For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీకు ప్రత్యేకమైన టూత్ పేస్టు అవసరమని తెలిపే 4 లక్షణాలు

మీరు మీ చర్మం/జుట్టు రకానికి సంబంధించిన ఉత్పత్తులే ఎలా ఎంచుకుంటారో, మీ నోటి ఆరోగ్యానికి సరిపోయేవిధంగా టూత్ పేస్టును కూడా అలానే ప్రత్యేకంగా ఎంచుకోవాల్సి ఉంటుంది.

By Lekhaka
|

మీరు మీ చర్మం/జుట్టు రకానికి సంబంధించిన ఉత్పత్తులే ఎలా ఎంచుకుంటారో, మీ నోటి ఆరోగ్యానికి సరిపోయేవిధంగా టూత్ పేస్టును కూడా అలానే ప్రత్యేకంగా ఎంచుకోవాల్సి ఉంటుంది. టూత్ పేస్టులు చాలా వెరైటీల్లో లభిస్తాయి. అవి దంతక్షయం, చిగుళ్ళవ్యాధులు, పళ్ళు జివ్వుమనటం వంటి సమస్యలకి ప్రత్యేకంగా పోరాడే పదార్థాలతో విడివిడిగా వస్తాయి. ఇంకా వాటిల్లో పళ్ళని శుభ్రంగా, తెల్లగా మార్చే పదార్థాల వెరైటీలుంటాయి, దుర్వాసన కోసం ప్రత్యేకమైన ఫ్లేవర్లు కూడా ఉంటాయి.12

మామూలు టూత్ పేస్టునుంచి ప్రత్యేకమైన టూత్ పేస్టు కు మారటానికి మీకు తప్పనిసరయ్యే 4 లక్షణాలుః

singns you need a specialized toothpaste

పళ్ళు గారపట్టటం

మీ నోటిలోని బ్యాక్టీరియా బ్రష్ తో తోమడం, ఫ్లాసింగ్ వల్ల పోకపోతే, అవి మీ పళ్ళపై అతుక్కుపోయి, వందలాదిగా పెరిగిపోయి గారపట్టడం ప్రారంభమవుతుంది. ఈ అతుకున్న గార పళ్లని రెండు రకాలుగా పాడుచేస్తుంది. మొదటగా, ఆహారపదార్థాలు, ముఖ్యంగా చక్కెర పదార్థాలు దానికి అతుక్కుపోతాయి. గార ఈ ఆహారపదార్థాలను వాడుకుని మరింత బ్యాక్టీరియాను వృద్ధి చేసి, ఎక్కువ యాసిడ్ ను ఉత్పత్తి చేస్తుంది. రెండవది, ఈ గార పంటి ఉపరితలంపై యాసిడ్ ను పట్టి ఉంచుతుంది. దాన్ని తీసేయకపోతే, యాసిడ్ క్రమంగా ఎనామెల్ పై పనిచేసి కావిటీ కలిగిస్తుంది. గారకోసం ప్రత్యేకమైన టూత్ పేస్టును మీరు వాడినప్పుడు, నిజానికి అది కావిటీలను సృష్టించే సూక్ష్మజీవులతో పోరాడుతుంది.3

పళ్ళు జివ్వుమనటం

మీరు ఏదైనా వేడి లేదా చల్లని ఆహారపదార్థాలు, డ్రింక్స్ తింటున్నప్పుడు, బ్రష్ లేదా ఫ్లాసింగ్ చేస్తున్నప్పుడు లేదా చల్లగాలిని పీలుస్తున్నప్పుడు కూడా మీ పళ్ళు జివ్వుమనవచ్చు. పళ్ళలో సున్నితత్వం దానంతట అదే పోదు. మీరు జివ్వుమనటం తగ్గించే,సురక్షితమైన పేస్టు వాడటం మంచిది. ఇది నొప్పి పుట్టించే నాడీ చివర్లను మూసివేసి పళ్లలో సున్నితత్వాన్ని తగ్గిస్తుంది.3

పళ్లపై మరకలు

మీరు కాఫీ లేదా టీ, పొగాకు లేదా కొన్ని మందులు వాడుతున్నట్లయితే ఎప్పుడో ఒకప్పుడు మీ పళ్ళు తెలుపు నుండి రంగు మారిపోవటం తప్పదు. మళ్ళీ ముత్యాల్లాంటి పళ్ళ కోసం, మార్కెట్లో లభించే చాలా వైటనింగ్ టూత్ పేస్టులు రోజూ వాడవచ్చు.4 ఈ వైటనింగ్ టూత్ పేస్టులు పంటి ఉపరితలంపై పడ్డ మరకలను కొంచెం గరుకు పదార్థం కలిగివుండి ,రుద్ది పోగొడతాయి.5

నోటి దుర్వాసన

మీ పళ్లను రోజూ క్రమం తప్పకుండా బ్రష్ చేసుకోకపోతే, ఆహార పదార్థాల భాగాలు మీ నోట్లోనే ఉండిపోయి పళ్ళమధ్య, చిగుళ్ల చుట్టూ, నాలుకపై బ్యాక్టీరియా పెరిగేలా చేసి దుర్వాసన వచ్చేలా చేస్తాయి.6 దుర్వాసనకి మంచి ప్రభావం చూపే సరైన పేస్టు వాడటం ముఖ్యం. తాజా శ్వాసను ఇచ్చే టూత్ పేస్టులు దుర్వాసనపై ముసుగు తొడిగి ఉంచుతాయి కానీ నిజంగా హాలిటోసిస్ ను నయం చేయవు.

English summary

4 Signs That Show You Need A Specialized Toothpaste

Here are 4 signs that may encourage you to consider switching from a regular toothpaste to a specialized one, check them out!
Desktop Bottom Promotion