For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఛాతిమంట (గుండెమంట) ను పోగొట్టే 10 ఇంటి నివారణ చిట్కాలు !

|

మీరు ఛాతిమంటతో బాధపడుతుననట్లైతే, అది ఎంత బాధకరమో మీకు బాగా తెలుసు. ఛాతిమంట అనేది మీరు అన్నం తిన్న తర్వాత (లేదా) రాత్రి నిద్ర పోయేటప్పుడు మీ ఛాతిలో మండుతున్నట్లుగా ఉన్న భావనను కలిగి ఉంటారు. మీరు తరచుగా కిందన పడుకున్నప్పుడు (లేదా) కిందకి వంగినప్పుడు మీ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ఛాతిమంట నుంచి ఉపశమనం కలిగించే మందులను మీరు విస్తృతంగా ఉపయోగిస్తున్నప్పటికీ అవి ఎంత వరకు మేలు చేస్తాయో అన్నది ఇంకా ప్రశ్నగానే మిగిలింది.

ఛాతిమంటకు కారణమైన ఆమ్లత్వాన్ని తగ్గించడానికి "ప్రోటాన్ పంప్ ఇంహిబిటర్ను" (PPI) అనబడే మందులను మనము తరచుగా ఉపయోగిస్తాము. ఇలాంటి మందులను మీరు తరచుగా వాడటం వల్ల మీ ఎముకలు సాంద్రతను కోల్పోవడమే కాక, B12 విటమిన్ లోపం కూడా ఏర్పడుతుందని పరిశోధకులు గుర్తించారు. ఈ PPIs ని ఎవరైతే ఎక్కువగా వినియోగిస్తారో అలాంటి వారికి భవిష్యత్తులో గుండె & కిడ్నీ సంబంధిత రుగ్మలతలు కలగవచ్చు.

ఛాతిమంట కోసం వాడే మందులు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ను కలిగి ఉంటాయి, కాబట్టి వాటిని ఉపయోగించటానికి బదులు నేచురల్గా ఉండే నివారణ మార్గాలను ఎంచుకోవడం వల్ల మీరు మరింత సురక్షితంగా ఉంచేలా సమర్థవంతంగా పనిచేస్తుంది. మీరు మీ జీవనశైలిని మార్చుకోవడం వల్ల ఛాతిమంట తగ్గి, యాసిడ్ రిఫ్లెక్షన్కు మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది.

1. అరటిని తినాలి :-

1. అరటిని తినాలి :-

అరటిలో ఉండే యంటాసిడ్స్, యాసిడ్ రిఫ్లెక్షన్కు వ్యతిరేకిగా పనిచేస్తూ, ఉపశమనాన్ని కలిగిస్తుంది. మీరు రోజులో కనీసం ఒక్క అరటి పండును తినడం వల్ల యాసిడ్ రిఫ్లెక్షన్కు దూరంగా ఉండవచ్చు. అరటిలో ఉన్న క్షారత్వ గుణము, కడుపులో ఉన్న ఆమ్లత్వాన్ని నెమ్మదించటంలో సహాయపడుతుంది.

2. అల్లం టీ తాగండి :-

2. అల్లం టీ తాగండి :-

సహజసిద్ధమైన అల్లము, గందగోళంగా ఉన్న మీ కడుపుని ఉపశమనపరుస్తుంది. అల్లంతో చేసిన టీ, వికారాన్ని & యాసిడ్ రిఫ్లెక్షన్ను సులభంగా నివారిస్తుంది. పావువంతు అల్లం ముక్కను తీసుకొని దానిని 3 భాగాలుగా కట్ చేయాలి. 2 కప్పుల నీటిని తీసుకొని బాగా మరగించి, అందులో ఈ అల్లం ముక్కలను వేసి 30 నిముషాల పాటు బాగా మరగనివ్వాలి. అలా తయారైన పానీయంలో అల్లం ముక్కలను వేరు చేసి, భోజనానికి 20 నిముషాల ముందు ఈ టీని తాగాలి.

3. ఆవాలను తినండి :-

3. ఆవాలను తినండి :-

మీకు వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉన్నా, ఆవాలలో మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఈ ఆల్కలీన్ పదార్థం మీ కడుపు & గొంతులో ఉన్న ఆమ్లత్వాన్ని నెమ్మదించటంలో సహాయపడుతుంది. ఛాతిమంట మిమ్మల్ని ఎక్కువగా భాదిస్తే,1 స్పూను ఆవాలను తినండి.

4. చమోమిలే-టీ తాగండి :-

4. చమోమిలే-టీ తాగండి :-

రాత్రి నిద్రపోవడానికి అరగంట ముందు ఈ చమోమిలే-టీను తాగండి, ఇది మీ కడుపులో ఉన్న మంటకు తగ్గిస్తుంది. ఇది సహజసిద్ధముగానే యాసిడ్ రిఫ్లెక్షన్ పోగొట్టడంతో పాటు, ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. ఒక కప్పు నీటిని స్టౌవ్ మీద పెట్టి బాగా మరిగించాలి, అందులో చమోమిలే ఆకులను వేసి 45 సెకన్ల పాటు ఉంచాలి. చమోమిలే ఆకులలో ఉన్న గుణాలు ఆ నీటిలోకి బాగా ఇంకిపోయేలా నిర్ధారించుకున్న తర్వాత ఆ ఆకులను తీసివేసి, కాస్త చల్లార్చిన తర్వాత ఈ పానీయాన్ని తాగాలి.

