చేతుల నొప్పులను తగ్గించుకునేందుకు 7 నేచురల్ హోమ్ రెమెడీస్

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

మీరు తరచూ చేతుల నొప్పులతో బాధపడుతూ ఉంటారా? చేతుల నొప్పులు ఈ మధ్య కాలంలో సాధారణ సమస్యగా మారిపోయాయి. చేతులలో ఎదో ఒక ప్రదేశంలో నొప్పి చాలా మందిని వేధిస్తూ ఉంటోంది. ఈ నొప్పి కొన్ని సార్లు భరించలేనంత తీవ్రతతో బాధపెడుతుంది. అందువలన, మీరు సాధారణంగా చేసుకునే రోజువారీ పనులలో అంతరాయం ఏర్పడుతుంది.

చేతులు మనకు ఎన్నో విధాలా ఉపయోగపడతాయి. వస్తువులను పట్టుకునేందుకు, పైకి ఎత్తేందుకు అలాగే వస్తువులను ఒక ప్రదేశంలోంచి ఇంకొక ప్రదేశంలోకి అమర్చేందుకు ఇలా ఎన్నో రకాలుగా చేతులను మనం ఉపయోగిస్తూ ఉంటాము. కాబట్టి, ఒకవేళ మీరు చేతుల నొప్పులతో బాధపడుతూ ఉంటే కొన్ని పనులను చేయలేరు. పూర్ స్లీపింగ్ పోసిషన్ , పూర్ బ్లడ్ సర్క్యూలేషన్, విపరీతమైన ఏక్సర్సైజేస్ అలాగే రిపిటీటివ్ కదలికల వలన చిన్నపాటి చేతుల నొప్పులు రావచ్చు.

నరాలలో బెణుకు, ఎముకలు విరుగుట, రొటేటర్ కఫ్ ఇంజురీ, బెణుకు, ర్యూమటాయిడ్ ఆర్త్రైటిస్ వంటి కొన్ని సమస్యల వలన కూడా చేతుల నొప్పులు తలెత్తుతాయి. వాపు, నొప్పి, స్టిఫ్ నెస్, చేతుల కింద లింఫ్ నోడ్స్ లో వాపు, ఎర్రదనం వంటి కొన్ని లక్షణాలను మీరు గమనించవచ్చు.

చేతులనొప్పుల నుంచి తక్షణ ఉపశమనం కోసం మీరు ఏవైనా సులభమైన హోమ్ రెమెడీస్ ను పాటించవచ్చు.

1. కోల్డ్ కంప్రెస్:

1. కోల్డ్ కంప్రెస్:

చేతులనొప్పులను తగ్గించేందుకు కోల్డ్ కంప్రెస్ అనే విధానం చక్కగా ఉపయోగపడుతుంది. కోల్డ్ టెంపరేచర్ వలన నొప్పితో ఇబ్బందిపడుతున్న ప్రదేశంలోని టిష్యూలు కాసేపు మొద్దుబారతాయి. ఆ తరువాత నొప్పి తగ్గుతుంది. ఇంఫ్లేమేషన్ ను కూడా ఈ విధంగా తగ్గించుకోవచ్చు.

ఒక టవల్ లో కొన్ని ఐస్ క్యూబ్స్ ను ఉంచి ఆ టవల్ ను మీ చేతులపై చుట్టండి.

ఇలా పదిహేను నిమిషాల వరకు ఉంచండి.

కొంత కాలం వరకు ప్రతి రోజూ ఈ ప్రాసెస్ ను ఫాలో అవండి.

2. ఎలివేషన్:

2. ఎలివేషన్:

చేతులనొప్పులను తగ్గించేందుకు ఎలివేషన్ అనే ప్రక్రియ ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. నొప్పి ఉన్న చేతిని పైకి ఎత్తండి. ఇలా ఎలివేట్ చేయడం వలన బ్లడ్ సర్క్యూలేషన్ మెరుగయి హీలింగ్ ప్రాసెస్ ని వేగవంతం చేస్తుంది.

మీరు రెస్టింగ్ పోసిషన్ లో ఉన్నప్పుడు ఒకటి లేదా రెండు పిల్లోలను చేతుల కింద ఉంచండి.

