స్కిన్ లెస్ చికెన్ బ్రెస్ట్ తినడం వల్ల కలిగే 10 ఆరోగ్య లాభాలు ఇవే

By R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అతి ఇష్టంగా తినే ప్రముఖ మాంసాహారాల్లో కోడి మాంసానికి మొదటిస్థానం లభిస్తుందంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా భారత దేశంలో చాలా మంది మేక లేదా గొర్రె మాంసాన్ని తినడానికంటే కూడా కోడి మాంసాన్ని తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు మరియు ఆసక్తి చూపిస్తారు.

కోడిలోని ఒక భాగాన్ని చికెన్ బ్రెస్ట్ అని అంటారు. దీనిని ఎంతోమంది ఇష్టంగా ఆరగిస్తారు. చికెన్ బ్రెస్ట్ పైన ఎటువంటి చర్మం ఉండదు మరియు అందులో ఎముకలు కూడా ఉండవు. ప్రోటీన్లు అత్యధికంగా ఇందులో లభిస్తాయి. దీనిని తినడటం వల్ల శరీర బరువును ఖచ్చితత్వంతో సరైన పద్దతిలో నిర్వహించవచ్చు.

10 Health Benefits Of Skinless Chicken Breast

సగం చికెన్ బ్రెస్ట్ లో 142 కేలరీల శక్తి, 3 గ్రాముల కొవ్వు ఉంటాయి. వీటికి తోడు విటమిన్ E, విటమిన్ B6 మరియు విటమిన్ B12 వంటి ఎన్నో రకాల పోషకాలు అదనంగా మన శరీరానికి లభిస్తాయి. దీనికి తోడు చికెన్ బ్రెస్ట్ లో ఇనుము, క్యాల్షియం, జింక్ మరియు పొటాషియం వంటి ఖనిజాలు కూడా చిన్న మోతాదులో ఉంటాయి.

చికెన్ బ్రెస్ట్ భాగాన్ని బాగా వండుకొని తినొచ్చు లేదా నిప్పుల పై కాల్చుకొని తినొచ్చు లేదా బేకింగ్, గ్రిల్లింగ్ పద్ధతుల్లో తినవచ్చు. చికెన్ బ్రెస్ట్ తినడం వల్ల కలిగే వివిధ రకాల లాభాల గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం.

1 పోషకపదార్ధాలు అత్యధికంగా లభిస్తాయి :

1 పోషకపదార్ధాలు అత్యధికంగా లభిస్తాయి :

చికెన్ బ్రెస్ట్ లో పోషకపదార్ధాలు అత్యధికంగా లభిస్తాయి. ప్రతి 100 గ్రాముల చికెన్ బ్రెస్ట్ లో 18 గ్రాముల పోషకపదార్ధాలు ఉంటాయి. పోషకపదార్ధాలు తీసుకోవడం వల్ల మన శరీర కండరాలు దృఢంగా తయారవుతాయి మరియు కండరాల్ల శక్తిని కోల్పోకుండా అరికడుతుంది. ప్రతి రోజు ఒక గ్రాము పోషకపదార్ధం ఖచ్చితంగా తీసుకోవాలని వైద్యులు చెబుతారు. కాబట్టి చికెన్ బ్రెస్ట్ తినడం వల్ల ఈ లోటు ని భర్తీ చేయవచ్చు.

2 ఖనిజాలు మరియు విటమిన్లు :

2 ఖనిజాలు మరియు విటమిన్లు :

చికెన్ బ్రెస్ట్ లో ఖనిజాలు మరియు విటమిన్లు కూడా అధికంగా లభిస్తాయి. ఇందులో విటమిన్ B అధికంగా లభిస్తుంది. దీని వల్ల కంటి చూపుని మసకబారిచే శుక్లము ( కేటరాక్ట్ ) మరియు వివిధరకాల చర్మానికి సంబంధించిన సమస్యలు తలెత్తకుండా అరికడుతుంది. శరీరంలో ఉన్న బలహీనతను పోగొడుతుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, జీర్ణ వ్యవస్థ సరైన రీతిలో పనిచేసేలా చూస్తుంది, గుండె సంబంధిత సమస్యలను అరికడుతుంది మరియు కొవ్వు శాతం అధికంగా పెరగకుండా చేస్తుంది.

