For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేపను నమలడం వలన కలిగే లాభాలు

వేపను నమలడం వలన కలిగే లాభాలు

|

మన భారత దేశంలో వేపకున్న విశిష్టత ప్రత్యేకమైనది. మన తల్లిదండ్రులు అలాగే అమ్మమ్మలు అలాగే బామ్మలు వేపకున్న ప్రాముఖ్యతను చెప్తూ ఉండటం మనకు గుర్తుకు వస్తూ ఉంటుంది. వేపాకులో దాదాపు 130 రకాల పదార్థాలు లభిస్తాయి. వేప చెట్టుకు చెందిన ప్రతి భాగాన్ని అంటే ఆకులు, కొమ్మలు, గింజలు, వేర్లు, పండ్లు లేదా పూలు అనేవి ఆయుర్వేద చికిత్సా విధానంలో విరివిగా వాడతారు. వేప ద్వారా అనేక ప్రయోజనాలు లభిస్తాయి.

వేపను సరైన పద్దతిలో ఉపయోగించడం ద్వారా అనేక రకాల ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇంఫ్లేమేషన్, ఫీవర్ ఇన్ఫెక్షన్, చర్మ సమస్యలు మరియు దంత సమస్యలను తగ్గించుకోవచ్చు. యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ కార్సినోజెనిక్, యాంటీ ఇంఫ్లేమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ సెప్టిక్, యాంటీ మలేరియల్, యాంటీ మైక్రోబయాల్ మరియు యాంటీ వైరల్ ప్రాపర్టీస్ పుష్కలంగా ఉండటంతో వేప అనేక ఆరోగ్య సమస్యలకు చక్కని పరిష్కారంగా నిలుస్తోంది. ఇప్పటికీ, ఫ్లూ వంటి సమస్యలతో ఇబ్బంది పడే వ్యక్తుల వద్ద వేపాకులను ఉంచుతారు. అలాగే ఇంటికి తోరణంగా వేపాకులను అమరుస్తారు. వేపాకులను దాటిన గాలి స్వచ్ఛంగా మారుతుందని నమ్మకం. తద్వారా, వ్యాధికారక బాక్టీరియా మరియు వైరస్ లు తొలగిపోతాయని నమ్మకం.

6 Amazing Benefits of Chewing Neem Regularly

వేపాకుల నుంచి అనేక ఆరోగ్య అలాగే చర్మ సంరక్షణ ప్రయోజనాలను పొందవచ్చు. వేపాకును పేస్ట్ రూపంలో గానీ, టీ రూపంలో గానీ లేదా వేప కాడను నమలడం ద్వారా గాని అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం నుంచి వేపాకు నుంచి అందే ప్రయోజనాలు ప్రాచుర్యం పొందటం ప్రారంభించాయి. ముఖ్యంగా సౌత్ ఈస్ట్ యాసియాలో ప్రాచుర్యం పొందాయి. క్రమంగా వెస్ట్ లో కూడా వేప సుగుణాలు ప్రాచుర్యం పొందటం ప్రారంభించాయి. వేపాకులను నమలడం ద్వారా అనేక ప్రయోజనాలను పొందవచ్చని ఆయుర్వేదం కొన్ని తరాల క్రితం నుంచి స్పష్టం చేస్తోంది. చేదుగా అలాగే ఘాటుగా ఉన్న వేపాకులలో వాత లక్షణాన్ని అంటే న్యూరో మజులర్ డిజార్డర్స్ ని బాలన్స్ చేసే సామర్థ్యం కలదు. అలాగే రక్తం నుంచి టాక్సిన్స్ ను తొలగించగలదు. అలాగే ఫ్రీ రాడికల్ యాక్టివిటీస్ ను శుద్ధి చేసే ప్రక్రియను పెంపొందిస్తుంది. వేపాకులను నమలడం ద్వారా శిరోజ సౌందర్యం పెంపొందుతుంది. తలనొప్పి తగ్గుతుంది.

వేపాకులను నమలడం ద్వారా ఈ కింద పేర్కొన్న ప్రయోజనాలను పొందగలుగుతారు.

1. చర్మ సంరక్షణ ప్రయోజనాలు:

1. చర్మ సంరక్షణ ప్రయోజనాలు:

వేపాకులను తీసుకోవడం ద్వారా రక్తం శుద్ధవుతుంది. టాక్సిన్స్ తొలగిపోతాయి. చర్మం క్లియర్ గా మారుతుంది. వేపాకులలో యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీస్ పుష్కలంగా కలవు. ఇవి ఇన్ఫెక్షన్స్ పై పోరాటం జరుపుతాయి. అలాగే కాలిన గాయలు మరియు ఇతర చర్మ సమస్యలను తగ్గిస్తాయి. వేపాకుల పేస్ట్ మరియు పసుపును కలిపి వాడి పురుగు కాట్లు, దురద, ఎక్జిమా, రింగ్ వార్మ్ మరియు కొన్ని చిన్నపాటి స్కిన్ డిసీసెస్ నుంచి రక్షణను పొందవచ్చు. వేపాకులను నమలడం ద్వారా చర్మానికి పోషణ అందుతుంది. చర్మం తేటగా అలాగే కాంతివంతంగా మారుతుంది.

