పుచ్చకాయలతో ఆ సామ‌ర్థ్యం పెరుగుతుంది.. వేసవిలో పుచ్చకాయలను తినడం మరిచిపోకండి

Written By:
Subscribe to Boldsky

కాలానికనుగుణంగా ప్రకృతి మనకు వివిధ రకాల ఫలాలను ఇస్తుంటుంది. వేసవి వచ్చిందంటే పుచ్చకాయలు, తాటి ముంజలు, మామిడి పండ్లు వచ్చేస్తాయి. ప్రస్తుతం పుచ్చకాయలు వచ్చేశాయి. మృదువుగా, తీయగా, రసపభరితమైన పుచ్చకాయ ఈ వేసవికి చాలా ఉపయోగకరమైనది. వాటిని తింటే దాహం తీరిపోతుంది. పుచ్చకాయల ద్వారా సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్‌లు మీకు లభిస్తాయి. హృదయ సంబంధ వ్యాధులకి, ప్రేగు క్యాన్సర్‌కి, అలాగే మధుమేహానికి చాలా మంచివని పరిశోధనలు తేల్చారు.

92 శాతం నీరు

92 శాతం నీరు

వాటిలో ఎ, బి, సి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే తక్కువ క్యాలరీలు, ఎక్కువ పోషకాలు ఉంటాయి. పుచ్చకాయ జూస్‌ తాగేందుకు అనువైన పానీయం. ఎందుకంటే, అందులో 92 శాతం నీరు ఉంటుంది. పైగా కొలెస్ట్రాల్‌ లాంటివి అందులో ఉండవు. వెంటనే తన ప్రభావాన్ని చూపిస్తుంది.

సరియైన పుచ్చకాయ

సరియైన పుచ్చకాయ

అయితే సరియైన పుచ్చకాయను ఎంచుకోవాలి. మచ్చలుగానీ, దెబ్బలుగానీ లేని నిగనిగలాడే పుచ్చకాయను ఎంచుకోవాలి. దాన్ని చుట్టూ తిప్పినప్పుడు ఒక పక్క మీకు పసుపు రంగు కన్పిస్తుంది. అలా పసుపు రంగు కన్పించడం చాలా మంచి సూచన. ఆ రంగు అది సూర్యకిరణాలలో పండిందని తెలియజేస్తుంది. అది తీయగా, రసభరితంగా ఉంటుందనడానికి కూడా అదే సూచన.

పుచ్చకాయ కొనడం మరచిపోకండి

పుచ్చకాయ కొనడం మరచిపోకండి

పుచ్చకాయను తట్టినపుడు బోలుగా ఉన్నట్టు శబ్దం వస్తే అది పండిందని అర్థం. పుచ్చకాయ పెద్దదిగా ఉంటుందని, రిఫ్రిజిరేటర్‌లో ఎక్కువ చోటుని ఆక్రమించేస్తుందని మీరు ఎప్పుడూ వెనుకాడుతుంటారా? కానీ, ప్రస్తుతం లెక్కలేనన్ని చిన్న పుచ్చకాయలు మార్కెట్లో దొరుకుతున్నాయి. కాబట్టి, ఈ సారి పండ్ల షాపుకి వెళ్తే పుచ్చకాయ కొనడం మరచిపోకండి.

జ్యూస్ రూపంలో తీసుకున్నా

జ్యూస్ రూపంలో తీసుకున్నా

పుచ్చకాయలో విటమిన్ ఎ, బి1, బి6, సి, పొటాషియం, మెగ్నిషియం, మాంగనీస్, బయోటిన్ వంటి పోషకాలు ఎన్నో ఉన్నాయి. అయితే వేసవి కాలంలో మనకు ఎదురయ్యే అనారోగ్య సమస్యలను అధిగమించాలంటే ఈ సీజన్‌లో పుచ్చకాయను కచ్చితంగా తినాల్సిందే. దీన్ని అలాగే తిన్నా లేదంటే జ్యూస్ రూపంలో తీసుకున్నా అనేక లాభాలు పొందవచ్చు.

డీహైడ్రేష‌న్‌

డీహైడ్రేష‌న్‌

వేసవిలో చాలా మంది ఎదుర్కొనే సమస్య డీహైడ్రేష‌న్‌. ఎంత నీటిని తాగుతున్నా వేసవి తాపానికి ఆ నీరు ఇట్టే ఇంకిపోతుంది. దీంతో శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. ఫలితంగా వడదెబ్బ కూడా తగులుతుంది. అయితే అలా కాకుండా ఉండాలంటే పుచ్చకాయను తినాలి. దీంతో డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండవచ్చు.

