For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ 5 లక్షణాలు ఊపిరితిత్తుల కాన్సర్ ఉందనడానికి ప్రధాన సంకేతాలు..!

ఈ 5 లక్షణాలు ఊపిరితిత్తుల కాన్సర్ ఉందనడానికి ప్రధాన సంకేతాలు..!

|

అనేక సందర్భాలలో ఊపిరితిత్తుల క్యాన్సర్ గురించిన వివరాలను నిపుణులు, లేదా మీడియా ద్వారా వినే ఉంటారు. మీకు ధూమపానం అలవాటు లేని కారణంగా కానీ, లేదా కలుషిత ప్రదేశాల నుండి దూరంగా ఉండడం మూలంగా కానీ, మీకు ఈ సమస్య రాదని భావించి, సూచనలను విస్మరించి ఉండవచ్చు. కానీ, ఊపిరితిత్తుల కాన్సర్ సోకడానికి అనేక కారకాలు ఉన్నాయన్న విషయం మర్చిపోకూడదు. క్రమంగా ఈ ప్రమాదకర వ్యాధి యొక్క లక్షణాల గురించిన అవగాహన కలిగి ఉండడం ద్వారా ముందు జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ప్రకారం, ఊపిరితిత్తుల క్యాన్సర్ కలిగిన 20 శాతం మంది ప్రజలు ధూమపానం కానివారుగా గుర్తించబడ్డారు అంటే ఆశ్చర్యం కలుగక మానదు. ఈ 20శాతం మంది రోగులు కాన్సర్ ప్రధాన కారకం అయిన ధూమపానాన్ని దూరం చేసినా కూడా, ఇతర కాలుష్య పొగల కారణంగా, పర్యావరణ నాశన కారకాలు లేదా జన్యు ఉత్పరివర్తనలు, వాహనాల కాలుష్యం మొదలైన వాటి ద్వారా కూడా ఈ వ్యాధి బారిన పడినట్లు తేలింది.

5 Early Signs of Lung Cancer You Shouldn’t Ignore

అంతేకాకుండా, ఊపిరితిత్తుల క్యాన్సర్, క్యాన్సర్ మరణాలకు ప్రధాన కారణంగా ఉంది. అంతేకాక క్యాన్సర్ల యొక్క అత్యంత సాధారణ రకాల్లో కూడా ఒకటి. అమెరికాలో ప్రతి సంవత్సరం కాన్సర్ బారిన పడుతున్న రోగులలో 14 శాతం మంది, ఊపిరితిత్తుల కాన్సర్ బారిన పడిన వారే.

పూర్తిగా సమస్యలో కూరుకుపోయాక నివారణా చర్యలు చేపట్టడం మూలంగా ప్రయోజనాల శాతం తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కావున, ఇప్పుడు చెప్పబోయే ఊపిరితిత్తుల క్యాన్సర్ యొక్క ఈ 5 ఉమ్మడి సంకేతాలను గమనించినట్లయితే, వెంటనే మీ వైద్యుని సంప్రదించడం మంచిది.

దీర్ఘకాలిక దగ్గు:

దీర్ఘకాలిక దగ్గు:

ఒక సాధారణ జలుబు లేదా ఇతర శ్వాస సంబంధిత అనారోగ్యం దగ్గుకు కారణమవుతుంది. కానీ కేవలం ఒక వారం లేదా రెండు వారాలలో దగ్గు పూర్తిగా తగ్గిపోతుంది. కొన్ని సందర్భాలలో మందులని ఆశ్రయించినా, 2,3 వారాలలో దగ్గు పూర్తిగా తగ్గుముఖం పడుతుంది. అలాకాకుండా మీ దగ్గు నెల లేదా అంతకన్నా, ఎక్కువ కాలం కొనసాగితే, ఖచ్చితంగా దాన్ని తనిఖీ చేయవలసిన అవసరం ఉంటుంది. మీరు పదేపదే జబ్బు బారిన పడుతున్న ఎడల, వెంటనే వైద్యునికి మీ పరిస్థితిని గూర్చి తెలియజేయండి. వైద్యుడు ఎక్స్-రే, రక్త మరియు మూత్ర పరీక్షల ద్వారా మీ పరిస్థితిని అంచనావేసి నివారణా మార్గాలు, లేదా చికిత్సా విధానాలను సూచించగలడు.

