For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్మూచింగ్ మరియు ముద్దు వలన కలిగే ప్రయోజనాలేమిటో తెలుసా?

స్మూచింగ్ మరియు ముద్దు వలన కలిగే ప్రయోజనాలేమిటో తెలుసా?

|

మీకు రోజు ఆనందంగా జరగాలి అనుకుంటే, ఆహారాలు, లెమన్ జ్యూసులు, వ్యాయామాలు, జీవన శైలి మార్పులు, ఆద్యాత్మిక మార్గాలు, అలవాట్లు మొదలైన అనేక అంశాల కన్నా ముందుగా చేయవలసిన మరొక పని ఉంది. మీ భాగస్వామి లేదా మీ ప్రియమైన వ్యక్తిని ముద్దుపెట్టుకోవడం. అవును మీరు విన్నది నిజం ! రోజులో ఒక్క ఆత్మీయమైన ప్రేమతో కూడిన ముద్దు, తెలియని మానసిక ప్రశాంతతని క్రమంగా శారీరిక ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది అని అనేక అధ్యయనాలు కూడా సూచిస్తున్నాయి. ముద్దు లేదా స్మూచింగ్ ద్వారా అనేక తెలియని ప్రయోజనాలను కూడా పొందవచ్చు.

కొన్ని రోజులు మనం సంతోషంగా నిద్ర లేస్తే, కొన్ని రోజులు ఆరోజు కన్నా బాధాకరమైన రోజు లేదన్నట్లుగా నిద్ర లేయడం జరుగుతుంటుంది. కానీ, మనం మేల్కొనే సమయంలోని ఆలోచనా విధానం రోజులో వ్యక్తి మానసిక స్థితి మీద, క్రమంగా పని మీద ప్రభావాన్ని చూపుతుంది. ఇక్కడ ముద్దు పెట్టుకోవడం లేదా స్మూచింగ్ చేయడం అనేది ఆ నిస్తేజాన్ని వదిలించడానికి సహాయం చేస్తుంది. ఈ విషయాన్ని సైన్స్ ధృవీకరించింది కూడా. ఇంకా నమ్మకం కుదరడం లేదా ? అయితే ఈ స్మూచింగ్ లేదా కిస్సింగ్ గురించిన మరిన్ని వివరాల కోసం ఈ వ్యాసం చూడండి.

12 reasons why you should smooch more

ఇదివరకు మీ భాగస్వామితో ముద్దును ఆస్వాదించని వారుగా ఉన్నట్లయితే, మీరు ప్రారంభించాల్సిన అవసరం ఉంది. కొందరు ముద్దు పెట్టడం కూడా యాంత్రికంగా చేస్తుంటారు. అందులో ప్రేమ కనపడడం తక్కువగా ఉంటుంది. ముద్దుకు సమయం కేటాయించడం ముఖ్యం. ఈ కింద తెలిపిన కారణాలు ఎందుకని మరింత ఎక్కువగా స్మూచింగ్ చేయాలో తెలియజేస్తాయి. రోజుని సంతోషభరితంగా మార్చే ముద్దు యొక్క అదనపు ప్రయోజనాలు తెలుసుకునేందుకు ఈ వ్యాసం చూడండి.

స్మూచింగ్ మరియు ముద్దు వలన కలిగే అదనపు ప్రయోజనాలు :

1.) హ్యాపీ హార్మోన్ల విడుదలలో సహాయం చేస్తుంది

1.) హ్యాపీ హార్మోన్ల విడుదలలో సహాయం చేస్తుంది

మన శరీరం మనకు సంతోషంగా మరియు మరింత ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగించడానికి విడుదలయ్యే కొన్ని హార్మోన్లను కలిగి ఉంటుంది. ఇవి ముఖ్యంగా ఆక్సిటోసిన్, సెరోటోనిన్ మరియు డోపమైన్. ఇవి కేవలం ఆనందం మరియు ఆప్యాయతకు సంబంధించిన అనుభూతిని మాత్రమే తీసుకురావడం కాకుండా, శరీరంలోని కార్టిసోల్ (శరీరం యొక్క ఒత్తిడి హార్మోన్) స్థాయిలను కూడా తగ్గిస్తుంది. మీరు స్మూచింగ్ లేదా ముద్దు పెట్టుకోవడం వలన, నిర్దిష్ట హార్మోన్లను ప్రేరేపించటానికి మరియు అదే విధంగా విడుదల చేయటానికి బాధ్యత వహించే మెదడులోని కొన్ని ప్రత్యేక ప్రాంతాలపై ప్రభావాన్ని కలిగి ఉంటుంది. క్రమంగా సంతోషం మరియు సానుకూలమైన మానసిక అనుభూతికి లోనయ్యేలా చేస్తుంది. సాధారణంగా, అన్ని రకాల ప్రేమపూర్వక కార్యకలాపాలు, 'ఐ లవ్ యు' వంటి మాటలు కూడా మన శరీరాల్లో మానసిక ప్రభావాన్ని కలిగి ఉంటాయి మరియు ఒత్తిడిని వదిలించుకోవడానికి సహాయం చేస్తాయి. నిజమైన ప్రేమలో ఉన్నవారు ఎల్లప్పుడూ సంతోషంగానే ఉంటారు. కానీ ఆ ప్రేమను కనుగొనడంలో మాత్రం తప్పటడుగు వేయరాదు.

