ఈ 15 ఆహారాలు ఆరోగ్యానికి గ్రేట్ అనుకుంటాము, కానీ కాదు!

By: Mallikarjuna
Subscribe to Boldsky

హాలో..! మీరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నారా? మీ ప్లేట్ లో ఉన్నది హెల్తీ ఫుడ్డేనా? ఒకసారి ఆలోచించండి! చాలా వరకూ ఆరోగ్యకరమైన ఆహారాలు మీరు తీసుకునే ఫుడ్ క్యాటగరీలో కాదు, మీ గ్రాసరీ లిస్ట్ లో ఉండాల్సిందే,.

వాస్తవంగా చెప్పాలంటే బయట మార్కెట్లో కొనుగోలు చేసే అన్ని రకాల ఆహారాలు ఆరోగ్యకరమైనవి కాకపోవచ్చు. లేదా మీరు కొనే ప్రతి ఆహార కాంబినేషన్, లేదా సమయం సరైనవి కాకపోవచ్చు. సీజనల్ గా పండే ఆహారాలు కాకపోవచ్చు.

ఉదాహరణకు, ఒక బాసిల్ పెస్టో గ్రీన్ కలర్లో కనిపించే ఈ ఆహారపదార్థంను చూసి, ఆరోగ్యకరమైనదిగా భావిస్తారు, అయితే మీరు పప్పులో కాలేసినట్లే, ఎందుకంటే ఇవి ప్రిజర్వేటివ్స్ నిల్వచేయడం కోసం ఉప్పును ఎక్కువగా ఉపయోగించి ఉంటారో, షాప్ లో అందుబాటులో ఉండే పెస్టోలో 1.5గ్రాముల సాల్ట్ ఉంటుంది.

అలాగే, పాస్తా సాస్ మరియు సలాడ్ డ్రెస్సింగ్ లలో కూడా ఎక్కువ ఉప్పు ఉంటుంది. వీటిని తినడం వల్ల శరీరంలో సోడియం కంటెంట్ పెరుగుతుంది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు.

ఇలాంటి ఆహారాలు మీకు కొంచెం కన్ఫ్యూజన్ కలిగించవచ్చు. ఎలాంటి ఆహారాలు ఆరోగ్యానికి మంచివి అని గందరగోళం పడేయవచ్చు. అది తెలుసుకోవడానికి ఈ క్రింద సూచించిన 15 రకాల ఆహారాలు ఆరోగ్యకరమైనవి అని అనుకుంటాము, కానీ ఇవి ఆరోగ్యాని మంచివి కాదు, అదెలాగో తెలుసుకుందాం..

15 Foods We Think Are Healthy But Aren't

1. హోల్ వీట్ సెరెల్

వీట్ సెరెల్ మార్కెట్లో వివిధ రకాలు అందుబాటులో ఉన్నాయి,. అయితే వీటిని ఫ్రోస్ట్ చేయడం లేదా షుగర్ కోట్ చేయడం వల్ల ఇవి చూడటానికి హెల్తీగా అనిపించినా, తినడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదుర్కుంటారు, కాబట్టి, వీటికి ప్రత్యామ్నాయంగా ఓట్ మీల్, నట్స్ మరియు బెర్రీస్ తీసుకోవడం ఉత్తమం.

2. డ్రైడ్ ఫ్రూట్స్

2. డ్రైడ్ ఫ్రూట్స్

డ్రైడ్ ఫ్రూట్స్ చూడటానికి కలర్ ఫుల్ గా అట్రాక్టివ్ గా కనబడుతాయి, రుచికరంగా కూడా ఉంటాయి. చాలా మంది డ్రైడ్ ఫ్రూట్స్ ను స్నాక్ గా మరియు డిజర్ట్ గా తీసుకుంటారు. ఇవి ఆరోగ్యానికి అంత మంచిది కాదు. డ్రైడ్ ఫ్రూట్స్ లో 3టైమ్స్ షుగర్ జోడించి కండెన్స్ చేసి ఉంటాయి. ఈ విషయం మీకు తెలియదు కదూ!

3. లైట్ సలాడ్ డ్రెస్సింగ్

3. లైట్ సలాడ్ డ్రెస్సింగ్

సలాడ్ ప్రిపరేషన్ కోసం ఫ్యాటీ డ్రెస్సింగ్ ను ఎంపిక చేసుకోవడం లేదా లోఫ్యాట్ డ్రెస్పింగ్ ఉపయోగిస్తుంటే ఒక సారి ఆలోచించండి!సలాడ్ డ్రెస్సింగ్ నిల్వ చేసే క్రమంలో కొన్ని రకాల ప్లేవర్స్ ఆడిటివ్స్ ను జోడిస్తారు, ఇవి ఆరోగ్యానికి హానికరం. వీటికి ప్రత్యామ్నాయంగా ఆలివ్ ఆయిల్ లేదా వెనిగర్ వంటివి సలాడ్ డ్రెస్సింగ్ గా ఉపయోగించుకోవచ్చు.