ఈ పద్దతి వలన రక్తప్రసరణ సజావుగా సాగుతుంది.

3. హాట్ కంప్రెస్:

3. హాట్ కంప్రెస్:

చేతుల నొప్పులను తగ్గించేందుకు హాట్ కంప్రెస్ అనేది తోడ్పడుతుంది. ఈ రెమెడీ అనేది ఇంజురీ ఏర్పడినప్పటి నుంచి లేదా నొప్పి ప్రారంభమైనప్పటి నుంచి 48 గంటల వరకు మాత్రమే ఎఫెక్టివ్ గా ఉంటుంది

ఒక టబ్ నిండా హాట్ వాటర్ ని తీసుకుని అందులో మీ చేతులను పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఉంచాలి. ఈ పద్దతిని రోజుకు రెండుసార్లు పాటించాలి.

4. రెస్ట్:

4. రెస్ట్:

చేతులను సరైన భంగిమలో రెస్ట్ చేయడం ద్వారా చిన్నపాటి నొప్పికి కారణమైన సాఫ్ట్ టిష్యూ డేమేజ్ తగ్గుతుంది. మెత్తటి తలగడపై మీ చేతులను ఉంచండి. ఈ విధంగా చేస్తే నొప్పితో పాటు ఇంఫ్లేమేషన్ కూడా తగ్గుతుంది. 72 గంటల పాటు చేతులను ఒత్తిడి కలిగించే పనుల నుంచి దూరంగా ఉంచండి.

5. మసాజ్:

5. మసాజ్:

చేతుల నొప్పులను తగ్గించేందుకు మసాజ్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ప్రభావిత ప్రదేశంలో ఒత్తిడిని తగ్గించి మీకు ఉపశమనం కలిగిస్తుంది.

ఒక టేబుల్ స్పూన్ మస్టర్డ్ ఆయిల్ లేదా కోకోనట్ ఆయిల్ ను వేడి చేయండి.

ఈ వెచ్చటి ఆయిల్ తో ప్రభావిత ప్రదేశంపై రుద్దండి.

చేతులను సున్నితంగా మసాజ్ చేయడం ద్వారా బ్లడ్ సర్క్యూలేషన్ మెరుగవుతుంది.

ఇలా రోజులో అనేకసార్లు చేయండి.

6. టర్మరిక్:

6. టర్మరిక్:

చేతుల నొప్పులను తగ్గించేందుకు టర్మరిక్ కూడా పనిచేస్తుంది. ఇందులో లభించే కుర్కుమిన్ అనే పదార్థంలో యాంటీ ఇంఫ్లేమేటరీ ప్రాపర్టీస్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ కలవు. ఇవి వాపును తగ్గించేందుకు అద్భుతంగా పనిచేస్తాయి.

రెండు టీస్పూన్ల టర్మరిక్ పౌడర్ ను ఒక టీస్పూన్ కొబ్బరి నూనెలో కలిపి పేస్ట్ ను తయారుచేసుకోండి.

ఈ పేస్ట్ ను ప్రభావిత ప్రాంతంపై రుద్దండి.

ఈ పద్దతిని రోజులో రెండు సార్లు పాటించండి.

7. జింజర్:

7. జింజర్:

చేతుల నొప్పులను తగ్గించేందుకు జింజర్ ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ తో పాటు యాంటీ ఇంఫ్లేమేటరీ ప్రాపర్టీస్ కలవు. ఇవి ఇంఫ్లేమేషన్ ను తొలగిస్తాయి. అలాగే, రక్తప్రసరణని మెరుగుపరిచేందుకు కూడా జింజర్ తోడ్పడుతుంది. తద్వారా, హీలింగ్ ప్రాసెస్ వేగవంతంగా మారుతుంది.

రోజూ 3 కప్పుల జింజర్ టీను తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది.

English summary

7 Natural Home Remedies For Arm Pain

A mild pain in the arm can be due to a poor sleeping position, poor blood circulation, repetitive motions or excessive exercising. The remedies to cure arm pain are cayenne pepper, hot compress, cold compress, massage, turmeric powder, lavender oil, etc.
Story first published: Tuesday, March 13, 2018, 15:13 [IST]