2.) ఒత్తిడి, ఆందోళనలను తగ్గిస్తుంది

2.) ఒత్తిడి, ఆందోళనలను తగ్గిస్తుంది

మీరు ఆందోళనతో బాధపడుతున్న వ్యక్తిగా ఉన్నారా ? లేదా మీరు ఒత్తిడి మరియు ఆందోళన నిర్వహించడానికి కష్టపడుతున్నారా ? అయితే ముద్దు మీ సమస్యలన్నింటికీ ఒక గొప్ప పరిష్కారంగా ఉంటుంది. ముద్దు పెట్టుకున్నప్పుడు, ఆక్సిటోసిన్ హార్మోన్ శరీరంలో విడుదల అవుతుంది, ఇది ఆందోళనను తగ్గిస్తుంది మరియు మిమ్ములను మరింత సంతృప్తిపరచేలా చేస్తుంది, క్రమంగా ఒక సంపూర్ణమైన అనుభూతిని ఇస్తుంది. ఏది ఏమైనా ప్రేమ, ముద్దు ఇవ్వగలిగిన మానసిక ప్రశాంతత మరేదీ ఇవ్వలేదు అన్నది నిజం.

3.) రక్తపోటును తగ్గిస్తుంది

3.) రక్తపోటును తగ్గిస్తుంది

మీరు ముద్దు పెట్టుకున్నప్పుడు, మీ హృదయ స్పందనల రేటు (గుండె కొట్టుకునే వేగం) పెరుగుతుంది. క్రమంగా, శరీరంలోని రక్త నాళాలు వెడల్పుగా మారి, మరింత విస్తృతంగా తెరుచుకుంటాయి. ఇలా జరిగినప్పుడు, ధమనులలో రక్తప్రవాహం సజావుగా సాగేలా దారి ఏర్పడుతుంది. తద్వారా రక్తపోటు తగ్గుతుంది. అనేక మానసిక సంబంధిత పరిస్థితులను ఎదుర్కొనడానికి, మూడ్ లెవల్స్ పెంచుటకు హాపీ హార్మోన్స్ దోహదం చేస్తాయి. క్రమంగా రక్తపోటు క్రమబద్దీకరించబడుతుంది.

4.) బంధాలను మెరుగుపరుస్తుంది

4.) బంధాలను మెరుగుపరుస్తుంది

మీ ప్రియమైన వారిని లేదా భాగస్వామిని ముద్దు పెట్టుకోవడం వారికి అత్యంత సన్నిహితులను చేస్తుందని అనేకమందికి తెలియదు. ఇలా తెలియకే, అలా కోర్టు మెట్లదాకా వెళ్తున్నారు అనేకులు. పైన చర్చించినట్లుగా, ముద్దు ఆక్సిటోసిన్ హార్మోనును విడుదల చేస్తుంది, ఇది అనుభూతిని పెంచే మంచి హార్మోన్లలో ఒకటిగా ఉంది. శరీరంలో ఆక్సిటోసిన్ పెరుగుదల కారణంగా, ముద్దు పెట్టుకున్న వ్యక్తితో విడదీయలేని అటాచ్మెంట్ మరియు ఆప్యాయతలను పొందగలరు.