4. లోఫ్యాట్ మఫిన్స్

4. లోఫ్యాట్ మఫిన్స్

బయట మార్కెట్లో లోఫ్యాట్ మఫిన్స్ ను ఎంపిక చేసుకుంటున్నట్లైతే మీరు తప్పు చేస్తున్నట్లే, లోఫ్యాట్ మఫిన్స్ వివిధ రకాల ఫ్లేవర్స్ అందుబాటులో ఉంటాయి, ఇవి రుచికరమైనవి కూడా, అయితే వాస్తవం ఏంటంటే వీటిని తయారుచేసే క్రమంలో వీటిలో షుగర్స్ జోడించడిస్తారు. ఇలా చేయడం ఆరోగ్యానికి హానికరం.

5. ఫ్లేవర్డ్ యోగర్ట్

5. ఫ్లేవర్డ్ యోగర్ట్

ప్రొబయోటిక్ మరియు గ్రీక్ యోగర్ మంచి స్నాక్, అయితే ఎక్కువగా పెరుగును తీసుకోవడం వల్ల న్యూట్రీషినల్ బెనిఫిట్స్ కోల్పోవడం జరుగుతుంది. ప్రత్యామ్నాయంగా ప్లెయిన్ పెరుగును కొనడం, లేదా ఇంట్లో తయారుచేసుకోవడం చేయవచ్చు. వీటి ద్వారా తగిన పోషకాలను పొందుతారు, భయపడాల్సిన అవసరం ఉండుదు .

6. డైట్ సోడ

6. డైట్ సోడ

డైట్ సోడ అంటే చాలా మందికి ఇష్టం, అయితే ఇందులో షుగర్ కూడా జోడిస్తారని మీకు తెలుసా, డైట్ సోడా మంచి ఎంపికే కానీ, డైట్ సోడా నిల్వచేయడానికి జోడించే కొన్ని రకాల ఫ్లేవర్స్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఆరోగ్యానికి హాని కలుగచేస్తాయి. ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఆరోగ్యానికి అంత మంచివి కావు .

7. ఫ్రూట్ జ్యూస్ :

7. ఫ్రూట్ జ్యూస్ :

మార్కెట్లో లభించే ఫ్రూట్ జ్యూసులు వంద శాతం స్వచ్చమైనవి అంటారు. ఇవి ఫ్రూట్ జ్యూసులు మాత్రమే కాదు, ఇవి షుగర్ తో నిండి ఉంటాయి. ప్యాక్ చేసిన ఫ్రూట్ జ్యూస్ లలో షుగర్ జోడించి ఉండటం వల్ల శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ పెరుగుతాయి. కాబట్టి, వీటికి ప్రత్యామ్నాయంగా ఇంట్లోనే స్వయంగా ఫ్రూట్ జ్యూస్ లను తయారుచేసుకోండి.

8. ప్రోటీన్ బార్స్

8. ప్రోటీన్ బార్స్

మరో వ్యూహాతీత పదార్థం ప్రోటీన్ బార్, ఇది ప్రోటీన్ బార్ కాదు, షుగర్ బార్. దీన్ని మారువేషంలో ఉన్న ప్రోటీన్ బార్ అని పిలుస్తారు, అన్ని రకాల ప్రోటీన్ బార్లు ఆరోగ్యకరమైనవి కావు, వీటిలో కూడా షుగర్ ఉంటాయి. కాబట్టి, కొడనడానికి ముందు జాగ్రత్తగా లేబుల్స్ చదివి కొనడం లేదా మీట్, హంమ్స్, పాలు లేదా నట్స్ వంటి న్యాచురల్ ప్రోటీన్స్ తీసుకోవడం ఉత్తమం.

9. బనానా చిప్స్

9. బనానా చిప్స్

బనానా చిప్స్ లో న్యూట్రీషియన్స్ ఎక్కువ అని భావిస్తారు . కానీ ఇవి శరీరంలో క్యాలరీలను జోడించడంతో పాటు, షుగర్ ను కూడా శరీరానికి జత చేస్తుంది. కాబట్టి బానానా చిప్స్ కానీవ్వండి లేదా వేరే ఏ ఇతర డీప్ ఫ్రై చేసిన చిప్స్ అయినా సరే ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. వీటికి ప్రత్యామ్నాయంగా ఫ్రెష్ బనానా తినడం వల్ల మీకు కావల్సిన పోషకాలను అందిస్తుంది.

