Latest Updates
-
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం! -
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
సర్వ రోగాలకు మూలం కడుపే..పేగుల్లో పేరుకుపోయిన చెత్తను బయటకు పంపే 10 ఫుడ్స్ -
మన పూర్వీకుల ఆరోగ్య రహస్యం గుమ్మడికాయ దప్పళం.. వారానికోసారి తింటే సర్వరోగాలు మాయం.! -
కేవలం 10 నిమిషాల్లో స్వర్గాన్ని చూపించే వెల్లుల్లి కారం ఆమ్లెట్..ఎలా చేసుకోవాలంటే.. -
బీహారీ స్పెషల్ చోఖా..పొలం గట్టు మీద కూర్చొని ఈ పచ్చడి కలిపి అన్నం తింటుంటే స్వర్గమే! -
నిమజ్జనం రోజు గణేశుడి చెవిలో ఈ 3 పదాలను చెప్పండి.. మీ తీరని కోరిక నెరవేరడం పక్కా.!
బీట్ రూట్ తినడం వలన కలిగే 10 దుష్ప్రభావాలను గురించి తెలుసుకోండి !
బీట్ రూట్ లో ఇనుప ధాతువు లభ్యత అధికంగా ఉంటుందని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే! కనుకనే ప్రతి ఒక్కరు తమ ఆహారంలో బీట్ రూట్ ని భాగంగా చేసుకుంటారు.బీట్ రూట్ లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు మరియు పీచు పదార్ధం అధికంగా ఉంటాయి. పూర్వకాలంలో దీనిని ఔషధంగా వాడేవారు. విటమిన్-సి, బీటా-కెరోటిన్, బయోఫ్లావనాయిడ్లు,పోటాషియం మరియు మాంగనీసు దీనిలో పుష్కలంగా లభిస్తాయి. బీట్ రూట్ రసం కంటిని, కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి తోడ్పడుతుంది.
బీట్ రూట్ లో ఉండే బీటయిన్ కాలేయంలో మలినాలను తొలగించి , శరీరంలో హార్మోన్ల సహజోత్పత్తిని పెంపొందిస్తుంది. మూత్రం మరియు రక్తంలో ఉండే అధిక హోమోసిస్టయిన్ ను తొలగిస్తుంది.

బీట్ రూట్ రక్త పోటును, రక్తంలో ట్రైగ్లిసరైడ్ల స్థాయిని తగ్గిస్తుంది. దీని వలన క్రీడాకారుల ప్రదర్శనా పాటవాలు మెరుగవుతాయి. ఇటువంటి ప్రయోజనాలతో పాటు, బీట్ రూట్ కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్న వారిపై తీవ్రమైన దుష్ప్రభావం చూపిస్తాందని మీకు తెలుసా! తెలుసుకుందాం రండి.

1. బీటూరియా ని కలుగజేస్తుంది:
బీట్ రూట్ ను అధికంగా తినడం వలన మూత్రం పింక్ రంగులో అయ్యే అవకాశం ఉంది. దీనినే బీటూరియా అంటారు. సాధారణంగా ఐరన్ లోపంతో బాధపడే వారిలో ఈ విధంగా జరుగుతుంది. సుమారుగా 12-14 శాతం ప్రజలకు ఈ పరిస్థితి ఎదురవుతుంది. దీని వలన ఎటువంటి హానికరమైన పరిస్థితులు కాని లేదా తీవ్రమైన దుష్పరిణామాలు కాని ఉత్పన్నమవ్వవు .

2. మూత్రపిండాలలో రాళ్ళు:
ఆహారంలో బీట్ రూట్ ను అధికంగా తీసుకున్నప్పుడు అందులో ఉండే ఆక్సలేట్ల వలన మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడవచ్చు. దీనిలో ఉండే అధిక బీటయిన్ స్థాయిలు అప్పటికే మూత్రపిండ సమస్యతో బాధ పడుతున్నవారికి సమస్యలను మరీంతగా పెంచుతాయి. కిడ్నీ వ్యాధిగ్రస్తులు బీట్ రూట్ ను తినకపోవడమే ఉత్తమం.