5.) తలనొప్పిని తగ్గిస్తుంది

5.) తలనొప్పిని తగ్గిస్తుంది

మీరు చాయ్ ప్రేమికులు అయితే, తలనొప్పి నివారణలో చాయ్ కన్నా బెట్టర్ ఆప్షన్ ఉండదని మీ అభిప్రాయంగా ఉంటుంది అనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. కానీ చాయ్ కన్నా ముద్దు మరింత ప్రభావవంతముగా పనిచేస్తుంది. పైన చెప్పినట్లుగా, ముద్దు భావనలను పెంచడంలో మంచి హార్మోన్లను ప్రేరేపిస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు రక్త నాళాలను విస్తృతం చేయడం ద్వారా రక్తపోటును తగ్గిస్తుంది. ఒత్తిడి మరియు అధిక రక్తపోటు సాధారణంగా తలనొప్పితో సంబంధం కలిగి ఉంటాయి. కావున మీ శారీరిక మానసిక స్థాయిలు అదుపులో లేనప్పుడు ముద్దును ఆశ్రయించడమే మేలు.

6) సెక్స్ డ్రైవ్ మెరుగుపరుస్తుంది

6) సెక్స్ డ్రైవ్ మెరుగుపరుస్తుంది

శృంగారంపరంగా ముద్దుపెట్టుకోవడం మీ సెక్స్ డ్రైవ్ను మెరుగుపరుస్తుంది. ఇది అక్షర సత్యం. ఎందుకంటే లైంగిక ప్రేరేపకంలో లాలాజలంలో టెస్టోస్టెరాన్ ఎక్కువగా ఉన్న కారణాన జరుగుతుంది. ఒక మంచి ముద్దు మంచి సెక్స్ డ్రైవ్ ప్రోత్సహిస్తుంది. మరియు అదనపు ప్రయోజనాలను చేకూరుస్తుంది. తరచుగా సెక్స్ డ్రైవ్ కలిగి ఉండడం IgA లేదా ఇమ్యునోగ్లోబ్యులిన్-ఏ స్థాయిలను పెంచుతుంది. ఇది రోగనిరోధకవ్యవస్థను మెరుగుపరుస్తుంది మరియు సాధారణంకన్నా తక్కువ వ్యాధులకు గురయ్యే అవకాశం ఉన్నట్లు నిర్ధారిస్తుంది. దానికితోడు, హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి ఎంతగానో సహాయం చేస్తుంది. తక్కువ రక్తపోటు, కీళ్ళనొప్పి మరియు వెన్నునొప్పి ప్రభావాలను తగ్గిస్తుంది. మైగ్రేన్లు మరియు ఋతుచక్రం సమస్యల ప్రభావాలను సైతం తగ్గించడంలో సహాయపడగలదు.

7) రోగనిరోధక వ్యవస్థను ప్రోత్సహిస్తుంది

7) రోగనిరోధక వ్యవస్థను ప్రోత్సహిస్తుంది

ముద్దు కారణాన, మీరు మరియు మీ భాగస్వామి ఇద్దరూ లాలాజల మార్పిడికి పూనుకుంటారు. ఇది జరిగినప్పుడు, మీ భాగస్వామి యొక్క లాలాజలంలోని జెర్మ్స్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది మీ రోగనిరోధక వ్యవస్థ నుండి ప్రతిస్పందనలను ప్రేరేపిస్తుంది, ఇక్కడ రోగనిరోధక వ్యవస్థ కొత్త జెర్మ్స్ గుర్తిస్తుంది మరియు శరీరాన్ని కొత్త క్రిములతో పోరాడటానికి సిద్ధం చేస్తుంది, తద్వారా మీ రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. అనగా నిద్రాణ స్థితిని మేల్కొల్పుతుంది.

8) అలర్జీలను తగ్గిస్తుంది

8) అలర్జీలను తగ్గిస్తుంది

ముద్దు అలెర్జీలను ఎలా తగ్గిస్తుంది? వాస్తవానికి ముద్దులు, దద్దుర్లు (ఉర్టికారియా), దుమ్ము మరియు పుప్పొడి వలన కలిగే అలెర్జీలు వంటి అలెర్జీలను తగ్గిస్తాయని నిరూపించబడింది. అంతేకాకుండా, ఒత్తిడి అనేది అలెర్జీలను ప్రేరేపించే విషయాలకు సాధారణ కారకంగా ఉంది. ముద్దుపెట్టుకోవడం వలన ఒత్తిడి తగ్గుతుంది, ఇది కూడా అలెర్జీలను తగ్గించడంలో ప్రభావం చూపుతుంది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆహార, ఆరోగ్య, జీవన శైలి, ఆద్యాత్మిక, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

12 reasons why you should smooch more

A smooch or a kiss is more than just a way of showing love or affection. It has been scientifically proven to have multiple mental as well as physical health benefits! From making us stress-free to improving our immune system, here's presenting 12 reasons why smooching could help us lead a happier and healthier life!
Story first published:Thursday, August 23, 2018, 17:45 [IST]
Desktop Bottom Promotion