For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్త్రీలలో గుండె జబ్బులను పెంచే 10 ఆశ్చర్యకర కారణాలు

ప్రపంచవ్యాప్తంగా పురుషులు, స్త్రీలు ఇద్దరినీ చంపే మొదటి స్థితి గుండె జబ్బుగా మారుతోంది. ఇది స్త్రీలలోనే ఎక్కువ కన్పిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యూహెచ్ ఓ) ప్రకారం ప్రతిఏడాది 1.7 మిలియన్ భారతీయులు

|

ప్రపంచవ్యాప్తంగా పురుషులు, స్త్రీలు ఇద్దరినీ చంపే మొదటి స్థితి గుండె జబ్బుగా మారుతోంది. ఇది స్త్రీలలోనే ఎక్కువ కన్పిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యూహెచ్ ఓ) ప్రకారం ప్రతిఏడాది 1.7 మిలియన్ భారతీయులు గుండెజబ్బుల వలన చనిపోతున్నారు. గుండె జబ్బు పెరుగుతున్న భారత జనాభాకి అపాయకరం.

భారతీయ హార్ట్ అసోసియేషన్ ప్రకారం, 50 ఏళ్ళ లోపు భారతీయులకి 50శాతం గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. 25 శాతం గుండెజబ్బులు 40ఏళ్ళ వయస్సు లోపలే వస్తాయి.

స్త్రీలు మధుమేహం, స్థూలకాయం, గుండె పనిచేయకపోవటం, కిడ్నీలు పనిచేయకపోవటం, డిప్రెషన్ మరియు పక్షవాతం వంటి వాటి బారిన ఎక్కువ పడుతుంటారు.

శాస్త్రవేత్తలు మన భారతీయుల జన్యువులలోనే గుండెజబ్బులు వంశపారంపర్యంగా వస్తుంటాయని చెప్తున్నారు. ఇతర కారణాలు పొగతాగటం, అధిక కొలెస్ట్రాల్, మాంసం తినటం వంటివి కూడా గుండె జబ్బులకి కారణమవుతాయి. భారతీయులకి సాధారణంగా మెటబాలిక్ సిండ్రోమ్, అంటే గుండె జబ్బుల రిస్క్ ను పెంచే మెటబాలిక్ అనారోగ్య స్థితి సహజంగా ఎక్కువగా వస్తుంది.

కానీ, మీ గుండె జబ్బు వచ్చే రిస్క్ లను పెంచేవి కేవలం ఈ కారణాలే కాదు. ఇదిగో స్త్రీలలో గుండె జబ్బుల రిస్క్ ను పెంచే, మిమ్మల్ని ఆశ్చర్యపరిచే ఇతర కారణాలు ఇవిగో.

1.12 ఏళ్ళ వయస్సుకి ముందే రజస్వల కావడం

1.12 ఏళ్ళ వయస్సుకి ముందే రజస్వల కావడం

ఎంత తొందరగా కౌమార దశలోకి అడుగుపెడితే, అంత గుండె జబ్బులు వచ్చే అవకాశం పెరుగుతుంది. ఇటీవలి అధ్యయనంలో తేలింది ఏమనంటే, మొదటిసారి రుతుక్రమం 12 ఏళ్ల వయస్సు కన్నా ముందే వస్తే, వారికి 13 ఏళ్ళ వయస్సు తర్వాత రజస్వల అయ్యే స్త్రీల కన్నా 10 శాతం ఎక్కువ గుండె జబ్బులు వచ్చే రిస్క్ పెరుగుతుంది. ఎందుకంటే జీవితకాలంలో ఈస్ట్రోజెన్ స్థాయి పెరిగి రక్తం గడ్డటం మరియు గుండెపోట్లకి దారితీయవచ్చు.

2.ఇటీవల తీవ్రంగా ఫ్లూ వచ్చివుండటం

2.ఇటీవల తీవ్రంగా ఫ్లూ వచ్చివుండటం

తీవ్రంగా ఫ్లూ జ్వరం రావటం కూడా మున్ముందు గుండె జబ్బులు వచ్చే అవకాశం పెంచుతుందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఫ్లూ జ్వరం తీవ్రంగా అపాయకరమైన బ్యాక్టీరియా,వైరస్ లు సోకటం వలన వస్తుంది మరియు అవి మీ గుండెలోకి ప్రవేశించగలిగి, గుండె పనిచేయకపోవటానికి కూడా కారణమవ్వచ్చు. అందుకని మీకు ఫ్లూ జ్వరం తీవ్రంగా ఉంటే, వైద్యున్ని తప్పక సంప్రదించండి.