బాడీ మొత్తం క్లీన్

బాడీ మొత్తం క్లీన్

శరీరంలోని వ్యర్థ పదార్థాలను సమర్థవంతంగా బయటికి పంపే ఔషధ గుణాలు పుచ్చకాయలో ఉన్నాయి. పుచ్చకాయను తరచూ తింటుంటే బాడీ మొత్తం క్లీన్ అవుతుంది. శరీరం అంతర్గతంగా శుభ్రమవుతుంది. దీంతో ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. వేసవి కాలంలో ఎండలో తిరిగే వారి చర్మం నల్లగా అవుతుంది. దీనికి తోడు చర్మంపై దద్దుర్లు, మంట కూడా వస్తాయి. అలాంటప్పుడు పుచ్చకాయ జ్యూస్‌ను తాగితే ఫలితం ఉంటుంది. ఇందులో ఉండే పోషకాలు చర్మ సమస్యలను నివారిస్తాయి.

జుట్టు దృఢంగా పెరుగుతుంది

జుట్టు దృఢంగా పెరుగుతుంది

ఎండాకాలంలో చాలా మంది జీర్ణ సంబంధ సమస్యలను ఎదుర్కొంటారు. గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు ఉన్నవారు పుచ్చకాయను తినాలి. దీంతో ఆయా సమస్యలు తగ్గిపోతాయి. పుచ్చకాయను అలాగే తింటున్నా, లేదంటే దాని జ్యూస్‌ను తాగినా వెంట్రుకల సమస్యలు తగ్గుతాయి. జుట్టు దృఢంగా పెరగడమే కాదు, ప్రకాశవంతంగా మారుతుంది కూడా. విటమిన్ సి, కెరోటిన్ వంటివి పుచ్చ‌కాయ ద్వారా ల‌భించ‌డం వల్ల జుట్టు సమస్యలు రావు.

విటమిన్ ఎ ఎక్కువగా ఉండడం వల్ల

విటమిన్ ఎ ఎక్కువగా ఉండడం వల్ల

పుచ్చకాయల్లో ఉండే ఔషధ గుణాలు బీపీని కంట్రోల్ చేస్తాయి. రక్త సరఫరాను మెరుగు పరుస్తాయి. గుండె సమస్యలు ఉన్న వారికి మంచి ఆహారం. పుచ్చకాయను తరచూ తింటుంటే రక్త సరఫరా మెరుగు పడడమే కాదు, రక్తం కూడా పెరుగుతుంది. విటమిన్ ఎ ఎక్కువగా ఉండడం వల్ల పుచ్చకాయను తింటే కంటి ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. కళ్లకు చాలా మంచిది. వేసవిలో కళ్లకు కలిగే ఇన్‌ఫెక్షన్లు దూరమవుతాయి.

టెన్షన్, ఆందోళన, ఒత్తిడి

టెన్షన్, ఆందోళన, ఒత్తిడి

నాడీ వ్యవస్థను ప్రభావితం చేసి మనస్సుకు రిలాక్సేషన్ ఇచ్చే గుణాలు పుచ్చకాయలో ఉన్నాయి. అందువల్ల పుచ్చకాయను తింటే మనస్సు ప్రశాంతంగా మారుతుంది. టెన్షన్, ఆందోళన, ఒత్తిడి వంటివి తగ్గుతాయి. కేవ‌లం పుచ్చ‌కాయ మాత్ర‌మే కాదు, అందులో ఉండే గింజ‌లు కూడా మ‌న‌కు ఉప‌యోగ‌మే. పుచ్చ‌కాయ విత్త‌నాల్లో అనేక ర‌కాల ఫ్యాటీ యాసిడ్లు, ప్రోటీన్స్‌, మిన‌ర‌ల్స్ ఉంటాయి.

పుచ్చ‌కాయ విత్త‌నాల‌ను తీసుకుంటే

పుచ్చ‌కాయ విత్త‌నాల‌ను తీసుకుంటే

విట‌మిన్ బి, థ‌యామిన్‌, నియాసిన్‌, ఫోలేట్‌, పొటాషియం, ఐర‌న్‌, జింక్‌, పాస్ఫ‌ర‌స్‌, కాప‌ర్ వంటి పోష‌కాలు ఉంటాయి. వీటి వ‌ల్ల మ‌న‌కు శ‌క్తి కూడా బాగానే ల‌భిస్తుంది. కేవ‌లం 100 గ్రాముల పుచ్చ‌కాయ విత్త‌నాల‌ను తీసుకుంటే వాటిలో 600 క్యాల‌రీల శ‌క్తి ఉంటుంది.