5. బాదంపప్పును తినండి :-

5. బాదంపప్పును తినండి :-

మన కడుపులో ఊరే జీర్ణరసాలను సమతుల్యం చెయ్యడంలో బాదం గొప్ప పాత్రను పోషిస్తాయి. ఇవి ఛాతిమంట నుండి మీకు ఉపశమనాన్ని కలగచెయ్యడమే కాక, దానిని నివారించడంలో కూడా మీకు బాగా సహాయపడుతాయి. భోజనం చేసిన తర్వాత 3-4 బాదం గింజలను తినండి.

6. బేకింగ్ సోడాను ఉపయోగించండి :-

6. బేకింగ్ సోడాను ఉపయోగించండి :-

మీ కడుపులో ఉన్న ఆమ్లత్వాన్ని నివారించేందుకు బేకింగ్ సోడానే మూలపదార్థం. ఛాతిమంటను & యాసిడ్ రిఫ్లెక్షన్ను తగ్గించడం ద్వారా శరీర pH స్థాయిలను బ్యాలెన్స్ చేస్తుంది. 1/2 టీ స్పూను (లేదా) 1 టీ స్పూను బేకింగ్ సోడాను నీటిలో కలుపుకొని త్రాగడం వల్ల మీకు త్వరగా ఉపశమనం కలుగుతుంది.

7. కలబంద రసమును తాగండి :-

7. కలబంద రసమును తాగండి :-

కాలిన గాయాల నుండి ఉపశమనం పొందడానికి కలబంద ఉపయోగపడుతుందని మనందరికి బాగా తెలుసు. మీ కడుపులో ఏర్పడిన మంటను, ఇతర ఇబ్బందులను తొలగించడానికి ఒక గ్లాసు అలోవెరా జ్యూస్ను తాగటం వల్ల మీ కడుపులో ఏర్పడిన ఉద్రిక్తతలను నెమ్మదించేలా చేస్తుంది.

8. ఆపిల్ సైడర్ వెనిగర్ను తాగండి :-

8. ఆపిల్ సైడర్ వెనిగర్ను తాగండి :-

కడుపులోని ఆమ్లాలు తీవ్రమైనప్పుడు సాధారణంగా ఛాతిలో మంట ఏర్పడుతుందని మీరు అనుకోవచ్చు. కానీ చాలా కేసులలో, మీ కడుపులో సరిపోయినంత ఆమ్లాలను కలిగి ఉండకపోవడం వల్ల యాసిడ్ రిఫ్లెక్షన్కు దారితీస్తుంది. ఇలాంటప్పుడు మీరు 6-8 ఔన్స్ల నీటిలో, 3 టీస్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ను కలిపి తాగాలి. ముఖ్యంగా, భోజనం చేసే ముందు & పడుకునే ముందు ఇలా కలిపిన నీటిని తాగాలి.

9. సిగరెట్లను & ఆల్కహాల్ను మానేయండి :-

9. సిగరెట్లను & ఆల్కహాల్ను మానేయండి :-

మీరు యాసిడ్ రిఫ్లెక్షన్ / ఛాతిమంటతో బాధపడుతుననట్లైతే, మీరు తప్పకుండా సిగరెట్లు & ఆల్కహాల్ వంటి అలవాట్లను మానివేయాలి. ఎందుకంటే, నికోటిన్ & ఆల్కహాల్ ఈ రెండు కూడా, మీ కడుపులోనికి ఆహారాన్ని స్వాగతించే కండరాలను బలహీనపరుస్తాయి. అప్పుడు మీ కడుపులో ఉన్న యాసిడ్ తిరిగి ఆహారనాళం ద్వారా పైకి వెదజిమ్మెలా అవ్వడానికి దారితీస్తుంది. సిగరెట్ & మద్యపానాన్ని నివారించడం ద్వారా యాసిడ్ రిఫ్లెక్షన్ను తగ్గించి, మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేలా చేస్తుంది.

10. తల ఎత్తుగా ఉండేటట్లు పడుకోవాలి :-

10. తల ఎత్తుగా ఉండేటట్లు పడుకోవాలి :-

రాత్రి సమయంలో ఎదురయ్యే ఛాతిమంట చాలా అద్వానంగా ఉంటుంది. మీరు కింద పడుకున్నప్పుడు, మీ కడుపులోని జీర్ణమవుతున్న పదార్థాలు తిరిగి అన్నవాహిక గుండా వెనుకకు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇలాంటప్పుడు, మీరు మంచానికి సమాంతరంగా పడుకునేటప్పుడు, మీ మొండెం నుండి తల భాగం వరకూ గల శరీరమంతటినీ 6 ఇంచుల వరకూ పైకి లేపడానికి ప్రయత్నించండి. అలాగే, మీరు భోజనం చేసిన 3-4 గంటల వరకూ పడుకోకూడదు.

English summary

10 Heartburn Natural Remedies Better Than Medication!

If you suffer from heartburn, you know how painful it can be. Heartburn is a burning pain in the chest that usually occurs after eating and may occur at night. It often worsens when lying down or bending over. Although heartburn medications are widely prescribed, their safety have questioned.The most commonly used medications for acid reductions in heartburn are known as proton pump inhibitors. Studies have shown that these medications can result in bone loss and Vitamin B12 deficiency when chronically used.
Story first published: Wednesday, September 5, 2018, 10:45 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more