చాలా మంది బాడీలో చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది.. ఇలా చేసి కొవ్వుతో చెడుగుడు ఆడండి

Written By:
Subscribe to Boldsky

చాలా మందిలో కొలెస్ట్రాల్ కామన్ ప్రాబ్లమ్ . 80శాతం మంది కొలెస్ట్రాల్ వల్ల గుండె సంబంధిత వ్యాధులతో బాధపడటం లేదా చనిపోవడం జరుగుతున్నది. అధిక కొలెస్ట్రాల్ వల్ల హార్ట్ సమ్యలు పెరుగుతాయి. ఇవి ప్రాణాంతకంగా మారుతాయి.

శరీరంలో ఉండే ఎల్ డిఎల్ కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్ ఇది హార్ట్, కిడ్నీలు, ధమనులు బ్లాక్ అవ్వడం వంటి సమస్యలకు గురిచేసి, ప్రాణాంతకంగా మారుతుంది. శరీరంలో కొవ్వు ఎక్కువగా నిల్వచేరడం వల్ల అనేక సమస్యలు వస్తాయి.కొలెస్ట్రాల్ నీటితో కరగదు. ఇది రక్తనాళాల్లోకి చేరడం వల్ల శరీర ఆరోగ్యం రిస్క్ లో పడుతుంది.

చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్), మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) అని రెండు ఉంటాయి. మంచి కొలెస్ట్రాల్ మన శరీరానికి మేలు చేస్తే, చెడు కొలెస్ట్రాల్ మాత్రం మనకు చేటు తెస్తుంది. పలు అనారోగ్య సమస్యలను తెచ్చి పెడుతుంది. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతే గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది.

పేరుకుపోకుండా చూసుకోవాలి

పేరుకుపోకుండా చూసుకోవాలి

అధికంగా బరువు పెరుగుతారు. కనుక ఎవరైనా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా చూసుకోవాలి. అందుకు నిత్యం వ్యాయామం చేయడంతోపాటు కింద సూచించిన విధంగా పలు ఆహారాలను రోజూ తీసుకోవాలి. దీంతో చెడు కొలెస్ట్రాల్‌ను అంతం చేయవచ్చు. తద్వారా ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు. మరి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకునేందుకు నిత్యం తీసుకోవాల్సిన ఆ ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందామా..!

యాపిల్

యాపిల్

నిత్యం ఒక యాపిల్ పండు తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదని అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే యాపిల్‌ను రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ పోతుంది. లివర్ తయారు చేసే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణాలు యాపిల్‌లో ఉంటాయి. అందుకని రోజూ ఒక యాపిల్ పండు తింటే మంచిది.

బీన్స్

బీన్స్

బీన్స్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ తయారీని అడ్డుకుంటుంది. బీన్స్‌లో ఉండే లేసిథిన్ అనే పదార్థం చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. దీంతోపాటు బీన్స్‌లో ఉండే పొటాషియం, కాపర్, పాస్ఫరస్, మాంగనీస్, ఫోలిక్ యాసిడ్‌లు కూడా శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.

ద్రాక్ష

ద్రాక్ష

ఆంతోసైనిన్స్, టానిన్స్ వంటి పదార్థాలు ద్రాక్షల్లో పుష్కలంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ద్రాక్షలో ఉండే పొటాషియం శరీరంలో ఉండే విష పదార్థాలను బయటకు పంపుతుంది.

జామ

జామ

జామ పండ్లలో విటమిన్ సి, పాస్ఫరస్, నికోటిన్ యాసిడ్, సాల్యుబుల్ ఫైబర్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె వ్యాధులు రాకుండా చూస్తాయి.

పుట్టగొడుగులు

పుట్టగొడుగులు

శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో పుట్టగొడుగులు కూడా ఎంతగానో దోహదం చేస్తాయి. వీటిల్లో ఉండే విటమిన్ బి, సి, కాల్షియం, ఇతర మినరల్స్ చెడు కొలెస్ట్రాల్ పని పడతాయి.

గింజలు

గింజలు

అవిసె గింజలు, బాదం పప్పుల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. గుండెను పదిలంగా ఉంచుతాయి.