ఎండ‌బెట్టి పొడి చేసుకుని

ఎండ‌బెట్టి పొడి చేసుకుని

పుచ్చకాయ విత్త‌నాల‌ను పుచ్చ‌కాయల్లాగే నేరుగా తిన‌వ‌చ్చు. కానీ వాటి రుచి చాలా మందికి న‌చ్చ‌దు. అయితే అలా తిన‌లేక‌పోతే వాటిని ఎండ‌బెట్టి పొడి చేసుకుని నీటిలో క‌లుపుకుని తాగ‌వ‌చ్చు. లేదంటే విత్త‌నాల‌ను నీటిలో బాగా మ‌రిగించి ఆ నీటిని తాగాలి. అప్పుడు కింద చెప్పిన ఫ‌లితాలు క‌లుగుతాయి.

ఫైబ‌ర్ కూడా ఎక్కువే

ఫైబ‌ర్ కూడా ఎక్కువే

పుచ్చ‌కాయ విత్త‌నాల్లో ఫైబ‌ర్ కూడా ఎక్కువే. ఇది జీర్ణ సంబంధ స‌మ‌స్య‌ల‌ను తొల‌గిస్తుంది. జీర్ణాశ‌యం, పేగుల్లో ఉండే క్రిములు నాశ‌న‌మ‌వుతాయి. లివ‌ర్ వ్యాధులు, వాపుల‌తో బాధ‌ప‌డే వారికి పుచ్చ‌కాయ విత్త‌నాలు చ‌క్క‌ని ఔష‌ధంగా ప‌నిచేస్తాయి.

ర‌క్త స‌ర‌ఫరా

ర‌క్త స‌ర‌ఫరా

పుచ్చ‌కాయ విత్త‌నాల్లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్క‌లంగానే ఉన్నాయి. ఇవి శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డ‌మే కాదు, ప‌లు ర‌కాల ఇన్‌ఫెక్ష‌న్ల‌ను న‌యం చేస్తాయి. క్యాన్స‌ర్లు రాకుండా అడ్డుకుంటాయి. బీపీ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. ర‌క్త స‌ర‌ఫరా మెరుగు ప‌డుతుంది. గుండె సంబంధ స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. గుండె ఆరోగ్యం మెరుగ‌వుతుంది.

వ‌య‌స్సు మీద ప‌డ‌కుండా

వ‌య‌స్సు మీద ప‌డ‌కుండా

యాంటీ ఏజింగ్ ల‌క్ష‌ణాలు పుచ్చ‌కాయ విత్త‌నాల్లో ఉన్నాయి. వ‌య‌స్సు మీద ప‌డ‌డం కార‌ణంగా చ‌ర్మంపై వ‌చ్చే ముడ‌తలు పోతాయి. డ‌యాబెటిస్ ఉన్న వారికి పుచ్చ‌కాయ విత్త‌నాలు మేలు చేస్తాయి. ఇవి వారి ర‌క్తంలోని చ‌క్కెర స్థాయిల‌ను అదుపు చేస్తాయి. దీంతో మ‌ధుమేహం నియంత్ర‌ణ‌లో ఉంటుంది.

నీటిలో మ‌రిగించి

నీటిలో మ‌రిగించి

జ్వ‌రం వంటివి వ‌చ్చిన‌ప్పుడు పుచ్చ‌కాయ విత్త‌నాల‌ను మ‌రిగించి చేసిన నీటిని తాగిస్తే త్వ‌ర‌గా కోలుకుంటారు. పుచ్చ‌కాయ విత్త‌నాల్లో జ్ఞాప‌క‌శ‌క్తి పెంచే ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఈ విత్త‌నాల‌ను నీటిలో మ‌రిగించి త‌యారు చేసిన మిశ్ర‌మాన్ని తాగితే మెమొరీ ప‌వ‌ర్ అద్భుతంగా పెరుగుతుంది.

శృంగార సామ‌ర్థ్యం

శృంగార సామ‌ర్థ్యం

పురుషుల్లో శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంది. వీర్యం వృద్ధి చెందుతుంది. శుక్ర క‌ణాల్లో బాగా క‌ద‌లిక వ‌స్తుంది. దీంతో సంతానం పొంద‌డానికి అధికంగా చాన్స్ ఉంటుంది. ఒంట్లో నీరు అధికంగా చేరిన వారు పుచ్చ‌కాయ విత్త‌నాల‌తో చేసిన నీటిని తాగాలి. దీంతో ఆ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

English summary

20 reasons why watermelon is the perfect summer fruit

20 reasons why watermelon is the perfect summer fruit
Story first published: Wednesday, May 2, 2018, 9:00 [IST]