బ్రదర్.. బార్ కెళ్లి ఏవేవో తాగే బదులు బార్లీ జావ తాగి చూడండి.. మస్తుగుంటది..ఆ సామర్థ్యం పెరుగుతుంది

Written By:
Subscribe to Boldsky

బార్లీ గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొవ్వును అదుపులో ఉంచి, బరువు తగ్గాలనుకునేవారికి బార్లీ మంచి పరిష్కారం. బార్లీ నీరు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలుంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అనేక అనారోగ్యాలను దూరం చేసే శక్తి ఇందులో ఉందని అంటున్నారు.

చిన్నపిల్లలకు బార్లీ నీటిని తాగించడం వల్ల మూత్రం చెడువాసన రాదు. బార్లీ నీటిని పరగడుపునే తాగితే శరీరంలోని వ్యర్థ, విష పదార్థాలన్నీ మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయి. పెద్ద పేగు శుభ్రపరిచి కోలన్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది.

ఉపశమనం లభిస్తుంది

ఉపశమనం లభిస్తుంది

హార్మోన్లకు సంబంధించిన చికిత్స తీసుకుంటున్నవారు బార్లీ నీటిని తాగితే ఉపశమనం లభిస్తుంది. తిన్న ఆహారం గొంతులోకి వచ్చినట్లుగా ఉండేవారికి బార్లీ నీరు మంచి ఫలితాలనిస్తుంది. కడుపులో మంట, అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు దూరమవుతాయి.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

వేడిచేసినవారు బార్లీ నీటిని తాగడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. బార్లీ నీటిలో సహజసిద్ధంగా ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాల వల్ల కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. బార్లీలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

బరువు తగ్గాలనుకునేవారు

బరువు తగ్గాలనుకునేవారు

బరువు తగ్గాలనుకునేవారికి బార్లీ నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే పోషకాలు శరీర మెటబాలిజాన్ని క్రమబద్ధీకరిస్తాయి. దీంతో బరువు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

మధుమేహం ఉన్నవారు

మధుమేహం ఉన్నవారు

మధుమేహం ఉన్నవారు బార్లీ నీటిని తాగడం చాలా మంచిది. ఇందులో ఉండే బీటా గ్లూకాగాన్ గ్లూకోజ్ గ్రహించడాన్ని ఆలస్యం చేస్తుంది. దీని వల్ల రక్తంలో చక్కెర నిల్వలు పెరిగే అవకాశం తగ్గుతుంది.

చెడు కొలెస్ట్రాల్

చెడు కొలెస్ట్రాల్

శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. దీని వల్ల గుండె సంబంధిత వ్యాధులు ధరిచేరవు. బీపీ కూడా అదుపులో ఉంటుంది. బార్లీ నీటికి కిడ్నీలో రాళ్లను కరిగించే శక్తి ఉంది. గర్భవతులు బార్లీనీటిని తాగితే మూత్రాశయ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. బాలింతలకు బార్లీ నీటిని తాగిస్తే పాలు బాగా పడతాయి. జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది.

ఇలా తయారు చేసుకోవచ్చు..

ఇలా తయారు చేసుకోవచ్చు..

ఒక పాత్రలో లీటరు మంచినీటిని తీసుకొని, అందులో గుప్పెడు బార్లీ గింజలను వేయాలి. 20 నిమిషాలపాటు ఈ నీటిని బాగా మరిగించాలి. దీంతో బార్లీ గింజలు మెత్తగా మారి, వాటిలోని పోషకాలన్నీ నీటిలోకి చేరతాయి. తర్వాత ఆ నీటిని చల్లార్చి కొద్దిగా నిమ్మరసం లేదా తేనె కలుపుకోవాలి. ఈ నీటిని నిత్యం ఉదయాన్నే పరగడుపున తాగాలి.

రాళ్లు ఉన్నా కరిగిపోతాయి

రాళ్లు ఉన్నా కరిగిపోతాయి

బార్లీ గింజల్ని నానబెట్టి ఉడికించి వడకట్టిన నీళ్లు అప్పుడప్పుడు మాత్రమే కాదు... ఈ వేసవిలో తరచూ తాగడం మంచిది. ఎందుకంటారా..చాలామందిని బాధించే ప్రధాన సమస్యల్లో మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌ ఒకటి. ఈ సమస్యను అదుపులో ఉంచాలంటే ఉదయం పూట గ్లాసు బార్లీ నీళ్లు తాగితే చాలు. మూత్రంలోని ఇన్‌ఫెక్షన్లూ, వ్యర్థాలు ఇట్టే దూరం అవుతాయి. మూత్ర పిండాలు శుభ్రపడతాయి. రాళ్లు ఉన్నా కరిగిపోతాయి.

హృద్రోగ సమస్యలూ దరి చేరవు

హృద్రోగ సమస్యలూ దరి చేరవు

బార్లీలో పీచు, బీటా గ్లూకాన్లు అధికం. ఇవి శరీరానికి మేలు చేస్తాయి. రక్తంలో కొలెస్ట్రాల్‌ శాతం తగ్గించడంలోనూ బార్లీ నీళ్లు కీలక పాత్ర పోషిస్తాయి. హృద్రోగ సమస్యలూ దరి చేరకుండా ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్‌ బి రక్తపోటు సమస్యను దూరం చేస్తుంది.

