ఈ 5 ఆరోగ్య సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!

Posted By: Deepthi
Subscribe to Boldsky

ప్రతీరోజూ చాలామంది చాలా ఆరోగ్య సమస్యలతో పోరాడుతూనే ఉంటారు. బిజీ జీవితం, ఇంటి పనుల మధ్య మీరు మీ ఆరోగ్య సమస్యలను అంత పట్టించుకోకపోవచ్చు. మీరు చాలా ఆరోగ్యంగా ఉన్నా, లేదా ఏదన్నా జబ్బున్నా, లేదా మీకు అర్థం కాని లక్షణాలు కన్పించినా, డాక్టర్ తో మాట్లాడటం మంచిది. మనం రోజూ చూసే 'చిన్న' 5 ఆరోగ్య సమస్యలు నిజానికి ఎంత 'పెద్దవో' తెలుసుకోడానికి చదవండిః

common health problems

1.నడుంనొప్పి

మనలో చాలామందికి ప్రతిరోజూ చాలా సాధారణంగా విన్పించేది, వచ్చేది నడుంనొప్పి. అది సన్నగా నుంచి తీవ్ర స్థాయిలో రావచ్చు, తక్కువ సమయం నుంచి చాలా సేపు కూడా ఉండవచ్చు. ఎలా ఉన్నా, నడుంనొప్పి మాత్రం రోజువారీ పనులు చేసుకోటానికి అడ్డంగా మారుతుంది. నడుంనొప్పి రావటానికి కొన్ని సాధారణ కారణాలు ఎక్కువ పనిచేయటం లేదా బరువులు ఎత్తడం లేదా వంగటం వలన వచ్చే కండరాల నొప్పి. వయస్సు మీరుతుండటం కూడా వీపు సమస్యల్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది.

నొప్పి నుండి ఉపశమనానికి వ్యాయామం చేసి బలం పెంచుకోవటం సాయపడుతుంది. నిటారుగా నిలబడటం, కూర్చోడం, ఎత్తడం వంటివి చేయటం వలన భవిష్యత్తులో నడుం నొప్పి సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. ఇంకా వ్యాయామ ప్రోగ్రాములైన యోగా లేదా పిలాటేలు కొంతమందికి ఉపయోగపడతాయి. మీ వయస్సు లేదా లక్షణాలతో సంబంధం లేకుండా కొన్ని వారాలపాటు మీ నడుంనొప్పి తగ్గకపోతే, డాక్టర్ ను కలవటం మంచిది.1

2.తలనొప్పి

మీరు ప్రతిరోజూ పొద్దున్నే అలారం ఆపగలరు, సడెన్ గా వచ్చే తలనొప్పులను ఎలా ఆపగలరు? మీరు ఈ విషయంలో ఒంటరి కాదు. దాదాపు ప్రతి రెండవ వ్యక్తికి టెన్షన్ తో వచ్చే తలనొప్పి ఇంకా పదిమందిలో ఒకరికి మైగ్రేయిన్ వస్తుంది. అందుకే తలనొప్పి మేటి 10 సాధారణ ఆరోగ్య సమస్యల్లో ఒకటిగా నిలిచింది.

తరచుగా తలనొప్పులు రోజువారీ ఇంటిపని, ఆఫీసుపని, ట్రాఫిక్ లో ఉండాల్సి రావటం, కుటుంబం లేదా స్నేహితులు2 ,లేదా సరైన ఆహారపు అలవాట్లు లేక ఎసిడిటీ వలన కూడా రావచ్చు.3 చాలామటుకు తలనొప్పికి భయపడక్కర్లేదు, నొప్పి తగ్గించే పెయిన్ కిల్లర్ వేసుకుంటే సరిపోతుంది. అలా తగ్గకపోతే, డాక్టర్ ను సంప్రదించండి. మీరు మానసిక వత్తిడిలో ఉండి వుండవచ్చు లేదా ఏదన్నా తీవ్ర సమస్య శరీరంలో ఉండొచ్చు.

3.పళ్లు జివ్వుమనటం

రోజును హాయిగా ఉత్సాహంగా మొదలుపెట్టడానికి చాలామంది వేడి వేడి టీ లేదా కాఫీతో మొదలుపెడదాం అనుకొంటారు. కానీ సున్నితమైన పళ్ళున్న వారికి పొద్దునే ఇదొక సమస్యగా మారి కూర్చుంటుంది! ఎనామెల్ పింగాణీ తొడుగు పళ్ళను చప్పరించటం లేదా కొరకటం నుంచి రక్షిస్తుంది.4

ఎనామెల్ పొర పగిలిపోయాక, పంటిలోని నాడులు బయటకి కన్పించి వేడి, చల్ల పానీయాలు, చక్కెరలు, ఎసిడిక్ పదార్థాలు వాటికి నేరుగా తగులుతాయి. అదే చురుగ్గా,సడెన్ గా పంటినొప్పి కలిగిస్తుంది. ఎనామెల్ ఒకసారి పోతే, శరీరం రిపేర్ చేసుకోలేదు, ఆ నష్టం ఎన్నటికీ తిరిగి పూడదు.