3. బరువు తగ్గిస్తుంది :

3. బరువు తగ్గిస్తుంది :

శరీర బరువు తగ్గాలనుకున్నవారు చికెన్ బ్రెస్ట్ ని ఆహారంగా తీసుకోవడం చాలా మంచిది. అందుచేతనే చాలామంది పోషకాహార నిపుణులు బరువుని తగ్గించడం కోసమై చికెన్ బ్రెస్ట్ ని తీసుకోమని సలహా ఇస్తుంటారు. బరువు తగ్గడం కోసమై సాధారణంగా అధిక పోషకపదార్థాలు ఉన్న ఆహారాన్ని స్వీకరించమని చెబుతుంటారు. ఇది బరువు తగ్గడం పై మంచి ప్రభావం చూపిస్తుంది. అందుచేత చికెన్ బ్రెస్ట్ లో అధిక పోషకపదార్థాలు ఉండటం వల్ల దానిని స్వీకరిస్తే మీ పొట్ట ఎప్పుడు నిండుగానే ఉంటుంది.

4 రక్తపోటు :

4 రక్తపోటు :

చికెన్ బ్రెస్ట్ రక్తపోటుని నియంత్రిస్తుందనే విషయం మీకు తెలుసా ? కానీ ఇది నిజం. చికెన్ బ్రెస్ట్ స్వీకరించడం ద్వారా రక్తపోటు ని అది నియంత్రిస్తుందని రుజువైంది. ఏ వ్యక్తులైతే హైపర్ టెన్షన్ తో బాధపడుతుంటారో, వాళ్ళు చికెన్ బ్రెస్ట్ తినడటం మంచిది.

5 క్యాన్సర్ భారిన పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది :

5 క్యాన్సర్ భారిన పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది :

క్యాన్సర్ వ్యాధి భారిన పడకుండా, ముఖ్యంగా పెద్ద పేగు క్యాన్సర్ భారిన పడే ప్రమాదాన్ని తగ్గించడంలో చికెన్ బ్రెస్ట్ ఎంతో బాగా పనిచేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎరుపు మాంసంతో పోల్చి చూసినప్పుడు, చికెన్ బ్రెస్ట్ తినడం వల్ల క్యాన్సర్ భారిన పడే ప్రమాదం కూడా తక్కువగానే ఉందట.

6 కొవ్వు పదార్ధం అధికంగా ఉండటం :

6 కొవ్వు పదార్ధం అధికంగా ఉండటం :

చికెన్ బ్రెస్ట్ తో పోల్చి చూసినప్పుడు ఎరుపు మాంసంలో కొవ్వు శాతం మరియు సాచ్యురేటెడ్ కొవ్వు శాతం అధికంగా ఉంటుందట. చికెన్ బ్రెస్ట్ తినడం వల్ల అధిక కొవ్వు శరీరంలో చేరుతుందట. అంతే కాకుండా, రకరకాల గుండె సంబంధిత వ్యాధుల భారిన పడే అవకాశం కూడా ఉందట. అందుచేత గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని అరికట్టాలన్న లేదా తక్కువ చేయాలన్నా, ప్రతి రోజు మనం తినే ఆహారంలో చికెన్ బ్రెస్ట్ ని కూడా తినడం మర్చిపోకండి.

7 సహజసిద్ధ ఒత్తిడిని దూరం చేస్తుంది :

7 సహజసిద్ధ ఒత్తిడిని దూరం చేస్తుంది :

చికెన్ బ్రెస్ట్ లో ట్రీప్టోఫాన్ వంటి ఎమినో ఆమ్లాలు అధికంగా లభిస్తాయట. ఇవి మీ శరీరానికి ఎంతో విశ్రాంతిని చేకూరుస్తాయట. మీరు గనుక తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంటే లేదా బాధపడుతుంటే లేదా ఏ రకమైన ఒత్తిడి లేదా ఉత్కంఠను గనుక అనుభవిస్తుంటే, ఆ సమయంలో చికెన్ బ్రెస్ట్ ని తినడం వల్ల మెదడులో ఉండే సెరోటోనిన్ స్థాయిలు పెరుగుతాయట. దీని వల్ల ఒత్తిడి దూరం అవ్వడమే కాకుండా, వ్యక్తుల యొక్క మానసిక స్థితి కూడా ఎంతో మెరుగవుతుందట.

