ఈ 5 ఆరోగ్య సమస్యలు మీకు ఉంటే మీరు ఎవ్వరి వద్దకు వెళ్లకూడదని భావిస్తారు

By Deepthi T.a.s
Subscribe to Boldsky

పార్టీలలో, ఆఫీసులో లేదా కుటుంబ ఫంక్షన్లలో మీరు అందరికీ దూరంగా ఉంటూ, దగ్గరికి వెళ్ళకుండా జాగ్రత్తపడుతున్నారా? అయితే వినండి, మీరు ఒంటరి కాదు! కొన్ని ఆరోగ్యసమస్యలు మన దగ్గరి బంధాల మధ్యలోకి వచ్చి మనం ఆందోళన పడేలా కూడా చేస్తాయి. అందరిలో సిగ్గుపడేలా చేసే ఐదు సాధారణ ఆరోగ్య సమస్యలు ఇవిగోః

 list of embarrassing conditions,

1)నోటి దుర్వాసన

దుర్వాసనను హాలిటోసిస్ అని కూడా అంటారు, ఇది మీరు సిగ్గుపడేలా చేసి, ఎవర్నీ కలవనివ్వదు, అలాగే మీ బంధాలను దెబ్బతీసి ఆనందంగా జీవించనివ్వదు1. నోటి పరిశుభ్రతపై నిర్లక్ష్యం వహించటమే దుర్వాసనకి ప్రధానకారణంగా చెప్పుకోవచ్చు. ఉదాహరణకి, సరైన నోటి పరిశుభ్రత, బ్రష్ చేయకపోవటం వలన ఆహారపదార్థాల భాగాలు నోటిలోనే ఉండిపోతాయి. ఈ ఆహారభాగాలు నోట్లో బ్యాక్టీరియా పెరగటానికి తోడ్పడి, దుర్వాసనను పుట్టించేలా చేస్తాయి. నోటి ఆరోగ్యం పట్ల మంచి సంరక్షణ, క్రమం తప్పకుండా డెంటిస్ట్ దగ్గరకి వెళ్ళటం నోటి దుర్వాసన సమస్యలను తగ్గిస్తాయి23.

2)శరీర దుర్వాసన

శరీర దుర్వాసన సమస్య తమకి ఉన్నదని తెలిసినవారు సాధారణంగా ఎవరితో కలవరు, దూరంగా ఉంటారు. శరీర దుర్వాసన విషయంలో సాధారణంగా చెమట వల్లనే దుర్వాసన వస్తుందని అందరికీ నమ్మకం. కానీ నిజానికి చెమటకి ఏ వాసనా ఉండదు. అందులో ఉండే బ్యాక్టీరియా చేసే పనుల వలన దుర్వాసన వెదజల్లబడుతుంది.4 అందుకే కొన్ని శరీర భాగాలు ( చంకలు వంటివి) మిగతావాటికంటే ఎక్కువ దుర్వాసన వస్తూ ఉంటాయి. శరీర దుర్వాసన పోగొట్టుకోడానికి మీరు చేయాల్సిన ముఖ్యమైన పని వ్యక్తిగత శుభ్రతను బాగా పాటించడం. రోజూ స్నానం చేస్తూ, శరీరాన్ని శుభ్రంగా, బ్యాక్టీరియా లేకుండా ఉంచుకుంటే దుర్వాసన సమస్య కూడా నియంత్రణలో ఉంటుంది.5

3) జివ్వుమనే పళ్ళు

పెళ్ళి రిసెప్షన్ లో కుటుంబంతో కలిసి ఐస్ క్రీం తింటూ ఆనందించేటప్పుడో లేదా స్నేహితులతో కలిసి వేడి వేడి కాఫీ తాగటమో ఎంత బావుంటుంది! కానీ మీ పళ్ళు నొప్పి పెడతాయని తెలిసినప్పుడు ఆనందం ఆవిరి అయిపోతుంది. పళ్ళు జివ్వుమనే సమస్య ఉన్నవారికి వేడి, చల్ల ఆహారపదార్థాలతో, డ్రింక్స్ తో పీడకలల్లాంటి అనుభవాలే జరిగివుంటాయి; అందుకే వారు అందరిముందూ సిగ్గుపడతారు కూడా! ఇంత అసౌకర్యంగా ఉంటే, వారి ఆత్మవిశ్వాసం కూడా దెబ్బతిని ఎవరితో సరిగ్గా కలవలేరు.

పళ్ళు జివ్వుమనటం, సున్నితంగా ఉండటం పళ్ళపై ఎనామెల్ కరిగిపోవటం లేదా పంటిలోని రక్తనాళాలు బయటకి కన్పించటం వలన జరుగుతుంది. ఇది దానంతట అది తగ్గిపోలేదు పైగా సమయంతో పాటు తీవ్రమవుతుంది. అదృష్టవశాత్తూ పళ్ళ సున్నితత్వాన్ని నయం చేయవచ్చు, దానికి చాలా సులభమైన ఉపాయం కూడా ఉంది. మీ పళ్ళు జివ్వుమని బాధపెడుతుంటే, మీ డెంటిస్ట్ తో మాట్లాడండి. వారు మీకు జివ్వుమనటాన్ని తగ్గించే టూత్ పేస్టు సూచించి పళ్ళ సున్నితత్వాన్ని తగ్గిస్తారు.6

4) పసుపుపచ్చని గారపట్టిన పళ్ళు

తెల్లని పళ్లతో, మెరిసే చిరునవ్వు మీకూ, మీ అందానికి ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వటమేకాదు, మీరు మరింత యవ్వనంతో కన్పడేలా చేస్తుంది. పసుపుపచ్చని పళ్ళున్న వ్యక్తులు తమ పళ్ళను దాచుకోడానికి నవ్వకుండా ఉండటానికే ప్రయత్నిస్తారు.కానీ మీకు పళ్ళు ఎందుకు పసుపుపచ్చ రంగులోకి మారతాయో తెలుసా? పళ్ళు రంగుమారటానికి చాలా కారణాలుంటాయి, టీ, కాఫీ, కోలాలు తాగటం కావచ్చు, పొగాకు వాడటం, సరైన పంటి శుభ్రత లేకపోవటం వంటివి ఏవైనా కావచ్చు. కొన్ని జీవనశైలి మార్పులతో పళ్ళ రంగు మారకుండా చూసుకోవచ్చు. ఉదాహరణకి, మీరు టీ/కాఫీ తాగేవారైతే, తగ్గించండి లేదా పూర్తిగా మానేయండి.7 ఇంకా తెల్లబర్చే టూత్ పేస్టును వాడటం వలన మరకలు తొలగి, మీ నవ్వు మరింత కాంతివంతంగా మెరుస్తుంది.

5)మొటిమలు

మొటిమలు సాధారణంగా ఆందోళన, సిగ్గు, అందరితో కలవలేకపోవటం వంటి భావాల వలన వస్తాయి.8 వీటి వలన చాలా మనస్తాపం చెందుతారు, స్నేహితులకి దూరమవుతారు, ఆఫీసులో లేదా కాలేజీలో సరిగా పనిచేయలేరు. మీ వయస్సు 16 లేదా 65 ఏదైనా సరే, ఈ సమస్యను పరిష్కరించే మంచి ఉపాయం దాన్ని గోకకండి, పిండవద్దు, గుచ్చవద్దు. సరైన చికిత్స కోసం చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించండి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Embarrassing’ Health Problems That Should Not Be Ignored

    Do you find yourself avoiding close contact with the others while at social parties, workplace or family functions? Well, you’re not alone! Some health issues can get in the way of your social life and can make you feel self-conscious.
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more