వెల్లుల్లి

వెల్లుల్లి

వంటలకు చక్కని రుచి, వాసన తేవడంలో వెల్లుల్లిని మించింది లేదు. కేవలం ఆ విషయంలోనే కాదు, శరీరంలో పేరుకుపోయే చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించడంలోనూ వెల్లుల్లి అమోఘంగా పనిచేస్తుంది. నిత్యం ఉదయాన్నే పరగడుపున ఒక వెల్లుల్లి రెబ్బను అలాగే తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

ఓట్స్, సబ్జా

ఓట్స్, సబ్జా

ఓట్స్, సబ్జా గింజలను రోజూ ఆహారంలో భాగం చేసుకున్నా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

పెసలు

పెసలు

పెసలలో మన శరీరానికి పనికొచ్చే శక్తివంతమైన ప్రోటీన్లు ఉంటాయి. ఇవి శరీర నిర్మాణానికి పనికొస్తాయి. అలాగే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలోనూ పెసలు అమోఘంగా పనిచేస్తాయి. నిత్యం ఒక కప్పు మోతాదులో ఉడకబెట్టిన పెసలను నెల రోజుల పాటు తింటే ఆశించిన ఫలితం వస్తుంది.

ఆరెంజ్ జ్యూస్ తాగాలి

ఆరెంజ్ జ్యూస్ తాగాలి

రెండు గ్లాసుల ఆరెంజ్ జ్యూస్ ను రోజూ ఉదయం తాగడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. ఫ్రెష్ గా తయారుచేసిన ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల శరీరంలో ఆరోగ్యకరమైన రక్తనాళాలను కలిగి ఉంటుంది. షుగర్ మానేయాలి. షుగర్ కు ప్రత్యామ్నాయంగా తేనె ఉపయోగించవచ్చు.

మితాహారం తీసుకోవాలి

మితాహారం తీసుకోవాలి

రోజుకు 6 లేదా 7 సార్లు మితాహారం తీసుకునే వారిలో వేగంగా కొలెస్ట్రాల్ తగ్గినట్లు కనుగొన్నారు. మితాహారం తీసుకోవడం వల్ల కరోనరీ డిసీజెస్ 10 నుండి 20 శాతం తగ్గుతుంది.

ఒక గ్లాస్ రెడ్ వైన్ తాగాలి

ఒక గ్లాస్ రెడ్ వైన్ తాగాలి

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను వేగంగా తగ్గించుకోవాలంటే, ఒక గ్లాస్ రెడ్ వైన్ తాగాలి. పరిశోధన ప్రకారం రెడ్ వైన్ హెచ్ డిఎల్ కొలెస్ట్రాల్ వెవల్స్ ను పెంచుతుంది. రెడ్ వైన్ లో ఉండే సాపోనిన్స్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి పాజిటివ్ ఎఫెక్ట్ ను కలిగి ఉంటుంది.

త్రుణ ధాన్యాలు

త్రుణ ధాన్యాలు

వైట్ బ్రెడ్ కు బదులుగా బ్రౌన్ బ్రెడ్ ను తీసుకోవాలి. ఇది హెచ్ డి ఎల్ లెవల్స్ ను పెంచుతుంది. త్రుణ ధాన్యాలు ఎక్కువ డైరీ ఫ్రైబర్ ను కార్డీయో వ్యాధులను నివారిస్తుంది. బ్రౌన్ రైస్ మరియు హోల్ వీట్ పాస్తాలలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మంచి కొలెస్ట్రాల్ పెంచుతుంది.

సలాడ్ డ్రెస్సింగ్ కోసం ఆలివ్ ఆయిల్

సలాడ్ డ్రెస్సింగ్ కోసం ఆలివ్ ఆయిల్

ఆయిల్లో మోనో శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా ఉంటుంది. ఇది మెటబాలిక్ సిండ్రోమ్ లేదా డయాబెటిస్ తో బాధపడే వారిలో ఎల్ డిఎల్ కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది

English summary

15 home remedies to naturally reduce bad cholesterol

15 home remedies to naturally reduce bad cholesterol
Story first published: Saturday, May 12, 2018, 9:30 [IST]