For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కడుపు ఉబ్బరం సమస్యలతో భాదపడుతున్నారా? అయితే కడుపు ఉబ్బరానికి కారణమయ్యే ఈ 7 ఆహార పదార్ధాల గురించి తెలుసుకోండి.

|

తరచుగా కడుపు ఉబ్బరం సమస్య తలెత్తుతుందా? తిరిగి సాధారణ స్థితికి వచ్చేందుకు పరిష్కారాలు కనబడడం లేదా? అయితే ఈవ్యాసం తప్పక మీకు సహాయపడగలదు.

మనలో అనేకులు అధికంగా ఎదుర్కొంటున్న సాధారణ సమస్య కడుపు ఉబ్బరం, ఇది మిమ్ములను అసౌకర్యంగా ఉంచడమే కాకుండా గస్సీ మరియు నీరసమైన అనుభూతికి లోనుచేస్తుంది. కడుపు ఉబ్బరం కలగడానికి అనేక కారణాలు ఉన్నాయి – అజీర్ణం, మరియు ఫుడ్ అలెర్జీల నుండి లాక్టోస్ రియాక్షన్స్ మరియు మలబద్ధకం వరకు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా, మన ఆహారపు అలవాట్లు, సమస్యను ప్రేరేపించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. అధిక ఉప్పుతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం, వేగంగా తినడం, అధికంగా తినడం, ఏదైనా ఆహారం తీసుకున్న వెంటనే కార్బోనేటేడ్ కూల్డ్రింక్స్ తీసుకోవడం వంటివి కూడా మీ కడుపుకు మంచిది కాదు. అందువలన, మీ రోజువారీ ఆహారంలో మీరు తీసుకుంటున్న ఆహార రకాలని, అవి తీసుకునే విధానం, మరియు మీ శరీరాన్ని ప్రభావితం చేసే అంశాలను అంచనా వేయడం అన్నివిధాలా శ్రేయస్కరం.

7 Foods To Avoid When You Are Feeling Bloated

కడుపు ఉబ్బరానికి కారణమయ్యే ఆహారాల జాబితాను ఇక్కడ పొందుపరచబడింది :

కడుపు ఉబ్బరం సమస్యలతో భాదపడుతున్న ఎడల, ఈ సమస్యకు కారణమయ్యే ఈ 7 ఆహార పదార్ధాల గురించిన అవగాహన ఉండడం అవసరం.

1. బీన్స్ :

1. బీన్స్ :

బీన్స్ లేదా చిక్కుళ్ళు ఫైబర్ కంటెంట్లో అధికంగా ఉంటాయి మరియు కడుపులో జీర్ణం చేయలేని కొన్ని షార్ట్ - చైన్ కార్బోహైడ్రేట్లని కూడా కలిగి ఉంటాయి. అవి ప్రేగులలో అధిక సమయం కొలువుదీరి ఉంటారి. దీనికి కారణం వీటి అరుగుదల సమయం ఎక్కువగా ఉండడమే. వీటిలో ఆరోగ్యకరమైన గట్ బ్యాక్టీరియా ఉన్నాకూడా, గాస్ సమస్యలకు దారితీస్తుంది. అందువలన, ఎల్లప్పుడూ నీటిలో నానబెట్టిన బీన్స్ మాత్రమే వండుతున్నారని నిర్ధారించుకోండి. మరియు వాటిని అనేకమార్లు కడిగాకనే వినియోగించడం మంచిదని సిఫార్సు చేయబడింది కూడా.

2. కాయధాన్యాలు :

2. కాయధాన్యాలు :

అన్నిరకాల కాయధాన్యాలు అందరికి సరిపోవు. అనేకమందికి కందిపప్పు, ముడి పెసలు, ముడి శనగలు వంటి కాయధాన్యాల కారణంగా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఎందుకంటే అవి బీన్స్ వలెనే, షార్ట్ – చైన్ కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటాయి.

3. కాలీఫ్లవర్, బ్రోకలీ :

3. కాలీఫ్లవర్, బ్రోకలీ :

వీటిని క్రూసిఫెరస్ రకానికి చెందిన వర్గంగా వ్యవహరిస్తారు. అవి పూర్తి స్థాయిలో అవసరమైన విటమిన్లు మరియు ఖనిజాలతో పుష్కలంగా లోడ్ చేయబడి ఉన్నా కూడా, కడుపులో వాయువు అధికమవడానికి దారితీస్తాయని చెప్పబడింది. మరియు జీర్ణం అయ్యేందుకు సమయం ఎక్కువ తీసుకుంటుంది.

Most Read: ఈ 7రకాల రోజూవారీ ఆహార పదార్ధాలు సహజ సిద్దమైన రోగనిరోధకతత్వాలను కలిగి ఉంటాయని తెలుసా?

4. ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి :

4. ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి :

మీరు ఉల్లిపాయలు లేదా వెల్లుల్లితో కూడిన రుచి లేకుండా ఒక డిష్ ఊహించగలరా ? ఈ పదార్థాలు వంటగదిలో లేని ఇల్లే ఉండదు. అంతగా మన వంటలలో మమేకమైపోయిన ఈ రెండూ కూడా, ఇన్ఫ్లమేషన్ (వాపు) కు సమస్యలతో ఉన్నవారికి అంతగా సూచించదగినవి కావు. వీటిని పూర్తిగా మానివేయమని చెప్పకపోయినా, తగ్గించడం ఉత్తమమని సిఫార్సు చేయబడుతుంది. ముడి ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి, ఫ్రక్టోట్లను కలిగివుంటాయి, ఇవి ఉబ్బరం కలిగించే సాల్యుబుల్ ఫైబర్లుగా ఉంటాయి.

5. గోధుమలు మరియు తృణ ధాన్యాలు :

5. గోధుమలు మరియు తృణ ధాన్యాలు :

కడుపు ఉబ్బరం సమస్య లేదా ఉదర కుహర వ్యాధితో బాధపడుతున్న వారు కఠినమైన గ్లూటెన్ ఫ్రీ ఫుడ్ అనుసరించాల్సి ఉంటుంది. కడుపు ఉబ్బరానికి తరచూ గురయ్యే వారు గోధుమ మరియు ఇతర తృణధాన్యాలను తగ్గించడం మీద దృష్టి సారించాలి. వీటిలోని అధికమైన ఫైబర్ మూలాల కారణంగా, జీర్ణంమవడం కష్టతరంగా ఉంటుంది. క్రమంగా ఇవి గ్యాస్ మరియు ఉబ్బరం వంటి సమస్యలకు దారితీస్తుంది.

6. జంక్ ఫుడ్ :

6. జంక్ ఫుడ్ :

అనేకమంది, జంక్ ఫుడ్ మీద మక్కువ ఎక్కువగా కలిగి ఉంటారు. కొందరు తప్పనిసరి పరిస్థితుల్లో, సమయానుభావం వలన జంక్ ఫుడ్ అనుసరిస్తుంటే, కొందరు అదిపనిగా శరీరానికి సరిపడవని తెలిసినా కూడా వీటి పట్ల సుముఖత చూపిస్తూ కోరి ప్రమాదాలు తెచ్చుకుంటూ ఉంటారు. వీటిలోని అధిక చక్కెరలు, కాలరీలు శరీరానికి లాభాన్ని చేకూర్చకపోగా, తీవ్ర నష్టాన్నే కలిగిస్తాయి. ఈమధ్యనే జరిగిన ఒక సర్వేలో మన దేశంలో అధిక మోతాదులో ఫికల్ (పెద్దపేగు సంబంధిత అవశేషాలు) బాక్టీరియా రోడ్-సైడ్ మరియు కొన్ని హోటళ్ళలో కనిపిస్తున్నట్లు తేల్చింది కూడా. క్రమంగా అనేక రకాల వ్యాధుల బారిన కూడా పడుతున్నారు.

మరియు ఈ జంక్ ఫుడ్ సులభంగా జీర్ణం కాకపోవడం మూలంగా కడుపు ఉబ్బరానికి దారితీస్తుంది. మరోవైపు కొన్ని రోడ్ సైడ్ పానీయాలు, కూల్ డ్రింక్స్, జీర్ణ వ్యవస్థలో కార్బన్ డయాక్సైడ్ గణనీయమైన పెరుగుదలకు దారితీసి., వాయువుకు కారణమవుతుంది.

Most Read: వేరే వాళ్లతో పిల్లల్ని కని తండ్రివి నువ్వేనని చెబుతా, నువ్వు మగాడివేనా, పుట్టించలేవా?

7. డైరీ ప్రాడక్ట్స్ :

7. డైరీ ప్రాడక్ట్స్ :

అనేకమంది భారతీయులు, పాలు మరియు ఇతర పాడి ఉత్పత్తులను ఎక్కువగా వినియోగిస్తున్నప్పటికీ, లాక్టోజ్ అని పిలువబడే పాలలోని సహజ చక్కెరలను జీర్ణం చేసుకునే శక్తిని మాత్రం కలిగి లేరు అన్నది వాస్తవం. అధికంగా పాల పదార్ధాలు తీసుకోవడం మూలంగా లాక్టోస్ అసహనానికి దారితీస్తుంది. ఇది గ్యాస్, ఉబ్బరం మరియు తిమ్మిరికి కారణంగా మారుతుంది. ఉదాహరణకు వేడిపాలు కూడా ఒక ట్రిగ్గర్.

ఉబ్బరం నివారించడానికి పైన పేర్కొన్న ఈ పదార్ధాలపట్ల జాగ్రత్త తప్పనిసరి.

English summary

7 Foods To Avoid When You Are Feeling Bloated

There are several reasons that cause abdominal bloating - from indigestion and food allergies to lactose intolerance and constipation. Our eating habits, particularly, play a crucial role in triggering the issue. Even things like eating food too fast, taking cold drinks immediately after meals or high salt intake can make it worse.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more