అసాధారణ శ్వాస లేదా గురక:

అసాధారణ శ్వాస లేదా గురక:

ఊపిరితిత్తుల క్యాన్సర్ కలిగిన రోగులు శ్వాసలో మార్పును గమనిస్తారు. శ్వాస సరిగ్గా ఆడకపోవడం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడం, నిద్రలో తీవ్రమైన గురక మొదలైన సమస్యలు కూడా ఊపిరితిత్తుల కాన్సర్ లక్షణాలుగా ఉన్నాయి.

మీ వైద్యుడు ద్రువీకరించనంతవరకు, మీరు తేలికగా తీసుకోడానికి లేదు. కొన్ని శ్వాసకోశ సంబంధిత అలర్జీల కారణంగా కూడా ఇటువంటి పరిస్థితులు తలెత్తవచ్చు. కావున వైద్యుని సూచనల ప్రకారం నడుచుకోవలసి ఉంటుంది. ఊపిరితిత్తుల పరంగా ఎటువంటి చిన్న సమస్య వచ్చినా, నిర్లక్ష్యం వహించరాదు. ముఖ్యంగా జలుబు, ఆస్థ్మా వంటి తెలిసిన వ్యాధులు లేని పక్షాన కూడా శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తితే, వెంటనే వైద్యుని సంప్రదించడం మంచిది.

బొంగురు గొంతు :

బొంగురు గొంతు :

ఊపిరితిత్తుల క్యాన్సర్ స్వరపేటిక మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. గొంతులోని నరాలు నొక్కుతున్న అనుభూతికి లోనవ్వడం, క్రమంగా అసౌకర్యానికి లోనవడం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితులు తలెత్తినప్పుడు, మీరు మీ గొంతులో లేదా మాటలలో మార్పును గమనించవచ్చు. దీనిని బొంగురు గొంతు లేదా హోర్స్ వాయిస్ అని వ్యవహరిస్తారు. రెండు వారాల పాటు ఈ సమస్య కొనసాగినట్లయితే మీ వైద్యునికి ఈ లక్షణం గురించి తెలియజేయండి.

అసాధారణమైన బరువు నష్టం:

అసాధారణమైన బరువు నష్టం:

మీరు ఎటువంటి ప్రయత్నాలు చేయకుండానే బరువును కోల్పోతున్నారా? ఊబకాయం కలిగిన వారికి, అప్రయత్నంగా బరువు కోల్పోవడం అనేది సంతోషం కలిగిస్తున్నప్పటికీ, ఒక్కోసారి తీవ్రమైన సమస్యగా ఉండే అవకాశాలు లేకపోలేదు. ఇక్కడ మీ వైద్యుని అంచనా అవసరం. ఇతర లక్షణాలతో పాటు, అసాధారణంగా బరువు కోల్పోవడం కూడా ఊపిరితిత్తుల కాన్సర్ లక్షణం కావొచ్చు.

వెన్నునొప్పి :

వెన్నునొప్పి :

చివరగా, ఊపిరితిత్తుల క్యాన్సర్ సంకేతాలలో తక్కువగా తెలిసిన సంకేతం, మీ ఎముకలలో లేదా కీళ్ళలో తీవ్రమైన నొప్పి. వెన్నులో లేదా, నడుము భాగంలో నొప్పిని అనుభూతి చెందుతున్న ఎడల, రాత్రి నిద్రలో నొప్పి తీవ్రమవుతున్న పక్షంలో, ఇది ఖచ్చితంగా కాన్సర్ సంకేతం కావొచ్చు.

English summary

5 Early Signs of Lung Cancer You Shouldn’t Ignore

5 Early Signs of Lung Cancer You Shouldn’t Ignore
Desktop Bottom Promotion