మలబద్దకం ఉండదు

మలబద్దకం ఉండదు

ఆహారం సరిగా జీర్ణం కానప్పుడు ఉదరసంబంధ సమస్యలు ఉన్నప్పుడు బార్లీ నీళ్లు ఎంత తాగితే అంత మంచిది. ఇలా తీసుకోవడం వల్ల జీర్ణాశయం శుభ్రపడుతుంది. మలబద్దకం ఉండదు. వేసవి కాలంలో డీహైడ్రేషన్‌ సమస్యతో బాధపడేవారు దీన్ని తీసుకోవచ్చు. అది అదుపులోకి రావడమే కాదు..ఎండ ప్రభావం కైడా ఉండదు.

ఇన్సులిన్‌ అదుపు తప్పదు

ఇన్సులిన్‌ అదుపు తప్పదు

ప్రతిరోజు బార్లీ నీరు తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెరస్థాయిల్లో హెచ్చు తగ్గులు ఉండవు. ఇన్సులిన్‌ కూడా అదుపు తప్పదు. దీనిలో ఉండే గ్లైసమిక్‌ ఇండెక్స్‌ కూడా తక్కువగా ఉంటుంది. ఫలితంగా క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక సమస్య కూడా దరి చేరదు అని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. గర్భిణులను కాళ్లవాపు సమస్యలు ఎక్కువగా వేధిస్తాయి. ఇలాంటి వారు రోజులో ఒకసారైనా బార్లీ తాగితే మంచిది. దాని వల్ల ఆ సమస్య తగ్గడమే కాకుండా శరీరం కూడా అలసిపోకుండా చురుగ్గా మారుతుంది.

కాలిన గాయాలకు

కాలిన గాయాలకు

బార్లి గింజలను బాండి లో వేసి పొయ్యి మీద పెట్టి చిన్న మంట మీద వేడి చేస్తూ నల్లగా మాడ్చాలి. తరువాత వాటిని తగినంత నువ్వులనూనె తో కలిపి మెత్తగా మర్దించి ఆ గంధాన్ని కాలిన గాయాల మీద లేపనం చేస్తూ ఉంటే కాలిన గాయాలు అతి త్వరగా పోతాయి .

వేడిగడ్డల నివారణకు

వేడిగడ్డల నివారణకు

బార్లీ పిండి , గొధుమ పిండి , మినప పిండి ఈ మూడింటిని సమభాగాలుగా తీసుకుని కొంచం నీళ్లలో కలిపి ఉడకబెట్టి భరించగలిగినంత వేడిగా ఉన్నప్పుడు ఆ పిండిని గడ్డల మీద వేసి కట్టుకడుతూ ఉంటే గడ్డలు త్వరగా పక్వానికి వచ్చి పగిలిపోతాయి . తొందరలొనే మానిపోతాయి .

స్థూల కాయానికి

స్థూల కాయానికి

బార్లీ గింజల పిండితో రొట్టె చేసుకోని గాని , జావ చేసుకొని గాని ఆహారంగా వాడుతూ ఉంటే క్రమంగా స్థూలకాయత్వం తగ్గిపోయిశరీరం నాజూగ్గా మారుతుంది. బ్రదర్.. బార్ కెళ్లి ఏవేవో తాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకునే బదులు బార్లీ వాటర్, జావ తాగి ఆరోగ్యంగా ఉండండి.

శీఘ్రస్ఖలనం సమస్య

శీఘ్రస్ఖలనం సమస్య

సెక్స్‌లో శీఘ్రస్ఖలనం సమస్యతో బాధపడే పురుషులు బార్లీతో బలం పొందవచ్చు. పలువురు పురుషులు రాత్రి పూట బెడ్‌పైకి ఎక్కగానే రెండు మూడు నిమిషాల్లో వీర్య స్ఖలనం కావడంతో అప్సట్ అవుతుంటారు. అదేవిధంగా వీర్యం కూడా బాగా పలుచగా నీళ్లవలే ఉంటుంది. అటువంటి వారు బార్లీ గంజితో మేలైన ఫలితాన్ని పొందవచ్చు.

ఇలా తయారు చేసుకోండి

ఇలా తయారు చేసుకోండి

బార్లీ గింజలు 20 గ్రాములు తీసుకుని అర లీటరు నీళ్ళలో వేసి స్టౌ మీద పెట్టి పావు లీటరు నీరు మిగిలే వరకు సన్నని మంట మీద మరగబెట్టాలి. తర్వాత దానిని వడబోసుకుని 40 రోజుల పాటు ప్రతి రోజూ తాగుతూ ఉంటే శరీరంలోని అమితవేడి హరించి, వీర్యం గట్టిపడి సంభోగశక్తి సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది.

English summary

15 amazing barley water benefits drink up this elixir to good health

15 amazing barley water benefits drink up this elixir to good health
Story first published: Saturday, May 12, 2018, 17:00 [IST]