10. నిల్వ చేసిన పెరుగు

10. నిల్వ చేసిన పెరుగు

ఫ్రోజెన్ యోగర్ట్ , ఇది ఆరోగ్యకరమైన డిజర్ట్ అని అందరు అనుకుంటారు. కానీ, ఇది హెల్తీ డిజర్ట్ కాదు. ఇందులో ఫ్యాట్ తక్కువగా ఉండవచ్చు. కానీ షుగర్ కెంటెంట్, క్యాలరీలు ఇతర డిజర్ట్స్ లో లాంటివే అంటారు. కాబట్టి, మీరు హెల్తీ డిజర్ట్ కోరుకుంటున్నట్లైతే ఫ్రోజోడ్డ్ బనానా, డార్క్ చాక్లెట్ చిప్స్, మరియు స్ట్రాబెర్రీతో సులభంగా తయారుచేసుకోవచ్చు.

11. గ్రానోలా

11. గ్రానోలా

గ్రానోలా హెల్తీ ఫుడ్ అనుకుంటారు కానీ, కాదు. సూపర్ మార్కెట్లో అందుబాటులో ఉండే వివిధ రకాల గ్రానోలా బటర్, వెజిటేబుల్ ఆయిల్ మరియు వైట్ షుగర్ వంటి వాటితో తయారుచేస్తారు?మీరు కొనే గ్రానుల బార్ ఏ కంపెనీది, ఏ బ్రాండ్ దో అన్నది కాదు , మీరు ఊహించిన దానికంటే ఇంకా ఎక్కువ క్యాలరీలు ఇందులో ఉన్నాయి.

12. ప్యాకేజ్డ్ సూప్స్

12. ప్యాకేజ్డ్ సూప్స్

బరువు తగ్గాలనుకొనే వారికి ప్యాకేజ్డ్ సూప్స్ గ్రేట్ చాయిస్, అయితే గ్రేట్ చాయిస్ అనుకోకూడదు, ఎందుకంటే, వీటిలో సాల్ట్, షుగర్స్ చేర్చబడి ఉంటాయి. వీటికి ప్రత్యామ్నాయంగా చికెన్ మరియు వెజిటేబుల్ సూప్ ను ఇంట్లోనే హెల్తీగా తయారుచేసుకోవచ్చు.

13. మాప్లే సిరఫ్

13. మాప్లే సిరఫ్

మీరు మాప్లే సిరఫ్ ను ఇష్టపడుతున్నట్లైతే, మీరు చెడు వార్తే. మాప్లే సిరఫ్ చెక్కరతో నిండి ఉంటుంది. అంతే కాదు ఒక టేబుల్ స్పూన్ సిరఫ్ కు 52 క్యాలరీలుంటాయి. దీనికి ప్రత్యామ్నాయంగా తేనె తీసుకోవడం వల్ల న్యాచురల్ స్వీట్ వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హానీ జరగదు.

14. ఫ్లేవర్డ్ ఐస్ టీ

14. ఫ్లేవర్డ్ ఐస్ టీ

ఫ్లేవర్డ్ ఐస్ టీ తీసుకోవడం వల్ల నడుము చుట్టుకొలత పెరుగుతుంది. ఐస్ టీలో స్వీట్నర్స్ ఉండటం వల్ల ఇవి బ్లడ్ ప్రెజర్ ను పెంచి , ఇన్సులిన్ పెరగడానికి కారణం అవుతుంది. బరువు పెరగడానికి కారణం అవుతుంది.

15. సాల్ట్ నట్స్

15. సాల్ట్ నట్స్

సాల్ట్ లో వేయించిన నట్స్ తినడం వల్ల శరీరంలో సోడియం కంటెంట్ పెంచుతుంది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు, పచ్చి డ్రైనట్స్ తీసుకోవడం వల్ల ఫుల్ గా న్యూట్రీషియన్స్ పొందుతారు. మరియుఇవి ఆరోగ్యానికి మంచివి కూడా..

English summary

15 Foods We Think Are Healthy But Aren't

Do you like to drink diet soda or eat protein bars for the sake of losing weight? You are doing it all wrong. Check out these healthy foods that are bad for your health and stay away from them!
Story first published: Tuesday, January 16, 2018, 14:00 [IST]
Subscribe Newsletter