8. జీర్ణ క్రియ ఎంతగానో వృద్ధి చెందుతుంది:

8. జీర్ణ క్రియ ఎంతగానో వృద్ధి చెందుతుంది:

చికెన్ బ్రెస్ట్ లో B6 అనే విటమిన్ అధికంగా లభిస్తుంది. ఈ విటమిన్ జీర్ణ క్రియ లో ఉండే ప్రతిస్పందనలు మరియు ఎంజైములు చురుగ్గా ఉండేలా చూస్తుంది. సరైన మోతాదులో కోడి మాంసం తీసుకోవడం వల్ల, శరీరంలో రక్త నిల్వలు మంచి స్థాయిలో ఉండి ఆరోగ్యం కూడా బాగుంటుందట. అంతేకాకుండా శరీరంలో శక్తీ సామర్ధ్యాలు అధికంగా ఉండటంతో పాటు, అటు జీర్ణక్రియ కూడా బాగా వృద్ధి చెందుతుంది. ఇలా జరగడం వల్ల శరీర జీర్ణ క్రియ కూడా బాగా జరుగుతుందట. కాబట్టి ఇలా చేయడం వల్ల మీ శరీరంలో ఎక్కువ క్యాలరీలు కూడా ఖర్చవుతాయట.

9 ఎముకలు శక్తివంతంగా తయారవుతాయి :

9 ఎముకలు శక్తివంతంగా తయారవుతాయి :

చికెన్ బ్రెస్ట్ లో ప్రోటీన్లు అత్యధికంగా ఉండటం వల్ల ఎముకలకు జరిగే నష్టాన్ని అరికట్టవచ్చు. 100 గ్రాముల చికెన్ బ్రెస్ట్ తినడటం వల్ల మన శరీరానికి ఒక రోజులో అవసరమయ్యే ప్రోటీన్ల లో సగ భాగం లభిస్తాయట. క్రమం తప్పకుండా చికెన్ బ్రెస్ట్ తినడం వల్ల ఎముకలు, పళ్ళు మరియు నాడీ వ్యవస్థ శక్తివంతంగా ఉండటానికి ఎంతగానో శయపడుతుందట.

10 సరైన శరీరాకృతి :

10 సరైన శరీరాకృతి :

మీరు గనుక విపరీతమైన శరీర బరువుని కలిగి ఉండి లేదా బాగా లావుగా గనుక ఉంటే, మీకు గనుక కండల తిరిగిన శరీరం లేదా సరైన శరీరాకృతి కలిగిన శరీరం కావాలని మీరు భావిస్తున్నట్లైతే, చికెన్ బ్రెస్ట్ ని క్రమం తప్పకుండా తినడం ప్రారంభించండి. చికెన్ బ్రెస్ట్ లో అత్యధికంగా ప్రోటీన్లు ఉండటం వల్ల అది శరీరంలో ఉండే కండరాలకు శక్తిని ఇచ్చి, సరైన రూపుని కల్పిస్తాయి. దీని వల్ల మీరు కావాలనుకున్న శరీరాకృతిలోకి మీరు మారవచ్చు. అయితే మీరు తీసుకొనే ఆహారం సమతుల్యతతో ఉండాలి అనే విషయం మీరు మరచిపోకండి. వీటికి తోడుగా సరైన పద్దతిలో మాక్రో మరియు మైక్రో పోషకాలను కూడా మీ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా మీరు చక్కటి సమతుల్యమైన ఆహారం సేవిస్తున్నవారవుతారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    10 Health Benefits Of Skinless Chicken Breast

    health, weight loss, bone health, vitamins, protein, cancer, metabolism, cholesterol
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more