2. శిరోజాల సంరక్షణకు:

2. శిరోజాల సంరక్షణకు:

వేపాకులను నమలడం ద్వారా శిరోజాలకు తగినంత పోషణ లభిస్తుంది. వేపాకులలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. వేప అనేది స్కాల్ప్ కు ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. అలాగే వేపాకులు హెల్దీ సెల్ డివిజన్ ను ప్రేరేపించి స్కాల్ప్ పై హెయిర్ ఫాలికల్ గ్రోత్ ను పెంపొందిస్తాయి. మరిగించిన వేప నీళ్లను ఉపయోగించి తలస్నానం చేస్తే డాండ్రఫ్ సమస్య తొలగిపోతుంది. దెబ్బతిన్న శిరోజాలు కోలుకోవడం ప్రారంభిస్తాయి. వేపాకులలో యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి మలసేజియా వంటి డాండ్రఫ్ కి దారితీసే ఫంగైపై పోరాటం జరుపుతాయి. వేపలో నున్న అద్భుతమైన ఔషధ గుణాల వలన స్కాల్ప్ రక్షణకారి అన్న పేరును వేప సొంతం చేసుకుంది.

3. కంటి సంరక్షణకు తోడ్పడుతుంది:

3. కంటి సంరక్షణకు తోడ్పడుతుంది:

వేపాకులు కంటి ఆరోగ్యాన్ని సంరక్షించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. వేపాకులను నమలడం ద్వారా కంటి చూపును మెరుగుపరచుకోవచ్చు. అలాగే కళ్ళల్లో మంట, ఇరిటేషన్, అలసట వంటి సమస్యల నుంచి ఉపశమనం కోసం వేపను నీళ్ళల్లో మరగబెట్టి చల్లారిన తరువాత ఈ నీళ్లను ఐ వాష్ గా వాడుకోవాలి.

4. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది:

4. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది:

యాంటీ మైక్రోబయాల్, యాంటీ వైరల్ మరియు యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ పుష్కలంగా లభించడం వలన వేపాకులను నమలడం వలన రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఈ ఆకులను నమలడం వలన ఫ్రీ రాడికల్స్ ద్వారా తలెత్తే డేమేజ్ అరికట్టబడుతుంది. తద్వారా అనేక వ్యాధుల బారిన పడే ప్రమాదం తగ్గుముఖం పడుతుంది. ఫ్లూ, క్యాన్సర్ మరియు గుండె వ్యాధుల బారిన పడే ప్రమాదం తగ్గే అవకాశాలున్నాయి. బాక్టీరియాను హరించి రోగనిరోధక శక్తిని పెంపొందించే సామర్థ్యం వేపలో ఉంది.

5. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:

5. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:

వేపాకులు లివర్ ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. తద్వారా, జీర్ణక్రియ ఆటోమేటిగ్గా మెరుగవుతుంది. వీటితో పాటు, వేపను రోజూ తీసుకోవడం వలన ఇంటస్టిన్ లో నివసించే హానికర బాక్టీరియా అనేది హరించబడుతుంది. కొలోన్ శుభ్రపడుతుంది. జీర్ణక్రియ మెరుగవుతుంది.

6. ఓరల్ హెల్త్:

6. ఓరల్ హెల్త్:

వేపాకులను రెగ్యులర్ గా నమలడం వలన అనేక దంత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే, గర్భిణీలు వేపాకులను తీసుకోకూడదు. వేప అనేది లోపల నుంచి వేడిని ఉత్పత్తి చేస్తుంది. అందువలన, గర్భస్థ శిశువుకు హానీ జరిగే ప్రమాదం ఉంది. అలాగే, గర్భం దాల్చాలని ప్రయత్నిస్తున్న మహిళలు కూడా వేపాకుల ను అవాయిడ్ చేయాలి. వేపాకులను తీసుకోవడం ద్వారా ఉత్పత్తి అయ్యే వేడి గర్భం దాల్చే అవకాశాలను సన్నగిల్లేలా చేస్తుంది. అధిక వేడిని తగ్గించుకునేందుకు శరీర ఉష్ణోగ్రతను నియంత్రణలో ఉంచేందుకు నీళ్లను అధికంగా తీసుకోవడంతో పాటు బూడిద గుమ్మడికాయ జ్యూస్ ను తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.

English summary

6 Amazing Benefits of Chewing Neem Regularly

Ayurveda for generations has professed the advantages of consuming neem leaves. Both bitter and pungent in taste, neem leaf, according to Ayurveda, has been especially significant in balancing our Vata or neuromuscular disorders. It further removes toxins from our blood and enhances activity of free radical scavenging. Chewing neem leaves can also nourish our hair and treat headaches.
Desktop Bottom Promotion