౩. రక్త పోటు స్థాయిని తగ్గిస్తుంది :
బీట్ రూట్ రక్తపోటు స్థాయి తగ్గిస్తుంది కనుక రక్తపోటు తక్కువగా ఉన్నవారు లేదా స్థిరముగా లేని వారు దీనిని తినకపోవడమే ఉత్తమం.

4. దద్దుర్లు:
ఈ పరిస్థితి చాలా అరుదుగా సంభవిస్తుంది. అతిగా బీట్ రూట్ ను తినటం వలన ఎలర్జీ లక్షణాలు అయిన దద్దుర్లు, దురదలు,వణుకు మరియు జ్వరం వచ్చే అవకాశం ఉంది. మీరు కనుక బీట్ రూట్ ఎలర్జిక్ ఐతే బీట్ రూట్ ను తక్కువగా తీసుకోండి.

5. జీర్ణాశయ సమస్యలు:
మీరు జీర్ణాశయ సమస్యలు ఉన్నవారైతే, బీట్ రూట్ ఆ సమస్యలను అధికం చేస్తుంది. మీకు కడుపులో నొప్పి, తిమ్మిర్లు, ఉబ్బరం, అపానవాయు సమస్య, విరేచనాలు లేదా మలబద్దకాన్ని కలుగ చేయవచ్చు.

6. రక్తంలో చెక్కెర స్థాయిలు పెంచుతుంది:
మధుమేహం ఉన్న వారిలో బీట్ రూట్ తినడం వలన రక్తంలో చెక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. బీట్ రూట్ లో అధిక గ్లైసేమిక్ ఇండెక్స్ ఉంటుంది కనుక మధుమేహ వ్యాధిగ్రస్తులు తినరాదు.

7. కీళ్ళ వాతం:
కీళ్ళ వద్ద భరించలేని నొప్పులు, వాపు మరియు జ్వరం గౌట్ లక్షణాలు. మేరీల్యాండ్ వైద్య విశ్వవిద్యాలయం వారి పరిశోధనలలో బీట్ రూట్ లో ఉండే ఆక్సలేట్ గౌట్ కలుగజేస్తుందని వెల్లడయినది. కనుక ఆ వ్యాధి ఉన్నవారు బీట్ రూట్ ను తక్కువ మొత్తంలో తీసుకోవాలి.

8. గర్భధారణ సమయంలో సమస్యలు:
బీట్ రూట్ లో నైట్రేట్ లు అధికం. గర్భిణి స్త్రీలలో కొన్ని సార్లు నైట్రేట్ ప్రభావం చేత పిండం దెబ్బతినే అవకాశం ఉంది. కనుక గర్భిణి స్త్రీలు బీట్ రూట్ తినకపోవడమే మంచిది.

9. కాలేయ సమస్యలు:
బీట్ రూట్లో కాపర్, ఫాస్ఫరస్ , మెగ్నీషియం మరియు ఐరన్లు అధికం. ఇది మంచిదే ఐనప్పటికీ అన్ని లోహ ధాతువులు కావడం వలన అధికంగా తినడం వలన కాలేయం మరియు క్లోమంలలో పేరుకుపోయి హాని జరగవచ్చు.

10.రక్త విరేచనం:
సాధారణంగా మనం తినే ఆహారం జీర్ణ వ్యవస్థ లో జరిగే రసాయనిక చర్యల వలన రంగు కోల్పోతాయి. కాని అధిక మొత్తంలో బీట్ రూట్ తిన్నప్పుడు మెలనియా అని పరిస్థితి తలెత్తుతుంది. జీర్ణాశయ రక్తస్రావం వలన నలుపు రంగులో విరేచనమవుతుంది



Click it and Unblock the Notifications