మనలో చాలామంది పళ్ళ సున్నితత్వాన్ని పెద్ద పట్టించుకోరు, అదే తగ్గిపోతుందనుకుంటారు. ఈ నొప్పి అప్పుడప్పుడూ, కొద్దిసేపే ఉండొచ్చు కానీ ఆ స్థితి మాత్రం శాశ్వతంగా ఉండి సమయంతో పాటు మరింత పాడవుతుంది. మంచి వార్త ఏంటంటే సున్నితమైన పళ్ళను మళ్ళీ బలపర్చటానికి సులభమైన పరిష్కారం ఉంది.

మీరు మామూలుగా వాడే టూత్ పేస్టునుంచి డీసెన్సిటైజింగ్ టూత్ పేస్టుకి మారితే చాలు, అదే మీ పంటి ఎనామిల్ ను సంరక్షించి ఉపశమనాన్ని అందిస్తుంది. ఇంకా డీసెన్సిటైజింగ్ టూత్ పేస్టు రోజుకి రెండుసార్లు వాడితే మామూలు పేస్టుతో వచ్చే లాభాలన్నీ అందిస్తుంది.

సున్నితమైన పళ్ళు మంచి సంరక్షణ తీసుకోవాలని సూచించే లోపలి అసలు సమస్యను చూపిస్తాయి. అందుకని గతకొన్ని రోజులుగా మీరు పళ్ల సున్నితత్వం గురించి శ్రద్ధ తీసుకున్నా, ఏ మార్పూ లేకపోతే, డెంటిస్ట్ ను కలవండి. అతను లేదా ఆమె అసలు కారణం కనుక్కొని పళ్ళ సున్నితత్వానికి సరైన చికిత్స అందిస్తారు.5

4.జుట్టు ఊడిపోవటం

అందరికీ ప్రతిరోజూ కొంత జుట్టు ఊడిపోతుంది. రోజుకి 50-100 వెంట్రుకలు రాలిపోవటం సాధారణమే. కానీ వెంట్రుకలు మీ దిండుపై, హెయిర్ బ్రష్ పై రోజూకన్నా భిన్నంగా కన్పిస్తే, ఎక్కువ జుట్టు ఊడుతోందని అర్థం చేసుకోండి! జుట్టు ఊడిపోవటం గురించి మీరు సైలంట్ గా బాధపడక్కర్లేదు.

దాన్ని జుట్టుకి మంచి సంరక్షణ, క్రమం తప్పకుండా షాంపూ చేసుకోవటం, ఇంకా మంచి పోషకాహారంతో తగ్గించుకోవచ్చు. మీరు నియంత్రించగలిగే కారణాలతో జుట్టు ఊడుతుంటే, అంటే మానసిక వత్తిడి వంటివి, అలాంటప్పుడు మీరు కారణాన్ని నయం చేస్తే సమస్య తగ్గిపోతుంది.6 మీకు ఇంకా బెంగగా ఉంటే, చర్మవ్యాధి నిపుణుడి దగ్గరకు వెళ్తే సరి. డెర్మటాలజిస్టు ఎందుకు జుట్టు అంత ఊడిపోతోందో చెప్పి, చికిత్స కూడా సూచిస్తారు.7

5. గుండెల్లో మంట

పేరులో ఉన్నప్పుడు, గుండెల్లో మంటకీ, గుండెకి ఏం సంబంధం లేదు. గుండెల్లో మంట మీ కడుపులోని యాసిడ్లు ఆహారనాళంలో(గొంతు, పొట్టను కలిపే ట్యూబు) పైకి తన్నినప్పుడు వస్తుంది.ఇది ఛాతీ భాగంలో అసౌకర్యవంతమైన మంట ఫీలింగ్ ను కలిగించి మెడ, గొంతు వరకు పాకవచ్చు.

గుండెల్లో మంట నిమిషాల నుండి చాలా గంటల వరకూ ఉండవచ్చు. ఇదెప్పుడూ తిన్న తర్వాతనే వస్తుంది. ఎక్కువ తినటం, కొవ్వులు, నూనెలు ఉన్న భోజనం ఎక్కువ తినడం, మద్యం తాగటం, కూల్ డ్రింక్స్ కూడా గుండెల్లో మంట కలిగించవచ్చు. మంట కలిగించే ఆహారపదార్థాలకి దూరంగా ఉండటం, సరైన బరువు ఉండేలా చూసుకోవటం,తగినంత నిద్ర, ఒత్తిడి తగ్గించుకోవటం వలన త్వరగా నయమైపోతుంది.8

మీకు తరచుగా గుండెల్లో మంట వస్తుంటే, మీ రోజువారీ జీవితానికి ఇబ్బంది కలిగిస్తుంటే, డాక్టర్ దగ్గరకి వెళ్ళండి ఎందుకంటే ఇది ఇంకేదన్నా తీవ్ర సమస్యకి ప్రాథమిక లక్షణం కూడా కావచ్చు. అందుకే వైద్యసాయం తప్పనిసరి.9

English summary

5 common health issues you should not neglect

There are many health problems that people deal with everyday. Amid bustling life and household chores, sometimes you tend to neglect taking note of your health issues. Whether you are basically healthy, have a disease, or just symptoms you do not understand, your doctor is the best person to talk with.