3.డైట్ మందులు తీసుకోవడం

3.డైట్ మందులు తీసుకోవడం

చాలామటుకు డైట్ మందులు పనిచేయవని తెలిస్తే ఆడవారు షాకవుతారు. ఈ మందులు ప్రాణాంతకం కూడా అవుతాయి ఎందుకంటే వాటిలో ఉండే స్టిమ్యులెంట్ ప్రభావం మీ గుండెకి మంచిది కాదు. ఈ డైట్ మందులు మీ రక్తపోటును పెంచి, గుండె వేగాన్ని పెంచి గుండెపై ఎక్కువ వత్తిడిని పెంచుతాయి. చాలాకాలంపాటు ఈ డైట్ మందులు వాడటం వలన మీ గుండెకి శాశ్వత నష్టం కలుగుతుంది.

4.కడుపుతో ఉండటం

4.కడుపుతో ఉండటం

అవును! మీ శరీరం లోపల బేబీ ఉండటం వలన రక్తప్రసరణ వ్యవస్థపై అదనపు పని పడుతుంది. మీ గుండె మరింత కష్టపడుతుంది మరియు కడుపుతో ఉన్నప్పుడు రక్తం పరిమాణం కూడా రెట్టింపవుతుంది.మీకు గర్భసమయంలో డయాబెటిస్, అధిక రక్తపోటు లేదా ప్రీక్లాంప్సియా ఉంటే, మీకు గుండె జబ్బులు వచ్చే రిస్క్ కూడా ఎక్కువ అవుతుంది.

5.మనస్సు విరిగిపోవటం

5.మనస్సు విరిగిపోవటం

మీరు చాలా బాధగా ఉండి, మానసికంగా కృంగిపోయి ఉన్నట్లయితే,మీకు గుండెజబ్బులు వచ్చే అవకాశం ఉన్నది. మనస్సు విరిగిపోయే సిండ్రోం మానసిక వత్తిడి తీవ్రంగా ఉండటం వలన వస్తుంది. ఇది దగ్గరివారు చనిపోవటం, బ్రేకప్, ఆర్థిక పరిస్థితులు, లేదా విడాకులు దేనివల్లనైనా రావచ్చు. ఈ కారణాలు గుండె జబ్బు రిస్క్ ను పెంచుతాయి అందువలన మీరు వ్యాయామం, ధ్యానం, యోగా మరియు థెరపీతో ఈ కారణాలను తొలగించుకోండి.

6.రోజూ మద్యం తాగటం

6.రోజూ మద్యం తాగటం

మీరు సాధారణంగా ఆఫీసు నుండి రాగానే ఒక గ్లాసు వైన్ తాగేవారైతే మీరు ఆ అలవాటును ఇప్పటికిప్పుడే వదిలేయాలి! వైన్ లో ఆల్కహాల్ ఉంటుంది మరియు అధికంగా తాగితే మీ శరీరంపై చాలా హానికరమైన ప్రభావం చూపిస్తుంది. రోజుకి నిర్దేశిత పరిమాణంలో రెండుసార్లకన్నాఎక్కువగా ఆల్కహాల్ తాగితే గుండె జబ్బు వచ్చే రిస్క్ పెరుగుతుంది. అందుకని వైన్ ను మితంగానే తీసుకోండి.

7. వాపుకి సంబంధించిన వ్యాధి ఉన్నట్లు తెలియడం

7. వాపుకి సంబంధించిన వ్యాధి ఉన్నట్లు తెలియడం

రుమటాయిడ్ ఆర్థరైటిస్ స్త్రీలలో ఎక్కువగా వచ్చి గుండె జబ్బుల రిస్క్ ను పెంచుతుంది. ఇది శరీరంలో వాపులను కలిగించి రక్తనాళాలకు నష్టం కలిగిస్తుంది, గోడలు మందంగా మారేట్లు, కొవ్వు పేరుకునేలా చేస్తుంది. మీరు వాపును పెంచని ఆహారపదార్థాలను తినాలి దానిద్వారా గుండె జబ్బులను నివారించవచ్చు లేదా మీ స్థితి గురించి డాక్టర్ తో మాట్లాడండి.

English summary

10 Surprising Factors That Increase Heart Disease In Women

Heart disease is the number one killer for both men and women all over the world, but it is more seen in case of women. They suffer with certain conditions like diabetes, obesity, heart failure, renal failure, depression and history of stroke. The factors that cause heart disease in women are depression, lonely feeling, diet pills, emotional distress, etc..
Story first published:Friday, March 2, 2018, 15:20 [IST]
Desktop Bottom Promotion