాకోలెట్స్, టోఫు, నట్స్ మరియు గ్రిట్స్ ని తీసుకోవడం కూడా మానివేయాలి.

యూరిక్ యాసిడ్ స్టోన్స్ తో ఇబ్బందిపడుతున్నారని మీ డాక్టర్ నిర్ధారిస్తే ఈ కింద ఫుడ్స్ ని మీరు అవాయిడ్ చేయాలి.

7. ఆల్కహాల్:

7. ఆల్కహాల్:

కిడ్నీ స్టోన్స్ ఫార్మేషన్ కి అలాగే ఆల్కహాల్ కి ప్రత్యక్షంగా ఎటువంటి కనెక్షన్ లేకపోయినా ఆల్కహాల్ అనేది కిడ్నీ స్టోన్స్ ఫార్మేషన్ రిస్క్ తలెత్తే ప్రమాదాన్ని పెంచేలా ప్రేరేపిస్తుంది తెలుస్తోంది. ఇందులో, ప్యూరిన్ కాంపోనెంట్ కలదు. ఇది యూరిక్ యాసిడ్ ఫార్మేషన్ కు దారితీస్తుంది. ఆల్కహాల్ ను సేవించడం ద్వారా కిడ్నీ డేమేజ్ జరిగే ప్రమాదం తలెత్తుతుంది.

8. ఆంకోవీస్:

8. ఆంకోవీస్:

ఆంకోవీస్ అనే ఫ్యాటీ ఫిష్ అనేది అత్యంత రుచికరంగా ఉన్నా ఈ ఫిష్ ను తీసుకోవడం ద్వారా కిడ్నీ స్టోన్స్ సమస్యను గురయ్యే ప్రమాదం ఉంది. అందువలన, కిడ్నీ స్టోన్స్ తో బాధపడే వారు ఈ ఫిష్ ని దూరంగా ఉంచడం మంచిది.

9. ఆస్పరాగస్:

9. ఆస్పరాగస్:

దీనిని డైయూరేటిక్ గా వాడతారు. కిడ్నీ స్టోన్స్ తో బాధపడే వారు దీనికి దూరంగా ఉండటం మంచిది.

10. బేకింగ్ లేదా బ్రేవెర్స్ ఈస్ట్

10. బేకింగ్ లేదా బ్రేవెర్స్ ఈస్ట్

యూరిక్ యాసిడ్ స్టోన్ తో మీరు బాధపడుతున్నట్లైతే, బేకింగ్ లేదా బ్రేవేర్స్ ఈస్ట్ ను అవాయిడ్ చేయడం మంచిది. ఇందులో ప్యూరిన్ కాంపౌండ్ అధికంగా లభిస్తుంది.

వీటితో పాటు, కిడ్నీ స్టోన్స్ తో బాధపడే వారు లెజ్యుమ్స్, కాలీఫ్లవర్, కిడ్నీ మరియు లివర్ వంటి ఆర్గాన్ మీట్స్, మష్రూమ్, ఆలివ్ ఆయిల్, సమర్ధింస్ వంటి ఆహారాలకు కూడా దూరంగా ఉండటం మంచిది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    10 Foods To Avoid For Kidney Stones

    Kidney stones have been classified as calcium phosphate, cystine, calcium oxalate, and uric acid. Out of these calcium oxalates are mostly seen in human beings. So if you had been suffering from kidney stones in the past or facing any kidney ailment, which can lead to the formation of stones, certain food items are there to avoid its occurrence.
    Story first published: Friday, February 9, 2018, 16:30 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more